తెలంగాణ గురుకులాల్లో సబ్జెక్ట్‌ అసోసియేట్ పోస్టులు | TS Gurukulam Recruitment 2021: Apply Online, Vacancies, Salary Details | Sakshi
Sakshi News home page

తెలంగాణ గురుకులాల్లో 110 సబ్జెక్ట్‌ అసోసియేట్లు

Published Tue, Jun 29 2021 2:10 PM | Last Updated on Tue, Jun 29 2021 2:15 PM

TS Gurukulam Recruitment 2021: Apply Online, Vacancies, Salary Details - Sakshi

హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీలకు (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ, టీటీడబ్ల్యూఆర్‌ఈఐ) చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన జేఈఈ మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్‌ శిక్షణ కోసం పార్ట్‌టైం సబ్జెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 110
పోస్టుల వివరాలు: మ్యాథ్స్‌–16, ఫిజిక్స్‌–20, కెమిస్ట్రీ–24, బోటనీ–23, జువాలజీ–24, సివిక్స్‌–02, ఎకనమిక్స్‌–01.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ పూర్తిచేసి ఉండాలి. జేఈఈ మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్‌ టీచింగ్‌ అనుభవంతోపాటు సంబంధిత సర్టిఫికేట్‌ ఉండాలి.

ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో ప్రొఫిషియన్సీ, ఇంగ్లిష్‌లో కమ్యూనికేటివ్‌ స్కిల్స్, జేఈఈ/నీట్‌/ఎంసెట్‌ పరీక్షా విధానం గురించి తెలిసి ఉండాలి. వీటన్నింటి ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం: ఎంపిక ప్రక్రియను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 50 మార్కులకు స్క్రీనింగ్‌ టెస్ట్, 25 మార్కులకు డెమో, మరో 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌ల్లో అభ్యర్థి మాస్టర్స్‌ డిగ్రీ మెయిన్‌ సబ్జెక్ట్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.07.2021
► పరీక్ష తేది: 10.07.2021

► డెమో/ఇంటర్వ్యూ తేది: 18.07.2021
► వెబ్‌సైట్‌: https://tgtwgurukulam.telangana.gov.in


సీ–మెట్, హైదరాబాద్‌లో 25 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ(సీ–మెట్‌).. తాత్కాలికప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: సీనియర్‌ ఇంచార్జ్,షిఫ్ట్‌ ఇంచా ర్జ్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ స్టాఫ్, జూనియర్‌ ప్రాజెక్ట్‌ స్టాఫ్, ఎలక్ట్రీషియన్, హెల్పర్, సీనియర్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ స్టాఫ్, జూనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్, అనలిస్ట్, జూనియర్‌ ఆఫీస్‌ స్టాఫ్‌.

అర్హత: పోస్టుని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుని అనుసరించి నెలకు రూ.13,000 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ(సీ–మెట్‌), ఐడీఏ ఫేజ్‌–3, హెచ్‌సీఎల్‌(పీఓ), చర్లపల్లి, హైదరాబాద్‌–500051 చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 14.07.2021
► వెబ్‌సైట్‌: www.cmet.gov.in

మరిన్ని నోటిఫికేషన్లు: 
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు

ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. అప్లై చేసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement