హీరోయిన్ భర్తతో వివాదం ముదిరిందా? | Kajol will not be part of Karan Johar latest film | Sakshi
Sakshi News home page

హీరోయిన్ భర్తతో వివాదం ముదిరిందా?

Published Fri, Sep 30 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

హీరోయిన్ భర్తతో వివాదం ముదిరిందా?

హీరోయిన్ భర్తతో వివాదం ముదిరిందా?

ముంబై: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ మూవీ అంటే చాలు కచ్చితంగా ఒక హీరోయిన్ కు అతడి ఫ్రాంచైజీలో అవకాశం ఉంటుంది. పాత్ర చిన్నదా.. పెద్దదా.. లేక అతిథిగా అభిమానులకు కనిపిస్తారా.. అనే తేడా లేకుండా ఆ తార తళుక్కుమంటుంది. అయితే ఇటీవల జరిగిన ఓ మూవీ వివాదం కారణంగా ఆ నటి కరణ్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 'ఏ దిల్ హై ముష్కిల్' లో మాత్రం నటించడం లేదట. ఆమె మరెవరో కాదు బాలీవుడ్‌ నటి కాజోల్‌. కాజోల్ భర్త అజయ్ దేవగణ్ 'శివాయ్'లో హీరోగా నటించడంతో పాటు ఆ మూవీలో పలు బాధ్యతలు తనపై వేసుకున్నాడు.

సాయేశా సైగల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీపై కరణ్ జోహర్ తప్పుడు సంకేతాలు ఇచ్చాడని అజయ్ కొన్నిరోజుల కిందట ఆరోపించాడు. కుచ్ కుచ్ హోతా మై, కబీ కుషీ కబీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, ఇలా కరణ్ తీసిన పలు చిత్రాల్లో కాజోల్ సందడి చేసింది. కానీ భర్త అజయ్ మూవీపై నెగిటివ్ ప్రచారం రావడం, కరణ్ తన మూవీ కోసం ఇలా చేశాడన్న ఆరోపణల్ని కూడా ఈ దర్శకనిర్మాత గట్టిగా ఖండించలేదు. ఈ కారణాల వల్ల కాజోల్ కరణ్ మూవీలో నటించలేదని చెప్పవచ్చు. కరణ్ తాజా మూవీలో ఐశ్వర్యరాయ్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ఇతర ప్రముఖులు కనిపించనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement