ప్రముఖ నటి హనీ రోజ్ (Honey Rose) పోలీసులను ఆశ్రయించింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఆధారంగా కేరళలోని ఏర్నాకుళం పోలీసులు చర్యలు చేపట్టారు. హనీ రోజ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు.
అసభ్యకరమైన పోస్టులు..
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. ఈ పోస్ట్ కింద తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో ద్వారా వెల్లడించింది. దీనిపై ఇప్పటికే హనీ రోజ్ ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దాదాపు 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..:
ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఆదివారం సాయంత్రం హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని రాసుకొచ్చింది. ఈ కామెంట్స్ గురించిన నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇలాంటి వాటిని మీరు స్వాగతిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారని తెలిపింది. ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను పిలిచాడు. వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది.
హనీకి మద్దతుగా అమ్మ..
నటి హనీరోజ్‌పై సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టులపై చట్టపరమైన చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మలయాళ నటీనటుల సంస్థ(AMMA)అమ్మ తెలిపింది. ఈ విషయంలో హనీ రోజ్ చేస్తున్న న్యాయ పోరాటానికి అమ్మ సహకారం, పూర్తి మద్దతు ఉంటుందని లేఖ విడుదల చేసింది. అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని అమ్మ అడ్ హాక్ కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసింది. హనీ రోజ్‌ను సోషల్ మీడియా ద్వారా పరువు తీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలను అమ్మ సంఘం ఖండించింది.
చులకన వ్యాఖ్యలు
ఒకసారి అతడి షాప్‌కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేశాను.
మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు
అయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్‌కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్‌లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను.
హనీ రోజ్ సినిమాలు..
కాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్‌లో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment