మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి శాంతి ప్రియ స్పందించారు. ఇలాంటి వేధింపులు కేవలం మాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునవరావృతం కాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మన భవిష్యత్ తరాలకు భరోసానిచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు.
అంతేకాకుండా మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేయడం ఎంతవరకు సబబు అని శాంతి ప్రియ ప్రశ్నించారు.హేమ కమిటీ నివేదిక తర్వాత ఆరోపణలు వస్తున్న సమయంలో తప్పుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే బాధితులకు న్యాయం చేసేందుకు అండగా నిలబడాల్సిందని అన్నారు. బాధితులకు భరోసా కల్పించే బాధ్యత అమ్మ సభ్యులపై ఉందని ఆమె గుర్తు చేశారు.
తనకెప్పుడు ఎదురవ్వలేదు..
అయితే తనకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదని.. తన అదృష్టమని శాంతి ప్రియ వెల్లడించారు. నేను భానుప్రియ సోదరురాలిని అయినందువల్లే ఎవరూ టచ్ చేయలేదని తెలిపింది. ఎందుకంటే ఇండస్ట్రీలో మా కుటుంబానికి ఉన్న గౌరవమేంటో అందరికీ తెలుసున్నారు. కాగా.. కాబోయే అల్లుడు తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శాంతి ప్రియ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. 1980-90ల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది.
కాగా.. హేమ కమిటీ నివేదిక బయటకొచ్చాక మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘాన్ని రద్దు చేశారు. ఇందులో సభ్యులుగా ఉన్న 17 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment