బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్! | Anchor Sreemukhi Comments On Love Failure And Marriage | Sakshi
Sakshi News home page

Sreemukhi: తన లవ్ ఫెయిల్యూర్ గురించి శ్రీముఖి కామెంట్స్.. చాలాసార్లు అలా!

Published Wed, Nov 29 2023 5:00 PM | Last Updated on Wed, Nov 29 2023 5:32 PM

Anchor Sreemukhi Comments On Love Failure And Marriage - Sakshi

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షోల దగ్గర నుంచి ఈవెంట్స్ వరకు తనదైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. 30 ఏళ్ల మార్క్ కూడా దాటేసింది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ.. బ్రేకప్ గురించి మాట్లాడింది. అలానే పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది హింట్ ఇచ్చేసింది.

ప్రస్తుతం పలు షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి.. తాజాగా ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో ఫాలోవర్స్‌తో చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. ప్రేమలో ఎప్పుడైనా ఫెయిలయ్యావా? అని శ్రీముఖిని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన ఈ బ్యూటీ.. 'బొచ్చెడుసార్లు' అని మొహమాటం లేకుండా చెప్పేసింది. పెళ్లయితే యాంకరింగ్ మానేస్తారా అని మరో నెటిజన్ అడిగాడు.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న క‌మెడియ‌న్‌ కిర్రాక్ ఆర్పీ..)

పెళ్లి చేసుకున్నా సరే యాంకరింగ్ విచిచిపెట్టనని, పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటానని శ్రీముఖి చెప్పింది. అయితే ఆ కాబోయే వాడు ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచేసింది. దీనిబట్టి చూస్తే త్వరలో శ్రీముఖి.. ఏడడుగులు వేయడం గ్యారంటీ అనిపిస్తుంది.

గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న టైంలోనూ శ్రీముఖి తన లవ్-బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది. 'గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. అదే టైంలో ప్రొఫెషనల్ గా క్లిక్ అయ్యాను. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బాగుందని అనుకుంటున్న సమయంలో మనస్పర్థలు వచ్చి బ్రేకప్ అయింది. దీంతో చచ్చిపోదామనుకున్నాను. బాధ భరించలేకపోయాను' అని అప్పట్లో శ్రీముఖి చెప్పింది.

(ఇదీ చదవండి: 'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement