24 ఏళ్ల కెరీర్లో తొలిసారి..! | Ajay Devgn's First Ever Lip Lock In Shivaay | Sakshi
Sakshi News home page

24 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!

Published Wed, Sep 21 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

24 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!

24 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!

తన 24 ఏళ్ల కెరీర్లో ఇంత వరకు చేయని ఓ పనిని తన లేటెస్ట్ సినిమా శివాయ్లో చేస్తున్నాడు అజయ్ దేవగన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ల వరకు అందరూ తమ సినిమాలలో లీప్ లాక్లతో హల్ చల్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఈ ట్రెండ్ బాగా నడుస్తున్నా అజయ్ దేవగన్ మాత్రం ఇంత వరకు అలాంటి సీన్లకు దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ తాను స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న శివాయ్ సినిమా కోసం ఇన్నాళ్లుగా ఉన్న రికార్డ్ను పక్కన పెట్టేశాడు.

శివాయ్ సినిమాలో పోలిష్ నటి ఎరిక కార్తో లిప్ లాక్ చేశాడు అజయ్. ఇప్పటికే ఈ సీన్కు సంబందించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఈ గురువారం అజయ్, ఎరికలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. తన వయసులో దాదాపు సగం వయసున్న అమ్మాయితో అజయ్ చేస్తున్న రొమాన్స్ ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అఖిల్ సినిమాతో హీరోయిన్గాఎంట్రీ ఇచ్చిన సయేషా సైగల్ లీడ్ హీరోయిన్గా  నటిస్తున్న శివాయ్ అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement