విద్యార్థిని అదృశ్యం
-
బద్దెనపల్లి పాఠశాలలో కలకలం
-
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ(బాలికలు) గురుకుల పాఠశాలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సుపాక అరుణ(14) ఆదృశ్యమైంది. పెగడపల్లి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన గంగజల–నర్సయ్య దంపతుల కూతురు అరుణ బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఇటీవలే అనారోగ్యం కారణంగా ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు శుక్రవారం కూతురును తీసుకువచ్చి ప్రిన్సిపాల్‌కు అప్పగించి వెళ్లారు. శనివారం ఉదయం అరుణ హాస్టల్‌లో కనిపించలేదు. ఆందోళన చెందిన సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. కూతురు కోసం తమ బంధువుల ఇళ్లలో వాకబు చేసిన లాభం లేకపోయింది. దీంతో అరుణ తండ్రి నర్సయ్య సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల చుట్టూ ఎత్తయిన ప్రహరీ ఉంది. నైట్ వాచ్‌మన్, సిబ్బంది రాత్రి అక్కడే ఉన్నారు. ఎవరికంట పడకుండా అరుణ కనిపించకుండా పోవడంపై మిగతా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది పర్యవేక్షణ లేకనే ఇలా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రిన్సిపాల్‌కు బదులు తండ్రితో ఫిర్యాదు
తొమ్మిదో తరగతి విద్యార్థిని సుపాక ఆరుణ గురుకుల పాఠశాల నుంచి అదృశ్యం కాగా పాఠశాల సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గురుకుల పాఠశాల నుంచి విద్యార్థిని కనిపించకుండా పోతే ప్రిన్సిపాల్ పద్మ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాల్సి ఉండగా తం్రyì నర్సయ్యను పెగడపల్లి మండలం నుంచి పిలిపించి ఫిర్యాదు చేయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుణ బాధ్యత తమకేం సంబంధం లేదు అన్నట్లుగా కావాలనే తండ్రితో ఫిర్యాదు చేయించారని పలువురు ఆరోపిస్తున్నారు.
బలవంతంగా దింపి పోయారు..
–సీహెచ్.పద్మ. ప్రిన్స్‌పల్ , గురుకుల పాఠశాల బద్దెనపల్లి
ఆరుణ ఆరోగ్యం సరిగా లేదనే మేం ఇంటికి పంపాం. కానీ తల్లిదండ్రులు శుక్రవారం అరుణను పాఠశాలలో బలవంతంగా దింపి వెళ్లారు. తెల్లవారే సరికి ఆమె కనిపించకుండా పోయింది. ఇంటి వద్ద అరుణను తల్లి కొటినట్లు›తెలిసింది. మనస్తాపంతో ఎటయినా వెళ్లి ఉంటుందని భావిస్తున్నాం.