పెద్దపల్లిజిల్లా గర్రెపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది.
సుల్తానాబాద్: పెద్దపల్లిజిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది.
భూపతిపూర్ గ్రామానికి చెందిన శ్రీవర్ష ఈ పాఠశాలలో 5 తరగతి చదువుతున్నది. శనివారం రాత్రి నుండి కనిపించడంలేదు. అయితే ఈ విషయాన్ని గురుకుల పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఆదివారం ఉదయం శ్రీవర్షను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లారు. అయితే తమ కుఽమార్తె పాఠశాల హాస్టల్‌లో కనిపించలేదు. దీంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.