
సూర్య
ఇండోనేషియాలో ల్యాండయ్యారు హీరో సూర్య. వరుసగా సినిమాలు చేస్తున్నారు కదా! కాస్త విశ్రాంతి తీసుకుందామని టూర్ ప్లాన్ చేశారని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే అంత టైమ్ లేదు సూర్యకు. ఒప్పుకున్న సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇండోనేషియా ఎందుకు వెళ్లారు అంటే.. ‘కాప్పాన్’ సినిమా కోసం. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ కోసం ఇండోనేషియాలోని జావా ద్వీపానికి వెళ్లారు టీమ్.
సాయేషా కథానాయికగా నటిస్తున్న సినిమాలో మోహన్‌లాల్, బొమన్ ఇరానీ, సముద్రఖని, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులో ‘కాప్పాన్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ‘శూరరై పోట్రు’ అనే సినిమాలో, ఆ తర్వాత శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తారు సూర్య. అలాగే సూర్య పూర్తి చేసిన ‘ఎన్‌జీకే’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment