
ప్రతీకాత్మక చిత్రం
మైసూరు(బెంగళూరు): మైసూరులోని హెబ్బాళ సమీపంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను వేధింపులకు గురి చేసిన ఆరోపణలపై గురుకులం మేనేజర్ గిరీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ 18 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. గిరీష్ రోజూ ఎవరూ లేని సమయంలో తమ వద్దకు వచ్చి లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థినులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మేనేజర్‌ను అరెస్ట్ చేశారు.
మరో ఘటనలో..
మద్యం మత్తులో గొడవ.. ఒకరి హత్య
మండ్య: మద్యం మత్తులో జరిగిన గొడవలో ఒకరు హతమయ్యారు. ఈఘటన మళవళ్లి తాలూకా హలగూరులో చోటు చేసుకుంది. హలగూరుకు చెందిన మను(30) చెత్త పేపర్ల సేకరణతో జీవిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం లిక్కర్ షాపు వద్ద మద్యం తాగి వస్తుండగా మరో వ్యక్తితో గొడవ జరిగింది. షాపువారు ఇద్దరినీ మందలించి పంపారు. రాత్రి 9గంటల సమయంలో ఇద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. బీరు బాటిల్ తీసుకొని తలపై బాదడంతో మను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
చదవండి: నోట్ రాసి మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం