ఉదయ్‌ కోటక్‌ వారసత్వం ఎవరికి? | Two internal candidates in race to replace Uday Kotak as MD | Sakshi
Sakshi News home page

ఉదయ్‌ కోటక్‌ వారసత్వం ఎవరికి?

Published Tue, Sep 5 2023 4:39 AM | Last Updated on Tue, Sep 5 2023 4:39 AM

Two internal candidates in race to replace Uday Kotak as MD - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ పదవికి ఇద్దరు హోల్‌టైమ్‌ డైరెక్టర్లు కేవీఎస్‌ మణియన్, శాంతి ఏకాంబరం రేసులో ఉన్నారు. బ్యాంక్‌ ఎండీ సీఈఓగా  గత వారం ఉదయ్‌ కోటక్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

కోటక్‌ తన పదవీకాలం ముగియడానికి నాలుగు నెలల ముందే అంటే  1 సెపె్టంబర్‌  2023 నుండి బ్యాంక్‌ ఎండీ, సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగారు. కొత్త వ్యక్తి 2024 జనవరి 1వ తేదీనాటికి బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నందున, ఈ బాధ్యతల భర్తీపై రెగ్యులేటర్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుంది.

బ్యాంక్‌లో 26 శాతం హోల్డింగ్‌ ఉన్న కోటక్, బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మారారు. ఉదయ్‌ కోటక్‌ రాజీనామా నేపథ్యంలో మధ్యంతర ఏర్పాటుగా సంస్థ  జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌ గుప్తా  2023 డిసెంబర్‌ 31 వరకూ ఎండీ, సీఈఓగా విధులను నిర్వహిస్తారని (ఆర్‌బీఐ, బ్యాంక్‌ మెంబర్ల ఆమోదానికి లోబడి) కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ల తెలిపింది.  

విశేష సేవలు..
వ్యవస్థాపకుడిగా, నేను కోటక్‌ బ్రాండ్‌తో ప్రగాఢ అనుబంధాన్ని కలిగి ఉన్నాను. ఈ నేపథ్యంలో సంస్థకు నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగిస్తాను. పటిష్ట బ్యాంకింగ్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ బృందం ఉంది. వ్యవస్థాపకులు దూరంగా వెళ్లిపోతారు, కానీ సంస్థ శాశ్వతంగా వరి్ధల్లుతుంది. బ్యాంక్‌ షేర్‌ హోల్డర్లకు విశేష విలువలను సమకూర్చింది. లక్షకుపై ఉపాధి అవకాశాలు కలి్పంచింది. 1985లో రూ. 10,000 పెట్టుబడితో స్థాపించిన సంస్థ ఇప్పుడు రూ. 300 కోట్ల వ్యాపారానికి విస్తరించింది. భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక శక్తిగా మార్చడంలో ఈ సంస్థ మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.    
–  ఉదయ్‌ కోటక్, ఎక్స్‌లో పోస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement