యాంకర్ శ్రీముఖి పెళ్లికి రెడీ అయిందా? అంటే నిజమే అని తెలుస్తోంది. గత కొన్నేళ్లలో చూసుకుంటే లేడీ యాంకర్స్లో మంచి క్రేజ్ సంపాదించింది. ఎక్కువగా టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గతంలోనూ ఈ బ్యూటీ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇప్పుడు మాత్రం ఈమె ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ అసలు విషయం చెప్పేశాడు.
(ఇదీ చదవండి: ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు)
లేడీ యాంకర్లో సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. అలా సుమ తర్వాత ఉన్నంతలో మంచి ఫేమ్ సంపాదించింది ఎవరంటే శ్రీముఖినే గుర్తొస్తుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది గానీ తర్వాత పూర్తిగా యాంకరింగ్‌పై దృష్టి పెట్టింది. మధ్యలో బిగ్‌బాస్ షోకి కూడా వెళ్లొచ్చింది. 30 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటోంది.
గతంలో శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈమె ఫ్రెండ్ అయిన అవినాష్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీముఖి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రస్తుతం వాళ్లింట్లో సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఏడాదిలోనే వివాహం జరగొచ్చని అన్నాడు. దీనిబట్టి చూస్తే త్వరలో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తుందనమాట.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment