
కార్తీ, సాయేషా
కార్తీ కథానాయకుడిగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కడైకుట్టీ సింగమ్’. సాయేషా, ప్రియా భవాని శంకర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి తెలుగులో ‘చినబాబు’ అనే పేరు ఖరారు చేశారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకాలపై హీరో సూర్య, మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల 13న రిలీజ్ కానుంది.
‘‘ఈ నెల 23న జరగనున్న ‘చినబాబు’ ఆడియో ఫంక్షన్‌కు సూర్య కూడా హాజరు కానున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘చినబాబు’ టీజర్‌కు, ఫస్ట్ సాంగ్ (చినదాని..)కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రైతు పాత్రలో కార్తీ నటించారు. సినిమాలో రైతు సమస్యలను చర్చించాం. డి. ఇమ్మాన్ మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యరాజ్, భానుప్రియ, శత్రు, సూరి, శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వేల్ రాజా.
Comments
Please login to add a commentAdd a comment