Sayesha
-
హీరో ఆర్య కూతురిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో! (ఫొటోలు)
-
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌తో బెడ్ షేర్ చేసుకున్నాను, కానీ చివరకు..
లాకప్ షోతో ప్రకంపనలు సృష్టిస్తోంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఈ షోలోని కంటెస్టెంట్లు బయటపెట్టే సీక్రెట్లు సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ లాకప్ షోలోని కంటెస్టెంట్ సాయేషా షిండే మరో సంచనల సీక్రెట్ బయటపెట్టింది. ఆమె ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి ముందు స్వాప్నిల్ షిండేగా ఫ్యాషన్ వరల్డ్‌లో సేవలందించాడు. 2021లో ట్రాన్స్‌వుమెన్‌గా మారి సాయేషా షిండేగా పేరు మార్చుకున్నాడు. తను జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటన గురించి చెప్తూ.. 'కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో (బహుశా 2006వ సంవత్సరంలో) జరిగిందీ సంఘటన. ఆ ఇండియన్ డిజైనర్ (పేరు చెప్పలేదు) నా ఫేవరెట్. అతడిని కలిసినప్పుడు నేను ఆకర్షితురాలినయ్యాను. ఓసారి నన్ను హోటల్ గదికి పిలిచాడు, వెళ్లాను. ఎంతో డబ్బు, పేరుప్రఖ్యాతలు ఉన్నా తనకు ప్రేమను పంచేవాళ్లే లేరని బాధపడ్డాడు. నేను అతడిని ఓదార్చుతూ హగ్ చేసుకున్నా.. అలా ఇద్దరం బెడ్ షేర్ చేసుకున్నాం. ఆ తర్వాత కూడా అతనితో టచ్‌లో ఉన్నా. కానీ కొద్దిరోజులకే నాకు తెలిసిందేంటంటే.. నా ఫ్రెండ్స్‌కి కూడా ఇలాగే బాధలో ఉన్నాడంటూ కహానీలు చెప్పి 7-8 మంది అబ్బాయిలతో హోటల్లో బస చేశాడట. ఈ వార్త బయటకు పొక్కడంతో నన్ను ఇండస్ట్రీలో నుంచి బ్యాన్ చేశారు. నేనే అతడి గురించి అంతటా చాటింపు చేస్తున్నాను అనుకుని ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. నిజానికి నేను ఎవరికీ చెప్పలేదు' అని తెలిపింది. దీనిపై కంగనా స్పందిస్తూ 'ఇండస్ట్రీలో జరిగేది ఇదే. మీటూ ఉద్యమం సమయంలో కూడా ఇలాగే జరిగింది. ఎంతోమంది అమ్మాయిలు తమ వేధింపుల గురించి బాహాటంగానే ప్రస్తావించారు. ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తుల పేర్లను బయటపెట్టారు. కానీ ఎవరైతే అలా ముందుకువచ్చి మాట్లాడారో వాళ్లందరూ కనిపించకుండా పోయారు, కానీ వేధించినవాళ్లు మాత్రం ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతున్నారు. మీటూ ఉద్యమానికి మద్దతు పలికినందుకు నన్ను కూడా చిత్రపరిశ్రమలో బ్యాన్ చేశారు' అని చెప్పుకొచ్చింది. కాగా లాకప్ షో గ్రాండ్ ఫినాలే మే7న జరగనుంది. చదవండి: రాకింగ్ రాకేశ్‌కు కాస్ట్లీ ఫోన్ గిఫ్టిచ్చిన సుజాత సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ -
మాకో టైటిల్ పెట్టండి
సూర్య ఫ్యాన్స్‌కు భలే చాన్స్ ఇచ్చారు దర్శకుడు కేవీ ఆనంద్. సూర్యతో ఈ దర్శకుడు ఓ స్టైలిష్ థ్రిల్లర్ రూపొందిస్తున్నారు. కథానుసారంగా ఆ చిత్రానికి మూడు టైటిల్స్‌ను అనుకున్నారు చిత్రబృందం. అయితే ఏది ఫిక్స్ చేయాలో అర్థం కాలేదు. దాంతో నిర్ణయాన్ని అభిమానులకే వదిలేశారు. ‘‘మేం మూడు టైటిల్స్ అనుకున్నాం. అందులో ఏ టైటిల్ బావుంటుందో చెప్పండి’’ అంటూ ‘మీట్పాన్, కాప్పాన్, ఉయిర్కా’.. ఈ మూడు టైటిల్స్‌ను పెట్టి ఓ పోల్ నిర్వహించారు. ఆ మూడు టైటిల్స్ అర్థం దగ్గరదగ్గరగా ఒకటే. కాపాడటం, రక్షించడం అనే అర్థాలు వస్తాయి. ఫస్ట్ రెండు టైటిల్స్ కంటే మూడో టైటిల్ విభిన్నంగా ఉందని ‘ఉయిర్కా’ అనే టైటిల్‌కు ఎక్కువ ఓట్లు వేశారు. మరి ఫైనల్‌గా చిత్రబృందం ఏ టైటిల్ ఫిక్స్ చేస్తుందో చూడాలి. జనవరి 1న టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నారు. ఇందులో సూర్య రక్షణ శాఖ అధికారిగా కనిపిస్తారు. సయేషా కథానాయిక. మోహన్‌లాల్ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. -
రాజకీయ నాయకుడు!
హీరో సూర్యతో రాజకీయాలు చేస్తున్నారు మలయాళ నటుడు మోహన్‌లాల్. కానీ ఇది వెండితెరపై మాత్రమే. మరి.. ఈ రాజకీయ లబ్ధి ఎవరికి? అనేది తెలుసుకోవడానికి సమయం పడుతుంది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. మోహన్‌లాల్, ఆర్య, బొమన్ ఇరానీ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో హీరో సూర్య నేషనల్ సెక్యూరిటీ కమాండో పాత్రలో కనిపిస్తారు. మోహన్‌లాల్ రాజకీయ నాయకుడి పాత్ర చేస్తున్నారని టాక్. మోహన్‌లాల్ లుక్కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పై ఫొటో అదే. -
కులూలో కూల్ కూల్‌గా...
దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నారు హీరో సూర్య. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. మోహన్‌లాల్, బొమన్ ఇరానీ, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఇటీవల నోయిడా షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రబృందం తాజా షూటింగ్ కోసం కులు మనాలీ వెళ్లారు. ఈ షూట్లో సాయేషా కూడా పాల్గొంటున్నారు. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమాలో సూర్య కమాండో ఆఫీసర్‌గా నటిస్తున్నారట. సామాజిక స్పృహ ఉన్న కథాంశంతో సాగే ఈ సినిమాలో మంచి సందేశం ఉంటుందని సమాచారం. -
రక్షించడానికి రాజధానిలో...
సైనికుడి ముఖ్య కర్తవ్యం ప్రజల రక్షణ. ఆ విషయంలో అతను ఎంత సమర్థవంతంగా వ్యవహరించాడన్న దాని మీదే దేశ శాంతి భద్రతలు ఆధారపడి ఉంటాయి. ఇలాంటి సిన్సియర్ సైనికుడి పాత్రలోనే హీరో సూర్య తన నెక్ట్స్ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకుడు. ఇందులో మోహన్ లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సయేషా కథానాయిక. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
సోల్జర్ సూర్య!
దేశం కోసం ఎందాకైనా తెగిస్తా అంటున్నారట హీరో సూర్య. ఎందుకంటే ఆయన తన తాజా సినిమాలో సైనికుడి పాత్రలో కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. బొమన్ ఇరానీ, మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ షూటింగ్ స్పాట్లో సూర్య లుక్‌కి చెందిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఈ ఫొటోలో సూర్య ఆర్మీ ఆఫీసర్లా హెయిర్ కట్ చేయించుకుని కనిపించారు. అంతే.. సూర్య సోల్జర్ పాత్రలో కనిపిస్తారన్న ఊహగానాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో బలమైన సందేశం కూడా ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక తారాగణంపై సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ (నందగోపాల కుమారన్) అనే సినిమా రూపొందుతోంది. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయాలను కున్నారు. కానీ, వాయిదా వేశారు. -
రైతు సమస్యలపై చినబాబు పోరు
కార్తీ, సాయేషా జంటగా నటించిన చిత్రం ‘చినబాబు’. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. పాండిరాజ్ దర్శకత్వంలో 2డి ఎంటరై్టన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్స్‌లో హీరో సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో రైతుల సమస్యలను పాండిరాజ్ చక్కగా చర్చించారు. కామెడీ, యాక్షన్ కూడా ఉంటుంది. కార్తీ తొలిసారి రైతు పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో కార్తీ చెప్పిన డైలాగ్స్ ఆలోచింపచేసేలా ఉన్నాయి. టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నాం. ఇందులో శత్రు మెయిన్ విలన్‌గా నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ప్రియా భవానిశంకర్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సి.హెచ్. సాయికుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్, సంగీతం: డి.ఇమాన్, కెమెరా: వేల్రాజ్. -
రైతు సమస్యలపై పోరాటం
కార్తీ కథానాయకుడిగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కడైకుట్టీ సింగమ్’. సాయేషా, ప్రియా భవాని శంకర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి తెలుగులో ‘చినబాబు’ అనే పేరు ఖరారు చేశారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకాలపై హీరో సూర్య, మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల 13న రిలీజ్ కానుంది. ‘‘ఈ నెల 23న జరగనున్న ‘చినబాబు’ ఆడియో ఫంక్షన్‌కు సూర్య కూడా హాజరు కానున్నారు. రీసెంట్గా విడుదలైన ‘చినబాబు’ టీజర్‌కు, ఫస్ట్ సాంగ్ (చినదాని..)కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రైతు పాత్రలో కార్తీ నటించారు. సినిమాలో రైతు సమస్యలను చర్చించాం. డి. ఇమ్మాన్ మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యరాజ్, భానుప్రియ, శత్రు, సూరి, శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వేల్ రాజా. -
క్రేజీ మల్టీస్టారర్‌కు భారీ బడ్జెట్
తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న స్టార్ హీరో సూర్య ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారు. అందుకే తన తదుపరి చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహల్ లాల్ తో కలిసి నటిస్తున్నారు. సూర్య హీరోగా వీడొక్కడే, బ్రదర్స్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్ ఈ క్రేజీ మల్టీ స్టారర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య 37వ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు చిత్రయూనిట్ భారీ బడ్జెట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ భాగం అమెరికా, లండన్, బ్రెజిల్ లాంటి దేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన అఖిల్ ఫేం సయేషా సైగల్ హీరోయిన్గా నటించనుంది. -
చినబాబు ముగించాడు
‘ఆవారా, నా పేరు శివ, ఖాకి.. వంటి చిత్రాలతో తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆయన హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కడై కుట్టి సింగమ్’. తెలుగులో ‘చినబాబు’ అనే టైటిల్ ఖరారు చేశారు. సాయేషా, ప్రియా భవానీ శంకర్ కథానాయికలుగా నటించారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తీ అన్నయ్య, హీరో సూర్య నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. అంటే ‘చినబాబు’ ముగించేశాడన్నమాట. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రైతు పాత్రలో నటించారు కార్తీ. సినిమా రిలీజ్‌పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అప్పుడే తన నెక్ట్స్ చిత్రంపై కూడా కార్తీ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆ సినిమాలోని న్యూ లుక్ కోసం కసరత్తులు చేస్తున్నారు. కొత్త దర్శకుడు రజత్ రవిశంకర రూపొందించనున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్ కథనాయికగా నటించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్లో భాగంగా చెన్నై, హైదరాబాద్‌లలో షూటింగ్ జరిపి ఆ తర్వాత యూరప్ వెళ్లాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ టాక్. -
24 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!
తన 24 ఏళ్ల కెరీర్లో ఇంత వరకు చేయని ఓ పనిని తన లేటెస్ట్ సినిమా శివాయ్లో చేస్తున్నాడు అజయ్ దేవగన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ల వరకు అందరూ తమ సినిమాలలో లీప్ లాక్‌లతో హల్ చల్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఈ ట్రెండ్ బాగా నడుస్తున్నా అజయ్ దేవగన్ మాత్రం ఇంత వరకు అలాంటి సీన్లకు దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ తాను స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న శివాయ్ సినిమా కోసం ఇన్నాళ్లుగా ఉన్న రికార్డ్‌ను పక్కన పెట్టేశాడు. శివాయ్ సినిమాలో పోలిష్ నటి ఎరిక కార్‌తో లిప్ లాక్ చేశాడు అజయ్. ఇప్పటికే ఈ సీన్‌కు సంబందించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఈ గురువారం అజయ్, ఎరికలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. తన వయసులో దాదాపు సగం వయసున్న అమ్మాయితో అజయ్ చేస్తున్న రొమాన్స్ ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ సినిమాతో హీరోయిన్గాఎంట్రీ ఇచ్చిన సయేషా సైగల్ లీడ్ హీరోయిన్గా నటిస్తున్న శివాయ్ అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. -
'అఖిల్' మూవీ రివ్యూ
టైటిల్ : అఖిల్ జానర్ : రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : అఖిల్, సయేషా సైగల్, రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం : వి.వి. వినాయక్ నిర్మాత : శ్రేష్ట్ మూవీస్ సంగీతం : అనూప్ రుబెన్స్, థమన్ అక్కినేని వంశంలో మూడో తరం నట వారసుడిగా భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసిన నటుడు అఖిల్. గతంలో ఏ హీరోకి రాని హైప్ అఖిల్ తొలి సినిమాకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో అఖిల్ సినిమాను తెరకెక్కించారు. అఖిల్ లుక్కు తగ్గట్టుగా క్లాస్ రొమాంటిక్ సీన్స్ తో పాటు, వినాయక్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న అఖిల్ దీపావళి కానుకగా బుధవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. సోషియో ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కిన అఖిల్ ఆడియన్స్‌ను ఎంత వరకు మెప్పించింది. భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన అఖిల్ ఆ అంచనాలను అందుకున్నాడా..? కథ : అఖిల్ హ్యాపీగా జీవితాన్ని గడిపే ఓ సాదాసీదాకుర్రాడు. అలా జీవితం సాగిపోతున్న సమయంలో పిజి చదువుతున్న హీరోయిన్ సయేషాతో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి ప్రేమను గెలుచుకుంటాడు. ఇంతలో కొంత మంది రౌడీలు సయోషాను కిడ్నాప్ చేస్తారు. ఆమె కోసం వెతికే ప్రయత్నంలో ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుసుకున్న అఖిల్ అక్కడికి వెళతాడు. తన ప్రియురాళిని కాపాడుకోవటానికి అక్కడి గిరిజనుల సాయం తీసుకుంటాడు. అసలు ఆ గిరిజనులు ఎవరు. సయేషాను విలన్లు ఎందుకు కిడ్నాప్ చేశారు. అక్కడికి వెళ్లిన అఖిల్ జీవితం ఎలా మారిపోయింది అన్నదే మిగతా కథ. నటీనటులు : అఖిల్ పూర్తి స్థాయి ఫాంటసీ కథాంశం కాకపోయినా, చిన్న ఫాంటసీ లైన్‌ను రియలిస్టిక్‌గా రూపొందించారు. ముఖ్యంగా అఖిల్ లాంచింగ్ సినిమా కావటంతో, కథా కథనాలు అన్ని అఖిల్ పాత్ర చుట్టూ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అఖిల్ కూడా తన మీద ఉన్న బాధ్యతకు పూర్తి న్యాయం చేశాడు. తొలి సినిమానే అయినా ఎక్కడ అలా కనిపించలేదు. డ్యాన్స్, ఫైట్స్ తో పాటు డైలాగ్ డెలివరీ బాడీలాంగ్వేజ్ వంటి విషయాల్లో కూడా మంచి ఈజ్ కనబరిచాడు. అయితే కామెడీ విషయంలో మాత్రం ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండనిపించింది. హీరోయిన్గా నటించిన సయేషా సైగల్ కూడా మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా డ్యాన్స్‌ల విషయంలో అఖిల్‌తో పోటి పడిన సయేషా మంచి మార్కులు సాధించింది. బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డిల కామెడీ అలరిస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ మరోసారి ఆకట్టుకోగా, విలన్‌గా మహేష్ మంజ్రేకర్ తన మార్క్ చూపించాడు. సాంకేతిక నిపుణులు : తెర మీద అఖిల్ వన్ మేన్ షోలా సాగిన అఖిల్ సినిమా. తెర వెనుక వినాయక్ వన్ మేన్ షోలా సాగింది. ఎన్నో అంచనాలు ఉన్న అక్కినేని వారసున్ని వెండితెరకు పరిచయం చేసే భారీ బాధ్యతను తలకెత్తుకున్న వినాయక్ అందుకు తగ్గ స్ధాయిలో కష్టపడ్డాడు. ముఖ్యంగా తనకు బాగా పట్టున్న మాస్ యాక్షన్‌ను క్లాస్‌గా ప్రజెంట్ చేసి, స్టార్ వారసులకు గ్రాండ్ లాంచింగ్ ఇవ్వటంలో తాను స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కథా కథనాల్లో ఎక్కడా పట్టు కోల్పోకుండా సినిమా అంతా చాలా ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించాడు. అనూప్, థమన్లు కమర్షియల్ నెంబర్స్‌తో అలరించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరా వర్క్ సూపర్ అనిపించింది. గతంలో ఎన్నడూ చూడని లొకేషన్స్‌లో షూట్ చేసిన చిత్రయూనిట్, ఆ ప్రాంతాలను గ్రాండ్‌గా ప్రజెంట్ చేశారు. అఖిల్, సయేషాలు తెర మీద చాలా అందంగా కనిపించారు. ఎడిటింగ్, కొరియోగ్రఫీ, యాక్షన్స్ సీన్స్ ఇలా అన్నీ అప్ టు ద మార్క్ గా ఉన్నాయి. విశ్లేషణ : అఖిల్ ఫాంటసీ కథాంశం కాకపోయినా.. చిన్న ఫాంటసీ ఎలిమెంట్‌ను పక్కా కమర్షియల్ జానర్లో ప్రజెంట్ చేశారు. అఖిల్ తొలి సినిమానే అయినా ఓ స్టార్ హీరో సినిమాలో ఉండే అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించారు. ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ ఎపిసోడ్స్, యాక్షన్, డ్రామా ఇలా అన్ని రకాల సీన్స్‌తో అఖిల్ స్టామినా ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా కూడా అదే స్ధాయిలో వచ్చింది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంది. ప్లస్ పాయింట్స్ : అఖిల్ పర్ఫామెన్స్, డ్యాన్స్, యాక్షన్ వినాయక్ టేకింగ్ సినిమా నిడివి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరీ లైన్ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ ఓవరాల్‌గా 'అఖిల్' అక్కినేని అభిమానులకు ఫుల్ ట్రీట్, అఖిల్ కు పర్ఫెక్ట్ లాంచింగ్ -
అభిమానులందరికీ ప్రమాణం చేస్తున్నా..
-
అఖిల్‌తో జతకడుతోన్న సుందరి.. సయేషా!
-
సైరాబాను మనవరాలి తెరంగేట్రం..
సైరాబాను మనవరాలు సయేషా త్వరలోనే తెరంగేట్రం చేయనుంది. అజయ్ దేవ్‌గణ్ తన సొంత సంస్థ ‘ఎఫ్ ఫిలిమ్స్ అండ్ ఎరోస్’ బ్యానర్‌పై రూపొందించనున్న యాక్షన్ చిత్రం ‘శివే’ కోసం సయేషాను ఎంపిక చేసుకున్నాడు. మరో విశేషమేమంటే... ఈ చిత్రానికి అజయ్ స్వయంగా దర్శకత్వం వహించనున్నాడు. దర్శకుడిగా అజయ్‌కి ఇది రెండో చిత్రం. తన భార్య కాజోల్ కథానాయికగా 2008లో ‘యా, మీ ఔర్ హమ్’ చిత్రం తీశాడు. అది ఫ్లాప్ అయింది. దీంతో దర్శకత్వానికి దూరంగా ఉన్న అజయ్ దేవ్‌గణ్, ఇన్నాళ్ల వ్యవధి తర్వాత దర్శకత్వం చేపట్టేందుకు సిద్ధవువుతున్నాడు.