యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది అరియానా గ్లోరీ. ఆర్జీవీ చేసిన ఒక్క ఇంటర్వ్యూ ఈ బ్యూటీకి క్రేజ్ సంపాదించి పెడితే బిగ్‌బాస్ ద్వారా తనెంటో ప్రూవ్ చేసుకుంది. సీజన్-4లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు కూడా ఈ అమ్మడి యాటిట్యూడ్‌కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్ మీడియాలో ఈమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అరియానాకు చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..త్వరలోనే ఈ బ్యూటీ మిసెస్ అరియానాగా మారనుందట.
అయితే ఈమె పెళ్లాడే ఆ వరుడు ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మరోవైపు ఈ ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని ప్రకటించాడు అవినాష్. మంచి ముహుర్తాలు ఉంటే పెళ్లికి రెడీ అంటూ ఓపెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అరియానా పెళ్లి మ్యాటర్ వెలుగులోకి రావడంతో ఫ్యాన్స్‌లో సందేహాం మొదలైంది. కొంపదీసి వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ షో నుంచి ఎంతో క్లోజ్‌గా మూవ్ అయిన అరియానా-అవినాష్‌లపై ఇప్పటికే పలు పుకార్లు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వాటిని కొట్టిపారేస్తూ తాము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొనే ఈ జంట మరి ఈ వార్తలపై స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
చదవండి : షణ్ముఖ్‌తో దీప్తి సునయన.. అక్కడేం చేస్తుంది?
యాంకర్ రవి కారులో.. సీక్రెట్స్ బయటపెట్టేసిన లాస్య
Comments
Please login to add a commentAdd a comment