sayesha sehagal
-
టెడ్డీ ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది..
నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టెడ్డీ. ఇది పలు విశేషాలతో కూడి ఉంటుందంటున్నారు దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్. ఈయన ఇంతకు ముందు టిక్ టిక్ టిక్ అనే స్పై చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రాలను రూపొందించడంలో సిద్ధహస్తుడైన ఈయన తాజా చిత్రం టెడ్డీలోనూ గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందట. ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషాసైగల్ నటిస్తున్న చిత్రం ఇది. దీన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆర్య వెనుక టెడ్డీబేర్ నిలబడి తొంగి చూస్తున్న ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టెడ్డీ చిత్రం కథేంటి? టెడ్డీబేర్ పాత్ర విశేషాలు ఏమిటి? గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఎంత? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ! ఆ సందేహాలను చిత్ర దర్శకుడిని అడిగి తెలుసుకుందాం! ప్ర: ఈ చిత్రానికి టెడ్డీ అని పేరు నిర్ణయించడానికి కారణం? జ: చిత్రంలో ఆర్యకు టెడ్డీబేర్‌కు చాలా సంబంధం ఉంటుంది. అయితే ఈ చిత్రానికి చాలా పేర్లను పరిశీలించాం. చివరికి అందరికీ పరిచయం అయిన టెడ్డీ పేరునే చిత్రానికి ఖరారు చేశాం. టెడ్డీ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తేనే టైటిల్ ప్రాముఖ్యత మీకు అర్థం అయ్యి ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకూ ఎలా టెడ్డీబేర్‌ను ముద్దులాడతారో అలా ఈ టెడ్డీ చిత్రాన్ని చూసి అలరిస్తారు. అలా చిత్రాన్ని తయారు చేయడానికి శ్రమిస్తున్నాం. ప్ర: ఇంతకు ముందు బ్యాంకు దోపిడీ. జోంబి, అంతరిక్షం నేపథ్యాల్లో చిత్రాలను తెరకెక్కించారు. మరి ఈ టెడ్డీ ఏ జానర్లో ఉంటుంది? జ: దీన్ని ఒక్క మాటలో పలానా జానర్ చిత్రం అని చెప్పడం కుదరదు. చిత్రంలో హీరోతో పాటు కంప్యూటర్‌కు సంబంధించిన పాత్ర ఉంటుంది. దాన్ని రూపాన్ని గ్రాఫిక్స్‌లో మాత్రమే ఆవిష్కరించాల్సి ఉంటుంది. అదే టెడ్డీబేర్ పాత్ర. ఇదే చిత్రంలో ప్రత్యేకం. చిత్రంలో సెకెండ్ పాత్ర ఇదే. టెడ్డీబేర్‌ను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో సహజత్వానికి అద్దం పట్టేలా రూపొందిస్తున్నాం. ఈ టెడ్డీబేర్ ఫైట్స్ కూడా చేస్తుంది. అదే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్ర: వివాహానంతరం ఆర్య, సాయేషాలను హీరోహీరోయిన్లుగా నటింపజేయాలన్న ఆలోచన గురించి? జ: నిజం చెప్పాలంటే వారిద్దరినీ హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి భయపడ్డాను. అయితే కథ విన్న వారం రోజుల్లోనే పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటి సాయేషా నటించడానికి అంగీకరించారు. ప్ర: అజర్బైజాన్ దేశంలో షూటింగ్ చేయడానికి కారణం? జ:అది చాలా పురాతన దేశం. ఇప్పుడు అదే రష్యా. అప్పట్లో భారతీయ చిత్రాలను అక్కడి ప్రజలు ఎక్కువగా చూసేవారు. నటి సాయేషా ప్రఖ్యాత నటుడు దిలీప్‌కుమార్ మనవరాలు అని తెలవగానే అక్కడి ప్రజలు సంతోషంగా దిలీప్‌కుమార్ అంటూ పెద్దగా కేకలు పెట్టారు. ఒక బామ్మ నటుడు ఆర్యను పట్టుకుని అటూ ఇటూ ఊపేసింది. ఎందుకమ్మా? అని అంటే మదరాసు పట్టణం చిత్ర సీడీ చూపించి ఇందులో నటించింది నువ్వేగా అని అడిగింది. అంతగా ఇండియన్ చిత్రాలను ఇప్పటికీ య్యూట్యూబుల్లో అక్కడి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్ర: చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌రాజా గురించి? జ: టిక్ టిక్ టిక్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్‌రాజాను కలిశాను. బడ్జెట్, ఎన్ని రోజులు షూటింగ్ వంటివి ఏమీ అడగకుండా చిత్రం చేద్దాం అని చెప్పారు. ఇప్పటికీ ఇంత బడ్జెట్ అని నిర్ణయించలేదు. చిత్రానికి అవసరం అయిన వన్నీ సమకూర్చుతున్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన నిర్మాణ సంస్థలో చాలా మైలురాయి చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఈ టెడ్డీ చిత్రం కూడా చేరుతుందని చెప్పగలను -
‘కాప్పాన్’తో సూర్య అభిమానులు ఖుషీ
చాలా కాలం తరువాత నటుడు సూర్య అభిమానుల్లో ఆనందం తాండవిస్తోంది. కారణం సూర్య నటించిన తాజా చిత్రం కాప్పాన్. సూర్యకు జంటగా నటి సాయేషా సైగల్ నటించిన ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఆర్య ప్రదాన పాత్రలను పోషించారు. కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. శుక్రవారం భారీ అంచనాల మధ్య తెరపైకి వచ్చిన కాప్పాన్ చిత్రం సూర్య అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పలు ఆసక్తికరమైన మలుపులతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడిగా ఈయన కాప్పాన్ చిత్రంలోనూ తనదైన దర్శకత్వ శైలిని ప్రదర్శించారు. సినిమాలో దర్శకుడు చాలా విషయాలను చెప్పారు. దేశ భద్రత, దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రిగా మోహన్‌లాల్ పడే తపన, అందు కోసం చేసే కృషి, పాకిస్థాన్ ఉగ్రవాదుల దురాగతాలు, స్వదేశంలోని కార్పొరేట్ల స్వార్థం, కొందరు మంత్రుల అక్రమ రాజకీయాలు, బయోవార్, రైతుల సంరక్షణ, ప్రేమ వంటి అంశాలను టచ్ చేశారు. బడా కార్పొరేట్ శక్తులు తన స్వార్థం కోసం రైతుల కడుపు కొట్టాలని ప్రయత్నిస్తారు. అందుకు ప్రధాని అంగీకరించకపోవడంతో ఆయన్నే మట్టు పెట్టే ప్రయత్నానికి పాల్పడతారు. దాన్ని ప్రధాని సెక్యూరిటీ సూర్య ఎలా ఎదుర్కొన్నాడు..? రైతుల భూములను ఎలా కాపాడాడు? లాంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కాప్పాన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. సూర్య తనదైన శైలిలో ఆకట్టకున్నారు. మోహన్‌లాల్ ప్రధానమంత్రిగా హుందాగా నటించారు. కథానాయకిగా నటి సాయేషా సైగల్ తన పరిధిలో నటించింది. ఆర్య తనదైన హాస్యధోరణిలో కథలో కీలకంగా నిలిచారు. చిత్రానికి ఛాయాగ్రహణ హైలైట్. హరీస్ జయరాజ్ నేపథ్య సంగీతం బాగా కలిసివచ్చింది. -
బందోబస్త్ రెడీ
‘గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘బందోబస్త్’. సాయేషా సైగల్ కథానాయికగా నటించారు. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమాని నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 13న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ‘ఎన్నో తారల సంగమం... అంబరం ఒకటే...’ అంటూ సాగే దేశభక్తి గీతానికి, ‘చెరుకు ముక్కలాంటి...’ అనే మాస్ పాటకు మంచి స్పందన వచ్చింది. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ ప్రధాని పాత్రలో మోహన్‌లాల్ చెప్పిన డైలాగ్స్, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి’’ అన్నారు. ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హ్యారీస్ జైరాజ్. -
బందోబస్త్‌కు సిద్ధం
దేశాన్ని రక్షించే కమాండోగా సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కప్పాన్’. తెలుగులో ‘బందోబస్త్’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. భారత ప్రధానిగా మోహన్‌లాల్ నటించారు. సయేషా కథానాయిక. ఈ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘సూర్య డిఫరెంట్ గెటప్స్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు. ఇటీవలే తమిళంలో రజనీకాంత్‌గారు ఆడియో రిలీజ్ చేశారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే తెలుగు పాటలను విడుదల చేసి, గ్రాండ్‌గా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జైరాజ్. కెమెరా: ఎం.ఎస్. ప్రభు. -
సూర్యకు నటన రాదనుకున్నా!
‘‘తన సహనటులెవరికీ చెడ్డ పేరు రాకూడదనుకుంటారు శివకుమార్. వాళ్ల అబ్బాయిలు సూర్య, కార్తీని కూడా అలానే పెంచారు. తొలి సినిమా ‘పరుత్తివీరన్ (‘మల్లిగాడు’)లో కార్తీ అద్భుతంగా చేశాడు. సూర్య ఫస్ట్ సినిమా చూసి తనకు నటించడం రాదేమో? అనుకున్నాను. తనని తాను మలచుకొని ఈ స్థాయిలో నిలబడ్డాడు’’ అని రజనీకాంత్ అన్నారు. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాప్పాన్’ (తెలుగులో బందోబస్త్). సయేషా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, ఆర్య, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈరోజు సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు కేవీ ఆనంద్ నా ‘శివాజీ’ సినిమాకు కెమెరామేన్. ఆయనకు కథ మీద మంచి జడ్జిమెంట్ ఉంది. నేను ఆయనతో ఓ సినిమా చేయాలి కానీ ఆగిపోయింది. మోహన్‌లాల్ గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. హ్యారిస్ మ్యూజిక్ బావుంటుంది. ‘నేనే దేవుణ్ణి’ సినిమాలో ఆర్య నటన ఆశ్చర్యం కలిగించింది. తమిళ ఇండస్ట్రీకు దొరికిన వరం నిర్మాత సుభాస్కరన్. ప్రస్తుతం ‘ఇండియన్ 2, దర్బార్, పొన్నియిన్ సెల్వన్’ నిర్మిస్తున్నారు. ‘శివపుత్రుడు, గజిని, సింగం, సింగం 2’ వంటి గొప్ప సినిమాలు చేశారు సూర్య. విద్యా వ్యవస్థపై సూర్య చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ‘అగరం’ సంస్థ ద్వారా ఎందర్నో విద్యావంతుల్ని చేస్తున్నారు సూర్య’’ అన్నారు. ‘‘కేవీ ఆనంద్‌గారు, నేను చేస్తున్న మూడో (వీడొక్కడే, బ్రదర్స్) సినిమా ఇది. అందర్నీ మెప్పించేలా ఈ సినిమా తీశారాయన. సుభాçస్కరన్గారికి థ్యాంక్స్. ఆర్య ముందే సాయేషాతో ప్రేమగా నటించే సీన్స్ చేయడానికి ఇబ్బందిపడ్డాను (నవ్వుతూ). రజనీకాంత్‌గారికి, శంకర్‌గారికి థ్యాంక్స్. ఒకరి దారి రహదారి.. మరొకరేమో తన సినిమాలతో ఇండస్ట్రీను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. నా బలం ఫ్యాన్సే. కుటుంబం తర్వాతే సమాజం గురించి ఆలోచించండి (అభిమానులను ఉద్దేశిస్తూ..)’’ అన్నారు సూర్య. ‘‘ఈ కాప్పాన్కు (రక్షించేవాడు) పైనున్న కాప్పాన్ అండగా నిలుస్తాడనుకుంటున్నాను’’ అన్నారు మోహన్‌లాల్. ‘‘సూర్య రానురాను యువకుడిలా మారిపోతున్నాడు. కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి’’ అన్నారు శంకర్. ‘‘ఈ సినిమాలో మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్ర చేశారు. సూర్యకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. సీన్ అద్భుతంగా రావడానికి ఎంత కష్టమైనా పడతాడు సూర్య’’ అన్నారు ఆనంద్. ‘‘సమాజం మీద బాధ్యత ఉన్న కొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. నటుడిగా ఆల్రెడీ నిరూపించుకున్నారు’’ అన్నారు రచయిత వైరముత్తు. ‘‘6వ తరగతిలో పెయింటింగ్ పోటీలో నా చేతుల మీదగా ఆవార్డ్ తీసుకున్నారు ఆనంద్. సూర్యకు, తనకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది’’ అన్నారు శివకుమార్. -
కమాండో బందోబస్త్
మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు బందోబస్త్ ఏర్పాటు చేశారట హీరో సూర్య. కన్ఫ్యూజ్ కావొద్దు. ఇదంతా తమిళ సినిమా ‘కాప్పాన్’ గురించే. ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి చిత్రాల తర్వాత సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘కాప్పాన్’. ఈ చిత్రంలో సాయేషా కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాకు తెలుగులో ‘బందోబస్త్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి శుక్రవారం ఈ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. సూర్య, సముద్రఖని ఈ సినిమాలో ఎన్ఎస్జీ కమాండోలుగా నటించారు. మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటించారని తెలిసింది. బొమన్ ఇరానీ, ఆర్య, నాగినీడు, పూర్ణ తదితరులు నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
ఫారిన్లో పాట
ఇండోనేషియాలో ల్యాండయ్యారు హీరో సూర్య. వరుసగా సినిమాలు చేస్తున్నారు కదా! కాస్త విశ్రాంతి తీసుకుందామని టూర్ ప్లాన్ చేశారని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే అంత టైమ్ లేదు సూర్యకు. ఒప్పుకున్న సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇండోనేషియా ఎందుకు వెళ్లారు అంటే.. ‘కాప్పాన్’ సినిమా కోసం. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ కోసం ఇండోనేషియాలోని జావా ద్వీపానికి వెళ్లారు టీమ్. సాయేషా కథానాయికగా నటిస్తున్న సినిమాలో మోహన్‌లాల్, బొమన్ ఇరానీ, సముద్రఖని, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులో ‘కాప్పాన్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ‘శూరరై పోట్రు’ అనే సినిమాలో, ఆ తర్వాత శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తారు సూర్య. అలాగే సూర్య పూర్తి చేసిన ‘ఎన్జీకే’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. -
హ్యాపీ హనీమూన్
జీవితపు ఆనందక్షణాలను ఫొటోలలో దాచుకుంటున్నారు కోలీవుడ్ కొత్త దంపతులు ఆర్య, సాయేషా. ఈ నెల 10న ఈ ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట విదేశాల్లో హనీమూన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సాయేషా. ‘‘సూర్యకాంతి సమక్షంలో మా ప్రేమను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాం. ఇక్కడున్న ఫొటోలను నా భర్త (ఆర్య) తీశారు. హనీమూన్ జ్ఞాపకాలను మనసులోనే కాదు.. ఫొటోల్లోనూ దాచుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సాయేషా. ఇక సినిమాల విషయానికి వస్తే... పెళ్లికిముందు గజనీకాంత్, ‘కాప్పాన్’ సినిమాలో నటించారు సాయేషా, ఆర్య. ‘కాప్పాన్’ చిత్రంలో సూర్య హీరోగా నటించారు. పెళ్లి తర్వాత ఆర్య, సాయేషా జంటగా ‘టెడ్డీ’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు శక్తిసుందర్ రాజన్ దర్శకత్వం వహిస్తారు. -
టెడ్డీలో జోడీ
కోలీవుడ్ న్యూ కఫుల్ ఎవరంటే ఎవరైనా సరే ఆర్య, సాయేషా అని చెబుతారు. ‘గజనీకాంత్’ చిత్రం షూటింగ్ టైమ్‌లో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ‘కాప్పాన్’ సినిమాలో కలసి నటిస్తున్న సమయంలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఈ జంట ‘టెడ్డీ’ అనే కొత్త సినిమాలో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. శక్తి సౌందరరాజన్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించనున్న చిత్రం ‘టెడ్డీ’. ఈ సినిమాను ఆర్య, సాయేషా వివాహం రోజే (మార్చి 10)అనౌన్స్ చేయడం విశేషం. మే నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. చిన్నపిల్లలు, యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఈ చిత్రం చెన్నై, యూరప్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. -
ఒక్కటవుతున్నాం
శుభవార్తను పంచుకోవడానికి వేలంటైన్స్ డేను సందర్భంగా చేసుకున్నారు తమిళ నటుడు ఆర్య, నటి సాయేషా. ఈ జంట ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. ఆర్య, సాయేషా మాత్రం ఆ వార్తకు ‘ఊ’ అనలేదు ‘ఊహూ’ అని కూడా అనలేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘మేం ఒక్కటవుతున్నాం’ అని ప్రకటించారు. ‘‘మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మేం పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మార్చిలో పెళ్లి. మా సరికొత్త ప్రయాణంలో మీ ప్రేమ, అభిమానంతోపాటు ఆశీర్వాదాలను కూడా కోరుకుంటున్నాం’’ అని ఓ లేఖలో ఆర్య, సాయేషా పేర్కొన్నారు. మార్చి మొదటివారంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. ‘‘ఆర్యను మా ఇంటి అల్లుడిగా స్వాగతించడానికి ఆనందిస్తున్నాం’’ అని సాయేషా తల్లి షహీన్ అహ్మద్ పేర్కొన్నారు. ‘అఖిల్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సాయేషా ప్రస్తుతం తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ∙ఆర్య, సాయేషా -
చలిలో..!
రాత్రివేళ మైనస్ 7 డిగ్రీల చలిలో సూర్య ఓ ఆపరేషన్ చేస్తున్నారట. ఈ ఆపరేషన్ వెనక స్టోరీని మాత్రం వెండితెరపై చూడాల్సిందే. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పాన్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాయేషా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బొమన్ ఇరానీ, మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చంఢీఘర్‌లో జరుగుతోంది. ‘‘మైనస్ 7 డిగ్రీల చలిలో రాత్రివేళ ‘కాప్పాన్’ సినిమా షూటింగ్ జరుపుతున్నాం’’ అని దర్శకుడు కేవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇందులో సూర్య ఎన్ఎస్జీ కమాండో పాత్రలో నటిస్తున్నారు. మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సింగమ్’ సిరీస్‌తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న సూర్య–హరి మరో సినిమా చేయనున్నారట. ఈ సినిమాకు ‘యానై’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. యానై అంటే తెలుగులో ఏనుగు అని అర్థం. అలాగే ఇటీవల ‘ఎన్జీకే’ సినిమా షూట్‌ను కంప్లీట్ చేశారు సూర్య. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ సమ్మర్లో విడుదల కానుందని సమాచారం. -
సూర్యతో ఆర్య
తమిళ హీరో ఆర్య లండన్ వెళ్లారు. అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తీసిన తన ఫొటోను ఆర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సూర్య సినిమా కోసం బొమన్ ఇరానీ లండన్ వెళ్లారట. సో.. సూర్య సినిమాలో ఆర్య ఓ రోల్ చేయబోతున్నారనే ఉహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి. తన సినిమాలో ఆర్య ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు దర్శకుడు కేవీ ఆనంద్ ప్రకటించారు. ‘‘జామీ (ఆర్య) షూట్లో జాయిన్ అయ్యాడు’’ అని పేర్కొన్నారు కేవీ ఆనంద్. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. మోహన్‌లాల్, అల్లుశిరీష్, బొమన్ ఇరానీ, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు హారీష్ జైరాజ్ స్వరాలు అందిస్తున్నారు. -
కలలు కనాలి.. సాధించుకోవాలి
‘‘సింగం 3’ సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ వచ్చాను. అప్పుడు మీరు (ప్రేక్షకులు) చూపించిన ప్రేమ మర్చిపోలేను. రైతుల జీవితాల నేపథ్యంలో ‘చినబాబు’ సినిమాను నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. తమ్ముడితో సినిమా నిర్మించాలనే కల నిజం అయింది. అందరూ కలలు కనాలి. వాటిని సాధించాలి. పాజిటివ్‌గా ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. నాకంటే నా తమ్ముడు కార్తీ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నా. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్యాషన్‌తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ‘చినబాబు’ అందరికీ నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు సూర్య. కార్తీ, సాయేషా జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చినబాబు’. హీరో సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. శనివారం వైజాగ్‌లో ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జరిగింది. డి. ఇమాన్ స్వరకర్త. ఈ వేడుకలో కార్తీ మాట్లాడుతూ – ‘‘నన్ను, అన్నయ్యను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. రైతును మర్చిపోతున్న సమయంలో రైతును గుర్తు చేసుకొనే విధంగా సినిమా చెయ్యడం గర్వంగా ఉంది. అన్నయ్యకి ఈ సినిమా చాలా నచ్చింది. వచ్చే నెల ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం. అందరూ కలిసి ఉండాలని చెప్పే సినిమా ఇది. ఈ సినిమా చూశాక మీరు మీ అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతారు’’ అన్నారు. ‘‘1986లో నేను హీరోగా చేసిన ఓ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం వైజాగ్‌లో జరిగింది. ఇప్పుడు నేను నటించిన సినిమా ఆడియో వేడుక వైజాగ్‌లో జరగడం సంతోషంగా ఉంది. సూర్య, కార్తీ మంచి నటులు. ఈ సినిమాతో సూర్య సక్సెస్ఫుల్ నిర్మాత కాబోతున్నారు. డైరెక్టర్ పాండిరాజ్ ఈ సినిమాలో అందరికీ మంచి పాత్రలు ఇచ్చారు’’ అని సత్యరాజ్ అన్నారు.‘‘సూర్య, కార్తీ కథ ఓకే చేయడంతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయిందనిపించింది. మంచి యాక్షన్, చక్కని లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని పాండిరాజ్ చెప్పారు. ‘‘‘చినబాబు సినిమా టీజర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పా¯Œ ్స లభించింది’’ అన్నారు రచయిత శశాంక్ వెన్నెలకంటి. మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘వ్యవసాయం చెయ్యాలని చెప్పిన తండ్రి కోసం రైతుగా మారి, విజయం సాధించే కొడుకు కథ ఇది. రైతు పాత్రలో కార్తీ నటన అద్భుతం. పాండిరాజ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను’’ అని భానుప్రియ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: సి.హెచ్. సాయికుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్. -
ఫోర్ గెటప్స్‌లో...
ఊహలకు, వదంతులకు ఫుల్స్టాప్ పెట్టారు సూర్య అండ్ టీమ్. సినిమాలో నిజంగా ఎవరు నటించబోతున్నారన్న విషయాన్ని వెల్లడించారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ముందు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. ఫైనల్లీ సాయేషాని తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే మోహన్‌లాల్, అల్లు శిరీష్ నటించనున్న ఈ సినిమాలో తాజాగా సముద్రఖని, బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ యూనిట్లో యాడ్ అయినట్లు కేవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 15ఏళ్ల తర్వాత ఈ సినిమాతో బొమన్ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘నా నెక్ట్స్ సినిమాలో డైనమిక్ యాక్టర్ సూర్య సరసన నటించబోతున్నానని చెప్పడానికి ఆనందంగా ఉంది. బ్రిలియంట్ డైరెక్టర్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో మోహన్‌లాల్, శిరీష్‌లతో నటించబోతున్నందకు ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు సాయేషా. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న లండన్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. అక్కడే ఓ పబ్ సాంగ్‌ను కూడా తీస్తారట. ఈ సినిమాలో సూర్య ఫోర్ గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్. -
కార్తీ ‘చినబాబు’ టీజర్ విడుదల
-
పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే
ఆవారా, నా పేరు శివ, ఊపిరి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరయ్యారు కార్తీ. గతేడాది ఖాకీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కార్తీ ‘చినబాబు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా రైతు నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్లో రైతు గురించి చెప్పిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే, నువు రైతువైతే కాలరేగురేసుకుని తిరుగంతే.. లాంటి డైలాగ్‌లతో టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో కార్తీకి జోడిగా సాయేషా సైగల్ నటిస్తోంది. ఈ చిత్రం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందగా, 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తీ అన్నయ్య, హీరో సూర్య నిర్మించారు. -
చుట్టేసెయ్ చుట్టేసెయ్
‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి హిట్స్ తర్వాత హీరో సూర్య, దర్శకుడు కేవీ ఆనంద్‌ల హ్యాట్రిక్ కాంబినేషన్ సెట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అల్లు శిరీష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాలో సాయేషా సైగల్ కథానాయిక. కేవలం యాక్టర్స్ ఎంపిక విషయంలోనే కాదు.. షూటింగ్ లొకేషన్స్‌లో కూడా కాంప్రమైజ్ కాదలుచుకోవడంలేదు చిత్రబృందం. చుట్టేసెయ్.. చుట్టేసెయ్... అంటూ దేశాలు చుట్టనున్నారట. ఈ సినిమాను పది వివిధ దేశాల్లో షూట్ చేయనున్నారని సమాచారం. న్యూయార్క్, ఇంగ్లాండ్, బ్రెజిల్ వంటి పలు దేశాల్లోని సుందర ప్రదేశాల్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. జూన్ 23న లండన్‌లో స్టార్ట్ కానున్న ఈ చిత్రం షూటింగ్‌ను డిసెంబర్‌కు కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. సూర్య కెరీర్ -
బంపర్ చాన్స్
ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే హీరో సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో క్రేజ్ మొదలైంది. ఇందుకు నటీనటుల ఎంపిక ఒక కారణం. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందనున్న ఈ సినిమాలో ఆల్రెడీ మోహన్‌లాల్, అల్లు శిరీష్ కీలక పాత్రలు చేయనున్నారు. తాజాగా ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ సాయేషా సైగల్ కథానాయికగా నటించనున్నారని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే సాయేషా బంపర్ చాన్స్ కొట్టేసినట్లే. మరి.. స్టార్ హీరో సూర్య సరసన అంటే బంపర్ చాన్సే కదా. మూడేళ్ల క్రితం నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ చిత్రంలో ఈ బ్యూటీనే హీరోయిన్. ఆ తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేయలేదు కానీ కోలీవుడ్‌లో మాత్రం జోరుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ‘జుంగా’, కార్తీ హీరోగా నటించిన ‘కడైకుట్టి సింగమ్’, ఆర్య లీడ్ రోల్ చేస్తున్న ‘గజనీకాంత్’ సినిమాలతో బిజీగా ఉన్నారీ బ్యూటీ. కార్తీ నటించిన ‘కుడైకుట్టి సింగమ్’, తెలుగులో ‘చినబాబు’ పేరుతో రిలీజ్ కానుంది. -
గన్ను వదిలి.. నారు పట్టాడు
ఖాకీ వేసుకొని దొంగల్ని ఏరిపారేసిన కార్తీ పంచె కట్టుకొని కలుపు మొక్కల్ని ఏరిపారేస్తున్నారు. తుపాకీ పట్టుకొని గూండాల శరీరాన్ని తూట్లు పొడిచేసిన కార్తీ ఇప్పుడు నారు మాగాణిలో నాట్లు వేస్తున్నారు. ఏం చెబుతున్నామో అర్థం కావడం లేదా? కార్తీ నటించిన లాస్ట్ సినిమా ‘ధీరన్ అధిగారం ఒండ్రు’ తెలుగులో ‘ఖాకీ’ సినిమా పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. అందులో ఆయన పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కార్తీ నటిస్తున్న కొత్త సినిమా ‘కడైకుట్టి సింగం’ తెలుగులో ‘చిన్నబాబు’గా రిలీజ్ కానుంది. ఇందులో ఆయన ఓ పల్లెటూరి రైతు పాత్రలో కనిపిస్తారు. కార్తీ సోదరుడు సూర్య తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ పై ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సయేషా కథానాయిక. డి.ఇమ్మాన్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదల కానుంది. -
ప్యారిస్‌లో డాన్ లవ్
సెంటిమెంట్స్ లేని సెటిల్మెంట్స్ చేస్తూ సూట్‌కేసులు అందుకుంటూ దాదాగిరి చేసుకునే డాన్ అతను. మూడు గన్స్, ఆరు సూట్కేసుల్లా అతని లైఫ్ సాగుతుంది. కానీ సడన్‌గా గన్ పక్కన పెట్టి గులాబీ పట్టుకున్నాడు. ఎందుకలా అంటే.. డాన్ మనసులో ప్రేమ చిగురించింది. అది ఎంత స్ట్రాంగ్ అంటే.. ఆ అమ్మాయి కోసం ఏకంగా ఇండియా నుంచి ప్యారిస్ వెళ్లాడు. నెక్ట్స్ ఏమైంది అంటే.. ‘చెప్పమండి.. ఎలాగూ థియేటర్స్‌కి వస్తాంగా. చూసి, మా జుంగ లవ్ ఎలా ఉందో చెప్పండి’’ అంటున్నారు చిత్రబృందం. ‘కాష్మోరా’ ఫేమ్ గోకుల్ దర్శకత్వంలో ‘పిజ్జా’ ఫేమ్ విజయ్ సేతుపతి, సాయేషా, నేహా శర్మ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘జుంగ’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. టైటిల్ టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
జూంగా సేలౌట్!
తమిళసినిమా: జూంగా చిత్రం సేలౌట్ అయిపోయిందట. ఏమిటీ చిత్రం వ్యాపారం పూర్తి అయితే ఒక వార్తా అని అనుకుంటున్నారా? ఇవాళ ఎంత పెద్ద హీరో నటించిన చిత్రమైనా క్రయ విక్రయాలు అంత సులభం కాని పరిస్థితి నెలకొందన్నది వాస్తవం. ఇక వ్యాపారం కాక విడుదలకు నోచుకోని చిత్రాల సంఖ్య చాలానే ఉన్నాయి.అలాంటిది చిత్రం సెట్‌పైకి వెళ్లకుండానే సేలౌట్ అయ్యిందంటే కచ్చితంగా వార్తే అవుతుంది. ఇక జూంగా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని నటుడు విజయ్‌సేతుపతి సొంతంగా నిర్మి స్తూ, కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో సాయేషాసైగల్ నాయకిగా నటించనుంది. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ జూంగా చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహించనున్నారు. చిత్ర షూటింగ్ ఈ నెలాఖరున ప్రారం భం కానుంది. ఇలాంటి పరిస్థితిలో జూంగా చిత్రాన్ని తొలి కాపీ ప్రాతిప్రదికన ఏ అండ్ బీ సంస్థ కొనుగోలు చేసిందట. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు వెల్లడిస్తూ, విక్రమ్‌వేదా చిత్రం విజయంతో విజయ్‌సేతుపతి మార్కెట్ వ్యాల్యూ పెరిగిందనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోందన్నారు. ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్రం తరువాత విజయ్‌సేతుపతి, గోకుల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడం కూడా జూంగా చిత్రంపై అంచనాలు పేరగడానికి ఒక కారణం అంటున్నారు. విజయ్‌సేతుపతి నటించిన తాజా చిత్రం కరుప్పన్ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదల కానుందన్నది గమనార్హం. -
అఖిల్ ఆడియోకు రికార్డ్ రేటు
అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా రిలీజ్‌కు ముందు నుంచే సంచలనాలను నమోదు చేస్తుంది. గతంలో ఏ హీరో తొలి సినిమాకు లేని విధంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా అదే స్ధాయిలో 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. స్టార్ మేకర్ వినాయక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఈ హైప్ అఖిల్ సినిమా బిజినెస్ మీద కూడా బాగానే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సినిమా బిజిసెన్ కూడా పూర్తవ్వటంతో నిర్మాతలు చాలా హ్యాపిగా ఉన్నారు. దీనికి తోడు తాజాగా ఆడియో రిలీజ్ హక్కుల విషయంలోనూ అదే జోరు చూపించాడు అఖిల్.. గతంలో అత్యంత భారీ వ్యయానికి ఆడియో రిలీజ్ హక్కులను అమ్మిన రికార్డ్ ఇండియాస్ బిగెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి పేరిట ఉంది. బాహుబలి తరువాత స్థానంలో నిలిచాడు అఖిల్. దీంతో తొలి సినిమాతోనే ఈ ఘనత సాదించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. యంగ్ హీరో నితిన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సయేషా సెహగల్ అఖిల్ సరసన హీరోయిన్ గానటిస్తుంది. తమన్‌తో పాటు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20 రిలీజ్ కానుంది.