Shanti
-
సైన్సుకే సవాలుగా శాంతి దేవి పునర్జన్మ రహస్యం: విస్తుపోయిన శాస్త్రవేత్తలు..!
గతజన్మ ఉందని కొందరూ నమ్ముతుంటారు. అలాగే మన మత సంప్రదాయంలో ఆ విషయాల గురించి నొక్కి చెబతుంటాయి. అది వాస్తవికంగా ఎంతవరకు కరెక్ట్ అనేది స్పష్టంగా తెలియదు. కానీ అందుకు సంబంధి పలు సినిమాలు మాత్రం వచ్చాయి. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చిన సినిమాలు భారీగా హిట్టయ్యాయి కూడా. అయితే ఈ విషయమై శాస్త్రవేత్తలు ఎన్నాళ్లుగానో పరిశోధనలు చేస్తున్నారు. వారికి 1926లో జన్మించిన శాంతి దేవి కథ ఓ సవాలుగానూ ఆసక్తికరంగానూ మారింది. చెప్పాలంటే వారి పరిశోధనలకు సరైన సమాధానంగా ఆమె కేసు సజీవ సాక్ష్యంగా నిలిచింది. అంతేగాదు ఆ కేసు పునర్జన్మ ఉందని నర్మగర్భంగా తేల్చి చెప్పింది. వివరాల్లోకెళ్తే..1926 డిసెంబర్ 11న ఢిల్లీ నగరంలో శాంతి దేవి జన్మించింది. నాలుగేళ్ల వయసులో పెద్దదానిలా మాట్లాడుతూ అందర్నీ ఆశ్యర్యపరిచింది. పైగా తనకు జన్మనిచ్చిన తల్లిందండ్రులనే కాదని తిరస్కరించింది. తనకు భర్త, పిల్లలు కుటుంబం ఉందంటూ నమ్మశక్యం కానీ గతజన్మ గురించి పలు ఆసక్తికర విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది. ఈ విషయం దావానంలో భారతదేశం అంతటా వ్యాపించింది. అయితే ఆమె చెప్పే విషయాలను తల్లిదండ్రులు, స్నేహితులు కొట్టిపడేసేవారు. పైగా పిచ్చిదానిలా చూసేవారు ప్రజలంతా. అయితే ఆమె చెప్పే విషయాలు ఎంతవరకు కరెక్ట్ అనేదిశగా పలువురు జర్నలిస్టులతో సహా 15 మంది వ్యక్తులతో కూడిన కమిటి వాస్తవికతను తెలసుకునేందుకు ఇన్విస్టిగేట్ చేయడం ప్రారంభించారు. వారిలో డాక్టర్ కీర్తి స్వరూప్ రావత్ అనే ప్రముక సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. ఆయన మొదటి నుంచి శాంతి దేవి కేసును బూటకం అంటూ విర్శిస్తూ ఉండేవారు. వాస్తవాలేంటో చూపించాలనే దిశాగా ఆయన దర్యాప్తులో పాలుపంచుకుని విస్తుపోవడం జరిగింది. దర్యాప్తు బృందం శాంతి దేవి చెబుతున్న గత జన్మకు సంబంధించిన వ్యక్తుల అడ్రస్ ఇవ్వమని అడిగారు. గత జన్మలో తన పేరు లుగ్దీ అని తన భర్తతో కలిసి మధురలో ఉండేదాన్ని అంటూ ఆ చిరునామ ఇచ్చింది. అది నిజమా? కాదా? అని ఆ చిరునామాకు ఉత్తరం రాయగా రిప్లై వచ్చింది. అలాగే శాంతి దేవి చెప్పిన వివరాలు తమ కుటుంబంతో సరిపోయాయని ఆమె మా బంధువని అను పూర్తిగా విశ్వసిస్తున్నామని అని ఆ ఉత్తర సారాంశం. ఇక్కడ శాంతి దేవి ప్రస్తుత జన్మలో ఢిల్లీలో తల్లిదండ్రులతో జన్మిస్తుంది. ఆమె ఉన్న నివాసానికి దాదాపు 145 కిలోమీటర్లు దూరంలో మధుర ఉంది. ఇంతవరకు శాంతి దేవి తల్లిదండ్రులు ఆమెను తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లింది కూడా లేదు. ఒక వైపు ఆ బృందం అంతా విచారణ చేస్తుండగా..శాంతి దేవి తన వాళ్లను కలవాలని పట్టుబట్టింది. దీంతో వాళ్లు దేవి చెప్పిన వివరాల ప్రకారం ఆ బంధువులను తీసుకువచ్చారు వారందర్నీ గుర్తించింది. చివరగా ఆమె తన గత జన్మలో భర్తగా చెబుతున్న వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేయగా అతడిని గుర్తుపట్టింది. పైగా తన కొడుకును కలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. గత జన్మలో ఆమె భర్త పేరు కాంజి మాల్ చౌబే. ఆయన తన మూడో భార్యను తీసుకుని శాంతి దేవిని కలవడం జరిగింది. అంటే చౌబేకు గత జన్మలో శాంతి దేవి రెండో భార్య. ఆయన కూడా ఆమె గుర్తింపుని నిర్థారించేలా తమ ఇద్దరికే తెలిసిన సన్నిహిత ప్రశ్నలు అడిగారు. అందుకు శాంతి దేవి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెంది ఆమె తన భార్యగా గుర్తించడం విశేషం. నిజానికి మన మత సంప్రదాయాల ప్రకారం ఆత్మకు కొత్త జన్మరాగనే గత జన్మ తాలుకా విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఆమెకు గుర్తుండటం ఆశ్చర్యం కలిగించడమే గాక పునర్జన్మ ఉంది అనేందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది శాంతి దేవి.(చదవండి: అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!) -
మాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా ఉంది: భానుప్రియ సిస్టర్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి శాంతి ప్రియ స్పందించారు. ఇలాంటి వేధింపులు కేవలం మాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునవరావృతం కాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మన భవిష్యత్ తరాలకు భరోసానిచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు.అంతేకాకుండా మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేయడం ఎంతవరకు సబబు అని శాంతి ప్రియ ప్రశ్నించారు.హేమ కమిటీ నివేదిక తర్వాత ఆరోపణలు వస్తున్న సమయంలో తప్పుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే బాధితులకు న్యాయం చేసేందుకు అండగా నిలబడాల్సిందని అన్నారు. బాధితులకు భరోసా కల్పించే బాధ్యత అమ్మ సభ్యులపై ఉందని ఆమె గుర్తు చేశారు. తనకెప్పుడు ఎదురవ్వలేదు..అయితే తనకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదని.. తన అదృష్టమని శాంతి ప్రియ వెల్లడించారు. నేను భానుప్రియ సోదరురాలిని అయినందువల్లే ఎవరూ టచ్ చేయలేదని తెలిపింది. ఎందుకంటే ఇండస్ట్రీలో మా కుటుంబానికి ఉన్న గౌరవమేంటో అందరికీ తెలుసున్నారు. కాగా.. కాబోయే అల్లుడు తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శాంతి ప్రియ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. 1980-90ల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. కాగా.. హేమ కమిటీ నివేదిక బయటకొచ్చాక మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘాన్ని రద్దు చేశారు. ఇందులో సభ్యులుగా ఉన్న 17 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్రారంభించింది. -
కూల్చివేతలపై అధికారులతో సీఎస్ శాంతికుమారి కీలక భేటీ
-
థ్రిల్లర్ దర్శిని
వికాస్ జీకే, శాంతి జంటగా డా. ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించిన చిత్రం ‘దర్శిని’. డా. ఎల్వీ సూర్యం నిర్మించారు. ఈ సినిమా పోస్టర్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం) రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన చిత్రం ‘దర్శిని’. ఈ సినిమా టీజర్, సాంగ్స్ చూశాను.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సరికొత్త కథనంతో తెరకెక్కిన చిత్రం ‘దర్శిని’. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు డా. ప్రదీప్ అల్లు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు డా. ఎల్వీ సూర్యం. -
'అమ్మ కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు'.. జబర్దస్త్ శాంతి ఎమోషనల్!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. గతంలో తన తల్లికి సర్జరీ కోసం ఇంటిని అమ్మేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. తాజాగా శాంతి తన మదర్‌కు మోకాలి సర్జరీ చేయించినట్లు వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు శాంతి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తమను బాగా చూసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యంతో ఉన్నారని శాంతి ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. గతంలో అమ్మకు తెలియకుండానే సర్జరీ కోసం ఇంటిని అమ్మేస్తున్నట్లు చెబుతూ ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద ఏది ఉండదని అన్నారు. నా ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని శాంతి తెలిపింది. -
శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు?
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ యునెస్కో వారసత్వ జాబితాలో చేరింది. శాంతినికేతన్ నాటి రోజుల్లో భారతదేశంలో ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఒక విశ్వవిద్యాలయం. దీనిని మనం ఇప్పుడు విశ్వభారతి అని కూడా పిలుస్తున్నాం. గురుదేవులు శాంతి నికేతన్‌ను ప్రారంభించినప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్.. త్రిపురతోపాటు అనేక రాజ కుటుంబాల నుండి ఆర్థిక సహాయం అందుకున్నారు. ఆ సమయంలో చైనా కూడా శాంతినికేతన్ నిర్వహణకు భారీగా ఆర్థిక సహాయం అందించింది. చైనా అందించిన ఆర్థిక సహాయానికి గుర్తుగా శాంతి నికేతన్‌లోని చైనా భవన్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ విద్యాలయంలో చైనీస్ భాష బోధించడంతో పాటు, చైనా సంస్కృతిపై అధ్యయనం చేస్తారు. శాంతి నికేతన్‌కు గొప్ప సహాయం అందించిన చైనా పండితుని పేరు తాన్ యున్ జెన్. ఆయన చదువుకునేందుకు శాంతి నికేతన్‌కు వచ్చారు. ఆ తర్వాత ఈ యూనివర్సిటీకి భారీగా ఆర్థిక సాయం అందించారు. తాన్ యున్ జెన్ శాంతినికేతన్ క్యాంపస్‌లో చైనా భవనాన్ని నిర్మించి, దానిని అభివృద్ధి చేసిన వ్యక్తి. అతను రచయిత, కవి, వ్యాసకర్త, తత్వశాస్త్ర పండితుడు. అలాగే భాషావేత్త. మహాయాన బౌద్ధ, కన్ఫ్యూషియన్ పండితునిగానూ పేరుగాంచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1924లో చైనాను సందర్శించారు. మూడు సంవత్సరాల తర్వాత గురుదేవులు మలయాలో తాన్ను కలిశారు. అనంతరం అతను చదువుకోవడానికి శాంతి నికేతన్‌కు వచ్చారు. అతను ఇక్కడ భారతీయ సంస్కృతిని అభ్యసించారు. కాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఠాగూర్ కొత్త విభాగాలను తెరవలేకపోయారు. గురుదేవులు చైనీస్ సంస్కృతి, భాష బోధించే ఒక విభాగాన్ని కూడా స్థాపించాలనుకున్నారు. 1931లో తాన్ నిధుల సేకరణ కోసం సింగపూర్, రంగూన్, చైనా దేశాలకు వెళ్లారు. దాదాపు ఐదేళ్ల తర్వాత శాంతినికేతన్‌కు తిరిగి వచ్చి రూ.50 వేల ఆర్థిక సహాయంతో పాటు లక్ష పుస్తకాలను అందించారు. తరువాత ఆయన శాంతినికేతన్లోనే ఉండిపోయారు. 30 ఏళ్లపాటు శాంతినికేతన్‌కు సేవలు అందించారు. 1937 ఏప్రిల్ 14న చైనా భవన్ ఏర్పాటయ్యింది. దీనిని ఇందిరాగాంధీ ప్రారంభించారు. చైనా ప్రతినిధి చియాంగ్ కై-షేక్ 1957లో శాంతి నికేతన్‌ను సందర్శించినప్పుడు చైనా హాల్, విశ్వవిద్యాలయానికి భారీ ఆర్థిక సహాయం అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో ఏడు ఎకరాల స్థలంలో ఆశ్రమాన్ని స్థాపించారు. అదే నేడు విశ్వభారతిగా పేరొందింది. ఠాగూర్ 1901లో కేవలం ఐదుగురు విద్యార్థులతో ఇక్కడ పాఠశాలను ప్రారంభించారు. వీరిలో అతని కుమారుడు కూడా ఉన్నాడు. 1921లో జాతీయ విశ్వవిద్యాలయ హోదా పొందిన విశ్వభారతిలో ప్రస్తుతం 6000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ క్యాంటీన్లో ఏమేమి దొరుకుతాయి? ధరలు ఎంత? -
ఉదయ్ కోటక్ వారసత్వం ఎవరికి?
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి ఇద్దరు హోల్‌టైమ్ డైరెక్టర్లు కేవీఎస్ మణియన్, శాంతి ఏకాంబరం రేసులో ఉన్నారు. బ్యాంక్ ఎండీ సీఈఓగా గత వారం ఉదయ్ కోటక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కోటక్ తన పదవీకాలం ముగియడానికి నాలుగు నెలల ముందే అంటే 1 సెపె్టంబర్ 2023 నుండి బ్యాంక్ ఎండీ, సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగారు. కొత్త వ్యక్తి 2024 జనవరి 1వ తేదీనాటికి బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నందున, ఈ బాధ్యతల భర్తీపై రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంక్‌లో 26 శాతం హోల్డింగ్ ఉన్న కోటక్, బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారారు. ఉదయ్ కోటక్ రాజీనామా నేపథ్యంలో మధ్యంతర ఏర్పాటుగా సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా 2023 డిసెంబర్ 31 వరకూ ఎండీ, సీఈఓగా విధులను నిర్వహిస్తారని (ఆర్బీఐ, బ్యాంక్ మెంబర్ల ఆమోదానికి లోబడి) కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ల తెలిపింది. విశేష సేవలు.. వ్యవస్థాపకుడిగా, నేను కోటక్ బ్రాండ్‌తో ప్రగాఢ అనుబంధాన్ని కలిగి ఉన్నాను. ఈ నేపథ్యంలో సంస్థకు నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగిస్తాను. పటిష్ట బ్యాంకింగ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ మేనేజ్మెంట్ బృందం ఉంది. వ్యవస్థాపకులు దూరంగా వెళ్లిపోతారు, కానీ సంస్థ శాశ్వతంగా వరి్ధల్లుతుంది. బ్యాంక్ షేర్ హోల్డర్లకు విశేష విలువలను సమకూర్చింది. లక్షకుపై ఉపాధి అవకాశాలు కలి్పంచింది. 1985లో రూ. 10,000 పెట్టుబడితో స్థాపించిన సంస్థ ఇప్పుడు రూ. 300 కోట్ల వ్యాపారానికి విస్తరించింది. భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక శక్తిగా మార్చడంలో ఈ సంస్థ మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. – ఉదయ్ కోటక్, ఎక్స్‌లో పోస్ట్ -
‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది!
‘ఎవరైనా సరే నిద్రలేస్తూనే నేను ఉద్యోగం కోసం ఎదురు చూడడం లేదు. పదిమందికి ఉపాధి కల్పించడం కోసం ఎదురుచూస్తున్నాను’ అనుకోవాలి. ‘ఆశాపూరిత ప్రపంచాన్ని ఊహించుకున్నప్పుడే, దాన్ని నిజంగా సృష్టించగలం. నీ మార్గం ఏమిటి అనే విషయంలో స్పష్టత ఉంటేనే అక్కడికి చేరుకుంటావు. అలా చేరుకోవడానికి నీలోని ఉత్సాహం, అంకితభావం ఇంధనంలా ఉపయోగపడతాయి’...‘మైక్రోఫైనాన్స్ దారిదీపం’గా ప్రసిద్ధుడైన మహ్మద్ యూనస్ చెప్పిన ఇలాంటి మాటలెన్నో శాన్ఫ్రాన్సిస్కోలోని షీతల్ మెహతా వాల్ష్కు ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను యూనస్ బాటలో నడిపించి ‘శాంతి లైఫ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. సూక్ష్మారుణ సంస్థగా మొదలైన ‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది.. శాంతి లైఫ్ కెనడాలో పెరిగిన షీతల్ అక్కడి గుజరాతీ అసోసియేషన్‌లో భాగం కావడంతో ఎన్నోకుటుంబాలతో పరిచయం ఏర్పడింది. కమ్యూనిటీ లైఫ్‌లో భాగం కావడం ద్వారా పాశ్చాత్యజీవన విధానానికి భిన్నమైన భారతీయ జీవన విధానాన్ని చూసింది. ఎన్నో విలువలు నేర్చుకుంది. వెంచర్–క్యాపిటల్ ఫండింగ్ సెక్ట్చ్డర్లో రెండు దశాబ్దాల అనుభవాన్ని సంపాదించిన షీతల్ బంగ్లాదేశ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ మహ్మద్ యూనస్ స్ఫూర్తితో అహ్మదాబాద్ కేంద్రంగా ‘శాంతి లైఫ్’ అనే సూక్ష్మారుణ సంస్థను ప్రారంభించింది. ఇది పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో ఎలా ఉండేదంటే... పేద మహిళలకు రుణాలు లభించడం కష్టం. ఒకవేళ లభించినా బారెడు వడ్డీ కట్టలేక అష్టకష్టాలు పడేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో ‘శాంతి లైఫ్’ రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేస్తూ సొంతకాళ్ల మీద నిలబడ్డారు. కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా గ్రామీణప్రాంత మహిళలకు స్కిల్స్ ట్రైనింగ్, ఫైనాన్షియల్ లిటరసీ... మొదలైన వాటిలో శిక్షణ ఇస్తోంది శాంతి లైఫ్. క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన రావడానికి షీతల్‌కు అవకాశం ఏర్పడింది. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిని దూరం చేయాలంటే ఏంచేయాలి... మొదలైన విషయాలను తెలుసుకుంది షీతల్. ‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంది. పారిశుద్ధ్య లోపం వల్ల గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘సేఫ్ శానిటేషన్’ నినాదంతో గ్రామీణప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ అవగాహనతో వారు డబ్బు పొదుపు చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ‘రుణం తీసుకోవడం అనేది ఆర్థిక వ్యవహారమే కాదు. ఒక బాధ్యతను నిరంతరం గుర్తు చేస్తుంది. శాంతి లైఫ్ ద్వారా రుణం తీసుకున్న ఒక మహిళ రిక్షా కొనుగోలు చేసింది. ఈ రిక్షాను ఆమె భర్త నడిపేవాడు. గతంలో అతడి ప్రవర్తన ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం క్రమశిక్షణతో నడుచుకుంటున్నాడు. ఏరోజు డబ్బును ఆరోజే భార్యకు ఇస్తుంటాడు. భార్య పేరు మీద లోన్ ఉంది కాబట్టి ఆమెకు చెడ్డ పేరు రావద్దని అనుకునేవాడు భర్త. ఇలాంటి భర్తలు ఎందరో! రుణసహాయం మాత్రమే కాదు క్రమశిక్షణ పాదుకొల్పడంలో ‘శాంతి లైఫ్’ తనదైన పాత్ర నిర్వహిస్తోంది. గ్రామీణ వృత్తికళాకారులు తయారు చేసిన యోగా బ్యాగులు, చీరెలు, దుప్పట్లను ఆన్లైన్ ద్వారా అమ్మడం మొదలుపెట్టింది. ‘ప్రతి ఒక్కరికీ తమదైన నైపుణ్యం ఉంటుంది. అది ఇతరుల కంటే ఏ రకంగా భిన్నమైనది, ఆ నైపుణ్యం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి. నైపుణ్యాలను ఉపయోగించి క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చు’ అంటుంది షీతల్. లాభాలు గడించాలనే దృష్టితో కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే అవహగానతో ‘శాంతి లైఫ్’కు శ్రీకారం చుట్టింది షీతల్. సామాజిక నిబద్ధతతో మొదలైన ‘శాంతి లైఫ్’ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందా అని ప్రశ్నించుకుంటే ‘అంతకంటే ఎక్కువే’ అని జవాబు చెప్పుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాల శిక్షణ ద్వారా గుజరాత్‌లోని ఎన్నోగ్రామాల ముఖచిత్రాన్ని‘శాంతి లైఫ్’ మార్చింది. (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం! ) -
శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీహరి తన బాల్యంలోనే కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. అక్కడే అతని పాఠశాల విద్యను పూర్తిచేసుకున్నారు. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి అక్కడే జీవనం సాగించారు. అక్కడి నుంచి ఆయన సినిమాలపై మక్కువతో అరెకరం భూమి అమ్మి హైదరాబాద్ వచ్చారు. సినీ ఇండస్ట్రీలో శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి అని పేరు ఉంది. డిస్కో శాంతిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధివలన ముంబై లో కన్నుమూశారు. రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు శ్రీహరి మరణం జరిగిన సమయంలో ఏం జరిగిందో తాజాగ ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి తెలిపింది. సినిమా షూటింగ్ మధ్యలో అనారోగ్యానికి గురైన శ్రీహరిని ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో జాయిన్ చేసి ఐసీయూలో పెట్టారని ఆమె ఇలా చెప్పింది. 'శ్రీహరి చనిపోయే కొన్ని గంటల ముందు వైద్యులు చెకప్‌కు వచ్చారు. ఆ సమయంలో నన్ను బయటకు పంపించారు. అప్పుడు వాళ్లు కొన్ని మందులతో పాటు ఇంజక్షన్స్ సూచించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) కొంత సమయం తర్వాత ఒక నర్సు వచ్చి ఆ ఇంజక్షన్ వేసింది. కొన్ని నిమిషాల్లోనే శ్రీహరి కళ్లు,ముక్కు,చెవులు నుంచి మొత్తం బ్లడ్ వచ్చింది. నాకు హిందీ రాదు.. వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వాళ్లు బ్లడ్ మొత్తం క్లీన్ చేసి ఆయన్ను మరోగదిలోకి తీసుకుపోయారు. నేను ఎంత మొత్తుకున్నా శ్రీహరి దగ్గరకు కూడా పోనియలేదు.. వంద శాతం ఆ డాక్టర్లు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇదే హైదరాబాద్‌లో అయింటే ఆయన ఖచ్చితంగా బతికేవాడు.' అని ఆమె తెలిపింది. ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా చూపించారు శ్రీహరి చాలా గంటల ముందే చనిపోయినా తమకు ఆస్పత్రి సిబ్బంది చెప్పలేదని డిస్కో శాంతి పేర్కొన్నారు. వైద్యం అందిస్తున్నామని చాలా డబ్బు కట్టించుకున్నారని తెలిపింది. వాళ్లు చేసిన పని తలచుకుంటే చిరంజీవి ఠాగూర్ సినిమానే గుర్తుకొస్తుందని ఆమె పేర్కొంది. ఆస్పత్రి మీద కేసు వేయమని చాలామంది సలహాలిచ్చారు. ఆయన చనిపోతేనే మన అనుకునే వాళ్లు ఎవరూ రాలేదు. మళ్లీ ఈ కేసుల విషయంలో పిల్లలను పట్టుకుని తాను తిరగలేనని భావించి విరమించుకున్నానని శాంతి ఎమోషనల్ అయింది. చాలా మంది మోసం చేశారు శ్రీహరి మరణం తర్వాత సినీ పరిశ్రమ, స్నేహితులు ఏ ఒక్కరూ తమ ఇంటికి రాలేదని శాంతి తెలిపింది. కనీసం తాము ఉన్నామో లేమో కూడా వాళ్లకు తెలియదని గుర్తుచేసుకుంది. శ్రీహరి గతంలో ఎవరికి డబ్బు ఇచ్చారు. ఎవరిదగ్గర దాచారు అనేది తెలియదు. కానీ కొంతమంది ఆర్థిక విషయాల్లో తమను మోసం చేశారని శాంతి వాపోయింది. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు.. తాళి తప్పా నగలన్నీ తాకట్టలో శ్రీహరి మరణం తర్వాత ఒక్కసారిగా తమకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని శాంతి గుర్తుచేసుకుంది. శ్రీహరి లేరనే బాధ ఒకవైపు ఉండగానే కొంతమంది మోసం వల్ల డబ్బు కోల్పోయాను.. అదే డబ్బు ఉండిఉంటే తన కుమారుడు చదవుకునేందుకు ఫారిన్ వెళ్లేవాడని శాంతి తెలిపింది. తమకు రావాల్సిన డబ్బు అయితే తిరిగిరాలేదు కానీ తాము తీసుకున్న అప్పువాళ్లు మాత్రం ఇంటికి వచ్చారని చెప్పింది. అప్పుడు చేసేదిమి లేకపోవడంతో తమ వద్ద ఉన్న కార్లు, భూమి, బంగారం అన్నీ అమ్మేసి బాకీలు కట్టేశానని శాంతి తెలిపింది. (ఇదీ చదవండి: 'జైలర్' చూసి రజనీకాంత్ ఎలాంటి కామెంట్ చేశారంటే: నెల్సన్) చివరకు ఎంతో ఇష్టంగా కొనుకున్న ఒక కారు ఈఎంఐ కూడా కట్టలేకపోతే బ్యాంకు వారు తీసుకుపోయారని చెప్పింది. తాళి మాత్రమే ఉంచుకుని మిగిలిన బంగారాన్ని మొత్తం కోల్పోయానని శాంతి గుర్తుచేసుకుంది. ప్రస్తుతం జీవనోపాధికి తమ రెండు ఇళ్ల నుంచి అద్దె వస్తుందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం తాము ఉంటున్న ఇళ్లు నుంచి కొంత భాగం రోడ్డు డివైడింగ్ కోసం పోయింది. అందుకు సంబంధించి వచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేశామని శాంతి తెలిపింది. సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని శాంతి పేర్కొంది. డిస్కో శాంతికి పేరు తెచ్చిన పాట 'బంగారు కోడిపెట్ట' ( ఘరానామొగుడు) -
శాంతి యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గోశాలలో జరిగిన శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం పాల్గొన్న సంగతి తెలిసిందే. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
రెండో కుమారుడికి శాంతి పూజ చేయించిన యాంకర్ లాస్య (ఫోటోలు)
-
ఓం..శాంతి పట్టు!
గాంధీజీ 150 వ జయంతి రేపు. సమాజంలోని అణువణువులో ఆయన ప్రవచించిన అహింస.. ఓంకార నాదంలా ధ్వనిస్తోంది. శాంతి మార్గమై నడిపిస్తోంది. జ్యోతిరెడ్డి ఆ ధ్వనికి... ప్రతిధ్వని అయ్యారు. ఆ శాంతిమార్గంలో ఓ ‘పట్టు’ కొమ్మ అయ్యారు. పట్టుకు ఆయువు పట్టు అయిన పురుగు ప్రాణం తియ్యకుండా దారాన్ని సేకరించే ‘ఇంటెలిజెంట్ డిజైనర్’ అయ్యారు. ‘‘ప్రకృతి మనకు పత్తితోపాటు పట్టును కూడా ఇచ్చింది. పట్టు కోసం పట్టు పురుగును పెంచి, చంపడం అనే అమానుషానికి పాల్పడనక్కర్లేదు’’ అంటారు జ్యోతిరెడ్డి. అందంగా కనిపించడానికి చక్కటి పట్టు దుస్తులు ధరించాలనుకుంటాం. అందుకోసం పట్టు పురుగు మనకు అమూల్యమైన సేవలందిస్తోంది. దాని జీవితమంతా పట్టును పుట్టించడంలోనే గడుపుతుంది. పట్టు పురుగులు మల్బరీ ఆకులను తిని తమ చుట్టూ గూడు అల్లుకుంటాయి. అదే పట్టుగూడు. పురుగు గూడు లోపల ఉంటుంది. ఆ పట్టు గూళ్లను వేడి నీటిలో వేసినప్పుడు దారం వస్తుంది, కానీ పురుగు ప్రాణం పోతుంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న పట్టు సేకరణ విధానంలో పట్టు దారం కోసం పట్టు పురుగును నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అహింసాయుతంగా జీవించడానికి గాంధీజీ చెప్పినట్లు ‘విలువైనది మనిషి ప్రాణం మాత్రమే కాదు, అన్ని జీవుల ప్రాణమూ అంతే సమానమైనది’ అని జ్యోతిరెడ్డి నమ్ముతారు. నిజమే. మన మనుగడ కోసం ప్రాణుల్ని చంపాల్సి రావడాన్ని తప్పు పట్టలేం. కానీ మన అందం, ఆనందం కోసం ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. అహింస పట్టు ప్రకృతి మనకు జీవించడానికి అన్ని వనరులనూ ఇచ్చింది. అలాగే హింసకు తావులేని పట్టును కూడా ఇచ్చింది. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగే పట్టు పురుగులు స్వేచ్ఛాజీవులు. వాటికి ఆముదం ఆకులే ఆహారం. అక్కడ ఆముదం చెట్లు విస్తారంగా ఉంటాయి. ఆ పట్టుపురుగులు తమ చుట్టూ గూడు కట్టుకోవు. ఆకుల మీద పట్టు దారాలతో గూడు అల్లుతాయి. కొన్నాళ్లకు పాత గూడుని వదిలి మరో ఆకు మీదకు వెళ్లి కొత్త గూడు అల్లుతాయి. స్థానిక గిరిజనులు పురుగు వెళ్లిపోయిన ఆకును ఇట్టే గుర్తించగలుగుతారు. అలాంటి ఆకుల నుంచి మాత్రమే పట్టును సేకరిస్తారు. అంతే తప్ప పట్టు కోసం పురుగుకు హాని కలిగించరు. వారి జీవనం లాగానే వారి పట్టు వస్త్రాల తయారీ కూడా శాంతియుతంగానే ఉంటుంది. పట్టుదారం వడకడం, పట్టు వస్త్రాలను నేయడం అసోంలో కుటీరపరిశ్రమ. ఆ వస్త్రాలను పవిత్రంగా భావిస్తారు. పండుగలు, వేడుకలప్పుడు ధరిస్తారు. అహింసాయుత జీవితాన్ని ఆచరించే జైన, బౌద్ధులు ఈ వస్త్రాలను ధరిస్తారు. నేను వెదికింది అదే ‘ద వరల్డ్ నీడ్స్ ఇంటెలిజెంట్ ఫ్యాబ్రిక్ ’అన్న మాటలే తనను ఈ శాంతి పట్టు వైపు నడిపించాయంటారు జ్యోతి. ‘‘ఎక్స్పోర్ట్ వ్యాపారంలో అంతర్జాతీయ ట్రేడ్ షోలకు వెళ్లినప్పుడు ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ అన్న ఆ మాటకు అర్థం అప్పట్లో తెలియలేదు. ఇండియాకి వచ్చిన తర్వాత నా పనుల్లో నేను ఉన్నప్పటికీ వస్త్రరంగం మీద పరిశోధన మొదలు పెట్టాను. అంతకుముందు నేనే సొంతంగా డిజైన్ చేస్తూ బొటీక్ నడిపిన అనుభవాన్ని జోడించి రకరకాల వస్త్రరీతులను అధ్యయనం చేశాను. అందులో భాగంగా ముంబయిలో నాకు తెలిసిన డిజైనర్లతో కూడా మాట్లాడాను. అసోం గిరిజనులు పట్టు దారాన్ని సేకరించే విధానం, ఎరికల్చర్, ఎరి సిల్క్‌తో చేనేత గురించి తెలిసింది. ఓపెన్ కకూన్ని చూద్దామని వెళ్లాను. అక్కడ ఇది కుటీరపరిశ్రమ. ఇంట్లో అందరూ పని చేస్తారు. పట్టు దారం వడకడం నుంచి వస్త్రం నేయడం వరకు అన్నింటినీ స్వయంగా చేస్తారు. ప్రతి ఇంటి ముందు వెదురు కర్రల ఫ్రేమ్ ఉంటుంది. పట్టు వస్త్రం మీద కళాత్మకమైన డిజైన్‌తో నేసి ఆ ఫ్రేమ్‌కి తగిలిస్తారు. ఎవరి డిజైన్ వాళ్లదే. తల్లి నుంచి కూతురు నేర్చుకుంటుంది, ఆమె మరింత సృజనాత్మకత జోడించి కొత్త డిజైన్‌ను రూపొందిస్తుంది. అది ఆ కుటుంబానికే సొంతం. ఆ వస్త్రం చాలా అందంగా, ఒంటికి హాయిగా ఉంటుంది. రోజంతా ధరించినా ఒక్క ముడత కూడా పడదు. ఎన్ని రకాలుగా కట్టినా చక్కగా అమరిపోతుంది. ఆ పట్టు మీద మరెన్నో ప్రయోగాలు చేయవచ్చనిపించింది. ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ అన్న మాటల అర్థం అప్పుడు తెలిసింది. నిజంగా అది ఇంటెలిజెంట్ ఫ్యాబ్రికే. దీని మీద ఐదేళ్ల పాటు పరిశోధించాను. సురయ్యా హసన్ బోస్, ఉజ్రమ్మ, బీనారావు వంటి వాళ్ల అనుభవాలను తెలుసుకున్నాను. అసోం టు అమెరికా అసోం పట్టు దారాన్ని సన్నగా చేయగలిగితే విప్లవమే తీసుకురావచ్చనిపించింది. ఫ్యాక్టరీ పెట్టాలని ప్రయత్నాలు చేసేటప్పుడు.. ‘దీని మీద సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించరాదు, మీ ఆలోచనను నిరూపించాలనే తపన ఉంటే మాత్రం ముందుకెళ్లవచ్చు’ అని చెప్పారు ఆడిటర్. నా ప్యాషనే నన్ను ముందుకు నడిపించింది. నాలాగే ఆలోచించే మరికొందరం కలిసి చైనా మిషనరీతో కో ఆపరేటివ్ విధానంలో ఫ్యాక్టరీ పెట్టాం. నాలుగు వందల మంది చేనేతకారులు మాతో పని చేస్తున్నారు. మేము తయారు చేస్తున్న సన్నటి దారాన్ని ఇకత్, జామ్దాని, పైథాని, జకార్డ్ నేతలతో మిళితం చేస్తున్నాం. అందుకోసం వివిధ రాష్ట్రాల్లో నిపుణులైన చేనేతకారులను కలిశాను. పుట్టపాక, పోచంపల్లి, చౌటుప్పల్ నుంచి కోల్‌కతా, మిడ్నాపూర్ వరకు మొత్తం ఎనభై మంది మాస్టర్ వీవర్స్ మాతో పని చేస్తున్నారు. వాళ్ల సంప్రదాయ డిజైన్లకు కొత్త రీతులను జోడించి వైవిధ్యంగా తెస్తున్నాం. కలంకారీ అద్దకం చేస్తున్నాం. నా ప్రయత్నం అన్నింటిలోనూ విజయవంతమైంది. కానీ అడ్డంకి ఒక్క బాతిక్ దగ్గరే వచ్చింది. ఓపెన్ కకూన్లు ఆముదం ఆకును తింటాయి, కాబట్టి వాటి నుంచి వచ్చిన పట్టు కూడా చాలా స్మూత్‌గా జారుడుగా ఉంటుంది. దాంతో బాతిక్ ప్రింట్ కుదరలేదు. బాతిక్ కోసం పట్టులో ఆర్గానిక్ కాటన్ మిక్స్ చేసి ప్రయోగం చేస్తున్నాం. ఎరీనా బ్రాండ్ కోసం... ఎరి సిల్క్‌లో ప్రయోగాలతోపాటు ఇప్పుడు మా ఉత్పత్తుల బ్రాండింగ్ మీద దృష్టి పెట్టాను. జర్మనీలో సిల్క్ ప్రమోషన్ కౌన్సిల్ ట్రేడ్ ఫెయిర్‌లో మా పట్టు వస్త్రాలకు మంచి ఆదరణ వచ్చింది. స్థానిక మ్యాగజైన్లలో మంచి కథనాలు రాశారు. అమెరికాకీ పరిచయం చేశాను. మనదేశంలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసుకోవడంలో ఇప్పటికే చాలా వెనుకపడిపోయాం. దాంతో కొన్ని తరాల వెనుక మన చేనేతకారుల్లో ఉండిన కళ యథాతథంగా తర్వాతి తరాలకు కొనసాగలేదు. ఇప్పుడు అనేక ప్యాటర్న్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఉన్న వాటినైనా పరిరక్షించుకుంటే.. ఇండియా వేల ఏళ్ల కిందటే ఫ్యాషన్‌కు ప్రతీక అని ప్రపంచానికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరినీ నేను కోరేది ఒక్కటే. ‘బయటి దేశాలకు వెళ్లినప్పుడు మన వస్త్రాలను ధరిస్తే... మనదేశానికి మనమే బ్రాండ్ అంబాసిడర్లం అవుతాం’. అలాగని చీరలే కట్టాల్సిన పనిలేదు. కుర్తాలు, దుపట్టాలు, స్టోల్స్ ధరించినా చాలు. మన దగ్గర ఉన్న కళాత్మకతను గర్వంగా ప్రదర్శించవచ్చు’’. జర్మనీ ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ నేను పుట్టింది, పెరిగింది ముంబయిలో. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లాను. ఎంబీఏ అక్కడే చేశాను. పిల్లలిద్దరూ అక్కడే పుట్టారు. నాకేమో ఇండియా అంటే చాలా ఇష్టం. మనదేశంలో లేననే బెంగ ఉండేది. మా వారు (చంద్రశేఖర్) హైదరాబాద్‌లో బిజినెస్ ప్లాన్ చేయడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇండియాకి వచ్చేటప్పటికి పిల్లలు కొంచెం పెద్దయ్యారు. నేను కూడా ఏదైనా చేయాలనే ఆలోచనతో షూషాప్, బొటీక్ పెట్టాను. అమెరికాలో ఉన్న జర్మన్ ఫ్రెండ్‌కి ఎంబ్రాయిడరీ దుస్తులు ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఎక్స్‌పోర్టర్ హటాత్తుగా సప్లయ్ ఆపేయడంతో ఆమె నాకు ఫోన్ చేసింది. ఆమెకు వస్త్రాలను ఎక్స్పోర్ట్ చేయడం కోసం 1996లో ఎక్స్పోర్ట్ బిజినెస్ మొదలైంది. ఆ బిజినెస్‌ని విస్తరించడం కోసం వెళ్లిన ఫ్రాన్స్, స్వీడన్లలో ట్రేడ్ ఫెయిర్లతో శాంతియుతమైన ఎరి సిల్క్ బాట పట్టాను. డిన్నర్ టేబుల్ స్టోరీలు మా అమ్మానాన్నల అనుభవాలే మాకు పాఠాలు. నాన్న వరంగల్‌లో చిన్న గ్రామం నుంచి ముంబయికి వెళ్లారు. అక్కడ షిప్పింగ్ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. రాత్రి భోజనాలప్పుడు అన్ని విషయాలనూ చెప్తుండేవారు. ఒక సమస్యను అధిగమించడానికి ఎంత చాకచక్యంగా వ్యవహరించాలనేది ఆయన ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ మాలో వ్యాపార నైపుణ్యాలు పెరగడానికి అవన్నీ ఉపకరించాయి. అమ్మ ప్రతి పనినీ చాలా క్రియేటివ్‌గా చేసేది. అప్పట్లో మాకు భోజనాలకు కేసరోల్స్ ఉండేవి కాదు, స్టీలు గిన్నెలనే టేబుల్ మీద చక్కగా అమర్చేది. పూలను ఒకసారి కట్టినట్లు మరోసారి కట్టేది కాదు. ముగ్గులు కూడా నేర్చుకున్న వాటిని నేర్చుకున్నట్లు యథాతథంగా వేసేది కాదు. తన సృజనను జోడించేది. వీటన్నింటినీ చూస్తూ పెరిగాను. కాబట్టే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా ఈ రంగంలో విజయవంతం కాగలుగుతున్నాను. నా ఈ ప్రయత్నంలో ప్రత్యక్షంగా వందల కుటుంబాలకు ఉపాధి దొరకడంతోపాటు పరోక్షంగా వేలాది కుటుంబాలకు రాబడి పెరుగుతోంది. భారతీయ వస్త్ర కళ అంతర్జాతీయ వేదిక మీద మన్ననలు పొందేలా చేయాలనేది నా ఆకాంక్ష. నా రక్తంలో భారతీయత ఉంది. దేశగౌరవాన్ని పెంచడానికి నా వంతుగా ఏదైనా చేయాలి. నేను చేస్తున్న దేశసేవ ఇది. -
మాతోనే ఉన్నాడు
నేను నా దైవం నాకు బావే దేవుడు అంటుంది. అలా అయితే దేవుడు భక్తులను వదిలిపోడుగా. బావ వెళ్లిపోయాడు. ఇంతకు ముందు బావ ఎంగిలే ప్రసాదం. ఆ తర్వాత ముద్ద కూడా దిగేది కాదు ఈ కష్టాలలో నాకు తోడుగా ఉంది దేవుడే అంటున్నారు శాంతిశ్రీహరి. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని శాంతి శ్రీహరి ఇల్లు. ఇంటర్వ్యూ అంటే ‘ససేమిరా!’ అన్న శాంతి ‘నేను–నా దైవం’ అనగానే కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. తర్వాత తనే ముందుగా చెప్పడం మొదలుపెట్టారు.‘నాలుగేళ్ల క్రితం వరకు మా ఇల్లు రోజూ పండగలా ఉండేది. ఏ కష్టమూ మా ఇంటి గుమ్మం దాటి లోపలికి రాదు అని ధీమాగా ఉండేదాన్ని. కానీ, కాలం బావ (శ్రీహరి)ను తీసుకెళ్లిపోయింది. ఒక్కసారిగా స్వర్గం నుంచి అగాధంలోకి పడిపోయినట్టు అనిపించింది. మూడేళ్లు తిండికి, నీళ్లకు దూరమై బావ ధ్యాసలోనే ఉండిపోయాను. బావను మర్చిపోవడానికి ‘మత్తు’కి దగ్గరయ్యాను. ఆరోగ్యం పాడైంది. పూర్తిగా నీరసించిపోయాను. జీవశ్చవంలా పడుండేదాన్ని. నా కొడుకు తన చేతుల్తో ఎత్తుకుపోయి ఆసుపత్రిలో చేర్చాడు. ఆ రోజు ‘నేను పోతే ఈ పిల్లలేం అయిపోతారు, వీళ్ల కోసమైనా బతికించు దేవుడా’ అనుకున్నాను. ఈ రోజుకీ పిల్లల (పెద్దబ్బాయి శశాంక్, చిన్నబ్బాయి మేఘాంశ్) కోసం ఇలా ఉన్నానంటే ఇది ఆ దైవ నిర్ణయమే! ఆస్తులు కరుగుతున్నాయి. బాధ లేదు. పెద్దోడి చదువు పూర్తి కావస్తోంది. చిన్నోడి కాలేజీ చదువు ఇంకా మూడేళ్లు ఉంది. వాడికి మూడేళ్ల ఫీజు ఒకేసారి కట్టేశాను. పెద్దోడు అడిగాడు ‘ఏంటమ్మా! ఎవరైనా మూడేళ్ల ఫీజు ఒకేసారి కట్టేస్తారా’ అని. నేను చెప్పాను ‘ఒరే అప్పటి వరకు ఏమౌతుందో.. నేను ఫీజు కట్టలేని స్థితి వస్తే?! ఒక వేళ ఆరోగ్యం క్షీణించి మీ నాన్నలాగే నేనూ పోతే’ అన్నాను. వాడేం మాట్లాడలేదు. బావ దూరమయ్యాడనే బాధ, రేపేం జరుగుతుందో, ఎలా గడుస్తుందో అనే భయం నుంచి ఇప్పుడిప్పుడే ఎలాగైనా పిల్లలను స్థిరపరచాలనే ధైర్యం కలుగుతోంది. ఏదో దైవశక్తి ఉంది కాబట్టే నన్ను నడిపిస్తోంది.’ అసలు మీ జీవితమే కష్టంతోనే మొదలైంది కదా! అప్పట్లో దైవాన్ని తలుచుకుంటూ గడిపేవారా? నిజమే, కానీ అప్పట్లో అది కష్టం అనిపించలేదు. నలుగురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు తమ్ముళ్లు. నాన్న (సి.ఎల్.ఆనందన్ తమిళ సినిమా నటుడు) చనిపోయాడు. కుటుంబం గడవడం కోసం నేనీ సినిమా రంగంలో అడుగుపెట్టాను. అందరి కడుపు నిండాలంటే నేను నటించాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాను అనుకునేదాన్ని. అలా రోజులు గడిచిపోయాయి. దైవం అంటే భయమూ, భక్తి రెండూ ఉన్నాయి. కానీ, తలుచుకోవడం అంటూ ఏమీ ఉండేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు అమ్మవారి ఆలయానికే తీసుకెళ్లేది. భక్తిగా దండం పెట్టుకోవడం వరకే నాకు తెలిసేది. అయితే అప్పుడూ ఇప్పుడూ ఏదో శక్తి ఉందని, అదే ఈ సమస్త లోకాన్ని నడిపిస్తుందని నమ్ముతాను. మీ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మిమ్మల్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు శ్రీహరి. ఆ ప్రేమలో దైవత్వం ఉందంటారా? ముమ్మాటికి. ఆయనా ఎంతో కష్టపడి ఈ రంగంలో ఎదిగినవారు. నన్నుగా ఇష్టపడిన వ్యక్తి. ఆయన పరిచయమ య్యాక నా ప్రపంచమే మారిపోయింది. బావనే దైవం అయ్యాడు నాకు. బావ తప్ప మరో ప్రపంచం లేదన్నట్టుగా ఉండేది. ఎక్కడికెళ్లినా బావతోనే, ఏం చేసినా బావ కోసమే అన్నట్టుగా ఉండేదాన్ని. ఒకసారి బావ వాళ్ల గురువు (దాసరి నారాయణరావు) గారింట్లో పెద్ద లాఫింగ్ బుద్ధని చూశాడట. భలేగా ఉందే అన్నాడు ఇంటికి వచ్చి. అంతే, ఆ రోజు సిటీ అంతా తిరిగాను. ప్రతీ షాప్ వెతికాను. బావ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎదురుగా ఆయన కోరుకున్న లాఫింగ్ బుద్ధ. ఎంత సంతోషపడిపోయాడో... అలాగే నాకేదైనా నచ్చితే ఎంత కష్టమైనా సరే ఆ రోజుకు దాన్ని నా ముందుంచేవాడు. బావ నన్ను ఎంతలా అర్థం చేసుకున్నాడో ఒక్కమాటలో చెప్పలేను. ఏ దేవుడో కరుణించి నాకు దేవుడిలాంటి భర్తను ఇచ్చాడు అనుకునేదాన్ని. కానీ, ఆ దేవుడే నా బావను తీసుకెళ్లిపోయాడు. దైవం దగ్గర చేసిన మనిషిని దైవమే తీసుకెళ్లిపోతే ఆ దైవం మీద కోపం రాలేదా? బావ పోయాక నా ప్రపంచమే తలకిందులైపోయింది. దేవుడ్ని తిట్టుకున్న సందర్భాలు ఎన్నో. కానీ, నా రాత ఇలా ఉంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అని ఇప్పుడు నాకు నేను నచ్చజెప్పుకుంటాను. ఈ మిగిలిన జీవితాన్ని గడిపే ధైర్యం ఇవ్వు స్వామి అని వేడుకుంటున్నాను. బావ ఉన్నప్పుడు అంతా చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఎవరూ లేరు. జీవితం నేర్పిన కఠినపాఠాలను అర్థం చేసుకుంటున్నాను. చాలాసార్లు అనిపించింది నేనూ బావతో పాటే వెళ్లిపోతే బాగుండు అని. కానీ, పిల్లలు... మా బావ శరీరంగా లేడు. కానీ, మాతోనే ఉన్నాడు. లేకపోతే, ఈ నాలుగేళ్లలో నేనూ నా పిల్లలు రోడ్డు మీద ఉండేవాళ్లమే కదా! అలా జరగకుండా మా బావనే మమ్మల్ని చూసుకుంటున్నాడు. బావ ముందు కూర్చుని ఇప్పుడూ మాట్లాడతాను. ఎందుకిలా చేసి పోయావని తిడతాను. ఏడుస్తాను. (చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ) రోజుకు మూడుపూటలా ఆయన ఫొటో ముందు భోజనం పెట్టిన తర్వాతే నేనూ పిల్లలు తింటాం. పిల్లలు ఏం తెచ్చుకున్నా వాళ్ల నాన్నకు ముందు పెట్టి తర్వాత వాళ్లు తింటారు. ఆలయాలకు వెళ్లిన సందర్భాలు? చెన్నైలో మేల్మలయనూర్లో అంగలమ్మన్ ఆలయం ఉంది. అక్కడి అమ్మవారు శక్తిమాత. వెయ్యేళ్ల నాటి గుడి అని చెబుతారు. వారం క్రితమే మా తమ్ముడు కుటుంబంతో కలిసి ఆ అమ్మవారి ఆలయానికి వెళ్లి, మొక్కుతీర్చుకొని వచ్చాను. వేపాకులే దుస్తులుగా కట్టుకొని చెల్లించే మొక్కు అది. నేను, మా బావ అక్కడే పెళ్లి చేసుకున్నాం. శ్రీశైలం, తిరుపుతి, ఇక్కడి పెద్దమ్మగుడి, వరంగల్‌లోని భద్రకాళి ఆలయాలకు చాలాసార్లు వెళ్లాం. తిరుపతిలో నేనూ, పిల్లలు గుండు కూడా చేయించుకున్నాం. ఒకసారి కంచికి వెళ్లాం. అక్కడ మఠంలోని పెద్దస్వామిని దర్శించుకున్నప్పుడు చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఎందుకో తెలియదు కళ్లలో నీళ్లు వచ్చాయి. అక్కడ ఏదో శక్తి ఉందనిపించింది. నిత్యం ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు? మా బావకు శివయ్య అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. అలా నేనూ శివయ్యను పూజించేదాన్ని. బావతో పాటు నేనూ పూజలో పాల్గొనేదాన్ని. గణేషుడు, శివుడు, లక్ష్మీ దేవి శ్లోకాలన్నీ బావ ఒక డైరీలో రాయించి నాకు ఇచ్చాడు. పూజ సమయంలో వాటిని చదివేదాన్ని. బావ ఎక్కడి నుంచి తెప్పించాడో కానీ శివుడి స్వర్ణలింగం మా ఇంట్లో ఉండేది. దాదాపు మూడు వందల గ్రాముల బరువని చెప్పాడు. ఉదయాన్నే రోజూ పంతులుగారు వచ్చి మా ఇంట్లోని స్వర్ణలింగానికి పూజలు జరిపించేవారు. బావ దాదాపు గంటన్నరసేపు పూజ చేసేవాడు. పూజకు కావల్సినవన్నీ నేను సిద్ధం చేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లో నిత్య పూజలు లేవు. కానీ, స్నానం చేసిన తర్వాత దేవుని గదికి వెళ్లి రెండు అగరువత్తులు వెలిగించి దండం పెట్టుకొని వస్తాను. ఈ మధ్యే అమితమైన బాధ కలిగించిన సంఘటన ఒకటి జరిగింది. నాలుగురోజుల క్రితం ఎప్పటిలాగే నేను స్నానం చేసి, దేవుడి గదికి వెళ్లాను. అక్కడ చూస్తే ఏదో వెలితిగా అనిపించింది. బంగారు శివలింగం లేదు. ఎవరో దొంగిలించారు. ఎవరినీ నిందించలేదు. ఎవరికీ కంప్లైంట్ చేయలేదు. ఇంతటి సహనం నాకు ఎలా అబ్బిందా! అని ఆశ్చర్యం కలిగింది. దేవుడు విగ్రహంలో కాదు నా నిగ్రహంలో ఉన్నాడు అనిపించింది. శివయ్య మళ్లీ నా ఇంటికి వస్తాడని నమ్మకం ఏర్పడింది. మీ పిల్లలకు దైవం గురించి ఏం చెబుతుంటారు? పిల్లల చిన్నతనం అంతా వాళ్లు నిద్ర లేస్తూనే శ్లోకాలు వినపడేవి. ఇప్పుడు దేవుడి గదివైపు కూడా రారు. ‘దేవుడికి దండం పెట్టుకోండ్రా’ అని చెబుతాను. కానీ, వారు ఇష్టపడరు. మా నాన్న అన్నేసి గంటలు పూజలు చేసేవాడు. మరి ఆ దేవుడు మా నుంచి మా నాన్నను ఎందుకు తీసుకెళ్లాడు అంటారు. పెద్దవాళ్లయ్యాక వాళ్లే తెలుసుకుంటారని ఊరుకుంటాను. పుష్కరాలప్పుడు మాత్రం పిల్లలను తీసుకెళ్లి వాళ్ల నాన్నకు చేయవలసిన క్రతువును చేయించి వచ్చాను. ఇంత జీవితంలో మనుషుల్లో మీరు చూసిన దైవత్వం...? బావలోనే చూశాను. ఎవరు సాయం అడిగినా లేదనేవారు కాదు. మా పాప జ్ఞాపకంగా అక్షర పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి మేడ్చల్ మండలంలోని నాలుగు ఊళ్లలోని స్కూళ్లకు ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ సదుపాయం కల్పించాడు. ఆ ఫౌండేషన్‌కి నిధులు ఎప్పుడూ అందేలా తనే జాగ్రత్తలు తీసుకున్నాడు. మా ఫామ్‌హౌజ్ నుంచి వచ్చే బియ్యం, కూరగాయలు ఆశ్రమాలకు, జూనియర్ ఆర్టిస్టులకూ పంపించేవాడు. పుట్టినరోజులకు హోమ్‌లకు వెళ్లేవాడు. అన్నదానాలు చేసేవాడు. బావకు సీరియస్‌గా ఉందని తెలిసినక్షణం నుంచి ఆయనను గౌరవంగా సాగనంపేవరకు బావ దగ్గర అన్నం నీళ్లు మాని ఆయన స్నేహితులు సి.కళ్యాణ్, ఆలగడ్డ శ్రీనివాస్ ఉన్నారు. ప్రతియేటా బావ పోయిన రోజున ఆ ఇద్దరు వచ్చి దండంపెట్టుకొని వెళతారు. వాళ్లను చూసినప్పుడు అనిపిస్తుంది దైవం ఇలా కొందరి రూపం లో కనిపిస్తుంటాడని. ఈ నెల 15న బావ పుట్టినరోజు. ఆ రోజున బావ సమాధి దగ్గరే రోజంతా గడుపుతుంటాను. ఈసారి బావ చేసిన కార్యక్రమాలనే నేనూ చేయాలను కుంటున్నాను. సేవలో భాగం అవ్వాలనుకుంటున్నాను. ఈ క్షణం దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే..? పిల్లల భవిష్యత్తు. వాళ్లు ఈ లోకాన్ని అర్థం చేసుకొని నిలదొక్కుకోవాలి. అంతవరకు నన్ను బతికించు స్వామి అని దండం పెట్టుకుంటాను. అమ్మనాన్నలతో చిన్నప్పుడు గుళ్లకు తిరిగాం. పూజల్లో పాల్గొన్నాం. కానీ, అమ్మనాన్నలెప్పుడూ పూజలు చేయమని ఒత్తిడి చేయలేదు. ‘మనల్ని నడిపే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి నుంచే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తే మంచి జరుగుతుంద’ ని నాన్న చెప్పేవారు. అదే నమ్ముతాం. శశాంక్ శ్రీహరి మేఘాంశ్ శ్రీహరి – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
భర్త కుక్కను వదిలేసి వచ్చాడని..
పెంపుడు కుక్కను భర్త తరిమేశాడని భార్య ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కలను అమితంగా ప్రేమించే శాంతి అనే మహిళ 'కన్నీ' అనే కుక్కను కొన్నేళ్ల నుంచి పెంచుకుంటోంది. కన్నీని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేని ఆమె భర్త దాన్ని, కొత్తగా పుట్టిన కుక్కపిల్లను బయటకు తీసుకువెళ్లి వదిలేసి వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన మహిళ ఒంటికి నిప్పంటించుకుంది. దాదాపు 85 శాతం శరీరం కాలిపోయిందని, ప్రస్తుతం నమక్కల్ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ఓ మెడికో విద్యార్ధి కుక్క మేడ మీది నుంచి పడేసిన ఘటన మరువకు ముందే ఈ ఘటన జరగడంతో జంతుప్రేమికులు దీనిని ఖండిస్తున్నారు. -
పార్టీని ఓడించడానికి ప్రయత్నించారు...
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. సీనియర్ల నాయకుల మాటల యుద్ధం తారాస్థాయి చేరుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఓడించడానికి ప్రయత్నించారంటూ యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ లపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది ఆప్. బాధ్యులు తప్ప ఇంకెవ్వరూ పార్టీ వ్యవహారాలపై మాట్లాడకూడదని నిర్ణయించిన తరువాత కూడా యాదవ్, భూషణ్ మీడియాతో మాట్లాడి, జనంలో గందరగోళానికి కారణమయ్యారని ఆప్ లీడర్ అశుతోష్ తెలిపారు. దీన్ని నిబంధనల అతిక్రమణగా పార్టీ భావిస్తోందని ఆయన తెలిపారు. అందుకే వారినైజాన్ని బహిర్గతం చేయక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. వాస్తవాలను ప్రజలకు వెల్లడించడం మా బాధ్యతని అశుతోష్ పేర్కొన్నారు. మార్చ్ 4 న జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో యోగేంద్ర , ప్రశాంత్ భూషణలను పార్టీ (పీఎసీ )రాజకీయ వ్యవహారాల కమిటీనుంచి తొలగించిన సంగతి తెలిసిందే. , -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
శంషాబాద్ రూరల్: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని షాబాద్ రోడ్డులో ఒయాసిస్ పాఠశాల వద్ద ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలం పెద్దవేడు తండాకు చెందిన కేతావత్ నర్సింహా(42), శాంతి(38) దంపతులు రాత్రి శంషాబాద్ నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో శంషాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికిరణ్(19)బైక్‌పై వర్ధమాన్ కళాశాల నుంచి శంషాబాద్ వస్తున్నాడు. మార్గమధ్యంలో ఒయాసిస్ పాఠశాల వద్దకు రాగానే వీరి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన నర్సింహా, శాంతి దంపతులు ఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. మరో బైక్‌పై ఉన్న సాయికిరణ్‌కు గాయాలవడంతో 108 వాహనంలో చికిత్స కోసం శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా నర్సింహా దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. దంపతుల మృతి విషయం తెలుసుకున్న కుటుంబీకులు, తండావాసులు ఘటనా స్థలానికి పెద్దఎత్తున చేరు కున్నారు. ఘటనా స్థలంలో వారి రోదనలు మిన్నం టాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక క్లస్టర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు శంషాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను క్షేమంగానే ఉన్నా: శ్రీహరి భార్య శాంతి
తాను ఆరోగ్యంగా ఉన్నానని, విషమ పరిస్థితుల్లో లేనని దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి భార్య శాంతి తెలిపారు. తాను విషమ పరిస్థితుల్లో ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. కాలేయానికి సంబంధించిన వ్యాధితో సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. తాను పచ్చకామెర్ల కారణంగా అనారోగ్యానికి గురైన మాట వాస్తమేనని చెప్పారు. చెన్నై వెళ్లి చికిత్స చేయించుకుని కోలుకున్నానని తెలిపారు. తన సోదరి లలితకుమారి నివాసంలో ఉంటూ చికిత్స చేయించుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, విషమపరిస్థితుల్లో లేనని స్పష్టం చేశారు. -
బావకు నేను చేస్తున్న చివరి ఉత్సవం ఇదే: శాంతి
మా బావకు నేను చేస్తున్న చివరి పెద్ద ఉత్సవం ఇది. ఇకపై జరిగే అన్ని కార్యక్రమాలను మా పిల్లలు కొనసాగిస్తారు. పిల్లు చదువుకుని మంచి స్థానాల్లో ఉండాలని నేను ఆశపడ్డాను. కాని వాళ్లు సినిమాల్లో స్థిరపడ్డాలని బావ కోరుకున్నారు. వాళ్లు కూడా బావ కోరికను నెరవేర్చాలని అనుకుంటున్నారు. మా ఫ్యామిలీకి మొదటి నుంచి చిత్ర పరిశ్రమలో అందరితోనూ, జర్నలిస్తులతోనూ మంచి సంబంధాలున్నాయి. ఇకపై కూడా తాము ఆ సంబంధాలను కొనసాగిస్తాం అని శ్రీహరి సతీమణి శాంతి ఉద్వేగంగా ప్రసంగించారు. నా కోరిక మేరకు నేను దర్శకుడిగా మారుతాను. తమ్ముడు హీరో అవుతాడు అని శ్రీహరి కుమారుడు శశాంక్ అని అన్నారు. దివంగత సినీనటుడు శ్రీహరి ప్రథమ వర్ధంతి హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో సి. కళ్యాణ్, వీర శంకర్, దేవీ ప్రసాద్, బాబీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఉత్కంఠతో...
వెంకి, అను ఉపాధ్యాయ, గోపికృష్ణ, శాంతి, హని, నాని ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. భవానీ మస్తాన్ దర్శకుడు. పొట్లాబత్తుని శివశంకరరావు నిర్మాత. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. హారర్ నేపథ్యంలో రూపొందించిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు చెప్పారు. విజయవాడ, మంగళగిరి పరిసరాల్లో జరిపిన చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తయిందని, అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించి డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: నాని. -
ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి
లోద్దపుట్టి (ఇచ్ఛాపురం), న్యూస్‌లైన్: ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం అభ్యర్థి రెండి శాంతి ఓటర్లకు విజ్ఞప్తి చేశా రు. బుధవారం మధ్యాహ్నం ఆమె పార్టీ నాయకులతో కలిసి..లొద్దపుట్టి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి..ఫ్యాన్‌గుర్తుపై ఓటు వేయాలని, లొద్దపుట్టి ఎంపీటీసీ అభ్యర్థి పిట్ట హేమలతను గెలిపించాలని కోరారు. మహిళల వద్దకు వెళ్లి..వారిని ఆప్యాయంగా పలకరించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. వికలాంగ, వృద్ధ మహిళలతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రాజన్న పాలన వస్తుందని, అందరి కష్టాలు తీరుతాయని వివరించారు. స్థానిక మహిళలతో కలిసి..వడ్లు దంచారు. చిరు వ్యాపారులు, పనుల్లో ఉన్న మహిళల వద్దకు వెళ్లి..పలకరించి..వైఎస్ఆర్సీపీని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఆయన సతీమణి విజయ, పార్టీ నాయకులు సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ కె.గోవిందరెడ్డి, మండల కన్వీనర్లు కారంగి మోహనరావు, పిట్ట ఆనంద్, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి సుగ్గు ఛత్రపతి రెడ్డి, సేవాదళ్ కన్వీనర్ తిప్పన రామారావు, మాజీ ఎంపీపీ తిలక్, అనపాన పితాంబర్, పైల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.