gurukulam
-
ఆస్ట్రేలియాలో తటవర్తి గురుకులం అవధానం..
ఆస్ట్రేలియా దేశం నుంచి వికసించిన భాషాకమలం తటవర్తి గురుకులంలో మరో అద్భుతమైన అవధానం జూమ్ మాధ్యమంలో జరిగింది. ఇందులో పలు దేశాల నుంచి తెలుగు పండితులు, భాషాభిమానులు, అవధానులు పాల్గొన్నారు. తటవర్తి గురుకులం వ్యవస్థాపకులు సద్గురువులు, అవధాని తటవర్తి కల్యాణచక్రవర్తి గారు తమ గురుకులం నుంచి పద్య కవులకు అవధానులకు శిక్షణనిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు.తటవర్తి గురుకులం విద్యార్ధి కుమారి అహల్య 13 ఏళ్ళ వయసులోనే తెలుగు సాహితి ప్రక్రియ అయిన అష్టావధానం దిగ్విజయంగా పూర్తి చేసి, చిన్నారి మహిళా అవధానిగా అవతరించారు. గొప్ప కవులకు, పండితులకు సైతం కష్టసాధ్యమైన అష్టావధానం ప్రక్రియలో , 8 మంది ప్రాశ్నికులు / పృచ్చకులు అడిగే ప్రశ్నలకు, అక్కడికక్కడే పద్యాల రూపంలో ఆశువుగా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఇటువంటి విశేషాన్ని చిన్నారి అహల్య 13 ఏళ్ళ వయసులోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఇదే గురుకులం నుండి కొన్ని వారాల క్రితం అక్టోబరు 12 విజయదశమి సందర్భంగా మరో చిన్నారి సంకీర్త్ వింజమూరి కూడా అష్టావధానం పూర్తి చేసి, పండితుల ప్రశంసలు అందుకున్నారు. చిన్నారి సంకీర్త్కి కూడ 13 ఏళ్ళు కావడం గమనార్హం. ఇద్దరు చిన్నారులు ఇంగ్లీషు మీడియంలో 8వ తరగతి చదువుతున్నారు. విదేశాల్లో ఉంటూ తెలుగు మాట్లాడటం, చదవటమే గొప్ప అనుకునే రోజుల్లో, ఆస్ట్రేలియా తెలుగు భాష సేవకోసం గురుకులం స్థాపించి, స్వయానా తాము 120 కి పైగా అష్టావధానాలు చేసిన గురువు గారు కల్యాణ చక్రవర్తి గారు, గోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన వారు. ఈయన వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వివిధ దేశాల్లో విద్యార్థులకు, ఔత్సాహికులకు పద్య రచనలో మెళకువలు నేర్పుతూ, తెలుగు వారికే సొంతమైన పద్య రూపకాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఆయన అవధానార్చన పేరుతో తెలుగు రాష్ట్రాల్లో జీర్ణ స్థితిలో ఉన్న ఆలయాలకు అంకితం ఇస్తూ , అష్టావధానాలు చేస్తున్నారు, అలాగే ఆయా ఆలయాలకు ఆర్థికంగా వీలైనంత సహాయం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 120కి పైగా అష్టావధానాలు పూర్తిచేశారు. ఆస్ట్రేలియాలో ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా అనేక పురాణ ప్రవచనాలు, భాష్యాలు చెప్తూ , తెలుగు సాహిత్యం, భక్తి ఆధ్యాత్మిక రంగాల్లో తటవర్తి గురుకులం, గురువులు తటవర్తి కల్యాణ చక్రవర్తి గారు తమదైన రీతిలో సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు.పద్య రచన, పద్య కల్ప ద్రుమమ్ ( రాసిన ఒక్కో పద్యానికి ఒక్కో చెట్టు నాటడం) అనే కార్యక్రమం, ఆన్లైన్లో అవధాన పరిచయ కోర్సులు నడుపుతూ తెలుగు భాష కు మరింత జీవం పోస్తున్నారు. వీరి గురుకులంలో పద్యాలు వ్రాయడం నేర్చుకున్న కవులు , ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మొదటి తెలుగు పద్య శతకాలు రచించి చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా , యూకే, న్యూజీలాండు, సింగపూరు, దుబాయ్ ఇలా అనేక దేశాల నుంచి తొలి పద్య శతకాలు వీరి గురుకులం కవుల నుంచి వెలువడ్డాయి. (చదవండి: లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ 5కే వాక్‌థాన్‌కు మంచి స్పందన) -
Sakshi Little Stars: డాటర్ ఆఫ్ డైరెక్టర్ సుకుమార్
పిల్లలకు బంధువులంటే ఇష్టం. బాబాయ్, మావయ్య, పెదనాన్న, పిన్ని, అత్తయ్య, అమ్మమ్మ... బంధువులొస్తే వీరికి సంబరం. కాని దురదృష్టవశాత్తు కొందరు పిల్లలకు బంధువులుండరు. ఒకోసారి అమ్మో, నాన్నో కూడా వారితో వీరికి బంధువుగా మారి ఆదుకుంటోంది ‘వాల్మీకి గురుకులం’ అనే శరణాలయం. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి ఈ పిల్లలనుతానొక బంధువుగా కలిసింది. ఈ సమాజమే ఇటువంటి బాలలకు బంధుగణం అని మాట కలిపింది.అక్కడున్న పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. స్కూల్‌కు వెళ్లి చదువుకుంటారు. అందరూ కలిసి ఆడుకుంటూ భోజనం చేస్తూ ఒకేచోట గడుపుతూ మనమంతా ఒకరికొకరం అనే స్థయిర్యంతో బతుకుతారు. అయితే ఒక్కోసారి వారిని దిగులు కమ్ముకోవచ్చు. అమ్మో నాన్నో గుర్తుకు రావచ్చు. ఆ సమయాన్ని మనం దాటించగలగాలి. ఇలాంటి చోటుకు వీలున్న సమయాలలో వెళుతూ పలకరిస్తూ ఉంటే, వారితో సమయం గడుపుతూ ఉంటే వారి లోకం మనకు పరిచయం అవుతుంది. వారి చిరునవ్వుకు మన చిరునవ్వు తోడైతే కారే కన్నీరు తోక ముడుస్తుంది.అందుకే రంగారెడ్డి జిల్లా మోకిలా సమీపానప్రొద్దుటూరులో ఉన్న వాల్మీకి ఫౌండేషన్‌లో సుమారు 50 మంది చిన్నారులు దర్శకుడు సుకుమార్ కుమార్తె, చైల్డ్ సెలబ్రిటీ అయిన సుకృతిని చూసి కేరింతలు కొట్టారు. షేక్హ్యాండ్లు ఇచ్చారు. సరదా కబుర్లతో సమయమే తెలియలేదు అన్నట్టుగా గడిపారు.నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా సాక్షి మీడియా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇక్కడి పిల్లల కోసం సుకృతి తెచ్చిన పండ్లు, చాక్లెట్లతో తియ్యని వేడుకగా మారింది. వంటి తియ్యటి కార్యక్రమమిది. ఇక సుకృతి తెచ్చిన పుస్తకాలు ఒక మంచి కానుక వారికి. ఈ సందర్భంగా ఇక్కడి పిల్లలు తమ గురించి తాము సుకృతితో మనసువిప్పి మాట్లాడారు.ఈ బాధ్యత మనందరిదీ...‘సాక్షి’ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి రావడం వల్లే ఇలాంటి చిన్నారుల సామాజిక, మానసిక స్థితిగతులపైన అవగాహన వచ్చింది. వీళ్లూ నాలాంటి చిన్నారులే.. వీళ్లలో ఎన్ని నైపుణ్యాలున్నాయో చూస్తే ఆశ్చర్యమేసింది. చదువులతో పాటు డ్యాన్సులు చేస్తున్నారు, క్రీడల్లో రాణిస్తున్నారు. వారు వచ్చిన నేపథ్యం వేరు.. ఇక్కడ పొందిన పరిపక్వత వేరు. వారి మదిని తడిమి చూస్తే మాత్రం ఊహించని వేదన దాగుంది. అది మనం తీర్చలేనిది. కానీ వీలైనంత ఆత్మీయత,ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత.నేను ఇక్కడ పిల్లలు అందరితో కలిసి డ్యాన్సులు చేశాను. వారు నాకిష్టమైన అల్లు అర్జున్ గురించి, నా ఫేవరెట్ హాలిడే స్పాట్ పారిస్ గురించి, నా బెస్ట్ ఫ్రెండ్ సితార గురించి, నా చదువులు, లక్ష్యాలు ఇలా అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పచ్చని పొలాల మధ్య ఉన్న వాల్మీకి గురుకులం నాకో మధుర ఙ్ఞాపకం గా నిలిచిపోతుంది. నాన్న తెరకెక్కిస్తున్న పుష్ప–2 విషయాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. నా ఆలోచనల్లో చాలా మార్పులకు ఈ విజిట్ కారణమైంది. – సుకృతిలైబ్రరీ... కల్చరల్ టూర్మా దగ్గర 55 మంది చిన్నారులు సేవలు పొందుతున్నారు. సీడబ్ల్యూసీ నియమాల ప్రకారం యుక్త వయసు వచ్చిన చిన్నారుల్ని అనాథ ఆశ్రమంలో ఉంచకూడదు... కాబట్టి ఆ వయసుకొచ్చిన 15 మందిని ఉన్నత చదువుల కోసం మంచి కాలేజీల్లో చదివిస్తూ, హాస్టల్స్‌లో చేర్చాం. అనాథలు, నిరుపేద పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు సేవలందిస్తున్నాం. ఆర్ట్ ఆఫ్ స్టైల్ పేరుతో వంద మందికి సరిపడేలా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. డైనింగ్, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశాం. అధునాతన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని నిర్మిస్తున్నాం. మా సేవలన్నీ దాతల విరాళాలపైనే నిర్వహిస్తున్నాం. పిల్లలకు చదువులు మాత్రమే కాదు... వినూత్న అనుభవాలు, ఆలోచనలు కల్పించాలనే లక్ష్యంతో కల్చరల్ టూర్‌ను ప్లాన్ చేశాం. ఇందులో భాగంగా చెన్నైలోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన పిల్లలకు ఇక్కడ 4 రోజుల విడిది కల్పించి విభిన్నప్రాంతాల సాంస్కృతిక, చారిత్రక, అధునాతన జీవనశైలి పై అవగాహన కల్పించాం. మరికొద్ది రోజుల్లో మా చిన్నారులను కూడా చెన్నైకు తీసుకెళ్లనున్నాం. అంతేకాకుండా మా పిల్లలందరినీ విమానంలో గగనతల విహారం చేయించాం. న్యూట్రిషన్ కోసం ఎగ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా వాల్మీకి పిల్లల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులకు గుడ్లు అందిస్తున్నాం. గ్రామీణప్రాంతాల్లోని నిరుపేదల విద్యకు 500కు పైగా సైకిళ్లను అందించాం. – హరి కిషన్ వాల్మీకి, సంస్థ నిర్వాహకులుస్ఫూర్తిదాయకమైనదినేను ఆమెరికాలో ఆంకాలజీ డాక్టర్ గా పని చేశాను. గత కొన్నేళ్లుగా ఇక్కడి పిల్లల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నాను. ఇలాంటి వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలనే ఆలోచన స్ఫూర్తిదాయకమైనది. ఏడాదికి సరిపడా ఫీజులు ఒకేసారి చెల్లిస్తాను. ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులకు బయటకు వెళుతుంటే కాస్త బాధగానూ, అంతకు మించిన సంతోషంగానూ ఉంటుంది. – డా. రోహిణీ , సంస్థకు ప్రధాన సహాయకురాలుఎప్పుడూ చిల్డ్రన్స్ డేనేమాకెప్పుడూ చిల్డ్రన్స్డేలానే ఉంటుంది. ఇక్కడ అన్ని విషయాల్లో సహకారం అందిస్తారు. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. వీరు అందించిన ఏ సహకారాన్ని వృ«థాగా పోనివ్వను. – మారుతిమాదో కుటుంబంమేముంటున్న ‘వాల్మీకి గురుకులం’ అనా«థ ఆశ్రమంలా అనిపించదు. మాదో పెద్ద కుటుంబం. సౌకర్యాలు, వసతులే కాదు.. ఇక్కడ ప్రేమ, ఆప్యాయతలకు కొదువ లేదు. మాకెప్పుడూ ఒంటరి అనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటారు. కాకపోతే రోజూ 14 కిలోమీటర్లు స్కూల్‌కు వెళ్లి రావడం కష్టంగా ఉంది. ఈ విషయంలో ఎవరైనా దాతలు సహకారమందిస్తే వెహికిల్ ఏర్పాటు చేసుకుంటాం. – గౌతమ్ సాయిఇదే గురుకులానికి హెల్ప్ చేస్తానేను బాగా చదువుకుని, మంచి జాబ్ చేస్తూ ఇదే గురుకులంలోని మరి కొందరు చిన్నారులకు సహకారం అందించాలనుంది. ఇవాళ వచ్చిన సుకృతి అక్క మాతో చాలా బాగా కలిసిపోయింది. చాలా విషయాలు చెప్పింది. సినిమా హీరోలు ఎలా ఉంటారు... వారి జీవితాలు ఎలా గడుస్తాయి.. ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాను. – అనిల్ప్రేమ, తోడ్పాటు కావాలిఅప్పుడప్పుడు బాధ అనిపించినా ఇక్కడ ఆ ఆలోచనలకు తావు లేదు. మేం చాలా గౌరవంగా, ఆరోగ్యంగా మంచి చదువులను పొందుతున్నాం. జాలి, దయ కన్నా ప్రేమ, తోడ్పాటు జీవితాన్ని ముందుకు తీసుకెళతాయని తెలుసుకున్నాను. – భాను ప్రసాద్ -
జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు
-
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు
చేర్యాల(సిద్దిపేట): వసతి గృహంలో హాయిగా చదువుకోవలసిన విద్యార్థులు వంట పనివారిగా మారి చపాతీలు తయారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారంలో చపాతీలు అందించాల్సి ఉంటుంది. కానీ వాటి తయారీకి సరిపడా మనుషులు లేకపోవడంతో విద్యార్థులతో చేయించారు. ప్రిన్సిపాల్ సహకారంతోనే కాంట్రాక్టర్ ఇలా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గురుకుల ప్రిన్సిపాల్ అశోక్‌బాబు వద్ద ప్రస్తావించగా.. తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందని స్పష్టం చేశారు. అందువల్లే విద్యార్థులతో వంట పని చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
గురుకులంపై గురి... లేకుంటే ‘ప్రైవేటు’ సరి
సాక్షి, హైదరాబాద్: గురుకులంలో సీటొచ్చిందా... సరేసరి. లేకుంటే ప్రైవేటు కాలేజీనే బెస్ట్ అంటున్నారు ఇంటర్ విద్యార్థులు. 2023–24 ప్రవేశాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో చేరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 83,177 మంది చేరగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో 98,536 మంది చేరారు. ఇక రాష్ట్రంలోని 1,285 ప్రైవేటు కాలేజీల్లో ఏకంగా 3,11,160 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ లెక్క గమనిస్తే సాధారణ ప్రభుత్వ కాలేజీల కన్నా, గురుకులాల్లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక హాస్టళ్లు ఉండటం, విద్యాబోధనలో ప్రమాణాలు పాటించడం వల్ల మంచి ఫలితాలొస్తున్నాయని, అందుకే గురుకులాలకు తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యతనిస్తున్నారని అధికారులు అంటున్నారు. గురుకులాల తర్వాత ప్రైవేటు కళాశాలలవైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది కంటే ఇంటర్ ప్రవేశాలు తక్కువే నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్లో చేరిన వారి సంఖ్య తక్కువే. 2022–23లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 4,98,699 మంది ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థులు ఇంటర్లో చేరారు. అంటే, ఈ సంవత్సరం 5,826 మంది తగ్గిపోయారు. టెన్త్‌లో ఉత్తీర్ణత తగ్గడం దీనికి ఒక కారణమైతే, పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు రావడంతో కొంతమంది అటు వైపు మొగ్గు చూపారు. ఇంటరే కీలకం.. టెన్త్ వరకూ విద్యాభ్యాసం ఎలా ఉన్నా.. ఇంటర్ విద్యను కీలకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ భావిస్తున్నారు. ఇంటర్‌తో పాటే జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలని భావిస్తుంటారు. ఈ కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి అకడమిక్ విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన తర్ఫీదు తీసుకుంటున్నారు. ఇంటి వద్ద నుంచి కాలేజీకి వెళ్లి రావడం వల్ల మంచి ఫలితాలు రావని తల్లిదండ్రులు భావిస్తున్నారు. హాస్టల్ వసతి ఉన్న చోటే పిల్లలను చదివించాలనే ఆలోచన కొన్నేళ్లుగా పెరిగింది. ప్రభుత్వ గురుకులాల్లో సీట్లు వస్తే సరి... లేకుంటే వ్యయ ప్రయాసలు భరించైనా హాస్టల్ వసతి ఉన్న ప్రైవేటు కాలేజీల్లో చదువు చెప్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 3,178 ఉన్నాయి. -
సీఎం సార్... ఆశీర్వదించండి
ఆంధ్రప్రదేశ్ గురుకులం విద్యార్థులు అరుదైన అవకాశం చేజిక్కించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడ 10 నెలలు ఉండి పాఠాలు చదువుకోబోతున్నారు. ఈ గొప్ప అవకాశం వారి జీవితాలను మార్చనుంది. ఇందుకు కారణమైన ఏ.పి. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం అంటున్నారు. ‘ఏ.పి గురుకులాలను సి.ఎం గారు ఆధునికంగా తీర్చిదిద్దడం వల్లే మాకు ఈ అవకాశం దక్కింది’ అంటున్నారు. ‘కెనడీ లుగర్–యూత్ ఎక్స్ఛేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్’ కింద అమెరికా వెళ్లిన విద్యార్థుల మనోగతాలు... మా దేశానికి అధ్యయానికి రండి అంటూ అగ్రదేశం అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానం ఏ.పి. గురుకుల పాఠశాలల్లో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. నెలకు కనీసం రూ.10 వేలు కూడా సంపాదన లేని కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులు అమెరికాను చూడటమే కాదు అక్కడ పది నెలలు ఉండి చదువుకునే అవకాశం పొందడం వారి జీవితాలను మార్చనుంది. ఇలా పేదపిల్లలకు పెద్ద అవకాశం దక్కడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన చదువుల మహాయజ్ఞం కీలకపాత్ర పోషించిందన్నది జగమెరిగిన సత్యం. ‘నాడు–నేడు’తో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు అధునాతంగా మారిపోవడంతోపాటు అన్ని వసతులూ సమకూరాయి. ఇంగ్లిష్ విద్య, నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆన్లైన్ క్లాసులు, ట్యాబ్‌లు వంటి ఎన్నో సౌకర్యాలతో పేదపిల్లల పెద్ద చదువుకు కొత్త బాటలు పరుస్తున్నారు. తొమ్మిది దశల వడపోత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో అంతర్జాతీయ అవగాహనలో భాగంగా యూనైటెడ్ స్టేట్స్ (యూఎస్) గత కొన్నేళ్లుగా ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ (కేఎల్ – వైఈఎస్) ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి యేటా ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. దీనికి ఎంపిక కావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది. మొదట బయోడేటా నుంచి చివరి ఇంటర్వ్యూల వరకు తొమ్మిది దశల్లో కఠినతరమైన వడపోత కొనసాగు తుంది. దాదాపు తొమ్మిది నెలలపాటు కొనసాగే అన్ని అర్హత పరీక్షల ప్రక్రియను విజయవంతంగా దాటుకుని రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు డి.నవీన, ఎస్. జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్. ఆకాంక్షలు అవకాశాన్ని దక్కించుకున్నారు. వారంతా ఇటీవలే అమెరికాకు పయనమై వెళ్లారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలోచేర్పిస్తారు. ఆ విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు అతిథ్యం ఇస్తాయి. విద్యార్థులు ఒక్కొక్కరికీ దాదాపు 200 డాలర్లు (సుమారు రూ. 16,500) నెలవారీ ఆర్థిక తోడ్పాటు (స్టైపెండ్)ను అందిస్తారు. సీఎంకు కృతజ్ఞతలు 2023–24 విద్యా సంవత్సరానికి ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ’ కోసం ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియాలోని 38 దేశాల విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో మన దేశానికి చెందిన 30 మంది ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండటం గర్వకారణం. వీరికి కావలసిన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ఫోన్ల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థికసాయం అందిస్తోంది. కేఎల్–వైఈఎస్ ప్రోగ్రామ్‌లో అమెరికా చదువులకు వెళ్తున్న ఐదుగురు విద్యార్థులు డి. నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్ ఆకాంక్ష సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆగస్టు 31న కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తిచేసుకుని వచ్చిన విద్యార్థులు కె.అక్ష, సి.తేజ కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ నేప«థ్యం తదితర వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. యూఎస్ఏ లో చదువులు పూరై్త వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి ట్యాబ్‌లను అందజేశారు. థాంక్యూ సీఎం సార్ అమెరికా చదువులకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్లే నాకు ఈ అవకాశం దక్కింది. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ మా ఊరు. మా నాన్న ప్రవీణ్ రాజ్ నెలకు రూ.7 వేలు సంపాదించే ప్రైవేటు ఉద్యోగి. తల్లి సుకాంతి గృహిణి. ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితిలో గురుకులం ద్వారా ప్రభుత్వం నాకు మంచి విద్యావకాశాలు కల్పించింది. – రోడా ఇవాంజిలి, మధురవాడ గురుకులం, విశాఖ జిల్లా. విద్యాలయాల్లో మెరుగైన సదుపాయాలు మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో బాగా తీర్చిదిద్దారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి మా గ్రామం. మా నాన్న దార కేశయ్య పదవ తరగతి చదివి వ్యవసాయ పనులతో నెలకు రూ.10 వేలు సంపాదిస్తాడు. ఐదవ తరగతి చదివిన అమ్మ ఆదిలక్ష్మమ్మ గృహిణి. పేదరికం కారణంగా ప్రకాశం జిల్లా మార్కాపురం గురుకులంలో 5 వ తరగతిలో చేరిన నేను ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నా. – డి.నవీన, మార్కాపురం గురుకులం ఆనందంగా ఉంది ప్రభుత్వ గురుకులంలో చదివే నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. విజయవాడ గుణదల ప్రాంతం మాది. మా నాన్న చొక్కా సురేష్ అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అమ్మ వనజ గృహిణి. – సీహెచ్ ఆకాంక్ష, ఈడ్పుగల్లు ఐఐటీ– ఎన్ఐటీ అకాడమి, కృష్ణా జిల్లా పేద పిల్లల చదువులకు సీఎం శ్రద్ధ చూపిస్తున్నారు పేద పిల్లల ఉన్నత చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ శ్రద్ధ చూపిస్తున్నారు. పేదవర్గానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపిక అయ్యానంటే మా చదువులకు సీఎం సార్ అందించిన ప్రోత్సాహమే కారణం. చాలా సరదాగా మాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం గారు మాకు రూ.లక్ష సాయం, ట్యాబ్‌లు అందించారు. సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, మల్లెనిపల్లి మా గ్రామం. మా నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. –హాసిని బలిగా, ఈడ్పుగల్లు ఐఐటీ– నీట్ అకాడమి, ఎస్సీ గురుకుల కలలో కూడా ఊహించలేదు నేను అమెరికా చదువుకు ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు అందించిన సహకారం వల్లే ఈ అవకాశం దక్కింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జి.కొత్తూరు మా ఊరు. మా నాన్న ఎస్.కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము రోజువారీ కూలీగా నెలకు ఆరు వేలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 2017లో గురుకులంలో 6వ తరగతిలో చేరి ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. – ఎస్. జ్ఞానేశ్వరరావు, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా. – యిర్రింకి ఉమమాహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి, అమరావతి -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మన్ననూరులో ఉద్రిక్తత
సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: జిల్లాలోని మన్ననూరు గురుకులంలో దారుణం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్లాస్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని నిఖిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో నిఖిత ఘర్షణ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థిని మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. మానసిక వేదనే నిఖిత సూసైడ్‌కు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొట్టి చంపారని నిఖిత తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో మన్ననూరు గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: రంగారెడ్డి: ఉసురు తీసిన కంత్రీగాళ్లు -
తెలంగాణ: కాగజ్‌నగర్ గురుకులంలో ఫుడ్‌పాయిజన్
ఆసిఫాబాద్: కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్‌పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. భోజనం వికటించి యాభై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాత్రికి రాత్రే వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షలోనే వాళ్లంతా ఉన్నారు. ఇదిలా ఉంటే.. భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఫిర్యాదు చేయడం విశేషం. -
విద్యార్థిని ఆత్మహత్య...కారణం అదేనా...
ఎచ్చెర్ల క్యాంపస్: కుమార్తెపైనే గంపెడు ఆశలు పెట్టుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. చదువులో ఎప్పుడూ ముందుండే తమ కుమార్తె ఇక లేదని తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంగళవారం శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలం అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాంమెట్ట (మన్నెపేట)కు చెందిన దంపతులు దుంగ భూలోక, భారతిలు విశాఖలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కుమారుడు నవీన్ ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తుండగా, కుమార్తె కరిష్మా(17) ఎచ్చెర్లలోని అంబేడ్కర్ గురుకులం(పాఠశాల/కళాశాల)లో ఇంటర్మీడియెట్(బైపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతోంది. చదువులో చురుగ్గా ఉండే కరిష్మా ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతూ త్వరలో జరిగే పబ్లిక్ పరీక్షలతో పాటు నీట్, అగ్రికల్చర్ సెట్లకు సైతం సిద్ధమవుతోంది. ఇటీవలే చెవి నొప్పి అంటూ ఇంటికి వెళ్లి చికిత్స చేయించుకుని ఆదివారం మళ్లీ పాఠశాలకు చేరుకుంది. స్టడీ అవర్స్‌లో భాగంగా మంగళవారం ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి 5.30 గంటలకు తరగతి గదికి చేరుకుంది. కొద్దిసేపటికే ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులు ఆరు గంటలకు తరగతికి గదికి చేరుకోగా కరిష్మా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఎస్సై కె.రాము ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా విద్యార్థిని మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలం వద్ద ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. విశాఖ నుంచి తల్లిదండ్రు లు, సోదరుడు, బంధువులు ఘటనా స్థలాని కి చేరు కుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తహశీల్దార్ సనపల సుధాసాగర్ గురుకులాన్ని పరిశీలించారు. కారణం అదేనా.. గురుకులం పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విజయనగరం నుంచి కారులో రాకపోకలు సాగిస్తున్నారు. కారు డ్రైవర్ ఈ విద్యార్థినిని కొంతకాలంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు సైతం చెప్పినట్లు తెలిసింది. అప్పట్లో తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థినికి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వడం, డ్రైవర్‌ను ఉపాధ్యాయురాలు తొలగించడం జరిగాయి. ఈ క్రమంలోనే తోటి విద్యార్థులు కామెంట్లు చేయటం, విద్యార్థిని వ్యక్తిగతంగా రాస్తున్న డైరీ పరిశీలించి సోమవారం ఉపాధ్యాయురాలు మందలించటం వంటివి చోటుచేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఆగ్రహం.. విద్యార్థిని ఆత్మహత్య విషయంలో గురుకుల యాజమాన్యం తీరుపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రాకుండానే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించటం, విద్యార్థుల తల్లిదండ్రులను సైతం అనుమతించని గురుకులంలోకి డ్రైవర్‌ను రానివ్వడం, గతంలో వివాదం తలెత్తినప్పుడు డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం వంటి అంశాలను లేవనెత్తుతున్నారు. పోలీసులు మాత్రం తాము వచ్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాకే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు. నన్ను క్షమించండి... విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదుకు భిన్నంగా నోట్ ఉండటం గమనార్హం. సూసైడ్ నోట్ పరిశీలిస్తే.. ‘అమ్మా, నాన్నా, అన్నా.. నన్ను దయచేసి క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్లటం బాధగా ఉంది. నాకు వేరే దారిలేదు. మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాను. దేవుడు ధృడమైన సంకల్పం ఇవ్వలేదు. నేను, డ్రైవర్ సాయి ఇద్దరం ఇష్టపడ్డాం. ఆయన నా వల్ల ఉద్యోగం కోల్పోయారు. నా మృతికి ఎవ్వరూ కారణం కాదు. రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు..’ ఇదీ సూసైడ్ నోట్ సారాంశం. ముగ్గురిపై కేసు నమోదు.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురుకులం ప్రిన్సిపాల్ కె.ఉషారాణి, ఇంగ్లిష్ టీచర్ భవానీ, ఈమె పూర్వపు కారు డ్రైవర్ సురేష్ (సాయి)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.రాము చెప్పారు. ముగ్గురు సస్పెన్షన్.. శాఖాపరంగా సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ చర్యలు చేపట్టారు. ప్రిన్సిపాల్ కె.ఉషారాణి, ఇంగ్లి్లష్ టీచర్ భవానీ, హౌస్ (క్లాస్ టీచర్) మంజులను సస్పెండ్ చేసినట్లు జిల్లా అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త యశోధలక్ష్మి తెలిపారు. ప్రస్తుత వైస్ ప్రిన్సిపాల్ రాధికకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. విద్యార్థిని మృతి దురదృష్టకరం: కలెక్టర్ విద్యార్థిని కరిష్మా మృతి దురదృష్టకరమని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సూసైడ్ నోట్ మేరకు ఆత్మహత్య పూర్తిగా వ్యక్తిగతమైనదని తెలిసిందని, విద్యార్థులు సమస్యలు ఉంటే ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలని సూచించారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com (చదవండి: అర్థరాత్రి ప్రమాదం! బతుకులను చీకట్లో కలిపేసిన కాళరాత్రి) -
ఆర్నెళ్లలో గురుకుల నియామకాలు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆర్నెల్లలో సమయం పడుతుందని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వివిధ శాఖల్లో 80వేల పైచిలుకు ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ (నేరుగా నియామకాల) పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా నిర్దేశించిన పోస్టులను ఎంత కాలంలో భర్తీ చేస్తారనే అంచనాలను ప్రభుత్వం సేకరించింది. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోస్టుల భర్తీకి ఎంత సమయం పడుతుందో వివరాలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆమేరకు నియామక సంస్థలను కోరింది. గురుకులాల్లో 10 వేల ఖాళీలు ఉండగా, వీటి భర్తీకి ఆర్నెల్ల వ్యవధి పడుతుందని టీఆర్‌ఈఐఆర్‌బీ వెల్లడించింది. ఈ 10 వేల ఖాళీల్లో 85 శాతం పోస్టులు బోధన కేటగిరీవి కాగా, మిగతావి బోధనేతర కేటగిరీలోనివి. ప్రస్తుతం ఈ పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసినప్పటికీ భర్తీకి సంబంధించి శాఖల వారీగా ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే నియామకాల ప్రక్రియను వేగవంతం చేసి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు బోర్డు కసరత్తు చేపట్టింది. వివాదరహితంగా రిక్రూట్మెంట్ రాష్ట్రంలో ఐదు గురుకులాల సొసైటీలుండగా, వీటి పరిధిలో వెయ్యికిపైగా విద్యా సంస్థలున్నాయి. గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలను చేపట్టేం దుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీఆర్‌ఈఐఆర్‌బీని ఏర్పాటుచేసింది. ఈ బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 7 వేల ఖాళీల భర్తీకి అనుమతులివ్వగా, ఒక్క ఉద్యోగానికి సంబంధించి కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా భర్తీ చేసి శభాష్ అనిపించుకుంది. వీటిని గరిష్టంగా 9 నెలల వ్యవధిలోనే పూర్తి చేయగా, ఈసారి మరింత తక్కువ సమయంలోనే నియామకాలు చేపట్టేందుకు బోర్డు సిద్ధమవుతోంది. -
మేనేజర్ రోజూ ఏదో ఒక వంకతో మా దగ్గరకు వచ్చి..
మైసూరు(బెంగళూరు): మైసూరులోని హెబ్బాళ సమీపంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను వేధింపులకు గురి చేసిన ఆరోపణలపై గురుకులం మేనేజర్ గిరీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ 18 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. గిరీష్ రోజూ ఎవరూ లేని సమయంలో తమ వద్దకు వచ్చి లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థినులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. మరో ఘటనలో.. మద్యం మత్తులో గొడవ.. ఒకరి హత్య మండ్య: మద్యం మత్తులో జరిగిన గొడవలో ఒకరు హతమయ్యారు. ఈఘటన మళవళ్లి తాలూకా హలగూరులో చోటు చేసుకుంది. హలగూరుకు చెందిన మను(30) చెత్త పేపర్ల సేకరణతో జీవిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం లిక్కర్ షాపు వద్ద మద్యం తాగి వస్తుండగా మరో వ్యక్తితో గొడవ జరిగింది. షాపువారు ఇద్దరినీ మందలించి పంపారు. రాత్రి 9గంటల సమయంలో ఇద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. బీరు బాటిల్ తీసుకొని తలపై బాదడంతో మను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చదవండి: నోట్ రాసి మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా.. గురుకులాలకు షాక్!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు బ్రాండ్‌గా నిలిచిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో గురుకుల సొసైటీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శిగా 2012లో బాధ్యతలు చేపట్టారు. తక్కువ సమయంలోనే గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి వాటి ఖ్యాతిని పెంచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గురుకులాల కీర్తిని నిలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల్లో పెద్ద ఎత్తున కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. సాధారణంగా మూడేళ్ల పాటు ఒక పదవిలో పనిచేసిన వ్యక్తికి బదిలీ అనివార్యం. కానీ ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అక్కడి నుంచి కదిలించలేదు. కీలక బాధ్యతల్లో కొనసాగుతూ.. రెండు సొసైటీల కార్యదర్శితో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ (ఈఎంఆర్ఎస్ఎస్) కార్యదర్శిగా, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కేజీ టు పీజీ మిషన్ కింద గురుకుల విద్యా సంస్థలను పెద్ద సంఖ్యలో పెంచింది. ఈ క్రమంలో గురుకుల సొసైటీల్లో వేలాది ఉద్యోగాల భర్తీ చేయాల్సి రావడంతో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)ని ఏర్పాటు చేసి, ఈ బోర్డు చైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. దాదాపు ఈ బోర్డుకు నాలుగేళ్ల నుంచి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్ రాజీనామాతో ఈ నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఒకవేళ ఆయన రాజీనామాను ఆమోదిస్తే ఇప్పటికిప్పుడు కిందిస్థాయి అధికారులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినా.. వందల సంఖ్యల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఈ సొసైటీలకు హెచ్‌వోడీల నియామకం సులువైన విషయం కాదు. గరుకుల సంస్థల్లో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు సులువుగా పొందుతున్నారు. వీటిని ఇదే స్థాయిలో నిర్వహించాలంటే ప్రవీణ్‌కుమార్‌లా చురుగ్గా ఉండే అధికారి కావాలని విద్యార్థులు సైతం ఆకాంక్షిస్తున్నారు. -
TGCET 2021: తేదీల ఖరారు.. పరీక్షలు ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి అర్హత పరీక్షలన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో బోధన, అభ్యసన కార్యక్రమాల్లో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా అడ్మిషన్లు నిర్వహించాలని విద్యాశాఖ సూచించడంతో గురుకుల సొసైటీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐదో తరగతి అడ్మిషన్ల కోసం టీజీసెట్ నిర్వహిస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి సైతం దరఖాస్తుల ఆధారంగా ప్రవేశ పరీక్షలుంటాయి. ఇక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆర్జేసీసెట్, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆర్డీసీసెట్ నిర్వహిస్తున్నారు. పది రోజుల్లో ఫలితాలు గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీలు ఉమ్మడి ప్ర వేశ పరీక్ష(టీజీసెట్) నిర్వహిస్తోంది. ఈ నెల 18న టీజీసెట్‌ను నిర్వహించేందుకు గురుకుల సొసైటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్షకు వారం ముందు వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు సెట్ కన్వీనర్ ఇప్పటికే తెలిపారు. ► ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 17న యూజీసెట్ నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను ఈ ఏడాది మాత్రం విద్యార్థికి పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేశారు. ► బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లు, అదే సొసైటీ పరిధిలోని మహిళా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈనెల 25న అర్హత పరీక్షలను వేరువేరుగా నిర్వహిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో(ఆగస్టు తొలి వారం) ఫలితాలు విడుదల చేసేలా గురుకుల సొసైటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గతేడాది పరీక్షలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది అలాంటి జాప్యం లేకుండా వీలైనంత త్వరగా పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా సొసైటీ అధికారులు ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నారు. -
తెలంగాణ గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులు
హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీలకు (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ, టీటీడబ్ల్యూఆర్‌ఈఐ) చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్ శిక్షణ కోసం పార్ట్‌టైం సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 110 ► పోస్టుల వివరాలు: మ్యాథ్స్–16, ఫిజిక్స్–20, కెమిస్ట్రీ–24, బోటనీ–23, జువాలజీ–24, సివిక్స్–02, ఎకనమిక్స్–01. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ పూర్తిచేసి ఉండాలి. జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్ టీచింగ్ అనుభవంతోపాటు సంబంధిత సర్టిఫికేట్ ఉండాలి. ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో ప్రొఫిషియన్సీ, ఇంగ్లిష్‌లో కమ్యూనికేటివ్ స్కిల్స్, జేఈఈ/నీట్/ఎంసెట్ పరీక్షా విధానం గురించి తెలిసి ఉండాలి. వీటన్నింటి ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షా విధానం: ఎంపిక ప్రక్రియను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 50 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్, 25 మార్కులకు డెమో, మరో 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్‌ల్లో అభ్యర్థి మాస్టర్స్ డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.07.2021 ► పరీక్ష తేది: 10.07.2021 ► డెమో/ఇంటర్వ్యూ తేది: 18.07.2021 ► వెబ్సైట్: https://tgtwgurukulam.telangana.gov.in సీ–మెట్, హైదరాబాద్‌లో 25 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ(సీ–మెట్).. తాత్కాలికప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 25 ► పోస్టుల వివరాలు: సీనియర్ ఇంచార్జ్,షిఫ్ట్ ఇంచా ర్జ్, సీనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్, జూనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్, ఎలక్ట్రీషియన్, హెల్పర్, సీనియర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, ఇన్స్ట్రుమెంటేషన్ స్టాఫ్, జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, అనలిస్ట్, జూనియర్ ఆఫీస్ స్టాఫ్. ► అర్హత: పోస్టుని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుని అనుసరించి నెలకు రూ.13,000 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ(సీ–మెట్), ఐడీఏ ఫేజ్–3, హెచ్‌సీఎల్(పీఓ), చర్లపల్లి, హైదరాబాద్–500051 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 14.07.2021 ► వెబ్సైట్: www.cmet.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటిస్ ఖాళీలు.. అప్లై చేసుకోండి! -
ఏపీ బీజీ ఇంటర్ సెట్–2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్).. 2021–2022 విద్యాసంవత్సరానికి 164 సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజీలు, మూడు ఐఐటీ మెడికల్ అకాడెమీస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిం ది. బాలయోగి గురుకులం ఇంటర్మీడియెట్ కామన్ ఎం ట్రెన్స్ టెస్ట్(బీజీ ఇంటర్ సెట్–2021) ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ► ఏపీఎస్‌డబ్ల్యూఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు 2021–22. ► అర్హతలు: 2021 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బీజీ ఇంటర్ సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ► వయసు: 31.08.2021 నాటికి 17 ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక ఏడాది సడలింపు లభిస్తుంది. ∙విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: 2021–22 బీజీ ఇంటర్ సెట్లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, ఫిజికల్ సైన్స్ 15 ప్రశ్నలు, బయోసైన్స్ 15 ప్రశ్నలు, సోషల్ సైన్స్ 15 ప్రశ్నలు, ఇంగ్లిష్(కాంప్రెహెన్షన్ అండ్ గ్రామర్) 15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ► ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. అలాగే ఇందులో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ► ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఐఐటీ–మెడికల్ అకాడెమీస్ పరీక్ష ఐఐటీ–మెడికల్ అకాడెమీస్‌ను ఎంచుకొని.. బీజీ ఇంటర్ సెట్లో మెరిట్లో నిలిచిన విద్యార్థులకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు:ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2021 ► పరీక్షా తేదీ: త్వరలో వెల్లడిస్తారు ► వెబ్సైట్: https://apgpcet.apcfss.in/Inter చదవండి: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్ -
వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
అటు చీకటి.. ఇటు వెలుగు.. అటు కాఠిన్యం.. ఇటు మమకారం. గుండె ఘనీభవిస్తే విషాదం. మనసు పరిమళిస్తే ఆనందం. ఎంత వైరుధ్యం! ఎంత విచిత్రం! కాస్త కరుణించి అనురాగాన్ని పంచితే మమత వెల్లివిరిస్తుంది. అదే గుండె బండబారితే వేదన ఉప్పెనవుతుంది. అది ఎక్కడికైనా దారితీస్తుంది. పరస్పర భిన్నమైన ఈ పరిణామాలకు శుక్రవారం సాక్షిగా నిలిచింది. సవతి తల్లి కాఠిన్యం ఓ పందొమ్మిదేళ్ల యువకుడి ఆత్మహత్యకు ప్రేరణ అయితే.. గర్భవతిగా ఉన్న అధ్యాపకురాలికి సహోద్యోగులు తామే చొరవ తీసుకుని విద్యాలయంలో సీమంతం చేయడం సంతోష కారణమైంది. పొందూరు: మండలంలోని వీఆర్ గూడెం గ్రామానికి చెందిన యువకుడు పైడి నర్సింహమూర్తి(19) శుక్రవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సవతి తల్లి వేధింపులు భరించలేకే తనువు చాలిస్తున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నర్సింహమూర్తి తల్లి చిన్నప్పుడే దూరమైంది. తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. బాగా చదువుకోవాలనే ఉత్సాహం ఉన్నా ప్రోత్సహించే వారు లేకపోవడం, సవతి తల్లి వేధింపులు వెరసి తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆర్.దేవానంద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నా చావుకి కారణం... కన్నతల్లి చిన్నప్పుడే వదిలి వెళ్లిపోవడంతో నర్సింహమూర్తి సవతి తల్లి వద్ద పెరిగాడు. తండ్రి రెండేళ్ల క్రితం చనిపోవడంతో సవతి తల్లి వేధింపులకు గురిచేస్తోందంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అత్తమామల దయతో పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశానని, ఉన్నత చదువులు చదువుకోవాలని ఉత్సాహం ఉన్నా పట్టించుకునే వారు, ప్రోత్సహించే వారు లేరని, అందుకే చనిపోతున్నానని, అత్తమామలు, బావ క్షమించాలని నోట్లో పేర్కొన్నాడు. (చదవండి: నేను బావిలో పడి చనిపోతున్నా..) అమ్మలా.. దీవెన మందస: తోటి అధ్యాపకులే బంధువులయ్యారు.. ఆశీర్వచనాలే వేదమంత్రాలయ్యాయి.. సరస్వతీ నిలయమే ఆనందవేదికయ్యింది.. మందస మండలం భైరిసారంగపురం పంచాయతీ రాధాకృష్ణపురం సమీపంలోని ఏపీ బాలయోగి గురుకులంలో ఓ అధ్యాపకురాలికి శుక్రవారం సీమంతం నిర్వహించారు. కరోనా కారణంగా గురుకులానికి దూరమైన అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యారి్థనులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. చదువులమ్మ గుడిలో సందడి కనిపిస్తోంది. ఈ తరుణంలో బోటనీ అధ్యాపకురాలు బి.ప్రమీల గర్భిణిగా ఉందని తెలుసుకున్న సిబ్బంది సంప్రదాయరీతిలో సీమంతం నిర్వహించారు. గాజులు, పసుపు, కుంకుమ, చీర, స్వీట్లు అందించి అభినందనలు తెలిపారు. ఎన్నడూలేని రీతిలో తనకు గురుకులంలో సీమంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ప్రమీల చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేషాద్రి, వైస్ ప్రిన్సిపాల్ డి.మన్మధరావు, అధ్యాపకులు అన్నపూర్ణ, జయశ్రీ, ఎన్‌జ్యోతి, ఆర్.సుభాణి, యు.సంధ్యారాణి, కె.నాగమణి, వెంకటరావు, పోలయ్య, చంద్రశేఖర్, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
సీటు రాకుంటే వేటు!
