ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ భామ కృతి శెట్టి. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించింది. తాజాగా మలయాళ చిత్రం ఏఆర్‌ఎమ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది భామ. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి శెట్టి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించింది. హేమ కమిటీ నివేదిక తర్వాత చోటు చేసుకున్న సంఘటనలపై కృతి శెట్టి మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు చాలా దురదృష్టకరమని హీరోయిన్ పేర్కొంది. అయితే వీటి వల్ల ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన వస్తుందని కృతి శెట్టి అన్నారు. దీని వల్ల భవిష్యత్తులో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.
(ఇది చదవండి: ఏఆర్‌ఎమ్ నాకో పెద్ద సవాల్: కృతీ శెట్టి)
కృతి శెట్టి మాట్లాడుతూ..'ఇలాంటి విషయాలు కచ్చితంగా ఎక్కువ స్థాయిలో మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. ప్రతి ఒక్కరూ మా పరిశ్రమ మాత్రమే చెడ్డదని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. కానీ నేను మాత్రం చాలా సెన్సిటివ్ పర్సన్. మహిళలపై వేధింపులు లాంటి విషయాలను తలచుకుంటే నిజంగానే ఆందోళనకు గురవుతా. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధాలు లేకుండా కేవలం నటిగా మాత్రమే ఉండాలని కోరుకుంటా. కానీ ఎవరైనా కొత్తగా నటనలో అడుగుపెట్టాలనుకునే వారు మాత్రం నిర్ణయాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాలని సలహా ఇస్తా' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment