తాళికట్టే శుభవేళ.. శోభిత- నాగచైతన్య పెళ్లి వీడియో వైరల్! | Akkineni Naga Chaiatanya and Sobhitha Marriage Video Goes Viral | Sakshi
Sakshi News home page

Naga Chaitanya- Sobhitha: తాళికట్టే శుభవేళ.. శోభిత- నాగచైతన్య పెళ్లి వీడియో వైరల్!

Published Thu, Dec 5 2024 10:06 AM | Last Updated on Thu, Dec 5 2024 10:24 AM

Akkineni Naga Chaiatanya and Sobhitha Marriage Video Goes Viral

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి ముగిసింది. వేదమంత్రాల సాక్షిగా నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో  మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

తాజాగా శోభిత- నాగచైతన్య పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శోభిత మెడలో చైతూ తాళి కడుతున్న వీడియోను ఓ నెటిజన్‌ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో నాగార్జునతో పాటు వెంకటేశ్ కూడా కనిపించారు. ఇది చూసిన ఫ్యాన్స్‌ కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement