సాక్షి, విశాఖ: తనపై వస్తున్న ఆరోపణలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి స్పందించారు. తాను గిరిజన మహిళను కాబట్టే తనను టార్గెట్ చేశారని కన్నీరు పెట్టుకున్నారు. కక్ష గట్టి తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘2013లో మదన్‌మోహన్‌తో నాకు వివాహం జరిగింది. లా చదువుతుండగానే మా ఇద్దరి పెళ్లి జరిగింది. 2015లో మాకు కవల పిల్లలు పుట్టారు. మదన్ మోహన్ నన్ను చాలా హింసించాడు. 2016లో ఇద్దరం విడాకులు తీసుకుని విడిపోయాం. 2019లో మదన్‌మోహన్ యూఎస్ వెళ్లిపోయాడు. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను.
గిరిజన మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు. నేను రూ.100కోట్లు సంపాదించానని ఆంధ్రజ్యోతిలో రాశారు. రూ.75కోట్లు ఇవ్వాలని మదన్‌మోహన్ అడుగుతున్నాడు. నేను గిరిజన మహిళని కక్ష గట్టి నన్ను సస్పెండ్ చేశారు. తప్పుడు వార్తలు రాసేటప్పుడు పెద్దాయన వయసు గుర్తు రాలేదా?. సమాజంలో మర్యాద ఉన్న వ్యక్తిపై ఆరోపణలు ఎలా చేస్తారు. నా వివరణ కూడా తీసుకోకుండా ఇష్టానుసారం రాసేశారు. ఇది ఖచ్చితంగా వ్యక్తిత్వ హననమే’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment