ఎదురు చూపుల ‘వేదిక’ | vedhika act's in kaaviya thalaivan movie | Sakshi
Sakshi News home page

ఎదురు చూపుల ‘వేదిక’

Published Sat, Dec 13 2014 2:26 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

ఎదురు చూపుల ‘వేదిక’ - Sakshi

ఎదురు చూపుల ‘వేదిక’

అవకాశాల కోసం ఎదురుచూడడం నటి వేదికకు పరిపాటిగా మారింది. అలాగని ఈ బహుభాషా నటి ఖాళీగా ఏమీలేదు. తమిళంలోనే అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఇంతకుముందు ఈ అమ్మడు పలు చిత్రాలలో నటించినా అవేవీ విజయాలను అందించకపోవడంతో చాలా నిరాశ చెందారు. నటన వద్దు, వేషాలు వద్దు అని పైచదువుల కోసం అంటూ ఇంగ్లాండ్‌కు చెక్కేశారు. ఆ తరువాత వచ్చిన కొన్ని అవకాశాలను నిరాకరించారు. అలా వచ్చిన ఒక అవకాశాన్ని మాత్రం వేదిక కాదనలేకపోయారు. అదే బాలా దర్శకత్వంలో నటించిన పరదేశి చిత్రం.

బాలా అవకాశం కావడంతో తన మనసు మార్చుకుని మళ్లీ నటించడానికి కోలీవుడ్‌కొచ్చారు. ఆ చిత్రంలో కొండ ప్రాంత వాసిగా వేదిక నటన అద్భు తం అంటూ ప్రశంసల జల్లు కురిసింది. అయితే అవకాశాలు మాత్రం షరా మామూలే. కొంత గ్యాప్ తరువాత వసంతబాలన్ దర్శకత్వంలో కావ్యతలైవన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రశంసలందుకుంది. అయితే కొత్త అవకాశాలేమీ లేవు.

ఈ ముద్దుగుమ్మను మాలీవుడ్ ఆదరిస్తోంది. అక్కడ నటించిన సింగారవేలన్ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో వేదిక యువరాణిగా నటించారు. ప్రస్తుతం కజిన్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ యువరాణి పాత్రేనట.  రాణి పాత్రల నటిగా మాలీవుడ్ ముద్ర వేసిందట. అయినా వరుసగా అవకాశాలను అందిస్తున్న మలయాళ చిత్ర పరిశ్రమను మరువలేనంటున్నారు వేదిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement