ఆ నటిపై చెడు ప్రచారం చేయలేదు: డైరెక్టర్ | Kajol will never be back as a friend to me, says Karan Johar | Sakshi
Sakshi News home page

ఆ నటి విషయాన్ని వదిలేద్దాం: డైరెక్టర్

Published Sun, Feb 12 2017 11:02 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

ఆ నటిపై చెడు ప్రచారం చేయలేదు: డైరెక్టర్

ఆ నటిపై చెడు ప్రచారం చేయలేదు: డైరెక్టర్

ముంబై: వారిది దాదాపు పాతికేళ్లకు పైగా స్నేహం. ఇద్దరి కాంభినేషన్లో కుచ్ కుచ్ హోతా మై, కబీ కుషీ కబీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, లాంటి  సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. అయితేనేం ఓ చిన్న ఘటన వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది. దీంతో ఆ నటి ఇక నుంచీ నా జీవితంలో ఉండదు అంటూ తేల్చిపారేశాడు డైరెక్టర్. ఆ ఇద్దరిలో ఒకరు బాలీవుడ్ నటి కాజోల్ కాగా, రెండో వ్యక్తి దర్శకనిర్మాత కరణ్ జోహర్. కాజోల్ భర్త, స్టార్ హీరో అజయ్ దేవగణ్ తనను తీవ్రంగా దూషించాడని కరణ్ జోహర్ అంటున్నాడు. తన భర్య నుంచి ఏదో పార్టీలో తాను ఎవరితోనే తప్పుగా మాట్లాడానంటూ ఆరోపిస్తూ, అజయ్ తనపై మండిపడ్డాడని చెప్పాడు.

తమది 25 ఏళ్ల స్నేహమని, తన కుటుంబానికి కాజోల్ అంటే ఎంతో గౌరవమని.. అలాంటిది తన ఫ్రెండ్ గురించి తప్పుగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ దర్శకుడు.  శివాయ్ మూవీపై దుష్రచారం చేశానని, అందుకు సినీ విమర్శకులకు రూ.20 లక్షలు ముట్టజెప్పానని తనపై అజయ్ లేనిపోని వదంతులు వ్యాప్తి చేశాడని ఆందోళన చెందుతున్నాడు కరణ్ జోహర్. ఈ ఆరోపణలపై విచారణ జరగాలని అజయ్ ట్వీట్ చేయగా.. తనను అపార్థం చేసుకున్న కాజోల్ దాన్ని రీట్వీట్ చేయడం తనను బాధకు గురిచేసిందని చెప్పుకొచ్చాడు.  అజయ్ హీరోగా నటించి, నిర్మించిన శివాయ్, కరణ్ జోహర్ మూవీ 'ఏ దిల్ హై ముష్కిల్' ఒకేరోజు విడుదల కావడం.. అజయ్ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement