Shivaay
-
ఆ నటిపై చెడు ప్రచారం చేయలేదు: డైరెక్టర్
ముంబై: వారిది దాదాపు పాతికేళ్లకు పైగా స్నేహం. ఇద్దరి కాంభినేషన్లో కుచ్ కుచ్ హోతా మై, కబీ కుషీ కబీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, లాంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. అయితేనేం ఓ చిన్న ఘటన వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది. దీంతో ఆ నటి ఇక నుంచీ నా జీవితంలో ఉండదు అంటూ తేల్చిపారేశాడు డైరెక్టర్. ఆ ఇద్దరిలో ఒకరు బాలీవుడ్ నటి కాజోల్ కాగా, రెండో వ్యక్తి దర్శకనిర్మాత కరణ్ జోహర్. కాజోల్ భర్త, స్టార్ హీరో అజయ్ దేవగణ్ తనను తీవ్రంగా దూషించాడని కరణ్ జోహర్ అంటున్నాడు. తన భర్య నుంచి ఏదో పార్టీలో తాను ఎవరితోనే తప్పుగా మాట్లాడానంటూ ఆరోపిస్తూ, అజయ్ తనపై మండిపడ్డాడని చెప్పాడు. తమది 25 ఏళ్ల స్నేహమని, తన కుటుంబానికి కాజోల్ అంటే ఎంతో గౌరవమని.. అలాంటిది తన ఫ్రెండ్ గురించి తప్పుగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ దర్శకుడు. శివాయ్ మూవీపై దుష్రచారం చేశానని, అందుకు సినీ విమర్శకులకు రూ.20 లక్షలు ముట్టజెప్పానని తనపై అజయ్ లేనిపోని వదంతులు వ్యాప్తి చేశాడని ఆందోళన చెందుతున్నాడు కరణ్ జోహర్. ఈ ఆరోపణలపై విచారణ జరగాలని అజయ్ ట్వీట్ చేయగా.. తనను అపార్థం చేసుకున్న కాజోల్ దాన్ని రీట్వీట్ చేయడం తనను బాధకు గురిచేసిందని చెప్పుకొచ్చాడు. అజయ్ హీరోగా నటించి, నిర్మించిన శివాయ్, కరణ్ జోహర్ మూవీ 'ఏ దిల్ హై ముష్కిల్' ఒకేరోజు విడుదల కావడం.. అజయ్ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం తెలిసిందే. -
పండుగనాడు ఆ రెండు సినిమాలు తుస్..
ముంబై: మత్తెక్కించే రొమాంటిక్ సీన్లు, ప్రేమ, వైఫల్యాలు, గాఢమైన అనుబంధాలు కలబోసిన సినిమా ఒకటి. భారీ యాక్షన్ సీన్లు, హిమాలయాల్లో సాహసాలు, కూతురి సెంటిమెంట్ తో తెరకెక్కిన మరో సినిమా. దీపావళి సందర్భంగా విడుదలైన రెండు భారీ బాలీవుడ్ సినిమాలు 'ఏ దిల్ హై ముష్కిల్', 'శివాయ్'లు బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్నాయి. పండుగను క్యాష్ చేసుకోవడంలో రెండు సినిమాలూ విఫలమయ్యాయని, దీంతో ఫ్యాన్సీ రేట్లకు సినిమాలు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే మిగిలిందని సోమవారం బాక్సాఫీస్ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 28న విడుదలైన 'ఏ దిల్ హై ముష్కిల్', 'శివాయ్'లు తొలిరోజు వరుసగా రూ.13.30 కోట్లు, రూ.8.26కోట్ల వసూళ్ల(గ్రాస్)ను రాబట్టాయి. రెండో రోజు, అంటే శనివారం 'ఏ దిల్'కు రూ.13.10కోట్లు, 'శివాయ్'కు 10.06కోట్లు వసూలయ్యాయి. కానీ కీలకమైన దీపావళి (ఆదివారం)పండుగ నాడు మాత్రం రెండు సినిమాల కలెక్షన్లు పడిపోయాయి. దీపావళినాడు 'ఏ దిల్' 9.20 కోట్లు, 'శివాయ్' రూ.8.26 కోట్లు మాత్రమే వసూలు చేశాశాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకొచ్చారు. ఇండియాలో 3000 స్క్రీన్లపై విడుదలైన 'ఏ దిల్'కు విదేశాల్లో మంచి స్పందన లభించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా రూ.40.05 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు 'ఏ దిల్'.. 2016 సంవత్సరంలో విదేశాల్లో భారీ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచిందని రూపకర్తలు ప్రకటించారు. 'ఏ దిల్..' అమెరికాలో 2.1 మిలియన్ డాలర్లు, బ్రిటన్, ఆస్త్రేలియాల్లో వరుసగా 752,000 డాలర్లు, 307,045 డాలర్లు వసూలు చేసిందని నిర్మాతలు తెలిపారు. అయితే సోమ, మంగళవారాల్లో కలెక్షన్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన డిస్ట్రిబ్యూటర్ జోగిందర్ మహాజన్ అన్నారు. -
ఆ రెండు సినిమాలకు భారీ కలెక్షన్లు
ముంబై: కరణ్ జోహార్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్, అజయ్ దేవగణ్ చిత్రం శివాయ్ బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి. దీపావళి కానుకగా శుక్రవారం విడుదలైన ఈ రెండు సినిమాలు భారీగా ఓపెనింగ్ కలెక్షన్లు సాధించాయి. 3 వేల స్క్రీన్లపై విడుదలైన ఏ దిల్ హై ముష్కిల్ తొలి రోజు దేశంలో 13.30 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. ఈ సినిమాలో రణవీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్ నటించారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఇక స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నటించిన శివాయ్ తొలిరోజు 10.24 కోట్లు వసూలు చేసింది. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో భారీ కలెక్షన్లు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళన చేశారు. -
వివాదాలతోనే కలెక్షన్ల దుమ్మురేపింది
ఏదైనా సినిమా గురించి వివాదం వచ్చిందంటే.. అసలు అందులో ఏముందో చూద్దామని అంతా ఉత్సాహం చూపిస్తారు. సరిగ్గా అదే అంశం ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు బాగా కలిసొచ్చింది. కరణ్ జోహార్ తీసిన ఈ సినిమాలో పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించడంతో సినిమాను నిషేధించాలని, దాన్ని ప్రదర్శించడానికి వీల్లేదని తీవ్రస్థాయిలో గొడవలు చెలరేగాయి. ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్యవర్తిత్వం పుణ్యమాని సినిమా విడుదలైంది. దాంతో ఈ సినిమాకు బంపర్ కలెక్షన్లు వచ్చాయి. విడుదలైన మొదటిరోజున ఏకంగా రూ. 13.30 కోట్లు వసూలుచేసింది. రణబీర్ కపూర్, అనుష్కా శర్మ, ఐశ్వర్యా రాయ్ లాంటి పెద్ద స్టార్లు ఎంతమంది నటించినా, ఇందులో పాకిస్థానీ ఫవాద్ ఖాన్ ఉన్నాడన్న ప్రచారం మాత్రం బాగా జరిగింది. దాంతో బంపర్ కలెక్షన్లు వచ్చాయి. మరోవైపు అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన శివాయ్ సినిమా కూడా దీని స్థాయిలో కాకపోయినా బాగానే వసూలుచేసింది. ఈ సినిమాకు రూ. 10.24 కోట్ల వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఎరికా కార్, సయేషా సైగల్ నటించిన ఈ సినిమా చాలావరకు హిమాలయాల్లోనే ఉంటుంది. పర్వత ప్రాంత అందాలను అద్భుతంగా తెరకెక్కించడంతో ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్లు బాగానే ఉన్నాయి. #ADHM Fri ₹ 13.30 cr. India biz... EXCELLENT at plexes... Note: Dhanteras. Pre-Diwali. — taran adarsh (@taran_adarsh) October 29, 2016 #Shivaay is STRONG at single screens/mass circuits... Fri ₹ 10.24 cr. India biz... Note: Dhanteras. Pre-Diwali. — taran adarsh (@taran_adarsh) 29 October 2016 -
'బాలీవుడ్ ఫైట్స్ బోర్ కొడుతున్నాయి'
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ నెలాఖరున రిలీజ్‌కు రెడీ అవుతున్న శివాయ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న అజయ్, తనకు బాలీవుడ్ యాక్షన్ సీన్స్ బోర్ కొడుతున్నాయంటూ కామెంట్ చేశాడు. ఫైట్ మాస్టర్ వీర్ దేవగన్ వారసుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్, యాక్షన్ సీన్స్‌పై చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న శివాయ్ సినిమాలో హీరోగా నటిస్తున్న అజయ్ ఆ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ యాక్షన్ సీన్స్ బోర్ కొట్టాయన్న అజయ్ దేవగన్, తన సినిమాతో కొత్త తరహా యాక్షన్‌ను ట్రై చేశానని ప్రకటించాడు. 2008లో తెరకెక్కిన 'యు మీ ఔర్ హమ్' సినిమాతో మెగాఫోన్ పట్టిన అజయ్, రెండో ప్రయత్నంగా శివాయ్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఐదేళ్ల క్రితమే ఈ సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేసినా.. అప్పట్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కారణంగా వాయిదా వేసినట్టుగా తెలిపారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో అఖిల్ ఫేం సయేషా సైగల్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. -
'కాజోల్ ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉండదు'
ముంబై: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్, అతడి లక్కీ హీరోయిన్ కాజోల్ మధ్య ఫ్రెండ్ షిప్ కట్ అయిందా అంటే బాలీవుడ్ వర్గాలు అవునంటున్నాయి. తాజాగా కాజోల్ భర్త, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. గతంలో ఉన్నట్లుగా కాజోల్, కరణ్ సన్నిహితంగా ఉండటం లేదని తెలిపాడు. అందుకు కారణాలపై మీడియా ప్రశ్నించగా.. వ్యక్తిగత విషయాలు కారణమని, వాటిని బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదన్నాడు. అజయ్, కరణ్ పరిచయస్తులే కానీ, అంతగా క్లోజ్ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కరణ్ మూవీ అంటే చాలు.. కాజోల్ కచ్చితంగా అక్కడ ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. కానీ కాజోల్ భర్త నిర్మాతగా, హీరోగా నటించిన మూవీ 'శివాయ్' అక్టోబర్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు కరణ్ తీసిన మూవీ 'ఏ దిల్ హై ముష్కిల్' కూడా అదే రోజు విడుదల కానుంది. అయితే కరణ్ తన మూవీ శివాయ్ పై దుష్ప్రచారం చేశారని అజయ్ కొన్నిరోజుల కిందట ఆరోపించారు. శివాయ్ ప్రమోషన్లతో తాను బిజీగా ఉన్నానని, కాజోల్ తనకు ఎంతో సహాయపడుతుందన్నాడు. తన భార్యకు మూవీ స్టోరీ పూర్తిగా తెలియదని.. మూవీ సాంగ్స్, ట్రైలర్ మాత్రమే చూసిందని అజయ్ చెప్పుకొచ్చాడు. గతంలో కరణ్ తీసిన దాదాపు అన్ని మూవీలలో సందడి చేసిన కాజోల్.. కరణ్ లేటెస్ట్ మూవీలో మాత్రం నటించకపోవడం గమనార్హం. -
హీరోయిన్ భర్తతో వివాదం ముదిరిందా?
