నాన్న స్ఫూర్తి.. భర్త సహకారం | Chittoor Purna Shanthi Social Service Special Story | Sakshi
Sakshi News home page

పేదల సేవలోనే పూర్ణశాంతి

Published Thu, Jul 9 2020 9:31 AM | Last Updated on Thu, Jul 9 2020 9:31 AM

Chittoor Purna Shanthi Social Service Special Story - Sakshi

కవాడిగూడ: సేవ చేయడంలో ఆమె తండ్రి ఎప్పుడూ ముందుండేవారు.. ఎవరు.. ఎప్పుడు.. ఏ సాయం కావాలన్నావెంటనే స్పందించేవారు.. ఎంతో మంది పేదలు ఆయన్ను దేవుడిలా కొలిచేవారు.. దీంతో ఆమె తండ్రి నుంచిస్ఫూర్తి పొందారు. ఆయన బాటలో నడిచేందుకు నిశ్చయించుకున్నారు. తండ్రి చేసే సేవా కార్యక్రమాల్లోపాల్పంచుకున్నారు. మరో అడుగు మందుకు వేసి ‘శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి ట్రస్ట్‌’ను ఏర్పాటు చేసిఎందరో పేదలకు సేవలు అందిస్తున్నారామె.. అనాథ శవాలకు అంతిమ యాత్రలు నిర్వహించి హిందూసంప్రదాయం ప్రకారం శ్మశాన వాటికలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేయిస్తున్నారు. ఏ సాయం కావాలన్నా నేనున్నానంటూ హామీ ఇస్తున్నారు శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి వ్యవస్థాపకురాలు ఎర్ర పూర్ణశాంతి.  

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పూర్ణశాంతి 1992వ సంవత్సరంలో నగరంలో స్థిరపడ్డారు. 1999లో ఎర్రం భాస్కర్‌ అనే వ్యాపారితో వివాహమైంది. తండ్రి తేర్ల నరసింహమూర్తి చూపిన సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 2015లో ‘శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి’ని స్థాపించారు. జంటనగరాల్లో ఎక్కడ అనాథ శవాలున్నా తమకు సమచారం ఇవ్వాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడుతున్నారు. అలా ఎవరు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చినా ఆమె వెళ్లి మృతుల అంతిమ సంస్కారాలను దగ్గర ఉండి మరీ నిర్వహిస్తున్నారు. 

45మందికి షిరిడీ సాయిబాబా దర్శనం
సాయిబాబాను దర్శించుకోవాలని ఉన్నా షిరిడీ వెళ్లే ఆర్థిక స్థోమత లేని 45 మందిని సాయినాథుడి దర్శనానికి షిరిడీ తీసుకెళ్లారు. అందులో వృద్ధులు సైతం ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా వారానికోసారి పాత దుస్తులు సేకరించి పేదలకు పంపిణీ చేస్తున్నారు. నగరంలో దాదాపు 25 వృద్ధాశ్రమాలకు రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు అందించారు. సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ.75వేల ఖర్చుతో చిరువ్యాపారాన్ని ప్రారంభించి వారికి అప్పగించారు.  

సేవకు గుర్తింపుగా అవార్డులు

పూర్ణశాంతి చేస్తున్న సేవలకు ఎన్నో అవార్డులు దక్కాయి. వాటిలో ప్రధానంగా సీనారే చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డు, వరల్డ్‌వైడ్‌ విర్చువల్‌ యూనివర్సిటీ వారు డాక్టరేట్‌ను, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి సావిత్రిబాయి పూలే జాతీయ పురస్కారం, సేవారత్న, సేవా భారతి, సేవాశీలి నామకరణాలతో వివిధ సంస్థల నుంచి అందుకున్నారు. అదేవిధంగా మాజీ గవర్నర్‌ రోశయ్య, ప్రముఖ పాండిచ్చేరి గవర్నర్‌ కిరణ్‌బేడి చేతులమీదుగా సత్కారాలను అందుకున్నారు. భర్త అందిస్తున్న ఆర్థిక సాయంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలను అందిస్తున్నారు. ఆమె సేవలకు ప్రతి ఒక్కరూ సలాం అంటున్నారు.  

కుట్టుమిషన్ల పంపిణీ.. బ్యూటీ ట్రైయినింగ్‌
అదేవిధంగా నిరుపేద మహిళలకు వివాహం సందర్భంగా పుస్తెమెట్టెలు అందిస్తూ దాదాపు 15 జంటలకు హిందూ సంప్రదాయ ప్రకారం వివాహాన్ని సొంత ఖర్చులతో నిర్వహించారు. వికలాంగులకు వీల్‌ఛైర్లు ఇవ్వడమే కాకుండా కొందరికిఆర్టిఫిషియల్‌ లెగ్స్, హ్యాండ్స్‌ను వారికి అందజేశారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడేందుకు సుమారు 60 మంది మహిళలకు కుట్టుమిషన్లను అందజేశారు. వితంతువులకు అల్లికలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి నేర్పించారు. హస్తినాపురంలో 15మంది వితంతువులకు బ్యూటీపార్లర్‌ ట్రైయినింగ్‌. వీటితో గో సేవా కార్యక్రమాల్లో కూడా తాను ముందంజలో ఉన్నారు.  

నాన్న స్ఫూర్తి.. భర్త సహకారం
స్పందించే మనస్తత్వం నాది.. నాన్న స్ఫూర్తి, భర్త సహకారంతో ఇన్ని సేవా కార్యక్రమాలను చేయగలుగుతున్నాను. అర్ధరాత్రి సమయంలో ఎవరైనా సాయం కావాలనిగడపతొక్కినా, ఫోన్‌ చేసినా స్పందించే మనస్తత్వం నాది. దేవుడి ఆశీస్సులుకూడా నాపై ఉండటం వల్లే ఇంతచేయగలుగుతున్నాను.– పూర్ణశాంతి, ‘శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి’ వ్యవస్థాపకురాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement