
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ కొమరం. కామెడీ పంచులతో అదరగొట్టే కొమరం అంటే ఇండస్ట్రీలో ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఎందుకంటే తన పాత్ర కొమరక్కతోనే అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. తన యాస, భాష, కట్టు బొట్టుతో అందరిని మెప్పించారు. ఇటీవల నాని నటించిన దసరా చిత్రంలో కనిపించారు. అయితే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన కొమరం ఎప్పటికప్పుడు తన వీడియోలతో అభిమానులను అలరిస్తుంటారు.
(ఇది చదవండి: ఐదేళ్లు కష్టాలు అనుభవించా.. అలా ఎవరికీ జరగకూడదు: జబర్దస్త్ కొమరం)
తాజాగా తన ఛానెల్ కోసం ఓ జంటకు పెళ్లి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పటాస్ కామెడీ షోతో ఫేమస్ అయిన ప్రవీణ్‌కు పెళ్లి చేసిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పెళ్లి నిజంగానే జరిగిందా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో ఫైమా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పెళ్లిపై పటాస్ ప్రవీణ్ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో కేవలం కొమరక్క యూట్యూబ్ ఛానెల్ కోసమే చేసినట్లు చెప్పారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే కొమరక్క ఛానెల్‌లో వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment