
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. అయితే ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. అతని తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు.
(ఇది చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ )
ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ శాంతికి మద్దతు ప్రకటిస్తున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న పని చూస్తుంటే గర్వంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది.. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద, స్టేటస్ ఏది ఉండదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోతోంది.. కానీ ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది.
(ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!)
Comments
Please login to add a commentAdd a comment