'కాజోల్ ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉండదు' | actress Kajol is not as close as earlier with Karan Johar | Sakshi
Sakshi News home page

'కాజోల్ ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉండదు'

Published Sun, Oct 9 2016 3:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

'కాజోల్ ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉండదు'

'కాజోల్ ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉండదు'

ముంబై: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్, అతడి లక్కీ హీరోయిన్ కాజోల్ మధ్య ఫ్రెండ్ షిప్ కట్ అయిందా అంటే బాలీవుడ్ వర్గాలు అవునంటున్నాయి. తాజాగా కాజోల్ భర్త, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. గతంలో ఉన్నట్లుగా కాజోల్, కరణ్ సన్నిహితంగా ఉండటం లేదని తెలిపాడు. అందుకు కారణాలపై మీడియా ప్రశ్నించగా.. వ్యక్తిగత విషయాలు కారణమని, వాటిని బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదన్నాడు. అజయ్, కరణ్ పరిచయస్తులే కానీ, అంతగా క్లోజ్ కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

కరణ్ మూవీ అంటే చాలు.. కాజోల్ కచ్చితంగా అక్కడ ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. కానీ కాజోల్ భర్త నిర్మాతగా, హీరోగా నటించిన మూవీ 'శివాయ్' అక్టోబర్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు కరణ్ తీసిన మూవీ 'ఏ దిల్ హై ముష్కిల్' కూడా అదే రోజు విడుదల కానుంది. అయితే కరణ్ తన మూవీ శివాయ్ పై దుష్ప్రచారం చేశారని అజయ్ కొన్నిరోజుల కిందట ఆరోపించారు. శివాయ్ ప్రమోషన్లతో తాను బిజీగా ఉన్నానని, కాజోల్ తనకు ఎంతో సహాయపడుతుందన్నాడు. తన భార్యకు మూవీ స్టోరీ పూర్తిగా తెలియదని.. మూవీ సాంగ్స్, ట్రైలర్ మాత్రమే చూసిందని అజయ్ చెప్పుకొచ్చాడు. గతంలో కరణ్ తీసిన దాదాపు అన్ని మూవీలలో సందడి చేసిన కాజోల్.. కరణ్ లేటెస్ట్ మూవీలో మాత్రం నటించకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement