bandhobasth
-
బందోబస్త్‌కు సిద్ధం
దేశాన్ని రక్షించే కమాండోగా సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కప్పాన్’. తెలుగులో ‘బందోబస్త్’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. భారత ప్రధానిగా మోహన్‌లాల్ నటించారు. సయేషా కథానాయిక. ఈ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘సూర్య డిఫరెంట్ గెటప్స్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు. ఇటీవలే తమిళంలో రజనీకాంత్‌గారు ఆడియో రిలీజ్ చేశారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే తెలుగు పాటలను విడుదల చేసి, గ్రాండ్‌గా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జైరాజ్. కెమెరా: ఎం.ఎస్. ప్రభు. -
వెనక్కి తగ్గిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాప్పాన్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సాహో రిలీజ్ అదే రోజంటూ ప్రకటన రావటంతో తప్పని సరి పరిస్థితుల్లో కాప్పాన్ను ఆగస్టు 30కి వాయిదా వేశారు. కానీ తరువాత సాహో కూడా వాయిదా పడింది. దీంతో కాప్పాన్ టీం మరోసారి ఆలోచనలో పడింది. అయితే ముందుగా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రావాలని భావించినా ఇప్పుడు మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. భారీ అంచనాలున్న సాహోతో పోటి పడే కన్నా రిలీజ్ వాయిదా వేస్తేనే బెటర్ అని భావిస్తున్నారట. అందుకే సెప్టెంబర్ 13 లేదా 20 తేదిల్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాప్పాన్ వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా వాయిదా పడటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. మలయాళ నటుడు మోహన్‌లాల్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే రిలీజ్ విషయంలో భారీ పోటి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా తెలుగులో బందోబస్త్ పేరుతో రిలీజ్ కానుంది. -
సూర్యకు నటన రాదనుకున్నా!
‘‘తన సహనటులెవరికీ చెడ్డ పేరు రాకూడదనుకుంటారు శివకుమార్. వాళ్ల అబ్బాయిలు సూర్య, కార్తీని కూడా అలానే పెంచారు. తొలి సినిమా ‘పరుత్తివీరన్ (‘మల్లిగాడు’)లో కార్తీ అద్భుతంగా చేశాడు. సూర్య ఫస్ట్ సినిమా చూసి తనకు నటించడం రాదేమో? అనుకున్నాను. తనని తాను మలచుకొని ఈ స్థాయిలో నిలబడ్డాడు’’ అని రజనీకాంత్ అన్నారు. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాప్పాన్’ (తెలుగులో బందోబస్త్). సయేషా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, ఆర్య, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈరోజు సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు కేవీ ఆనంద్ నా ‘శివాజీ’ సినిమాకు కెమెరామేన్. ఆయనకు కథ మీద మంచి జడ్జిమెంట్ ఉంది. నేను ఆయనతో ఓ సినిమా చేయాలి కానీ ఆగిపోయింది. మోహన్‌లాల్ గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. హ్యారిస్ మ్యూజిక్ బావుంటుంది. ‘నేనే దేవుణ్ణి’ సినిమాలో ఆర్య నటన ఆశ్చర్యం కలిగించింది. తమిళ ఇండస్ట్రీకు దొరికిన వరం నిర్మాత సుభాస్కరన్. ప్రస్తుతం ‘ఇండియన్ 2, దర్బార్, పొన్నియిన్ సెల్వన్’ నిర్మిస్తున్నారు. ‘శివపుత్రుడు, గజిని, సింగం, సింగం 2’ వంటి గొప్ప సినిమాలు చేశారు సూర్య. విద్యా వ్యవస్థపై సూర్య చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ‘అగరం’ సంస్థ ద్వారా ఎందర్నో విద్యావంతుల్ని చేస్తున్నారు సూర్య’’ అన్నారు. ‘‘కేవీ ఆనంద్‌గారు, నేను చేస్తున్న మూడో (వీడొక్కడే, బ్రదర్స్) సినిమా ఇది. అందర్నీ మెప్పించేలా ఈ సినిమా తీశారాయన. సుభాçస్కరన్గారికి థ్యాంక్స్. ఆర్య ముందే సాయేషాతో ప్రేమగా నటించే సీన్స్ చేయడానికి ఇబ్బందిపడ్డాను (నవ్వుతూ). రజనీకాంత్‌గారికి, శంకర్‌గారికి థ్యాంక్స్. ఒకరి దారి రహదారి.. మరొకరేమో తన సినిమాలతో ఇండస్ట్రీను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. నా బలం ఫ్యాన్సే. కుటుంబం తర్వాతే సమాజం గురించి ఆలోచించండి (అభిమానులను ఉద్దేశిస్తూ..)’’ అన్నారు సూర్య. ‘‘ఈ కాప్పాన్కు (రక్షించేవాడు) పైనున్న కాప్పాన్ అండగా నిలుస్తాడనుకుంటున్నాను’’ అన్నారు మోహన్‌లాల్. ‘‘సూర్య రానురాను యువకుడిలా మారిపోతున్నాడు. కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి’’ అన్నారు శంకర్. ‘‘ఈ సినిమాలో మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్ర చేశారు. సూర్యకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. సీన్ అద్భుతంగా రావడానికి ఎంత కష్టమైనా పడతాడు సూర్య’’ అన్నారు ఆనంద్. ‘‘సమాజం మీద బాధ్యత ఉన్న కొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. నటుడిగా ఆల్రెడీ నిరూపించుకున్నారు’’ అన్నారు రచయిత వైరముత్తు. ‘‘6వ తరగతిలో పెయింటింగ్ పోటీలో నా చేతుల మీదగా ఆవార్డ్ తీసుకున్నారు ఆనంద్. సూర్యకు, తనకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది’’ అన్నారు శివకుమార్. -
కమాండో బందోబస్త్
మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు బందోబస్త్ ఏర్పాటు చేశారట హీరో సూర్య. కన్ఫ్యూజ్ కావొద్దు. ఇదంతా తమిళ సినిమా ‘కాప్పాన్’ గురించే. ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి చిత్రాల తర్వాత సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘కాప్పాన్’. ఈ చిత్రంలో సాయేషా కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాకు తెలుగులో ‘బందోబస్త్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి శుక్రవారం ఈ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. సూర్య, సముద్రఖని ఈ సినిమాలో ఎన్ఎస్జీ కమాండోలుగా నటించారు. మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటించారని తెలిసింది. బొమన్ ఇరానీ, ఆర్య, నాగినీడు, పూర్ణ తదితరులు నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాల తరలింపు
నాటకీయ పరిణామాలు అప్పగింత వద్ద ఉద్రిక్తత కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): కాకినాడ రామారావుపేటలో ఈ నెల 2న హత్యకు గురైన బడుగు బాల గంగాధరతిలక్ (బాలా), జగడం రామస్వామిల మృతదేహాలను పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తరలించారు. హత్య జరిగిన గురువారం జంట మృతదేహాలకు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారం అందజేయాలని, ఏ1 ముద్దాయిగా సుబ్బయ్య హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనే డిమాండ్లతో బాధిత కుటుంబాల సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు పోస్ట్‌మార్టం పూర్తయిన మృతదేహాలను మార్చురీ నుంచి తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో నాలుగు రోజులుగా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి, జేసీకి వినతి పత్రం అందించారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ను సంఘం నేతలు కలుసుకుని బాధితులకు న్యాయం చేయాలని , ఏ1 ముద్దాయిగా హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్పీని కలిసిన అనంతరం సోమవారం ఛలో కాకినాడ నిర్వహిస్తున్నామని, ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా ప్రణాళిక రచించారు. ముందుగానే మృతదేహాలను తరలించేందుకు కార్పొరేషన్ నుంచి లెటర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం నుంచి జీజీహెచ్ మార్చురీ వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. సాయంత్రం అయిదు గంటల నుంచి జిల్లాకు చెందిన సుమారు 600 మంది వరకూ ప్రత్యేక పోలీసు బలగాలు, పలు సబ్ డివిజినల్కు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది జీజీహెచ్‌కు చేరుకున్నారు. ఆఖరిసారిగా మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలకు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో 5.45 గంటలకు రెండు అంబులెన్స్‌లో పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ మృతదేహాలను వారి స్వస్థలాలు పెదపూడి మండలం రామేశ్వరం, కాకినాడ రామారావుపేటలోకి పంపిచేశారు. మృతదేహాలను తీసుకునేందుకు బాధిత బంధువులు నిరాకరించారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను ఎలా తీసుకొచ్చి అప్పగిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల వ్యవధి ఇచ్చామని, పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత నాలుగు రోజులు మార్చురీ వద్ద పడిగాపులు కాశామని, ఇక కుదరదని, కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు మృతదేహాలను తరలించినట్టు కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అనంతరం మృతదేహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసులు పాల్గొన్నారు. జంట హత్యల కేసులో పురోగతి పోలీసుల అదుపులో అయిదుగురు నిందితులు ఏ 2 ముద్దాయి కోసం గాలింపు కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): ఈ నెల 2న కాకినాడ రామారావుపేటలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య జరిగిన రోజునే పోలీసులకు లొంగిపోయిన ప్రధాన నిందితుడు జగన్నాథపురానికి చెందిన అడ్లబోయిన అశోక్‌కుమార్, ఆ తర్వాత పోలీసుల విచారణలో మరో అయిదుగురు పేర్లు చెప్పినట్టు çతెలిసింది. ఈ హత్యలో తనతో పాటూ మరో వ్యక్తి పాల్గొన్నట్టు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రెండో నిందితుడు సుబ్బయ్య హోటల్ సమీపాన సతీష్ పేకర్స్, మూవర్స్ అనే పేరుపై వాహనాలను నడుపుతున్నట్టు ప్రధాన నిందితుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. హత్య జరిగిన రోజున కేటరింగ్‌లో వేన్లో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వీరు హత్య జరిగిన తర్వాత అక్కడ నుంచి పరారైనట్టు తెలిసింది. ప్రధాన నిందితుడి వివరాల మేరకు ఇప్పటికే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడు సతీష్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలో రెండో ప్రధాన ముద్దాయిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జంట హత్యల కేసులో లోతుగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారిని విచారిస్తున్నామని విచారణ అధికారి, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.