సూర్య
మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు బందోబస్త్ ఏర్పాటు చేశారట హీరో సూర్య. కన్‌ఫ్యూజ్ కావొద్దు. ఇదంతా తమిళ సినిమా ‘కాప్పాన్’ గురించే. ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి చిత్రాల తర్వాత సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘కాప్పాన్’. ఈ చిత్రంలో సాయేషా కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాకు తెలుగులో ‘బందోబస్త్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి శుక్రవారం ఈ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. సూర్య, సముద్రఖని ఈ సినిమాలో ఎన్‌ఎస్‌జీ కమాండోలుగా నటించారు. మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటించారని తెలిసింది. బొమన్ ఇరానీ, ఆర్య, నాగినీడు, పూర్ణ తదితరులు నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment