నేను క్షేమంగానే ఉన్నా: శ్రీహరి భార్య శాంతి | Srihari wife Shanti Responds Over Her health Issues | Sakshi
Sakshi News home page

నేను క్షేమంగానే ఉన్నా: శ్రీహరి భార్య శాంతి

Nov 24 2014 9:13 PM | Updated on Sep 2 2017 5:03 PM

శాంతి(ఫైల్)

శాంతి(ఫైల్)

తాను ఆరోగ్యంగా ఉన్నానని, విషమ పరిస్థితుల్లో లేనని దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి భార్య శాంతి తెలిపారు.

తాను ఆరోగ్యంగా ఉన్నానని, విషమ పరిస్థితుల్లో లేనని దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి భార్య శాంతి తెలిపారు. తాను విషమ పరిస్థితుల్లో ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. కాలేయానికి సంబంధించిన వ్యాధితో సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు.

తాను పచ్చకామెర్ల కారణంగా అనారోగ్యానికి గురైన మాట వాస్తమేనని చెప్పారు. చెన్నై వెళ్లి చికిత్స చేయించుకుని కోలుకున్నానని తెలిపారు. తన సోదరి లలితకుమారి నివాసంలో ఉంటూ చికిత్స చేయించుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, విషమపరిస్థితుల్లో లేనని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement