Malayalam Chitra industry
-
ఇండస్ట్రీలో ఇలా జరగడం దురదృష్టకరం: ఉప్పెన భామ
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ భామ కృతి శెట్టి. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించింది. తాజాగా మలయాళ చిత్రం ఏఆర్ఎమ్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది భామ. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి శెట్టి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించింది. హేమ కమిటీ నివేదిక తర్వాత చోటు చేసుకున్న సంఘటనలపై కృతి శెట్టి మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు చాలా దురదృష్టకరమని హీరోయిన్ పేర్కొంది. అయితే వీటి వల్ల ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన వస్తుందని కృతి శెట్టి అన్నారు. దీని వల్ల భవిష్యత్తులో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.(ఇది చదవండి: ఏఆర్ఎమ్ నాకో పెద్ద సవాల్: కృతీ శెట్టి)కృతి శెట్టి మాట్లాడుతూ..'ఇలాంటి విషయాలు కచ్చితంగా ఎక్కువ స్థాయిలో మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. ప్రతి ఒక్కరూ మా పరిశ్రమ మాత్రమే చెడ్డదని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. కానీ నేను మాత్రం చాలా సెన్సిటివ్ పర్సన్. మహిళలపై వేధింపులు లాంటి విషయాలను తలచుకుంటే నిజంగానే ఆందోళనకు గురవుతా. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధాలు లేకుండా కేవలం నటిగా మాత్రమే ఉండాలని కోరుకుంటా. కానీ ఎవరైనా కొత్తగా నటనలో అడుగుపెట్టాలనుకునే వారు మాత్రం నిర్ణయాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాలని సలహా ఇస్తా' అని అన్నారు. -
తనపై లైంగిక ఆరోపణలు.. చట్టపరంగానే ఎదుర్కొంటా: నటుడు జయసూర్య
మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక సంచలనంగా మారింది. పలువురు నటులు, డైరెక్టర్లపై ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మలయాళ నటుడు జయసూర్య స్పందించారు. ఇలాంటి ఆరోపణలు తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జయసూర్య ఖండించారు. ప్రస్తుతం తాను యూఎస్‌లో ఉన్నానని.. త్వరలోనే కేరళకు వస్తానని చెప్పారు.ఆగస్టు 31న తన బర్త్ డేను జయసూర్య సెలబ్రేట్ చేసుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సులభమని.. అబద్ధం ఎల్లప్పుడూ నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుందని అన్నారు. కానీ చివరికీ నిజం గెలుస్తుందని జయసూర్య ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందన్నారు. నా పుట్టినరోజును ఇలాంటి సమయంలో జరుపుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.కాగా.. జయసూర్య తనను లైంగికంగా వేధించారంటూ ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికే మలయాళ ఆర్టిస్టుల సంఘ సభ్యులు మోహన్‌లాల్‌తో సహా అందరూ రాజీనామాలు చేశారు. -
మాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా ఉంది: భానుప్రియ సిస్టర్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి శాంతి ప్రియ స్పందించారు. ఇలాంటి వేధింపులు కేవలం మాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునవరావృతం కాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మన భవిష్యత్ తరాలకు భరోసానిచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు.అంతేకాకుండా మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేయడం ఎంతవరకు సబబు అని శాంతి ప్రియ ప్రశ్నించారు.హేమ కమిటీ నివేదిక తర్వాత ఆరోపణలు వస్తున్న సమయంలో తప్పుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే బాధితులకు న్యాయం చేసేందుకు అండగా నిలబడాల్సిందని అన్నారు. బాధితులకు భరోసా కల్పించే బాధ్యత అమ్మ సభ్యులపై ఉందని ఆమె గుర్తు చేశారు. తనకెప్పుడు ఎదురవ్వలేదు..అయితే తనకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదని.. తన అదృష్టమని శాంతి ప్రియ వెల్లడించారు. నేను భానుప్రియ సోదరురాలిని అయినందువల్లే ఎవరూ టచ్ చేయలేదని తెలిపింది. ఎందుకంటే ఇండస్ట్రీలో మా కుటుంబానికి ఉన్న గౌరవమేంటో అందరికీ తెలుసున్నారు. కాగా.. కాబోయే అల్లుడు తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శాంతి ప్రియ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. 1980-90ల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. కాగా.. హేమ కమిటీ నివేదిక బయటకొచ్చాక మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘాన్ని రద్దు చేశారు. ఇందులో సభ్యులుగా ఉన్న 17 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్రారంభించింది. -
ఇదో పిరికి చర్య: రాజీనామాలపై తంగలాన్ నటి
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు డైరెక్టర్స్, నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. ఇప్పటికే కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో సహా 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. తాజాగా తన సభ్యత్వానికి రాజీనామా చేయడంపై తంగలాన్ నటి పార్వతి తిరువోతు రియాక్ట్ అయ్యారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ మూకుమ్మడి రాజీనామా చేయడంపై నటి పార్వతి తిరువోతు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపంద చర్యలా ఉందని తెలిపారు. ఫిల్మ్ అసోసియేషన్‌లో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించింది. అయితే తమకు మాట్లాడే అవకాశం లేకపోవడంతో సంతోషంగా అసోసియేషన్‌కు రాజీనామా చేశానని పార్వతి తెలిపారు. మీడియాతో మాట్లాడే బాధ్యత నుంచి తప్పుకోవడం పిరికితనంగా అనిపించిందని పేర్కొన్నారు.ఈ విషయంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్వతి తిరువోతు ఆరోపించారు. మహిళలు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పేర్లతో రావాలని లాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పేర్లు చెప్పడం ముఖ్యమా? ఆ మహిళకు న్యాయం జరగడమా? అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. -
మాలీవుడ్‌లో మీ టూ : ‘మాకు ఆ విషయం చెప్పలేదు’
హేమ కమిటీ నివేదిక మాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ రిపోర్ట్ బయటకొచ్చాక పలువురు డైరెక్టర్స్, నటులపై పెద్దఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అమ్మ అధ్యక్ష పదవిలో ఉన్న మోహన్ లాల్ సైతం వైదొలిగారు. పాలక మండలి పదవుల నుంచి మొత్తం 17 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. వీరంతా నైతిక బాధ్యత వహిస్తూ పక్కకు తప్పుకున్నారు. దీంతో మలయాళ చిత్రమండలిని రద్దు చేశారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.రాజీనామా చేయని ఇద్దరు?అయితే అమ్మ సభ్యులుగా ఉన్న మరో ఇద్దరు హీరోయిన్స్ మాత్రం రాజీనామాలు సమర్పించలేదు. తాజాగా రద్దయిన కమిటీలో హీరోయిన్స్ సరయు, అనన్య సభ్యులుగా ఉన్నారు. అయితే రాజీనామా నిర్ణయంపై తమ సమాచారం లేదని వీరిద్దరు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ అభిప్రాయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. అయితే మండలి పూర్తిగా రద్దు చేయడంతో వీరి పదవులు కూడా పోయినట్లేనని భావిస్తున్నారు.అసలేంటి హేమ కమిటీ?ఇటీవల జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదికను బహిర్గతం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే మొదట అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. -
ఒకప్పుడు కేవలం అలాంటి సినిమాలే: మలయాళ ఇండస్ట్రీపై ఆర్జీవీ కామెంట్స్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇటీవల కల్కి చిత్రంలో అతిథిపాత్రలో మెరిశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే తాజాగా ఆర్జీవీ మలయాళ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో మలయాళ చిత్రాలు కేవలం అడల్ట్, రొమాంటిక్ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవని అన్నారు.రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ..'ఒకప్పుడు మలయాళం సినిమా అంటే కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమేనని మనందరికీ తెలుసు. నేను విజయవాడలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో మలయాళ సినిమాలు చూడలేదు. ఎందుకంటే ఇతర సినిమాలతో పోలిస్తే ఎక్కువ అడల్ట్ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం మలయాళం నుంచి ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఆ సమయంలో మంచి సినిమాలు లేవని కాదు. బహుశా అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా కారణాలతో అలాంటి సినిమాలు తీసుకొచ్చి ఉంటారేమో. వారిని ప్రభావితం చేసిన అనేక అంశాలు ఉండొచ్చు.' అని అన్నారు,ది కేరళ స్టోరీపై ప్రశంసలు..ది కశ్మీర్ ఫైల్స్, యానిమల్ లాంటి వివాదాస్పద చిత్రాలపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. తాను చూసిన ఉత్తమ చిత్రాలలో ది కేరళ స్టోరీ ఒకటని ఆయన తెలిపారు. అలాగే ప్రశాంత్ వర్మ చిత్రం హను-మాన్, నాగ్ అశ్విన్ తాజా బ్లాక్‌బస్టర్ కల్కి 2898 AD సినిమాలు అధ్బుతమని కొనియాడారు. శివ మూవీతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆర్జీవీ టాలీవుడ్‌కు పలు సూపర్ హిట్ చిత్రాలను అందించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటి కనకలత కన్నుమూశారు. తిరువనంతపురంలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె చాలా కాలంగా పార్కిన్సన్స్, మతిమరుపుతో బాధపడుతున్నారు. దీంతో కోలుకోలేక మరణించారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న కనకలత.. 16 ఏళ్ల తర్వాత తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఎలాంటి సంతానం లేకపోవడంతో 34 ఏళ్లుగాతన సోదరి విజయమ్మతో కలిసి ఉంటోంది.కాగా.. కనకలత మలయాళం, తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువగా నటించారు. దాదాపు రెండు భాషల్లో 360కి పైగా చిత్రాలు చేశారు. యాత్రామొళి, గురు, కిలుకిల్ పంబరం, పార్వతీ పరిణయం, తుంపోలి కడపురం, అతిర కన్మణి, ఎఫ్ఐఆర్, ఆకాశ గంగ, దోస్త్, నెమలి, మంత్రమోతీరం, కౌరవులు, కార్య, జాగురా, రాజు లాంటి సినిమాలు చేసింది. కనకలత చివరిసారిగా ‘పూక్కాళం’, ‘మూడు రోజులు సినిమాల్లో నటించింది. ఆమెకు చిత్ర పరిశ్రమ నుండి ఆఫర్లు వచ్చనప్పటికీ.. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె నటనకు విరామం తీసుకుంది. ఆమెకు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ), ఫిల్మ్ అకాడమీ ఆర్థిక సాయంతో చికిత్స తీసుకున్నారు. -
వెటరన్ స్క్రీన్ రైటర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
Veteran Screenwriter John Paul Puthussery Passed Away At 72: ప్రముఖ బహుముఖ కథా రచయతి జాన్ పాల్ పుతుస్సేరి కన్నుమూశారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. 72 ఏళ్ల జాన్ పాల్ గత రెండు నెలలుగా చికిత్స తీసుకుంటూ శనివారం (ఏప్రిల్ 23) మరణించారు. జాన్ పాల్ మృతిపట్ల కేరళ విద్యాశాఖ మంత్రి శివన కుట్టి సంతాపం వ్యక్తం చేశారు. మలయాళం ఇండస్ట్రీలో వెటరన్ స్క్రీన్ రైటర్‌గా పేరొందిన జాన్ పాల్ సుమారు 100కుపైగా సినిమాలకు పనిచేశారు. 1980లో స్టార్ డైరెక్టర్ భరతన్ దర్శకత్వం వహించిన 'చమరం' సినిమాతో జాన్ పాల్ స్క్రీన్ ప్లే రైటర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత పాలంగల్, ఓరు మిన్నమినుంగింటే నురుంగు వెట్టం, యాత్రా వంటి క్లాసిక్ చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. డ్రామా, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి వివిద రకాల జోనర్లకు ఆయన పనిచేశారు. బాలు మహేంద్ర, జోషి, శశి, సేతు మాధవన్ వంటి తదితర డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. శశి దర్శకత్వం వహించిన వెల్లతూవల్ (2009) సినిమా తర్వాత 10 ఏళ్లు కేరీర్ పరంగా సుధీర్ఘ విరామం తీసుకున్నారు. మళ్లీ 2019లో కమల్ డైరెక్ట్ చేసిన ప్రణయామీనుకలుడే కాదల్ సినిమాకు స్క్రిప్ట్ రాయడంతో రీఎంట్రీ ఇచ్చారు. చదవండి: ఇండియాకు వచ్చిన విల్‌స్మిత్.. అతని కోసమేనా ? ఫొటోలు వైరల్.. ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైంపాస్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తీపి గుర్తు
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ స్పెషల్ ఇన్విటేషన్ మీద కేరళ వెళ్లారు హీరో సూర్య. ఇద్దరి కాంబినేషన్లో సినిమా అని ఊహించుకోకండి. ప్రస్తుతానికైతే అదేం కాదు. త్రివేండ్రంలో జరిగిన (అమ్మా) అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (ఏఎమ్ఎమ్ఏ) 25వ వార్షికోత్సవంలో జాయిన్ అయ్యేందుకు వెళ్లారు. ఈ ఫంక్షన్ పూర్తి అయిన తర్వాత.. ‘అమ్మా’కి కొత్త ‘అమేజింగ్ మూమెంట్స్ అండ్ మెమొరీస్ ఆఫ్ యాన్ యాక్టర్’ అని కొత్త నిర్వచనం ఇచ్చారు సూర్య. ‘‘ఈ ఫంక్షన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మోహన్‌లాల్, మమ్ముట్టీలతో స్టేజ్ షేర్ చేసుకోవడాన్ని లైఫ్ టైమ్ మెమొరీగా ఫీల్ అవుతున్నాను. మోహన్‌లాల్ సార్.. మీ నటనే కాదు మీ జీవితంలోని అంశాలు కూడా నాకు ఇన్స్పిరేషనే. మీ గురించి మాట్లాడ్డానికి ఏ భాషలోని పదాలూ సరిపోవు. ఈ వేడుకలో నన్ను భాగం చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు సూర్య. మలయాళ ఇండస్ట్రీలో రత్నాల్లాంటి సినిమాలు వస్తాయని కూడా సూర్య పేర్కొన్నారు. -
ఎదురు చూపుల ‘వేదిక’
అవకాశాల కోసం ఎదురుచూడడం నటి వేదికకు పరిపాటిగా మారింది. అలాగని ఈ బహుభాషా నటి ఖాళీగా ఏమీలేదు. తమిళంలోనే అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఇంతకుముందు ఈ అమ్మడు పలు చిత్రాలలో నటించినా అవేవీ విజయాలను అందించకపోవడంతో చాలా నిరాశ చెందారు. నటన వద్దు, వేషాలు వద్దు అని పైచదువుల కోసం అంటూ ఇంగ్లాండ్‌కు చెక్కేశారు. ఆ తరువాత వచ్చిన కొన్ని అవకాశాలను నిరాకరించారు. అలా వచ్చిన ఒక అవకాశాన్ని మాత్రం వేదిక కాదనలేకపోయారు. అదే బాలా దర్శకత్వంలో నటించిన పరదేశి చిత్రం. బాలా అవకాశం కావడంతో తన మనసు మార్చుకుని మళ్లీ నటించడానికి కోలీవుడ్కొచ్చారు. ఆ చిత్రంలో కొండ ప్రాంత వాసిగా వేదిక నటన అద్భు తం అంటూ ప్రశంసల జల్లు కురిసింది. అయితే అవకాశాలు మాత్రం షరా మామూలే. కొంత గ్యాప్ తరువాత వసంతబాలన్ దర్శకత్వంలో కావ్యతలైవన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రశంసలందుకుంది. అయితే కొత్త అవకాశాలేమీ లేవు. ఈ ముద్దుగుమ్మను మాలీవుడ్ ఆదరిస్తోంది. అక్కడ నటించిన సింగారవేలన్ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో వేదిక యువరాణిగా నటించారు. ప్రస్తుతం కజిన్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ యువరాణి పాత్రేనట. రాణి పాత్రల నటిగా మాలీవుడ్ ముద్ర వేసిందట. అయినా వరుసగా అవకాశాలను అందిస్తున్న మలయాళ చిత్ర పరిశ్రమను మరువలేనంటున్నారు వేదిక.