ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్).. 2021–2022 విద్యాసంవత్సరానికి 164 సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజీలు, మూడు ఐఐటీ మెడికల్ అకాడెమీస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిం ది. బాలయోగి గురుకులం ఇంటర్మీడియెట్ కామన్ ఎం ట్రెన్స్ టెస్ట్(బీజీ ఇంటర్ సెట్–2021) ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
► ఏపీఎస్‌డబ్ల్యూఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలు 2021–22.
► అర్హతలు: 2021 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బీజీ ఇంటర్ సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
► వయసు: 31.08.2021 నాటికి 17 ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక ఏడాది సడలింపు లభిస్తుంది. ∙విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి.
► ఎంపిక విధానం: 2021–22 బీజీ ఇంటర్ సెట్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, ఫిజికల్ సైన్స్ 15 ప్రశ్నలు, బయోసైన్స్ 15 ప్రశ్నలు, సోషల్ సైన్స్ 15 ప్రశ్నలు, ఇంగ్లిష్(కాంప్రెహెన్షన్ అండ్ గ్రామర్) 15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు.
► ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. అలాగే ఇందులో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
► ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఐఐటీ–మెడికల్ అకాడెమీస్ పరీక్ష
ఐఐటీ–మెడికల్ అకాడెమీస్‌ను ఎంచుకొని.. బీజీ ఇంటర్ సెట్‌లో మెరిట్‌లో నిలిచిన విద్యార్థులకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
► దరఖాస్తు:ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2021
► పరీక్షా తేదీ: త్వరలో వెల్లడిస్తారు
► వెబ్‌సైట్: https://apgpcet.apcfss.in/Inter
చదవండి: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు
Comments
Please login to add a commentAdd a comment