ముంబై: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ మూవీ అంటే చాలు కచ్చితంగా ఒక హీరోయిన్ కు అతడి ఫ్రాంచైజీలో అవకాశం ఉంటుంది. పాత్ర చిన్నదా.. పెద్దదా.. లేక అతిథిగా అభిమానులకు కనిపిస్తారా.. అనే తేడా లేకుండా ఆ తార తళుక్కుమంటుంది. అయితే ఇటీవల జరిగిన ఓ మూవీ వివాదం కారణంగా ఆ నటి కరణ్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 'ఏ దిల్ హై ముష్కిల్' లో మాత్రం నటించడం లేదట. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి కాజోల్. కాజోల్ భర్త అజయ్ దేవగణ్ 'శివాయ్'లో హీరోగా నటించడంతో పాటు ఆ మూవీలో పలు బాధ్యతలు తనపై వేసుకున్నాడు. సాయేశా సైగల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీపై కరణ్ జోహర్ తప్పుడు సంకేతాలు ఇచ్చాడని అజయ్ కొన్నిరోజుల కిందట ఆరోపించాడు. కుచ్ కుచ్ హోతా మై, కబీ కుషీ కబీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, ఇలా కరణ్ తీసిన పలు చిత్రాల్లో కాజోల్ సందడి చేసింది. కానీ భర్త అజయ్ మూవీపై నెగిటివ్ ప్రచారం రావడం, కరణ్ తన మూవీ కోసం ఇలా చేశాడన్న ఆరోపణల్ని కూడా ఈ దర్శకనిర్మాత గట్టిగా ఖండించలేదు. ఈ కారణాల వల్ల కాజోల్ కరణ్ మూవీలో నటించలేదని చెప్పవచ్చు. కరణ్ తాజా మూవీలో ఐశ్వర్యరాయ్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ఇతర ప్రముఖులు కనిపించనున్న విషయం తెలిసిందే. -
24 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!
తన 24 ఏళ్ల కెరీర్లో ఇంత వరకు చేయని ఓ పనిని తన లేటెస్ట్ సినిమా శివాయ్లో చేస్తున్నాడు అజయ్ దేవగన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ల వరకు అందరూ తమ సినిమాలలో లీప్ లాక్‌లతో హల్ చల్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఈ ట్రెండ్ బాగా నడుస్తున్నా అజయ్ దేవగన్ మాత్రం ఇంత వరకు అలాంటి సీన్లకు దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ తాను స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న శివాయ్ సినిమా కోసం ఇన్నాళ్లుగా ఉన్న రికార్డ్‌ను పక్కన పెట్టేశాడు. శివాయ్ సినిమాలో పోలిష్ నటి ఎరిక కార్‌తో లిప్ లాక్ చేశాడు అజయ్. ఇప్పటికే ఈ సీన్‌కు సంబందించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఈ గురువారం అజయ్, ఎరికలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. తన వయసులో దాదాపు సగం వయసున్న అమ్మాయితో అజయ్ చేస్తున్న రొమాన్స్ ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ సినిమాతో హీరోయిన్గాఎంట్రీ ఇచ్చిన సయేషా సైగల్ లీడ్ హీరోయిన్గా నటిస్తున్న శివాయ్ అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. -
బాలీవుడ్లో మాటల యుద్ధం
బాలీవుడ్ లో భారీ చిత్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అక్టోబర్ 28న శివాయ, యే దిల్ హై ముష్కిల్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రచారం, రివ్యూల విషయంలో వివాదం మొదలైంది. శివాయ చిత్ర హీరో దర్శకుడు అయిన అజయ్ దేవగన్ తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేసిన ఓ ఆడియో క్లిప్ వివాదానికి తెర తీసింది. ఆడియో క్లిప్ లోని గొంతు ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్‌దిగా చెప్పిన అజయ్ దేవగన్, ఆయన తన శివాయ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేసేందుకు 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా తెలిపాడు. ఈ విషయాన్ని శివాయ చిత్ర మరో నిర్మాత కుమార్ మంగత్‌కు కమాల్ ఫోన్ లో చెపుతుండగా రికార్డ్ చేసిన ఆడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా..' నేను 25 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాను. నా తండ్రి యాక్షన్ డైరెక్టర్‌గా ఇక్కడే పనిచేశారు. అందుకే ఈ రంగంతో నాకు ఎంతో అనుబందం ఉంది. ఇలాంటి రంగంలో కమాల్ ఆర్ ఖాన్ లాంటి వాళ్లు చేస్తున్న పనులు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారే ఇండస్ట్రీ నాశనానికి సపోర్ట్ చేయటం బాధాకరం. ఈ విషయంలో కరణ్ జోహర్ ప్రమేయం ఉందా లేదా అన్న విషయం పై కూడా విచారణ జరగాలి' అని తెలిపారు. అజయ్ స్టేట్ మెంట్‌పై కమాల్ కూడా ఘూటుగానే స్పందించాడు. వారి సినిమాను ఇబ్బంది పెట్టే లైసెన్స్ నాకు ఇచ్చినందుకు అజయ్ దేవగన్, కుమార్ మంగత్లకు నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ ట్వీట్లపై కరణ్ జోహార్ మాత్రం స్పందించలేదు. Hear what self proclaimed no. 1 critic and trade analyst Kamaal R Khan has to say. https://t.co/wRc7moSlsZ— Ajay Devgn (@ajaydevgn) 1 September 2016Today both films #Shivaay n #AeDilHaiMushkil got free publicity of millions of ₹ with my name and this is the power of The Brand KRK. G.N.— KRK (@kamaalrkhan) 1 September 2016If you are talking with Kumar Mangat or @ajaydevgn then you should be careful because they can tape you.— KRK (@kamaalrkhan) 2 September 2016My press conference today at 5pm at my office 7/70, mahada, Andheri West, where I will give detailed reply for all allegations of Ajay Devgn— KRK (@kamaalrkhan) 2 September 2016 -
మా సినిమా ఎవరి సెంటిమెంట్స్‌ను దెబ్బతీయదు!
ముంబై: పరమశివుడి మానవీయ అంశాలు ఆధారంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ రూపొందించిన తాజా చిత్రం 'శివాయ్'. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ మతం మనోభావాలను దెబ్బతీయబోదని ఆయన పేర్కొన్నారు. ఇందులో తాను శివుడి పాత్రను పోషించడం లేదని, కేవలం శివుడి భక్తుడిగానే తాను కనిపిస్తానని దేవ్గన్ చెప్పారు. 'సినిమాలో ఎలాంటి మతకోణం లేదు. నేను శివుడి పాత్రను పోషించడం లేదు. ఆయన భక్తుడైన ఓ సామాన్యుడిలా కనిపిస్తాను. శివుడిని ఆత్మలో నిలుపుకొన్న పాత్ర ఇది. అలాగే, ఈ సినిమాలో శివుడిలాగా నేను ధ్యానం చేస్తూనే, ప్రార్థన చేస్తూనో కనిపించను. కానీ నా శరీరం నిండా శివుడి పచ్చబోట్లు ఉంటాయి' అని 47 ఏళ్ల అజయ్ దేవ్గన్ చెప్పారు. 'శివాయ్' సినిమా ట్రైలర్‌ను తాజాగా ఇండోర్‌లో విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 'ఒక్క శివుడు తప్ప మిగతా దేవుళ్లందరూ ఏ తప్పులు చేయనివారు. శివుడు మాత్రం అన్ని తప్పులు చేస్తాడు. పొగ తాగుతాడు. 'భంగ్' (మద్యం) సేవిస్తాడు. తనకు కోపం వచ్చిందే ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాడు. శివుడిది చాలా మంచి మనస్సు కానీ, కోపం వస్తే తట్టుకోలేం. శివుడిని మామూలు మనుషులు సైతం మోసగించగలరు. ఇవన్ని సహజంగా మనుష్యుల్లో ఉండే గుణాలు. ప్రస్తుత తరంలో యూత్‌కు బాగా కనెక్ట్ అయిన దేవుడు శివుడు' అని అజయ్ దేవ్గన్ పేర్కొన్నారు. -
'శివాయ్' లేటెస్ట్ పోస్టర్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్'. దీపావళి పండుగకు విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో అభిమానుల్లో ఆసక్తిని కలిగించిన అజయ్.. తాజాగా మరో పోస్టర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. ఏదో ఉపద్రవం నుంచి తప్పించుకుంటున్నట్టు, సాహసోపేతమైన పోరాటం చేస్తున్నట్టుగా ఆ పోస్టర్లో కనిపిస్తోంది. ఆగస్టు 7 వ తేదీన ట్రైలర్ శివాయ్ విడుదల కానుంది. శివాయ్లో సల్మాన్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నారని టాక్. ఈ సినిమాతో 'అఖిల్' ఫేమ్ సయ్యేషా సెహగల్ బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తుంది. 2 Days To Shivaay Trailer. Sharing with you all on 7th August. pic.twitter.com/Tj0cG3qB8O — Ajay Devgn (@ajaydevgn) 5 August 2016 -
ఫ్రెండ్ సినిమాలో హీరో స్పెషల్ సాంగ్
స్టార్ హీరోయిన్లు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం ఈ మధ్య కాలంలో అడపాదడపా చూస్తూనే ఉన్నాం. అయితే స్టార్ హీరోలు అలాంటి ప్రత్యేక గీతాల్లో కనిపించడం విశేషం. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ స్పెషల్ సాంగ్‌లో చిందేయనున్నాడట. స్నేహితుడు అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్' లో సల్లూభాయ్ ప్రత్యేక పాటలో కనిపించనున్నారని టాక్. అజయ్, సల్మాన్ ల మధ్య ఎప్పటి నుంచో మంచి దోస్తీ ఉంది. పలు సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఇదివరకే అజయ్ సినిమా 'సన్ ఆఫ్ సర్దార్'లో ఓ స్పెషల్ సాంగ్‌కు అజయ్‌తో కలిసి కాలు కదిపాడు సల్మాన్. ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతోపాటు ఫ్యాన్స్‌ను మెప్పించింది కూడా. అలానే ఇప్పుడు 'శివాయ్'లో సల్మాన్ స్పెషల్ డ్యాన్స్ నంబర్లో కనిపిస్తారనేది బీ టౌన్ న్యూస్. 'అఖిల్' ఫేమ్ సాయేషా సెహగల్ శివాయ్తో బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఫస్ట్ లుక్ అదిరింది.. ఆల్ ది బెస్ట్'
అఖిల్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయేషా సైగల్. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది. బాలీవుడ్ మూవీ 'శివాయ్'తో స్టార్ హీరో అజయ్ దేవగణ్ కు జత కట్టింది. శివాయ్ లో సాయేషా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మూవీ హిట్ అవ్వాలని, తనను ఆశీర్వదించాలని కోరుతూ సాయేషా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు స్పందించిన టాలీవుడ్ హీరో నితిన్.. ఫస్ట్ లుక్ అదిరింది, ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ అంటూ రీట్విట్ చేశాడు. థ్యాంక్యూ నితిన్, ఎప్పటికీ నువ్వే నా తొలి నిర్మాతవు అని మరో ట్వీట్ తో బదులిచ్చింది. ఎప్పటికీ నీ ప్రేమ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నట్లు సాయేషా రాసుకొచ్చింది. అఖిల్ మూవీకి నితిన్ నిర్మాత అన్న విషయం తెలిసిందే. మరోవైపు శివాయ్ మూవీకి అజయ్ దేవగణ్ అన్నీ తానై పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు. శివాయ్ కి దర్శకుడిగా, సహ నిర్మాతగానూ అజయ్ వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు ఇటీవలే మూవీ యూనిట్ ప్రకటించింది. @sayyeshaa Nice 1st look..good luck for the film -
థ్రిల్లింగ్ ఫస్ట్‌లుక్: 'శివాయ్' సాహసాలు!
అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్'. దీపావళి పండుగకు విడుదల కాబోతున్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. అజయ్ దేవగణ్‌తోపాటు సైరాబాను, దిలీప్‌కుమార్, సాయెషా సైగల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ను తాజాగా ట్విట్టర్లో విడుదల చేశారు. పరమశివుడిని తలపించే మంచుకొండల్లో హెలికాప్టర్ నుంచి తాడు పట్టుకొని సాహసాలు చేస్తున్న అజయ్ లుక్‌తో ఈ పోస్టర్ అదరగొడుతున్నది. అజయ్ అభిమానుల్ని థ్రిల్లింగ్‌కు గురిచేస్తున్నది. అక్టోబర్ 28న విడుదల అవుతుందని భావిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. Here is the latest poster of Shivaay, tell me what you think about this?? pic.twitter.com/755tYBHbsn — Ajay Devgn (@ajaydevgn) May 22, 2016 -
సల్మాన్‌తో కాదని అజయ్‌తో
ఈ ఏడాది రంజాన్‌కు బాలీవుడ్ తెర మీద భారీ యుద్ధం తప్పదని భావించారు అంతా. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో పాటు, షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాయిస్ సినిమాలు ఈద్ బరిలో పోటీ పడతాయని అనుకున్నారు. అయితే సల్మాన్‌తో ఇప్పుడిప్పుడే బలపడుతున్న స్నేహం కారణంగా బరిలో నుంచి తప్పుకున్న షారూఖ్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. దీంతో ఈద్ కు సోలోగా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్. అయితే ఈద్ బరి నుంచి తప్పుకున్న షారూఖ్, తన సినిమా రాయిస్‌ను దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కానీ ఆ సమయంలో కూడా బాద్ షాకు పోటీ మాత్రం తప్పేలా కనిపించటం లేదు. అజయ్ దేవగన్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న శివాయ సినిమాను దీపావళికే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి సల్మాన్‌తో పోటీ వద్దని పక్కకు జరిగిన షారూఖ్, అజయ్ కోసం మరోసారి తన సినిమా వాయిదా వేసుకుంటాడా లేక బరిలో దిగుతాడా చూడాలి. -
అజయ్ దేవ్గన్ 'శివాయ్' ఫస్ట్ లుక్
సింగం, సింగం రిటర్న్స్, యాక్షన్ జాక్సన్ సినిమాలో యాక్షన్ హీరోగా టర్న్ తీసుకున్న అజయ్ దేవ్ గన్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న సినిమా శివాయ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు అజయ్ దేవ్గన్. అజయ్ కేవలం ఓ తాడు సాయంతో భారీ కొండకు వేళాడుతున్న ఈ ఫస్ట్ లుక్, ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎతైన ప్రదేశాలంటే తనకున్న భయాన్ని పొగొట్టేందుకు స్టంట్ మాస్టర్ ఇలా ప్లాన్ చేశాడంటూ సరదా ట్వీట్ చేసిన అజయ్ దేవ్గన్, గతంలోనూ యాక్షన్ సీక్వన్స్ ల షూటింగ్ మొదలు పెట్టిన సమయంలో లోకేషన్లలో భారీ క్రేన్ లతో ఏర్పాట్లు చేస్తున్నఫోటోను కూడా ట్వీట్ చేశాడు. అజయ్ దేవ్గన్ సరసన అఖిల్ ఫేం సయోషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2016 దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Trying to overcome my fear of heights, do you guys think this will help?? pic.twitter.com/gSGJNuD73V— Ajay Devgn (@ajaydevgn) December 26, 2015