తీపి గుర్తు | Suriya expresses his love and respect for Mammootty and Mohanlal | Sakshi
Sakshi News home page

తీపి గుర్తు

May 10 2018 1:02 AM | Updated on Aug 9 2018 6:44 PM

Suriya expresses his love and respect for Mammootty and Mohanlal - Sakshi

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ స్పెషల్‌ ఇన్విటేషన్‌ మీద కేరళ వెళ్లారు హీరో సూర్య. ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అని ఊహించుకోకండి. ప్రస్తుతానికైతే అదేం కాదు. త్రివేండ్రంలో జరిగిన (అమ్మా) అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (ఏఎమ్‌ఎమ్‌ఏ) 25వ వార్షికోత్సవంలో జాయిన్‌ అయ్యేందుకు వెళ్లారు. ఈ ఫంక్షన్‌ పూర్తి అయిన తర్వాత.. ‘అమ్మా’కి కొత్త ‘అమేజింగ్‌ మూమెంట్స్‌ అండ్‌ మెమొరీస్‌ ఆఫ్‌ యాన్‌ యాక్టర్‌’ అని కొత్త నిర్వచనం ఇచ్చారు సూర్య.

‘‘ఈ ఫంక్షన్‌లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మోహన్‌లాల్, మమ్ముట్టీలతో స్టేజ్‌ షేర్‌ చేసుకోవడాన్ని లైఫ్‌ టైమ్‌ మెమొరీగా ఫీల్‌ అవుతున్నాను. మోహన్‌లాల్‌ సార్‌.. మీ నటనే కాదు మీ జీవితంలోని అంశాలు కూడా నాకు ఇన్స్‌పిరేషనే. మీ గురించి మాట్లాడ్డానికి ఏ భాషలోని పదాలూ సరిపోవు. ఈ వేడుకలో నన్ను భాగం చేసినందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు సూర్య. మలయాళ ఇండస్ట్రీలో రత్నాల్లాంటి సినిమాలు వస్తాయని కూడా సూర్య పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement