![Student Beaten Up By Teacher Dies In A Private School In Uttarpradesh - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/21/arrest.jpg.webp?itok=w4nYlS8h)
ప్రతీకాత్మక చిత్రం
బందా/లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ టీచర్ ఎనిమిదేళ్ల చిన్నారిని గొడ్డును బాదినట్టు బాదడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన బందా జిల్లాలోని సాదిమదన్‌పూట్ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో మంగళవారం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామనీ, ఘటనకు కారణమైన టీచర్ జైరాజ్‌ను అరెస్టు చేశామని పోలీస్ అధికారి ఎల్బీ కుమార్ పాల్ వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment