రుణమాఫీనా... శాసనమండలి భర్తీనా? | ఇన్ బాక్స్ | Sakshi
Sakshi News home page

రుణమాఫీనా... శాసనమండలి భర్తీనా?

Published Thu, Mar 26 2015 2:40 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

రుణమాఫీనా... శాసనమండలి భర్తీనా? - Sakshi

రుణమాఫీనా... శాసనమండలి భర్తీనా?

 ఇన్ బాక్స్

 రాష్ట్ర శాసనసభ సమావేశాలను 40 రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి తీర్మానం పెడితే, చిన్న రాష్ట్రమే కదా 17 రోజులు సరిపోతాయంటూ ఆ తీర్మా నాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. మరి ఈ చిన్న రాష్ట్రానికి శాసన మండలి ఎందుకు? ప్రభుత్వ కోశాగారం నుంచి ఖర్చు మినహా! అప్పట్లో డా॥వైఎస్ రాజశేఖరరెడ్డి శాసన మండలి ఏర్పాటు చేయటానికి కారణం ఉంది. ఎందు కంటే ఉమ్మడి రాష్ర్టంలో విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేసేవారు, వాటిని సమర్థ వంతంగా పర్యవేక్షించేందుకు శాసన సభ్యుల తోపాటు, శాసన మండలి సభ్యుల సహాయం ఉంటే మరింత సమర్థవంతంగా సంక్షేమ పథ కాలు ప్రజలకు చేరతాయని అప్పటిలో ఆయ న ఉద్దేశం. మరిప్పుడు ఉమ్మడి రాష్ట్రం లేదు, సంక్షేమ పథకాలు లేవు కాని శాసన మండలి ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడింది. ఆంధ్రప్ర దేశ్ ఆర్థికంగా కుదేలు అయిందని జాతీయ ప్రసార సాధనాల ముందు ముఖ్యమంత్రి గగ్గోలు పెడుతూనే, శాసన మండలి ఎన్ని కలకు మాత్రం జెండా ఊపేశారు. కేంద్రంలో మిత్ర కూటమి ఉంది కాబట్టి, సాధారణ మెజారిటీతో శాసన మండలిని రద్దు చేయటం చిటికెలో పని. 51 మంది శాసనమండలి సభ్యులకు ఇచ్చే జీతాలు, ఇతర ఖర్చులతో ఎన్ని గ్రామాలు దత్తత తీసుకోవచ్చు? ఎంత మంది రైతులను రుణవిముక్తులను చేయవ చ్చు? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ చార్జీలం టూ వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. కానీ రైతులరుణాలను మాఫీ చేయమంటే మాత్రం రాష్ట్రం ఆర్థికంగా వెనక బడిందనీ, 5 సంవత్సరాల కాల వ్యవధిలో మాత్రమే వాటిని తీర్చగలమని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఉద్యోగస్తులకు ఇచ్చిన ఫిట్ మెంట్ చార్జీలతో ఎంత మంది రైతులు రుణ విముక్తి అయ్యేవారు? అప్పులలో ఉన్న ప్రజ ల కష్టాలు తీర్చకుండా ఆర్థిక స్థిరత్వం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ చార్జీలు అంటూ వేలకోట్ల రూపాయలు కేటాయింపు అవసరమా? ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యతి రేకతతో ఇలా చెప్పడం లేదు. వారికి న్యాయం గా అందవలసిన ప్రయోజనాలు అందించకూ డదని కూడా దీని అర్థం కాదు. ఎప్పుడైనా ఆక లిగా ఉన్న వ్యక్తికి మాత్రమే అన్నం విలువ తెలుస్తుంది. ఫిట్‌మెంట్ చార్జీలు ఉద్యోగస్తు లకు ప్రభుత్వం ఇవ్వడం అంటే ఆకలి లేని వాడికి అన్నం పెట్టినట్లే. ఆ సొమ్ము విలువ ప్రభుత్వ ఉద్యోగస్తులకు తెలియదు. అదే సొమ్ముతో ఈ ఆర్థిక సంవత్సరానికి రైతుల రుణాలను మాఫీ చేసి ఉంటే ఎందరో రైతులు రుణవిముక్తి పొంది, సమస్యల నుంచి కొం తైనా ఊరట కలిగేది. అలాగే పలువురు రైతుల ఆత్మహత్యలను కూడా ఆపగలిగే వారమేమో కాస్త ఆలోచించండి?
 పి.పాపారావు  జగ్గయ్యపేట, శ్రీకాకుళం జిల్లా

 గురుకుల విద్యార్థుల స్థానికత
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1972 నుంచి దశల వారీగా కొన్ని జిల్లాలకు ఉమ్మడిగా కొన్ని గురుకుల పాఠశాలలు స్థాపించారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉత్తమంగా ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇటీవలి వరకు ఈ పాఠశాలలు మంచి ఉత్తీర్ణతతో ఒక వెలుగు వెలుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు గురుకుల విద్యార్థులు స్థానికత విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతుండటం ఎవరికీ తెలియకుండా పోతోంది. ఉత్తమ విద్య అందిస్తారనే కారణంతో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు దాటి వీరు జోనల్ పాఠశాలల్లో చదివారు. కాని వీరు ఏ జిల్లాలోని జోనల్ స్కూల్‌లో చదివితే అక్కడే ‘లోకల్’గా ప్రకటిస్తున్నారు. వాస్తవంగా వీరికి మినహాయింపు ఇవ్వవచ్చు. దానికి 1 నుంచి 4వ తరగతి స్థానికతనే పరిగణనలోకి తీసుకోవచ్చు. అలా తీసుకోవటం లేదు. ఇలా చేయటం వలన వారు ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వెళ్ల వలసివస్తోంది. కేవలం చదువు కోసం వెళ్లి జీవితాంతం ఇలా బాధలు పడుతున్నారు. కానీ ఈ విషయమై ఎన్ని విన్నపాలు ఇచ్చినా పట్టించుకున్న వారు లేరు. పైగా ఏ జిల్లాలో అయినా జోనల్ స్కూలు ఉంటే అక్కడ చదివిన గురుకుల విద్యార్థులకు అదే లోకల్ అవటం వలన ఉద్యోగాలలో స్థానికులకు అన్యాయం జరుగుతున్నది. ఇప్ప టికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలి.
 బి.శంకరరావు  సీతారామపురం, తుని, తూ.గో. జిల్లా
 
  ఆహార భద్రత కార్డులు
 తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల విషయంలో పారదర్శకత పూర్తిగా లోపించింది. రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం, మూడు గదుల ఇల్లు ఉన్న వారికి, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి ఆహారభద్రత కార్డులివ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది. కానీ, నేటికీ మధ్యతరగతి కుటుంబా లలో చాలామందికి ఈ కార్డులు రాలే దు. పేద, మధ్యతరగతి ప్రజానీకానికి వీటిని తప్పనిసరిగా అందించాల్సి ఉంది. ఒక్క ఆహార భద్రత కార్డులే కాదు కుటుంబంలో కనీసం ఒక్కరి కైనా పెన్షన్ సదుపాయం కల్పించాలి. వితంతు, విక లాంగ, బీడీ కార్మిక, వృద్ధాప్య పెన్షన్లలో ఏదో ఒకటి అందించాలి. దీనివల్ల ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికీ లబ్ధి చేకూరుతుంది. నవ తెలంగాణ నిర్మాణం కుటుంబ జీవితాన్ని మెరుగుపర్చడంతోనే మొదలుకావాలి. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు నిత్యం అవసరమైన సంక్షేమ చర్యలను చేపట్టి అమలుచే యాలని అభ్యర్థన.

 తవుటు రామచంద్రం  జగిత్యాల, కరీంనగర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement