'అమ్మ కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు'.. జబర్దస్త్ శాంతి ఎమోషనల్! | Jabardasth Shanti Emotional After Her Mother Surgery Goes Viral | Sakshi
Sakshi News home page

Jabardasth Shanti: సర్జరీ కోసం ఇంటిని అమ్మేశా.. జబర్దస్త్ శాంతి ఎమోషనల్!

Mar 8 2024 9:02 PM | Updated on Mar 9 2024 2:43 AM

Jabardasth Shanti Emotional After Her Mother Surgery Goes Viral - Sakshi

జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది.  కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. గతంలో తన తల్లికి  సర్జరీ కోసం ఇంటిని అమ్మేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు.

తాజాగా శాంతి తన మదర్‌కు మోకాలి సర్జరీ చేయించినట్లు వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు శాంతి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తమను బాగా చూసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యంతో ఉన్నారని శాంతి ఆనందం వ్యక్తం చేసింది. 

కాగా.. గతంలో అమ్మకు తెలియకుండానే సర్జరీ కోసం ఇంటిని అమ్మేస్తున్నట్లు చెబుతూ ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద ఏది ఉండదని అన్నారు. నా ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని శాంతి తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement