పెదవాల్తేరు : ఎంవీపీ కాలనీలోని శాంతి గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు, ఆశ్రమ శతాబ్ది ఉత్సాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు ముఖ్య అతిథిగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం శాంతి గురుకుల విద్యార్థుల యోగాసనాలు వేసి అతిథులను ఆకట్టుకున్నారు. అనంతరం సంకీర్తనలు ఆలపించారు. మధ్యాహ్నం మొక్కలు నాటారు. విద్యార్థులు సాంస్కతిక, క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం ఆధ్యాత్మికవేత్త పత్నిరాజు తన ప్రవచనాల్లో మహాభారతంలో అర్జునుడు, దుర్యోధనుడు, కర్ణుడు, ధతరాష్టుడు, శ్రీకష్ణుల స్వభావం గురించి వివరించారు. వారి స్వభావాల ప్రభావం మానవ మనగడపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో విఫులంగా వివరించారు. భీమిలి వైసీటీ యోగా కేంద్రానికి చెందిన యోగాచార్య వెంకటరమణ పతంజలి యోగ సూత్రాలు మానవ జీవితానికి ఎలా దోహదపడతాయో వివరించారు. ఆశ్రమాధిపతి మాతా జ్ఞానేశ్వరి పాల్గొన్నారు.