జబర్దస్త్ కమెడియన్ మహేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం సినిమాతో ఓ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఫుల్ ఎమోషనల్ సీన్స్‌లో మహేశ్ అద్భుతమైన నటనతో మెప్పించారు. అతనికి యాస, లుక్ మహేశ్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం మహేశ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్‌పై మహేశ్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
(ఇది చదవండి: 'పుష్ప రాజ్' తగ్గేదేలే.. భారీ ధరకు ఆడియో రైట్స్!)
మహేశ్ మాట్లాడుతూ.. 'చైతన్యతో నేను ఓసారి ట్రావెల్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నాకు డ్యాన్స్ నేర్పించారు. చైతన్య మంచి టాలెంటెడ్. ఆయన అలా చేసుకున్నాడంటే ఎంత స్ట్రగుల్ అయ్యాడో. ఆరోజు చాలా బాధపడ్డా. అంత క్రేజ్ ఉన్న ఆయనే అలా చేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి?' అని అన్నారు.
రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడుతూ..'కానీ నాకు అయితే రెమ్యూనరేషన్స్ బాగానే వస్తున్నాయి. నాకు ప్రారంభంలో తక్కువగానే ఉండేది. ఎందుకంటే మనకు అవకాశం రావాలి కదా. క్రేజ్‌ను బట్టి అమౌంట్ డిసైడ్ చేస్తారు. ఫస్ట్ తక్కువ డబ్బులు వచ్చినా మనం కష్టపడాలి. ఆ తర్వాతే నాకు బాగా డబ్బులొచ్చాయి. కామెడీలో నాకు రవితేజ టైమింగ్ అంటే చాలా ఇష్టం. సీన్ వందశాతం నిలబెట్టడంలో ఆయన బెస్ట్. ఎలాంటి సీన్ అయినా పండించగలరు. నా ఫేవరేట్ హీరోయిన్ అంటే అనుష్క. నా చిన్నప్పుడు అయితే రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. అయితే ఆమెను ఎప్పుడు కలవలేదు.' అని చెప్పుకొచ్చారు.
(ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment