shanthi
-
ఏపీలో మేం పని చేయలేం ఐఏఎస్ అధికారుల విముఖత
-
ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని అభాసుపాలు చేయడమే ఆంధ్రజ్యోతి పనా..!
-
గిరిజన మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు: అసిస్టెంట్ కమిషనర్ శాంతి
సాక్షి, విశాఖ: తనపై వస్తున్న ఆరోపణలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి స్పందించారు. తాను గిరిజన మహిళను కాబట్టే తనను టార్గెట్ చేశారని కన్నీరు పెట్టుకున్నారు. కక్ష గట్టి తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘2013లో మదన్‌మోహన్‌తో నాకు వివాహం జరిగింది. లా చదువుతుండగానే మా ఇద్దరి పెళ్లి జరిగింది. 2015లో మాకు కవల పిల్లలు పుట్టారు. మదన్ మోహన్ నన్ను చాలా హింసించాడు. 2016లో ఇద్దరం విడాకులు తీసుకుని విడిపోయాం. 2019లో మదన్మోహన్ యూఎస్ వెళ్లిపోయాడు. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను.గిరిజన మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు. నేను రూ.100కోట్లు సంపాదించానని ఆంధ్రజ్యోతిలో రాశారు. రూ.75కోట్లు ఇవ్వాలని మదన్మోహన్ అడుగుతున్నాడు. నేను గిరిజన మహిళని కక్ష గట్టి నన్ను సస్పెండ్ చేశారు. తప్పుడు వార్తలు రాసేటప్పుడు పెద్దాయన వయసు గుర్తు రాలేదా?. సమాజంలో మర్యాద ఉన్న వ్యక్తిపై ఆరోపణలు ఎలా చేస్తారు. నా వివరణ కూడా తీసుకోకుండా ఇష్టానుసారం రాసేశారు. ఇది ఖచ్చితంగా వ్యక్తిత్వ హననమే’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. -
విడుదలకు సిద్దమైన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ ‘దర్శిని’
వికాస్, శాంతి జంటగా, డాక్టర్ ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. వీ4 సినీ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ.. . ‘ముగ్గురు మిత్రులకి భవిష్యత్తు నీ చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యవసానాలే మా సినిమా దర్శిని. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. ప్రతి తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది’ అన్నారు. ‘సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ వారు మా చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుంది అని కొనియాడారు’ అని దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు అన్నారు. -
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
వికాస్, శాంతి జంటగా నటించిన తాజా చిత్రం దర్శిని. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కి డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని కే ఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని ముందే చూడగలిగే టెక్నాలజీ వస్తే ఎలా ఉంటుంది? దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దర్శిని కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తక్కువ బడ్జెట్లో చాలా మంచి సినిమా తీశారు. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.‘జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా చిత్ర కథ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం’ ని నిర్మాత ఎల్ వి సూర్యం అన్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు, హీరో వికాస్, నటుడు సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త కథనంతో వస్తోన్న దర్శిని.. లిరికల్ సాంగ్ రిలీజ్!
వికాస్ జీకే, శాంతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. ఈ చిత్రానికి డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. వీ4 సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ ఎల్వీ సూర్యం నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి అందమా అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. మేము అనుకున్నట్లు సినిమా అవుట్‌పుట్ వచ్చింది, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కాగా.. ఈ సినిమాకి నిజాని అంజన్ సంగీతం అందించారు. -
సర్జరీ కోసం ఇంటిని అమ్మేసింది.. అప్పుడే సొంతింటికి!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీతో అభిమానులను అలరించిన శాంతిస్వరూప్‌కు ఇండస్ట్రీలో జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. ఇటీవలే తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కల సాకారం కాబోతోంది అంటూ కొత్త వీడియోను పోస్ట్ చేసింది. తన సొంతింటి కల త్వరలోనే నిజం కానుందని వెల్లడించింది. (ఇది చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) వీడియోలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ..' సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇటీవల అమ్మ సర్జరీ కోసం పాత ఇంటిని అమ్మేశా. చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కొందరు నా మంచి కోరేవారు కూడా ఉన్నారు. వారి సహకారంతోనే ఇంటిని నిర్మిస్తున్నా. కూకట్‌పల్లిలోని భూదేవిహిల్స్‌లో ఇల్లు ఉంటుంది. త్వరలోనే పూర్తి కానుంది. ' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. -
ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. అయితే ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. అతని తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ ) ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ శాంతికి మద్దతు ప్రకటిస్తున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న పని చూస్తుంటే గర్వంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది.. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద, స్టేటస్ ఏది ఉండదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోతోంది.. కానీ ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. (ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!) View this post on Instagram A post shared by Jabardasth Shanthi Swaroop (@jabardasthshanti) -
శాంతినారాయణకు ‘వైఎస్సార్ లైఫ్‌టైం’ అవార్డు
అనంతపురం కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అనంతపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శాంతినారాయణ దక్కించుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్ అవార్డు కమిటీ సభ్యులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈ పురస్కారాన్ని నవంబర్ ఒకటో తేదీన ప్రదానం చేస్తారు. రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహంతో గౌరవించనున్నారు. బలమైన గొంతుక ఆయన సొంతం డాక్టర్ శాంతినారాయణ అనంతపురం యాసకు, కరువు కథకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈయన ఐదు దశాబ్దాలుగా సాహితీసేవలో తరిస్తున్నారు. తొలిరోజుల నుంచే ధార్మికుడు, మేధావి, అసలు సిసలైన సృజనశీలిగా కవిత్వాన్ని, గద్యాన్ని ఏకకాలంలో సమర్థవంతంగా నడిపించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని తన కలంతో ఎదిరిస్తూ బాధితులకు అండగా నిలిచారు. ఒకే వ్యక్తి ఏకకాలంలో భిన్న ఇతివృత్తాల్ని ఎంచుకుని రచనలు చేయడం తెలుగు సాహిత్య రంగంలో అరుదనే చెప్పాలి. నవలా రచనలో కూడా వైవిధ్యం కనబరిచారు. జీవిత దృక్పథం, రచనల నేపథ్యం, ప్రపంచీకరణ పోకడలు, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు, సమాజంలోని అసమానతల గురించి, ఆది నుంచి ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాలు, ప్రభావం చూపిన కథా సాహిత్యం, ఇక్కడ పురుడుపోసుకున్న ఉద్యమాల గురించి తన రచనలతో అందరినీ కదిలించారు. శింగనమల మండలం సి.బండమీదపల్లిలో నిరుపేద కుటుంబంలో జని్మంచిన శాంతినారాయణ తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తూనే రచనా వ్యాసంగం కొనసాగించారు. ఎటువంటి అభిప్రాయాన్నైనా నిక్కచ్చిగా, నిర్భయంగా బలమైన గొంతుకతో వినిపించగల్గిన ఆయన ఇనుప గజ్జెల తల్లి, పెన్నేటి మలుపులు, పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కల్లమయిపాయే, ఉక్కుపాద వంటి ప్రసిద్ధ కథలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన ‘నాగులకట్ట సుద్దులు’ నవల తెలుగు సాహిత్యంలోనే సంచలనంగా నిలిచింది. ఇటీవలే ఆయన పంచసప్తతి కార్యక్రమం అనంతపురం వేదికగా జరిగింది. తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత రచయితలు, కవులు శాంతినారాయణ సాహితీ కృషిని అభినందించారు. పలువురి హర్షం ప్రతిష్టాత్మక వ్యక్తులకందించే వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు శాంతినారాయణ ఎంపిక కావడంపై కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి, జిరసం అధ్యక్షుడు శ్రీహరిమూర్తి, డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్ అహ్మద్, సీనియర్ కథా రచయిత వెంకటేష్ తదితరులు వేర్వేరు ప్రకటనలో హర్షం ప్రకటించారు. విమలాశాంతి పురస్కారాల పేరిట ఎంతోమంది యువ రచయితలకందించి ప్రోత్సహిస్తున్న శాంతినారాయణను ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డుతో సమున్నతంగా గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు. (చదవండి: ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..) -
డబ్బులు ఇవ్వకుండా ఆయనను మోసం చేశారు: శ్రీహరి భార్య శాంతి
దివంగత నటుడు శ్రీహారికి చాలామంది డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన భార్య శాంతి శ్రీహరి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చి ఆ తర్వాత విలన్‌గా, హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. అంతేకాదు వ్యక్తిగతంగా ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలో 2009లో ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. ఆయన చనిపోయాక ఇండస్ట్రీలో తమని పలకరించేవారు కూడా లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన భార్య శాంతి. చదవండి: మహిళా యాంకర్ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఆయన సాయం తీసుకున్న చాలామంది కనీసం పలకరించడానికి కూడా రాలేదని, ఎదురుపడితే సాయం చేయాల్సి వస్తుందనే భయంతోనే అలా చేశారన్నారు. ‘బావకు(శ్రీహరికి) సినిమాలు అంటే పిచ్చి. ఆ ఇష్టంతో ఎవరు వచ్చి అడిగిన కాదనకుండా చేసేవారు. ఆయన రెమ్యునరేషన్ కూడా పెద్దగా డిమాండ్ చేసేవారు కాదు. అలా చాలామంది సినిమా తరువాత డబ్బులు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వకుండా ఎగ్గోట్టినవారే ఎక్కువమంది ఉన్నారు. ఆయన ఖచ్చితంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసి ఉంటే ఇప్పుడు మాకు ఓ 10 బంగ్లాలు ఉండేవి. అయితే చిరంజీవిగారి సంస్థ, మరొక రెండు మూడు సంస్థలు మాత్రమే డబ్బులు కరెక్టుగా ఇచ్చేవారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. చదవండి: ఐశ్వర్య, త్రిషల వల్ల చాలా ఇబ్బంది పడ్డా: మణిరత్నం అనంతరం ‘అలా బావ(శ్రీహరి) చేసిన ఎన్నో సినిమాలకు డబ్బులు తీసుకోలేదు. అంతేకాదు ఆయన చనిపోయే ముందు చేసిన సినిమాలకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ఆయన చనిపోయాక కనీసం వారు పలకరించేందుకు కూడా రాలేదు. కానీ, ఆయన చనిపోయిన తర్వాత ఓ సారి బాలకృష్ణ గారు కాల్ చేశారు. ఆయన సినిమాలో బావ ఏదో ఒక క్యారెక్టర్ చేశారట. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయా.. ఏమైనా సాయం కావాలా అని అడిగారు. బాలకృష్ణ గారికి అలా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కాల్ చేసి మా బాగోగులు ఆరా తీశారు. బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాలకృష్ణలా ఎవరూ కాల్ చేయలేదు’ అని చెప్పారు ఆమె. శ్రీహరి చనిపోయాక వారి ఇంటి మీద అప్పులు తీర్చడానికి తన నగలు, కార్లు అమ్మానని చెప్పారు శాంతి. -
దేవదాయశాఖ డీసీ, ఏసీల వ్యవహారంపై విచారణ
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఉప కమిషనర్ (డీసీ) ఈవీ పుష్పవర్ధన్‌పై సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతి ఇసుకతో దాడి చేసిన వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ ఆదేశాల మేరకు రాజమండ్రి దేవదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ (ఆర్జేసీ) సురేష్‌బాబు విచారణ జరిపారు. శుక్రవారం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఆర్జేసీ విచారణ చేపట్టారు. డీసీ పుష్పవర్ధన్, ఏసీ శాంతిలతోపాటు ప్రత్యక్ష సాక్షులు దేవదాయ శాఖ పర్యవేక్షకులు బి.ప్రసాదరావు పట్నాయక్, రాజారావు, టర్నర్ సత్రం ఈవో అల్లు జగన్నాథరావులను విచారించారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఘటన జరిగినప్పుడున్న అధికారులు, సిబ్బంది నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. వివరణ కోరిన మహిళా కమిషన్ విశాఖ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆరోపణలపై విచారణ నివేదిక అందజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్‌ను కోరారు. దేవదాయ శాఖ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పని తీరుపై కూడా మహిళా కమిషన్ ఆరా తీసింది. -
నాన్న స్ఫూర్తి.. భర్త సహకారం
కవాడిగూడ: సేవ చేయడంలో ఆమె తండ్రి ఎప్పుడూ ముందుండేవారు.. ఎవరు.. ఎప్పుడు.. ఏ సాయం కావాలన్నావెంటనే స్పందించేవారు.. ఎంతో మంది పేదలు ఆయన్ను దేవుడిలా కొలిచేవారు.. దీంతో ఆమె తండ్రి నుంచిస్ఫూర్తి పొందారు. ఆయన బాటలో నడిచేందుకు నిశ్చయించుకున్నారు. తండ్రి చేసే సేవా కార్యక్రమాల్లోపాల్పంచుకున్నారు. మరో అడుగు మందుకు వేసి ‘శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి ట్రస్ట్’ను ఏర్పాటు చేసిఎందరో పేదలకు సేవలు అందిస్తున్నారామె.. అనాథ శవాలకు అంతిమ యాత్రలు నిర్వహించి హిందూసంప్రదాయం ప్రకారం శ్మశాన వాటికలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేయిస్తున్నారు. ఏ సాయం కావాలన్నా నేనున్నానంటూ హామీ ఇస్తున్నారు శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి వ్యవస్థాపకురాలు ఎర్ర పూర్ణశాంతి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పూర్ణశాంతి 1992వ సంవత్సరంలో నగరంలో స్థిరపడ్డారు. 1999లో ఎర్రం భాస్కర్ అనే వ్యాపారితో వివాహమైంది. తండ్రి తేర్ల నరసింహమూర్తి చూపిన సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 2015లో ‘శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి’ని స్థాపించారు. జంటనగరాల్లో ఎక్కడ అనాథ శవాలున్నా తమకు సమచారం ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. అలా ఎవరు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా ఆమె వెళ్లి మృతుల అంతిమ సంస్కారాలను దగ్గర ఉండి మరీ నిర్వహిస్తున్నారు. 45మందికి షిరిడీ సాయిబాబా దర్శనం సాయిబాబాను దర్శించుకోవాలని ఉన్నా షిరిడీ వెళ్లే ఆర్థిక స్థోమత లేని 45 మందిని సాయినాథుడి దర్శనానికి షిరిడీ తీసుకెళ్లారు. అందులో వృద్ధులు సైతం ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వారానికోసారి పాత దుస్తులు సేకరించి పేదలకు పంపిణీ చేస్తున్నారు. నగరంలో దాదాపు 25 వృద్ధాశ్రమాలకు రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు అందించారు. సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ.75వేల ఖర్చుతో చిరువ్యాపారాన్ని ప్రారంభించి వారికి అప్పగించారు. సేవకు గుర్తింపుగా అవార్డులు పూర్ణశాంతి చేస్తున్న సేవలకు ఎన్నో అవార్డులు దక్కాయి. వాటిలో ప్రధానంగా సీనారే చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డు, వరల్డ్‌వైడ్ విర్చువల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్‌ను, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సావిత్రిబాయి పూలే జాతీయ పురస్కారం, సేవారత్న, సేవా భారతి, సేవాశీలి నామకరణాలతో వివిధ సంస్థల నుంచి అందుకున్నారు. అదేవిధంగా మాజీ గవర్నర్ రోశయ్య, ప్రముఖ పాండిచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడి చేతులమీదుగా సత్కారాలను అందుకున్నారు. భర్త అందిస్తున్న ఆర్థిక సాయంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలను అందిస్తున్నారు. ఆమె సేవలకు ప్రతి ఒక్కరూ సలాం అంటున్నారు. కుట్టుమిషన్ల పంపిణీ.. బ్యూటీ ట్రైయినింగ్ అదేవిధంగా నిరుపేద మహిళలకు వివాహం సందర్భంగా పుస్తెమెట్టెలు అందిస్తూ దాదాపు 15 జంటలకు హిందూ సంప్రదాయ ప్రకారం వివాహాన్ని సొంత ఖర్చులతో నిర్వహించారు. వికలాంగులకు వీల్ఛైర్లు ఇవ్వడమే కాకుండా కొందరికిఆర్టిఫిషియల్ లెగ్స్, హ్యాండ్స్‌ను వారికి అందజేశారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడేందుకు సుమారు 60 మంది మహిళలకు కుట్టుమిషన్లను అందజేశారు. వితంతువులకు అల్లికలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి నేర్పించారు. హస్తినాపురంలో 15మంది వితంతువులకు బ్యూటీపార్లర్ ట్రైయినింగ్. వీటితో గో సేవా కార్యక్రమాల్లో కూడా తాను ముందంజలో ఉన్నారు. నాన్న స్ఫూర్తి.. భర్త సహకారం స్పందించే మనస్తత్వం నాది.. నాన్న స్ఫూర్తి, భర్త సహకారంతో ఇన్ని సేవా కార్యక్రమాలను చేయగలుగుతున్నాను. అర్ధరాత్రి సమయంలో ఎవరైనా సాయం కావాలనిగడపతొక్కినా, ఫోన్ చేసినా స్పందించే మనస్తత్వం నాది. దేవుడి ఆశీస్సులుకూడా నాపై ఉండటం వల్లే ఇంతచేయగలుగుతున్నాను.– పూర్ణశాంతి, ‘శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి’ వ్యవస్థాపకురాలు. -
11వ సారి గర్భం దాల్చిన శాంతి..
టీ.నగర్: తిరుచ్చి జిల్లాలో 11వ సారిగా గర్భం దాల్చిన మహిళ ఇంట్లోనే ప్రసవానికి పట్టుబట్టింది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆమెను గురువారం బలవంతంగా ఆస్పత్రిలో చేర్చారు. వివరాలు.. తిరుచ్చి, ముసిరి దిగువవీధికి చెందిన కన్నన్ (50) కార్మికుడు. ఇతని భార్య శాంతి (45). వీరికి గీత, ఉదయకుమారి, కృత్తిక, సుబ్బులక్ష్మి (12), పూజ అనే ఐదుగురు కుమార్తెలు, కార్తీక్ (20), ధర్మరాజ్ (13), దీపక్ (8) అనే ముగ్గురు కుమారులున్నారు. శాంతికి ఇద్దరు పిల్లలు జన్మించి మృతిచెందారు. గీత, ఉదయకుమారి సహా ముగ్గురు కుమార్తెలకు వివాహమై వారికి పిల్లలున్నారు. ఇలాఉండగా శాంతి ప్రస్తుతం 11వ సారి గర్భం దాల్చింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేస్తారని.. ఆమెకు ఇంట్లో వైద్యపరీక్షలు జరుపుతున్న గ్రామీణ నర్సు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స పొందాల్సింది గా కోరింది. ఆమె ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించింది. శాంతి అక్కడ తనకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స జరుపుతారని, అందుచేత అక్కడికి రానని ఖరాఖండిగా తెలిపేది. తనకు ఇంట్లోనే 10 సార్లు సుఖ ప్రసవం అయిందని, అలాగే ఈ సారి కూడా ఇంట్లోనే ప్రసవిస్తానంది. తిరుచ్చి జిల్లా వైద్య బృందం ఆమెను ముసిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహించగా ఆమెకు రక్తహీనత ఉన్నట్లు తెలిసింది. గురువారం రక్తం ఎక్కించేందుకు ఏర్పాట్లు చేసిన వైద్యబృందం ఆమె కోసం ఇంటికి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న ఆమె కావేరి నది దాటి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.. దీంతో ఆమెపై ఆరోగ్యసిబ్బంది ముసిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాంతిని ముసిరి ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కారులో తీసుకువెళ్లారు. -
శాంతి పాఠశాల స్వర్ణోత్సవాలు ప్రారంభం
పెదవాల్తేరు : ఎంవీపీ కాలనీలోని శాంతి గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు, ఆశ్రమ శతాబ్ది ఉత్సాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు ముఖ్య అతిథిగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం శాంతి గురుకుల విద్యార్థుల యోగాసనాలు వేసి అతిథులను ఆకట్టుకున్నారు. అనంతరం సంకీర్తనలు ఆలపించారు. మధ్యాహ్నం మొక్కలు నాటారు. విద్యార్థులు సాంస్కతిక, క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం ఆధ్యాత్మికవేత్త పత్నిరాజు తన ప్రవచనాల్లో మహాభారతంలో అర్జునుడు, దుర్యోధనుడు, కర్ణుడు, ధతరాష్టుడు, శ్రీకష్ణుల స్వభావం గురించి వివరించారు. వారి స్వభావాల ప్రభావం మానవ మనగడపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో విఫులంగా వివరించారు. భీమిలి వైసీటీ యోగా కేంద్రానికి చెందిన యోగాచార్య వెంకటరమణ పతంజలి యోగ సూత్రాలు మానవ జీవితానికి ఎలా దోహదపడతాయో వివరించారు. ఆశ్రమాధిపతి మాతా జ్ఞానేశ్వరి పాల్గొన్నారు. -
శాంతి, సప్తగిరిలకు ప్రపంచ ఖ్యాతి
'బ్రో.. అర్జెంట్ గా దేవీ దగ్గరకి వచ్చెయ్..' స్నేహితుడితో ఓ హైదరాబాదీ ఫోన్ సంభాషణ. ఒక్క భాగ్యనగరంలోనే కాదు ఏ ఊళ్లోనైనా సినిమా థియేటర్లను ప్రత్యేకంగా థియేటర్లుగా పిలవరు. ఏదో స్నేహితుడి పేరు పలికినట్లు లలిత, సీతారామ, వాసవి, శ్రీనివాస.. అంటూ పిలుచుకుంటారంతే! జీవితంలో ఎప్పుడో అతర్భాగమైపోయిన సినిమాలు చూడటానికి అందరం థియేటర్లకు వెళతాం. కొద్ది మందికి కొన్ని థియేటర్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. కొన్ని థియేటర్లు తమదైన ప్రత్యేకతతో పేరుపొందుతాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సప్తగిరి 70 ఎంఎం, నారాయణగూడా చౌరస్తాలోని శాంతి 70 ఎంఎం కూడా వాటి నిర్మాణ శైలిలోని ప్రత్యేకతతో ప్రపంచ ఖ్యాతి పొందాయి. జర్మనీకి చెందిన జంట ఫొటోగ్రాఫర్లు హుబిట్జ్- జోచెలు భూగోళం అంతా సంచరించి ప్రఖ్యాత ప్రదేశాలు, అరుదైన కట్టడాల ఫొటోలు తీస్తారు. వారి ఫొటోగ్రాఫిక్ వర్క్స్, సైట్ స్పెసిఫిక్ ఇన్ స్టాలేషన్స్ కు ఘనమైన ఆదరణ ఉంది. దక్షిణ భారత దేశంలో సినిమా హాళ్ల నిర్మాణాలపై హుబిట్జ్- జోచె ఫొటోగ్రాఫిక్ వర్క్ ను ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ తన వెబ్ సైట్ లో ప్రత్యేక కథనంగా ప్రచురించింది. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని అరుదైన నిర్మాణశైలి ఉన్న ఈ సినిమాహాళ్ల ఫొటోలను 2011-2014 మధ్య కాలంలో తీసినవని, ఇవి సంప్రదాయానికి ఆధునికతను జోడించినట్లుగా కనిపిస్తాయని పొటోగ్రాఫర్ జోచె అంటున్నారు.