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు తమ పరిధిలోని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ)లకు జేఈఈ లక్ష్యాలు నిర్ధేశించాయి. అత్యుత్తమ ర్యాంకులు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. ప్రతి సీఓఈ కనీసం 3 నుంచి 5 సీట్లు వచ్చేలా కృషి చేయాలని హెచ్చరించాయి. గతవారం జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చి న విషయం తెలిసిందే. అందులో ఈ రెండు సొసైటీల నుంచి 706 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 432, ఎస్టీ గురుకుల సొసైటీ నుంచి 274 మంది ఉన్నారు. తాజాగా ఈ విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సన్నద్ధం చేయాలని ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి. యుద్ధ ప్రాతిపదికన తరగతులు ప్రారంభించాలని సూచించాయి. వీటితో పాటు బోధకులు, ప్రిన్సిపాళ్లకు పలు రకాల నిబంధనలు విధించాయి. ర్యాంకులొస్తేనే ఉద్యోగం... జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు మరో పదిహేను రోజుల సమయం ఉండడంతో విద్యార్థులకు బోధన, అభ్యసన కార్యక్రమాలు పెంచుకోవాలని సొసైటీలు ఆదేశించాయి. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్టును నాలుగు గంటల పాటు బోధించాలని సూచించాయి. మెయిన్ పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడంతో అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే తరహాలో ఫలితాలు ఉండాలని, లేకపోతే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ బాధ్యత వహించాలని స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితిని పరీక్షా సమయంగా భావించి పనిచేయాలని సూచిస్తూ... ప్రిన్సిపాల్స్ స్థానికంగా ఉంటూ అడ్వాన్స్డ్ బోధన, అభ్యసన తీరును నిరంతరం పర్యవేక్షించాలన్నాయి. ఫలితాలు సంతృప్తికరంగా లేకుంటే బోధకులను విధుల నుంచి టర్మినేట్ చేస్తామని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఆపరేషన్ విభాగం ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్డ్యూటీ) జారీ చేసిన సంయుక్త ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నిబంధన ఉపాధ్యాయుల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విధులను అత్యంత భయపడుతూ నిర్వహిస్తున్నామని, ఇలాంటి షరతులు పెడితే స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండదని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వైవీయూ గూటికే ‘గురుకులం’
సాక్షి, వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం గూటికి 21వ శతాబ్ధపు గురుకులం భవనాలు వచ్చి చేరనున్నాయి. ఈ మేరకు ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 8 బ్లాక్‌లతో వైవీయూలో 21వ శతాబ్ధపు గురుకులం భవనాలు ఏర్పాటు చేశారు. ఈ భవనాల నుంచి ఇడుపులపాయ ట్రిపుల్ వరకు నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమంలో ఇడుపులపాయలో ప్రత్యేకంగా భవనాలు నిర్మించడంతో వీటి అవసరం లేకుండా పోయింది. దీంతో వీటిని వైవీయూ నుంచి వేరుచేసి స్కిల్‌డెవలప్‌మెంట్ వారికి అప్పజెప్పారు. దీంతో ఈ భవనాలను ఎన్జీఓల ఆధ్వర్యంలో నడుస్తున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు ఈ భవనాలను వినియోగించుకుంటున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ భవనాల్లోని రెండు బ్లాక్‌లను మాత్రం వైవీయూ అధికారులు కామర్స్, మేనేజ్మెంట్ బ్లాక్‌లుగా, పరిశోధన అవసరాల కోసం వినియోగించుకుంటూ వచ్చారు. -
గురుకులాల్లో ‘5’కు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: గురుకులం అడ్మిషన్లకు కరోనా అడ్డంకి కాబోతోంది. ఐదో తరగతి ప్రవేశాలకు ఈసారి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటమే దీనికి కారణం. సాధా రణ పాఠశాలల్లో విద్యార్థులు ఉదయం హాజరై సాయంత్రానికి ఇంటి ముఖం పడతారు. కానీ, గురుకుల పాఠశాలల్లో బోధన, అభ్యాసన, వసతి అంతా ఒకేచోట ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 700కు పైగా గురుకుల పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశా లలో ఐదో తరగతి నుంచి పదో తరగతివరకు (ఆరు తరగతులు) ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు, ప్రతి సెక్షన్‌కు 40మంది పిల్లలుం టారు. ఈ లెక్కన ఒక్కో పాఠశా లలో 480 మంది విద్యార్థులుం టారు. ప్రతి సంవత్సరం మే నెలాఖరుకే ఐదో తరగతిలో అడ్మి షన్ల ప్రక్రియ పూర్తయ్యేది. ఈసారి క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించినా కరోనా కారణంగా ప్రవేశ పరీక్ష నిర్వహించకపోవడంతో అడ్మిషన్ల ప్రక్రియ స్తంభించింది. ఫిజికల్ డిస్టెన్స్ కీలకం: కొత్తగా ఏర్పాటు చేసిన, అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల భవనాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం ఇబ్బందే. ఈ ఏడాది ఐదో తరగతి అడ్మిషన్లు నిలిపివేస్తే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించే వీలుంటుందని సొసైటీలు భావిస్తున్నాయి. పదేళ్లలోపు పిల్లల ఆరోగ్యంపట్ల మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ పదేపదే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐదో తరగతి ప్రవేశాలకు బ్రేక్ ఇస్తే మంచిదని అధికారులు అంటున్నారు. ఇటీవల గురుకుల సొసైటీ కార్యదర్శులు నిర్వహించిన సమావేశాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్నిబట్టి అడ్మిషన్లు చేపట్టడమో, నిలిపివేయడమో జరుగుతుంది. ఒకట్రెండు రోజుల్లో మరోవిడత అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుండగా కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించిన తర్వాత గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నట్లు గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
గురుకులాల భవనాలకు శానిటైజేషన్..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థలను శాని టైజ్ చేయాలని సొసైటీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులతో మెజార్టీ రంగాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈక్రమంలో అతి త్వరలో విద్యా సంస్థల నిర్వహణకు సైతం ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వనున్న నేపథ్యంలో ఆ దిశగా సొసైటీ యాజమాన్యాలు చర్యలు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా గురుకుల పాఠశాలలను క్రమ పద్ధతిలో శానిటైజేషన్ చేయనున్నాయి. కోవిడ్–19 అనుమానితుల కోసం చాలా గురుకుల పాఠశాలల భవనాలను క్వారంటైన్ సెం టర్లుగా ప్రభుత్వం వినియోగించింది. ఆ భవనాలను శానిటైజేషన్ చేయనున్నారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ మొదలు పె ట్టనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సూచించడం తో అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. త్వరలో క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభిస్తారు. పాఠశాలలు తెరిచే నాటికి..: ప్రస్తుతం క్వారంటై న్ కేంద్రాలుగా ఉన్న వాటిని శానిటైజేషన్ చేసేందు కు కార్యాచరణ సిద్ధం చేస్తున్న సొసైటీలు... ఆ త ర్వాత మిగతా గురుకుల పాఠశాలల భవనాలను కూడా శుద్ధి చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 900కు పైగా గురుకుల పాఠశాల భవనాలున్నాయి. వీటి శానిటైజేషన్‌కు స్థానిక యంత్రాంగం సహకారం తీసుకో నున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో ఉన్న గురుకుల పాఠశాల భవనాల ను అక్కడి యంత్రాంగం సహకారంతో శుద్ధిచేయాలని భావిస్తున్నారు. ఆయా ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం కోసం సంప్రదించాలని ఆయా గురుకుల పా ఠశాలల ప్రిన్సిపాళ్లకు సొసైటీ అధికారులు సూచిస్తున్నారు. లాక్డౌన్ 4.0 ఈనెలాఖ రుతో ముగుస్తుంది. ఆ తర్వాత పొడిగిం పుపై సందేహం ఉన్నప్పటికీ జూన్ నెలాఖరు వరకు మాత్రం విద్యాసంస్థలకు అనుమతిచ్చే అవకాశం లేదని సమాచారం. టెన్త్ పరీక్షలు ముగిశాక జూలై చివర్లో లేదా ఆగస్టులో విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. దీంతో ఆలోపు గురుకుల పాఠశాల భవనాలను శానిటైజేషన్ చేయనున్నారు. -
త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీని 31 జిల్లాల ప్రకారమే చేపట్టే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన ములుగు, నారాయణ్‌పేట్ కలుపుకొని 33 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో 31 జిల్లాల ప్రకారమే ముందుకు సాగాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ) భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు సమాచారం. దీంతో గురుకులాల్లోని 2,500 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. మొత్తం 5 శాఖలకు చెందిన గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు సంబంధించిన వివరాలను ఆయా గురుకులాల సొసైటీల కార్యదర్శులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 1,900 పోస్టులు బీసీ గురుకులాలకు చెందినవి కాగా, మరో 600 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. 1,900 పోస్టులు బీసీ గురుకులాల్లోనే.. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ గురుకులాలు 261 ఉండగా, అందు లో 119 గురుకులాలు ఈ ఏడాదే ప్రారంభం అయ్యాయి. వాటిల్లోనే 1,900 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 1,071 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), 119 స్టాఫ్‌నర్స్, 119 లైబ్రేరియన్స్, 119 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు, 110 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే పీజీటీ హిందీ–100, ఫిజికల్ డైరెక్టర్స్–70 పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా మరో 192 పోస్టులను మిగతా బీసీ గురుకులాల్లో భర్తీ చేయనున్నారు. ఇతర సంక్షేమ శాఖలకు చెందిన గురుకులాల్లో మరో 600 వరకు బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆయా పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు సీఎస్‌కు లేఖ రాసింది. -
గురుకులాల్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు
సాక్షి, అచ్చంపేట: రాష్ట్రంలోని 34 గురుకుల పాఠశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులను ప్రారంభించినట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో రూ.1.50 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కస్తూర్భా బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మిం చిన జూనియర్ కళాశాల భవనాన్ని మంగళవారం గురుకులాల కార్యదర్శి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గురుకులాల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియో గం చేసుకొని విద్యార్థులు చదువుల్లో రాణించాలని కోరారు. రాష్ట్రంలో ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులతో పాటు 53 మహిళా డిగ్రీ కళాశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. కస్తూర్భా విద్యాలయాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను మహిళా డిగ్రీ కళాశాలలకు పంపాలని ఆయన సంబంధిత విద్యాలయాల ప్రిన్స్‌పాల్స్‌ను కోరారు. రాబోయే కాలంలో గురుకులాలను సమర్థవంతంగా నిర్వహించుటకు తగు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఆడ పిల్లల చదువుల విషయంలో సమస్యగా మారకుండా స్వేచ్ఛగా చదువుకునేలా వాతావరణం కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల రూపు రేఖలే మారాయన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన విద్యార్థుల సంక్షేమం కోరుతూ అనేక అన్ని వర్గాల వారికి గురుకుల విద్యను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సమస్యలను అధిగమించి ఆత్మగౌరవంతో చదువు కోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను హక్కుగా భావించి సద్వినియోగం చేసుకోవా లని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, ప్రిన్స్‌పాల్స్ నాగభూషణం, శారద, ఎంఈఓ చంద్రుడు, జెడ్పీటీసీ సభ్యు రాలు నేజమ్మ, ఎంపీపీ లింగమ్మ, స ర్పంచ్ కోనేటి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
పరిపూర్ణ విజయగాథ
20 ఆగస్ట్ 2013: ‘నల్లగా, సన్నగా ఉన్న పూర్ణ మలావత్’– కామారెడ్డి జిల్లాలో ఉన్న తాడ్వాయి మండలపు సాంఘిక సంక్షేమ పాఠశాలలో వాలీబాల్ ఆడుతుండగా, అపర్ణ తోట రాసిన ‘పూర్ణ’ మొదలవుతుంది. పూర్ణ తండ్రి దేవీదాస్ ‘తన పిల్లల చదువులపై పెట్టుబడి పెట్టిన’ వ్యక్తి. ఆయన పూర్వీకులు రాజస్తాన్ నుండి వలస వచ్చి, పాకాల కుగ్రామంలో స్థిరపడిన బంజారాలు. పూర్ణ టీచర్‌కు బోనగిరి గుట్టలెక్కేందుకు ఇద్దరు విద్యార్థులను పంపమన్న మెయిల్ వచ్చినప్పుడు, ఆమె పూర్ణ పేరు పంపుతారు. బడిపిల్లల కోసమని పర్వతారోహణ శిబిరాలను నిర్వహించే శేఖర్ బాబు, పరమేశ్ ఆధ్వర్యంలో బోనగిరి బండను చూస్తూ, ‘దాదాపు నిలువుగా ఉన్న రాతినెవరు ఎక్కగలరు?’ అని మొదట్లో అనుకున్న పూర్ణ, ‘కొత్త నైపుణ్యం నేర్చుకుంటున్నప్పుడు వచ్చే అడ్డంకులను అధిగమించేవరకూ ఆగేది కాదు’. ‘రాతితో స్నేహం చెయ్యి’ అన్న పరమేశ్ సలహా పాటిస్తూ, జై హనుమాన్ అని జపించుకుంటూ కొండ ఎక్కేస్తుంది. ‘స్వేరోస్’ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల సెక్రెటరీ అయిన ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ను అక్కడ చూస్తుంది. ‘నువ్వు ఎవరెస్టును లక్ష్యంగా చేసుకోవాలి’ అని పూర్ణతో చెప్పిన ప్రవీణ్, ‘అపరిమితమైన శిల, నాజూకైన అమ్మాయి’ అనుకుంటారు. పూర్ణ మొదటి రైలు ప్రయాణం డార్జిలింగుకు. ఖమ్మంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆనంద్ కూడా ఆ బృందంలో ఉంటాడు. ‘పోలీసు విభాగంలో విజయం సాధించినప్పటికీ, ‘నేను సాధిస్తున్నదేమిటి! పేరూ గౌరవమూనేనా?’ అనుకుంటూ, అసంతృప్తి చెందే’ ప్రవీణ్ అక్కడకు వెళ్ళి, ‘ప్రియమైన మౌంట్ ఎవరెస్ట్, త్వరలోనే నా స్వేరోలు నీ వద్దకు వస్తారు’ అన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తారు. హైదరాబాదులో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిల్లలను అభినందించినప్పుడు, ‘నా చిట్టి అంబేడ్కర్లు కళ్ళు కలపగలుగుతున్నారు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు’ అనుకుంటారు. శిక్షణలో భాగంగా జరిగిన పిల్లల తదుపరి ప్రయాణం లేహ్‌కు. ఎవరెస్ట్ ఎక్కడానికి పూర్ణ, ఆనంద్ ఎంపికవుతారు. పిల్లలిద్దర్నీ శేఖర్ బాబు తీసుకెళ్తారు. చైనా వైపు నుండి ఎక్కుదామని నిర్ణయించుకుంటారు. ‘ఇక్కడివరకూ రాగలిగానంటే తప్పక శిఖరాగ్రానికి చేరుకుంటాను’ అని పూర్ణ తీర్మానించుకుంటుంది. అక్కడ భారీగా మంచు కురవడంతో ‘పూర్ణా, వెనక్కి రావడానికే సమస్యా ఉండదు. మీ క్షేమం ఎక్కువ ముఖ్యం మాకు’ అని ప్రవీణ్ అన్నప్పుడు, ‘మేము స్వేరోలము సర్, మనకు రివర్స్ గేర్లు ఉండవు’ అని జవాబిస్తుంది. మే 25, 2014 ముందటి రాత్రి, యాత్రను విరమించుకుని పిల్లని వెనక్కి పిలవాలన్న ప్రలోభానికి లోనయ్యారు ప్రవీణ్. అది పిల్లలిద్దరి ఆశనే కాక, ఇతర స్వేరోస్ ఆశలను కూడా చంపేస్తుంది అనుకుని సతమతమవుతారు.మర్నాడు తెల్లవారు 5:45కి పూర్ణ శిఖరాగ్రానికి చేరుకుంటుంది. ‘మౌంట్ ఎవరెస్ట్ చేరుకున్న అతి పిన్న వయస్కురాలిని’ అన్న మాటలున్న టీ షర్ట్ తొడుక్కుని జాతీయ జెండా, అప్పటికి అధికారికంగా ఏర్పడని తెలంగాణా జెండానూ పాతుతుంది. ఆ తరువాత ఎస్.ఆర్.శంకరన్, అంబేడ్కర్ ఫొటోలున్న జెండాలను. ఆఖర్న స్వేరోస్ జెండా. 6:45కు ఆనంద్ కూడా శిఖరాగ్రం చేరుకుంటాడు.చివరి పేజీలలో అనేకమైన ఫొటోలున్న ఈ 162 పేజీల పుస్తకంలో ‘రాపెల్, బెలే, బకెట్ ఫోల్డ్’ వంటి సాంకేతిక మాటలుంటాయి. ‘డెత్ జోన్’ అన్నవి పెద్దక్షరాల్లో పుస్తకమంతటా కనబడతాయి. ఇంగ్లిష్ లిపిలో ఉన్న తెలుగు, హిందీ మాటల అనువాదాలు బ్రాకెట్లలో ఉంటాయి. ప్రతీ అధ్యాయానికీ ముందుండే శీర్షిక, సమయం, తేదీ, సంవత్సరాలు కథాక్రమాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఈ నిజ జీవితపు కథను ప్రిజమ్ బుక్స్ ఈ జూలైలో ప్రచురించింది. u కృష్ణ వేణి -
గురుకులాల్లో 667 పోస్టులకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో పోస్టుల విభజన పూర్తి కావడంతో వాటిల్లో ఖాళీల భర్తీకి గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) దృష్టి సారించింది. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో గతంలో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించిన పోస్టులను కొత్త జోనల్ విధానం ప్రకారం భర్తీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం గురుకుల బోర్డు వద్ద 667 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. తాజాగా పోస్టుల విభజన పూర్తి కావడంతో నియామకాలకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో తాజా పోస్టులకు గురుకుల సొసైటీలు మరోమారు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కొత్త జోనల్ విధానం, కొత్త జిల్లాలవారీగా పోస్టులను విభజించిన తర్వాత ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పిస్తే అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చే వీలుంటుంది. ఈ మేరకు గురుకుల నియామకాల బోర్డు ఆయా సొసైటీలకు సూచనలు చేసింది. అతిత్వరలో సొసైటీల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకొని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు గురుకుల నియామకాల బోర్డు అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. కేటగిరీలవారీగా పోస్టుల వివరాలు కేటగిరీ పోస్టులు ప్రిన్సిపాల్ 18 లైబ్రేరియన్ 148 పీడీ (డిగ్రీ), పీడీ 206 మెస్ మేనేజర్ 31 స్టాఫ్‌నర్స్ 31 కేర్ టేకర్ 15 ల్యాబ్ అసిస్టెంట్ 62 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 31 అసిస్టెంట్ లైబ్రేరియన్ 23 జూనియర్ అసిస్టెంట్ కం డీఈఓ 30 స్టోర్ కీపర్ 15 క్రాఫ్ట్‌టీచర్ 10 ఆర్ట్ టీచర్ 5 మ్యూజిక్ టీచర్ 5 స్టాఫ్ నర్స్ (డిగ్రీ) 12 పీఈటీ 25 -
గురుకులాలకు కొత్త కళ
సాక్షి, హైదరాబాద్: ‘కేజీ టు పీజీ’మిషన్.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు చేసిన ప్రయత్నాలతో ప్రభుత్వ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు బీజాలు పడ్డాయి. ఒకప్పుడు పరిమిత సంఖ్యలో ఉన్న గురుకుల పాఠశాలల సంఖ్య.. కొత్త రాష్ట్రం ఏర్పాటుతో వచ్చిన మార్పులతో భారీగా పెరిగింది. అన్నివర్గాలకు నాణ్యమైన విద్య క్రమంగా అందుబాటులోకి వస్తోంది. పెరుగుతున్న పోటీ ప్రపంచానికి దీటుగా నాణ్యతాప్రమాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఫలితాల్లోనూ ఈ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. దీంతో గురుకులాల్లో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మంచిభోజనంతోపాటు.. నాణ్యమైన విద్యనందిస్తున్న కారణంగా అడ్మిషన్లు ఇవ్వాలంటూ కార్యాలయాల చుట్టూ తిరిగేవారి సంఖ్య పెరిగింది. దీంతో పలు సొసైటీలు ‘హౌస్‌ఫుల్’బోర్డులు పెడుతున్నాయి. ఇదీ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులకు నిదర్శనం. గురుకులాలు మూడింతలు: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గురుకులాల సంఖ్య 292 మాత్రమే. పరిమిత సంఖ్యలో పాఠశాలలుండటంతో వాటిల్లో ప్రవేశాలు సైతం అంత గొప్పగా ఉండేవి కావు. నిర్వహణకు నిధులివ్వకపోవడంతో విద్యానాణ్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత.. టీఆర్ఎస్ సర్కారు విద్యా వ్యవస్థకు పునరుజ్జీవం అందించే ప్రయత్నంలో భాగంగా గురుకులాల సంఖ్య 881కి పెంచింది. వీటితో పాటు మరో 30 డిగ్రీ కాలేజీలు సైతం ప్రారంభం కావడంతో గురుకుల విద్యా సంస్థల సంఖ్య తొమ్మిది వందలు దాటింది. కొత్త రాష్ట్రంలో 104 ఎస్సీ గురుకులాలు, 53 ఎస్టీ గురుకులాలు, 194 మైనార్టీ గురుకులాలు, 119 బీసీ గురుకులాలు ఏర్పాటయ్యాయి. 2019–20 విద్యా సంవత్సరంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హౌస్‌ఫుల్ బోర్డులు గతంలో గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ సాదాసీదాగా జరిగేది. అర్హత పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పించినప్పటికీ మధ్యలోనే మానేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గురుకుల పాఠశాలల సంఖ్య పెరగడం, అత్తుత్తమ పద్దతిలో భోజనం అందించడంలాంటి కారణాలతో అడ్మిషన్ల కోసం ఎగబడుతున్నారు. అర్హత పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లు భర్తీ చేసినప్పటికీ.. సీట్లు రానివారు అడ్మిషన్ కావాలంటూ కార్యాలయాల చుట్టూ చక్కలు కొడుతున్నారు. ఈనేపథ్యంలో పలు సొసైటీలు ఏకంగా అన్ని సీట్లు భర్తీ అయినట్లు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నాయి. ర్యాంకుల పండగ గురుకుల పాఠశాలలు ఫలితాల్లో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల కంటే అత్యుత్తమ ఫలితాలను ఖాతాలో వేసుకుంటున్నాయి. గతేడాది పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 92% పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్, నీట్, క్లాట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లోనూ గురుకులాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధిస్తున్నారు. జూనియర్ కాలేజీలు అధికంగా ఉన్న ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల నుంచి ఏకంగా 37 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, డెంటల్ సీట్లు సాధించారు. 6గురు విద్యార్థులు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, 12 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో సీట్లు సాధించారు. బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 28 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. 10 మంది విద్యార్థులు వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, 16 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారు. గతేడాది ఎస్టీ గురుకులాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించడంతో ప్రభుత్వం వారికి ప్రోత్సాహకంగా ల్యాప్‌టాప్‌లు అందించింది. 2.72 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 762 గురుకుల పాఠశాలల్లో విద్యార్థులున్నారు. వచ్చే విద్యాసంవత్సరం మరో 119 బీసీ గురుకులాలు అందుబాటులోకి రానుండగా... ఇప్పుడున్న వాటిలో 2.72లక్షల మంది విద్యార్థులున్నారు. ఒక్కో తరగతిలో 40మంది చొప్పున.. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు కలిపి 80 మంది ఉంటారు. కొత్తగా ప్రారంభమైన పాఠశాలల్లో 5,6,7 తరగతులు ప్రారంభించగా.. ఏటా ఒక్కో తరగతి అప్‌గ్రేడ్ అవుతోంది. దీంతో 2020 నాటికి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 3 లక్షలు దాటనుంది. సొసైటీల వారీగా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల సంఖ్య సొసైటీ పేరు తెలంగాణకు ముందు కొత్త గురుకులాలు మొత్తం టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 134 104 238 టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ 94 53 147 టీఆర్ఈఐఎస్ 35 0 35 టీఎంఆర్ఈఐఎస్ 10 194 204 ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ 19 119 138 (మరో 119 గురుకులాలు 2019–20 విద్యా సంవత్సరంలో ప్రారంభం) పక్కా ప్రణాళికతో గతంలో గురుకుల పాఠశాలల నిర్వహణ సొసైటీ నిర్ణయాలకు తగినట్లు ఉండేవి. ప్రస్తుతం సొసైటీ ఆదేశానుసారం నడిచినప్పటికీ.. కీలక నిర్ణయాలన్నీ అన్ని సొసైటీ కార్యదర్శులు చర్చించి ఒకే తరహాలో అమలు చేయడంతో ఫలితాలు సైతం ఒకే తరహాలో వస్తున్నాయి. పాఠ్యాంశ బోధన మొదలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాలన్నీ పక్కాగా నిర్వహిస్తుండడంతో విద్యార్థులు చదువును ఒత్తిడిగా భావించడం లేదు. కొత్త గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో నియమిస్తోంది. బీసీ సొసైటీకి కొత్తగా మంజూరు చేసిన గురుకులాల్లోనూ ప్రభుత్వం సిబ్బందిని మంజూరు చేసింది. వచ్చే ఏడాది ఈ ఉద్యోగ నియామకాలు చేపడతారు. గురుకులాల్లో ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు)బోర్డును ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాలదే అతిపెద్ద సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు బీసీ గురుకుల సొసైటీలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉండేవి. కొత్త రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేయగా 2017–18 విద్యా సంవత్సరంలో వాటిని ఆ సొసైటీ అందుబాటులోకి తెచ్చింది. కానీ బీసీ విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా గురుకుల పాఠశాలలు లేవని క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు బీసీ గురుకుల సొసైటీ కార్యాలయం వద్ద పడిగాపులు కాయడం.. గందరగోళ వాతావరణం నెలకొంటొంది. ఇందులో భాగంగా మరో 119 కొత్త గురుకులాల ఏర్పాటుకు అనుమతిచ్చింది. వీటిని 2019–20 విద్యాసంవత్సరంలో వీటిని ప్రారంభించేందుకు బీసీ గురుకుల సొసైటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో 257 గురుకుల పాఠశాలలతో అతిపెద్ద గురుకుల సొసైటీగా ‘బీసీ గురుకుల సొసైటీ’అవతరించనుంది. సరికొత్త మెనూతో..! గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు బోధనతో పాటు ఆరోగ్య ప్రమాణాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. పాత విధానానికి స్వస్తి పలుకుతూ సరికొత్త మెనూను సిద్ధం చేసింది. ఎదిగే పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించేలా డైట్ చార్ట్‌ను తయారు చేసింది. ఇందుకు ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) సహకారాన్ని తీసుకుంది. కొత్తగా రూపొందించిన మెనూ అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌ను పెంచింది. మెస్‌చార్జీలను భారీగా పెంచడంతో విద్యార్థులకు మరింత పోషకాహారాన్ని ప్రణాళికాబద్ధంగా అందిస్తున్నారు. మెస్ చార్జీల రూపంలో ప్రస్తుతం 7వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.950 చొప్పున, 8నుంచి 10 తరగతికి రూ.1100, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.1050 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. గ్రీన్‌చానల్ ద్వారా నిధుల విడుదల... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఆర్థిక సమస్యలు రావద్దని నిర్ణయించి వీటిని గ్రీన్‌చానెల్ విధానంలోకి మార్చింది. నిధుల సమస్య తలెత్తకుండా అవసరాలకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తోంది. పైసా బకాయి ఉండకుండా డైట్ చార్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేయడంతో విద్యార్థులకు సకాలంలో సరైన భోజనం అందుతోంది. అదేవిధంగా సమస్యలున్న పాఠశాలల్లో కేవలం ప్రతిపాదనలు అందించిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో పనులు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నప్పటికీ.. సకాలంలో ఆమేరకు నిధులు విడుదల చేస్తోంది. పక్కా భవనాలకు కార్యాచరణ సిద్ధం చేస్తూనే ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా భవనాలు నిర్మించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. జనరల్ సర్జన్ అవుతా! మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామం. అమ్మ, నాన్న వ్యవసాయ కూలీలు. ఉన్నత చదువులు చదవాలనేది నాకల. డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. కానీ ప్రైవేటు స్కూళ్లలో చదివే స్థోమత లేకపోవడంతో గురుకుల పాఠశాలలో చేరా. పదోతరగతి వరకు ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివా. మంచి మార్కులు రావడంతో గౌలిదొడ్డి జూనియర్ కాలేజీలో సీటు వచ్చింది. అక్కడ బైపీసీలో చేరా. నీట్లో 2వేల ర్యాంకు వచ్చింది. మహబూబ్‌నగర్ వైద్య కళాశాలలో అడ్మిషన్ దొరికింది. జనరల్ సర్జన్ అవ్వాలనేది నా కల. – అమర్త్య, ఎంబీబీఎస్ ఫస్టియర్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల