గురుకులంలో అన్నం అధ్వానం | meal underdone at gurukulam | Sakshi
Sakshi News home page

గురుకులంలో అన్నం అధ్వానం

Published Sun, Jul 24 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

నల్లవాగు గురుకులంలో వండిన అన్నం

నల్లవాగు గురుకులంలో వండిన అన్నం

  • ఉడకని భోజనం
  • సగం కడుపు నింపుకుంటున్న విద్యార్థులు
  • అన్నం తినలేక నేలపై పడేస్తున్న దైన్యం
  • ఇదీ నల్లవాగు గురుకుల పాఠశాల దుస్థితి
  • కలే్హర్‌ : అవ్వా.. ఇదేమి బువ్వా అన్నట్టు ఉంది మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం. పేరుకు సన్న బియ్యం అంటున్నా పాఠశాలలో వండుతున్న భోజనం దొడ్డు బియ్యాన్ని తలపిస్తోంది. గడ్డలు కట్టినట్టు నాణ్యతలేని, ఉడకని భోజనం పెట్టడంతో సగం కడుపు నింపుకుని విద్యార్థులు పస్తులు ఉండాల్సీ వస్తోంది.

    ఆదివారం నల్లవాగు గురుకుల పాఠశాలను సాక్షి సందర్శించింది. విద్యార్థులకు నాణ్యతలేని భోజనం వండి వడ్డిస్తున్నట్లు వెల్లడైంది. గురుకులంలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని గతంలో సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఇంతవరకు పరిస్థితిలో మార్పు కనబడడం లేదు. భోజనం రుచిగా లేకపోవడంతో విద్యార్థులు సరిగా తినలేక నేలపై పడేస్తున్నారు.

    పాఠశాల ఆవరణలో చెట్ల కింద, కిటికిల వద్ద పడేస్తున్నారు. పాఠశాలలో 375 మంది విద్యార్థులు ఉన్నారు. ఏ ఒక్క రోజూ కడుపు నిండ అన్నం తినలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సన్న బియ్యం బస్తాలు సరఫరా చేస్తున్నా వండిన అన్నం దొడ్డుగా ఉంటోందని గురుకులం ఇ¯ŒSచార్జి వార్డె¯ŒS వెంకట్‌స్వామి తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. నాణ్యమైన భోజనం పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
    గురుకులం, ఉడకని అన్నం, నల్లవాగు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement