కలలు కనాలి.. సాధించుకోవాలి | Surya Emotional Speech @Chinna Babu Audio Launch | Sakshi
Sakshi News home page

కలలు కనాలి.. సాధించుకోవాలి

Published Sun, Jun 24 2018 1:26 AM | Last Updated on Sun, Jun 24 2018 6:25 AM

Surya Emotional Speech @Chinna Babu Audio Launch - Sakshi

భానుప్రియ, సత్యరాజ్, పరోటా సూరి, పాండిరాజ్, మిర్యాల రవీందర్‌ రెడ్డి, కార్తీ, సూర్య

‘‘సింగం 3’ సినిమా షూటింగ్‌ సమయంలో వైజాగ్‌ వచ్చాను.  అప్పుడు మీరు (ప్రేక్షకులు) చూపించిన ప్రేమ మర్చిపోలేను. రైతుల జీవితాల నేపథ్యంలో ‘చినబాబు’ సినిమాను నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. తమ్ముడితో సినిమా నిర్మించాలనే కల నిజం అయింది. అందరూ కలలు కనాలి. వాటిని సాధించాలి. పాజిటివ్‌గా ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. నాకంటే నా తమ్ముడు కార్తీ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నా.

నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ఎంతో ప్యాషన్‌తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.  ‘చినబాబు’ అందరికీ నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’’ అన్నారు సూర్య. కార్తీ, సాయేషా జంటగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చినబాబు’. హీరో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత మిర్యాల  రవీందర్‌ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. శనివారం వైజాగ్‌లో ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జరిగింది. డి. ఇమాన్‌ స్వరకర్త.

ఈ వేడుకలో కార్తీ మాట్లాడుతూ – ‘‘నన్ను, అన్నయ్యను సపోర్ట్‌ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. రైతును మర్చిపోతున్న సమయంలో రైతును గుర్తు చేసుకొనే విధంగా సినిమా చెయ్యడం గర్వంగా ఉంది. అన్నయ్యకి ఈ సినిమా చాలా నచ్చింది. వచ్చే నెల ఈ సినిమాని రిలీజ్‌ చేయబోతున్నాం. అందరూ కలిసి ఉండాలని చెప్పే సినిమా ఇది. ఈ సినిమా చూశాక మీరు మీ అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లికి ఫోన్‌ చేసి మాట్లాడుతారు’’ అన్నారు.

‘‘1986లో నేను హీరోగా చేసిన ఓ సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం వైజాగ్‌లో జరిగింది. ఇప్పుడు నేను నటించిన సినిమా ఆడియో వేడుక వైజాగ్‌లో జరగడం సంతోషంగా ఉంది. సూర్య, కార్తీ మంచి నటులు. ఈ సినిమాతో సూర్య సక్సెస్‌ఫుల్‌ నిర్మాత కాబోతున్నారు. డైరెక్టర్‌ పాండిరాజ్‌ ఈ సినిమాలో అందరికీ మంచి పాత్రలు ఇచ్చారు’’ అని సత్యరాజ్‌ అన్నారు.‘‘సూర్య, కార్తీ కథ ఓకే చేయడంతోనే ఈ సినిమా సగం సక్సెస్‌ అయిందనిపించింది. మంచి యాక్షన్, చక్కని లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని పాండిరాజ్‌ చెప్పారు.

‘‘‘చినబాబు సినిమా టీజర్‌కు, సాంగ్స్‌కు  మంచి రెస్పా¯Œ ్స లభించింది’’ అన్నారు రచయిత శశాంక్‌ వెన్నెలకంటి. మిర్యాల రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘‘వ్యవసాయం చెయ్యాలని చెప్పిన తండ్రి కోసం రైతుగా మారి, విజయం సాధించే కొడుకు కథ ఇది. రైతు పాత్రలో కార్తీ నటన అద్భుతం. పాండిరాజ్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను’’ అని భానుప్రియ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: సి.హెచ్‌. సాయికుమార్‌ రెడ్డి, రాజశేఖర్‌ కర్పూర, సుందర పాండియాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement