Ae Dil Hai Mushkil
-
ఐఫా విజేతలు వీరే..!
బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ (ఐఫా) వేడుక న్యూయార్క్ లో ఘనంగా జరుగుతోంది. బాలీవుడ్ తారాలోకం అంతా పాల్గొంటున్న ఈ షోలో అలియా భట్, కత్రినా కైఫ్, వరుణ్ ధావన్, ఏఆర్ రెహమాన్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్, కరణ్ జోహార్ లు వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్నారు. అందరూ ఊహించినట్టుగానే ధోని, పింక్, నీర్జా చిత్రాలు అవార్డుల పంట పండించాయి. ఇప్పటి వరకు ప్రకటించినా విజేతల వివరాలు... ఉత్తమ దర్శకుడు : అనిరుద్ధా రాయ్ చౌదరి (పింక్) ఉత్తమ సహాయ నటుడు : అనుపమ్ ఖేర్ (ఎమ్ ఎస్ ధోని : అన్‌టోల్డ్ స్టోరీ) ఉత్తమ సహాయ నటి : షభానా అజ్మీ(నీర్జా) ఉత్తమ ప్రతినాయకుడు : జిమ్ స్రభ్(నీర్జా) ఉత్తమ హాస్యనటుడు : వరుణ్ ధావన్ (ఢిష్యుం) ఉత్తమ సంగీత దర్శకుడు : ప్రీతం ( ఏ దిల్ హై ముష్కిల్) ఉత్తమ గాయకుడు : అమోత్ మిశ్రా ( బుల్లయ - ఏ దిల్ హై ముష్కిల్) ఉత్తమ గాయని : కనీకా కపూర్ ( దా దా దాస్సే - ఏ దిల్ హై ముష్కిల్), తులసీ కుమార్ (సోచ్ నా సకే - ఎయిర్‌లిఫ్ట్) ఉత్తమ తొలి చిత్ర నటుడు : దిల్జిత్ దొసాంజ్ ( ఉడ్తా పంజాబ్) ఉత్తమ తొలి చిత్ర నటి : దిశా పటానీ (ఎమ్ ఎస్ ధోని : అన్‌టోల్డ్ స్టోరీ) ఉత్తమ కథ : శకున్ బాట్రా, అయేషా (కపూర్ అండ్ సన్స్) స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ : అలియా భట్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ : తాప్పీ పన్ను (పింక్) 25 ఏళ్లుగా భారతీయ సంగీతాన్ని సేవలందిస్తున్న ఏఆర్ రెహమాన్‌కు స్పెషల్ జ్యూరి అవార్డ్. -
ఆ నటిపై చెడు ప్రచారం చేయలేదు: డైరెక్టర్
ముంబై: వారిది దాదాపు పాతికేళ్లకు పైగా స్నేహం. ఇద్దరి కాంభినేషన్లో కుచ్ కుచ్ హోతా మై, కబీ కుషీ కబీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, లాంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. అయితేనేం ఓ చిన్న ఘటన వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది. దీంతో ఆ నటి ఇక నుంచీ నా జీవితంలో ఉండదు అంటూ తేల్చిపారేశాడు డైరెక్టర్. ఆ ఇద్దరిలో ఒకరు బాలీవుడ్ నటి కాజోల్ కాగా, రెండో వ్యక్తి దర్శకనిర్మాత కరణ్ జోహర్. కాజోల్ భర్త, స్టార్ హీరో అజయ్ దేవగణ్ తనను తీవ్రంగా దూషించాడని కరణ్ జోహర్ అంటున్నాడు. తన భర్య నుంచి ఏదో పార్టీలో తాను ఎవరితోనే తప్పుగా మాట్లాడానంటూ ఆరోపిస్తూ, అజయ్ తనపై మండిపడ్డాడని చెప్పాడు. తమది 25 ఏళ్ల స్నేహమని, తన కుటుంబానికి కాజోల్ అంటే ఎంతో గౌరవమని.. అలాంటిది తన ఫ్రెండ్ గురించి తప్పుగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ దర్శకుడు. శివాయ్ మూవీపై దుష్రచారం చేశానని, అందుకు సినీ విమర్శకులకు రూ.20 లక్షలు ముట్టజెప్పానని తనపై అజయ్ లేనిపోని వదంతులు వ్యాప్తి చేశాడని ఆందోళన చెందుతున్నాడు కరణ్ జోహర్. ఈ ఆరోపణలపై విచారణ జరగాలని అజయ్ ట్వీట్ చేయగా.. తనను అపార్థం చేసుకున్న కాజోల్ దాన్ని రీట్వీట్ చేయడం తనను బాధకు గురిచేసిందని చెప్పుకొచ్చాడు. అజయ్ హీరోగా నటించి, నిర్మించిన శివాయ్, కరణ్ జోహర్ మూవీ 'ఏ దిల్ హై ముష్కిల్' ఒకేరోజు విడుదల కావడం.. అజయ్ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం తెలిసిందే. -
ఆ డైరెక్టర్ నన్ను అసభ్యంగా తాకాడు: అనుష్క
ముంబై: కాఫీ విత్ కరణ్.. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షోలో గాసిప్పులకు కొదవలేదు. గెస్టులను గుచ్చిగుచ్చి అడిగి.. కూపీలాగి మరీ.. వారి సీక్రెట్లు బయటపెట్టే కరణ్.. తాజాగా ఈ షోలో తానే బలయ్యాడు. అతను ఇటీవల అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌తో కలిసి షో నిర్వహించాడు. ఈ షోలో అనుష్క శర్మ పెద్ద షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. కరణ్ తాజాగా తెరకెక్కించిన 'యే దిల్ హై ముష్కిల్' (ఏడీహెచ్‌ఎం) సినిమా షూటింగ్ సందర్భంగా తనను కొన్నిసార్లు అభ్యంతరకరంగా తాకాడని తెలిపింది. అంతకుముందు కరణ్ మాట్లాడుతూ ఏడీహెచ్‌ఎం షూటింగ్ సందర్భంగా తనకు అనుష్కపై ప్రేమ పుట్టిందని పేర్కొంటూ.. 'నేను నీకు పూర్తిగా పడిపోయాను. నీ కోసం ఆ సినిమా చేశాను' అంటూ పేర్కొన్నాడు. ఎంతో ఓపిగ్గా ఇదంతా విన్న అనుష్క ఒకింత అసహనంగా.. 'నేను అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలి. కొన్నిసార్లు అతను నన్ను అభ్యంతరకరంగా తాకాడు' అని పేర్కొంది. దీనికి కత్రిన స్పందిస్తూ 'నీలో కొంత చురుకుదనం తేవడానికి అలా చేసి ఉంటాడు' అని పేర్కొనగా.. అనుష్క మాత్రం వెనుకకు తగ్గలేదు. 'జాక్వలిన్ కూడా నీపై ఫిర్యాదు చేసింది. మనీష్ మల్హోత్రా పార్టీలో నువ్వు ఆమెను అసభ్యంగా తాకావంట' అని పేర్కొంది. దీంతో కత్రిన జోక్యం చేసుకొని ఈ 'లీగల్' తగాదాను ఇక్కడితో ముగించాలని వేడుకొంది. ఇదంతా వీరు సరదా కోసమే చేశారా? లేక నిజంగా ఏదైనా జరిగిందా? అన్నది దేవుడికే తెలియాలి అంటున్నారు బాలీవుడ్ జనాలు. -
ఐష్ కు ఇదే మొదటిసారి
ముంబై: ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ తొలిసారిగా వంద కోట్ల క్లబ్ లో చేరారు. రెండో వారంలో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా వసూళ్లు రూ. 100 కోట్లు దాటాయి. అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రూ. 104.86 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లోనే రూ.73.42 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. కరణ్ జోహార్.. రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ దిల్ హై ముష్కిల్’లో రణబీర్ కపూర్, అనుష్క శర్మ, ఐశ్వర్యరాయ్ ముఖ్యపాత్రల్లో నటించారు. రణబీర్ కపూర్ నటించిన సినిమాలు వందకోట్లు దాటడం ఇది మూడోసారి. యే జవానీ హై దీవానీ, బర్ఫీ ఇంతకుముందు వందకోట్లు వసూలు చేశాయి. అనుష్క శర్మ నాలుగోసారి ఈ ఘనత అందుకుంది. ఆమె నటించిన జబ్ తక్ హై జాన్, పీకే, సుల్తాన్ సినిమాలు భారీ కలెక్షన్లు సాధించాయి. ఐశ్వర్యరాయ్ నటించిన సినిమా వంద కోట్లు వసూలు చేయడం ఇదే మొదటిసారి. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఏ దిల్ హై ముష్కిల్
-
ఐష్ బోల్డ్ సినిమాపై అభి స్పందించాడు
కొద్ది రోజులుగా బాలీవుడ్ సర్కిల్స్‌లో బచ్చన్ ఫ్యామిలీలో ఏదో జరుగుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐష్ నటించిన సన్నివేశాల విషయంలో బచ్చన్ ఫ్యామిలీ గుర్రుగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఏ దిల్ హై ముష్కిల్ సినిమా చూడకపోవటం, సినిమాపై కామెంట్ చేయకపోవటంతో ఈ వాదనకు మరింత బలాన్ని ఇచ్చినట్టయ్యింది. అయితే రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ అభిషేక్ క్లారిటీ ఇచ్చేశాడు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐష్ లుక్ స్టన్నింగ్‌గా ఉందంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు ప్రస్తుతం తాను తన ఫుట్ బాల్ టీం పర్యటనలతో బిజీగా ఉన్న కారణంగా సినిమా చూడలేకపోయానని, అయితే ప్రొడక్షన్ టైం లోనే కొంత సినిమా చూశానని ఐష్ అద్భుతంగా నటించిందని తెలిపాడు. అభిషేక్ కామెంట్స్‌తో బచ్చన్ ఫ్యామిలీ పై వినిపిస్తున్న గాసిప్స్ రకు తెరపడినట్టే అని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
డిలీటెడ్ సాంగ్ ఆన్లైన్లో దుమ్మురేపుతోంది!
-
డిలీటెడ్ సాంగ్ ఆన్లైన్లో దుమ్మురేపుతోంది!
కరణ్ జోహార్ తాజా సినిమా ‘యే దిల్ హై ముష్కిల్' విడుదలకు ముందు అనేక వివాదాలు ఎదుర్కొన్నా.. విడుదలైన తర్వాత మాత్రం అభిమానుల మనస్సు గెలుచుకుంటోంది. ప్రేమలు, విడిపోవడాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలోని కథ కొత్తగా లేకపోయినా.. పాటలు, కరణ్ మ్యాజిక్ జనాలను థియేటర్ల వైపు నడిపిస్తోంది. ఈ సినిమా విజయవంతంగా ఆడుతూ నెమ్మదిగా వందకోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ అభిమానులకు ఓ సర్ప్రైజ్ కానుక ఇచ్చారు. నిడివి కారణంగా ఈ సినిమా నుంచి డిలీట్ చేసిన పాటను తాజాగా యూట్యూబ్‌లో అభిమానులతో పంచుకున్నారు. పారిస్ వీధుల్లో రణ్‌బీర్ కపూర్, అనుష్క మధ్య ఈ హుషారెత్తించే పాటను చిత్రీకరించారు. యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్' అంటూ సాగే ఈ పాటకు నెటిజన్లు నీరాజనం పడుతున్నారు. ఇప్పటికే రెండు లక్షలమందికిపైగా ఈ బ్యూటీఫుల్ పాటను చూశారు. -
ఐశ్వర్యారాయ్‌ని ముట్టుకోవాలంటే చేతులు వణికాయి
ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో తాను ఐశ్వర్యా రాయ్‌తో కలిసి నటించాలని తనకు కరణ్ జోహార్ చెప్పగానే ఒక్కసారి ఆనందంతో గంతులేశానని, కానీ తర్వాత మాత్రం.. అసలు ఆమె తనతో నటిస్తుందా లేదా అన్న అనుమానం కలిగిందని హీరో రణబీర్ కపూర్ చెప్పాడు. 1999లో విడుదలైన 'ఆ అబ్ లౌట్ చలే' అనే సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని, అందులో ఐశ్వర్యారాయ్ నటించిందని రణబీర్ చెప్పాడు. అప్పటినుంచే తామిద్దరం మంచి స్నేహితులమని అన్నాడు. ఏ దిల్.. సినిమా షూటింగ్ సందర్భంగా ఐశ్వర్యను ముట్టుకోవాల్సి వచ్చినప్పుడు మొదట్లో తన చేతులు వణికేవని తెలిపాడు. కానీ ఆ తర్వాత ఐశ్వర్య మాత్రం తనను చాలా కూల్‌గా చేసిందని, చిన్నపిల్లాడిలా వేషాలు వేయడం మానేసి సీన్లో సరిగా నటించాలని చెప్పిందని అన్నాడు. ఆ తర్వాత తనకు కాస్తంత ఆత్మవిశ్వాసం వచ్చిందన్నాడు. ఆ తర్వాతి నుంచి ఇతర హీరోయిన్లతో ఎలా చేస్తానో ఐశ్వర్యతోనూ అలాగే చేశానన్నాడు. ఆమె ఎంత పెద్ద స్టార్ అయినా, సీనియర్ అయినా.. అసలు ఆ ఫీలింగ్ రానివ్వలేదని వివరించాడు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా గతంలో వచ్చిన కభీ అల్విదా నా కెహనా సినిమాకు దగ్గరగా ఉందన్న విమర్శలను రణబీర్ కొట్టిపారేశాడు. ఆ సినిమా వివాహేతర సంబంధాల గురించి ఉంటుందని, ఈ సినిమాలో అసలు తనకు పెళ్లే కాదని తెలిపాడు. ఇది లవ్ స్టోరీ కాదు గానీ, ప్రేమ, ప్రేమ వైఫల్పయం, వెళ్లిపోవడం, పట్టుకోవడం, స్నేహం.. ఇలా అన్నింటి గురించిన స్టోరీ అని అన్నాడు. -
'ఆ సినిమాను ప్రజలు బహిష్కరించాలి'
ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రిలీజ్‌కు ముందు పాకిస్థానీ నటుల కారణంగా బ్యాన్‌కు గురైన ఈ సినిమా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ తరువాత కూడా ఈ సినిమాను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా గోవా డీజీపీ ముఖేష్ చందర్ ఈ సినిమాను ప్రజలు బహిష్కరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వివాదాలతోనే భారీ ప్రచారం పొందిన ఏ దిల్ హై ముష్కిల్ ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుంది. సినిమాలోని ఓ డైలాగ్ లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీని అవమానించేదిగా ఉందని, ఈ డైలాగ్ వల్ల సంగీతాభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న వాదన వినిపిస్తోంది. సినిమాను బహిష్కరించాలంటూ ఏకంగా డీజీపీ స్థాయి వ్యక్తి పిలుపునివ్వటంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. రణబీర్ కపూర్, అనుష్క శర్మతో చెప్పిన 'మహ్మద్ రఫీ..? ఓ గాతే కమ్, రోతే జ్యాదా తే నా..?' అనే డైలాగ్ వివాదానికి కారణం అయ్యింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లతో సత్తాచాటుతున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు ఈ వివాదం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడాలి. -
కరణ్ జోహార్‌పై మరో వివాదం
ముంబై: బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. కరణ్ తాజా సినిమా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ప్రఖ్యాత గాయకుడు మహ్మద్ రఫీని అవమానించారని ఆయన కొడుకు షాహిద్ రఫీ ఆరోపించారు. ఈ సినిమాలో మహ్మద్ రఫీని కించపరిచేలా ఓ డైలాగ్ ఉందని చెప్పారు. నటి అనుష్క శర్మకు 'మహ్మద్ రఫీ పాడరు, ఏడుస్తారు' అనే డైలాగ్ ఉందని, ఇది రఫీని అవమానించడమేనని షాహిద్ అన్నారు. కరణ్ జోహార్ నుంచి ఇలా ఊహించలేదని, ఇది సిగ్గుపడే విషయమని విమర్శించారు. కరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కరణ్ జోహార్ తండ్రి యాష్ జోహార్ కోసం తన తండ్రి ఎన్నో పాటలు పాడారని, అయితే కరణ్ చేసిందేమిటని ప్రశ్నించారు. రఫీ సాబ్ అంటే ఏంటో కరణ్‌కు తెలియదని అన్నారు. లెజండరీ సింగర్ గురించి ఇలాంటి చౌకబారు డైలాగ్ ఏలా రాస్తారని విమర్శించారు. తన తండ్రి అభిమానులు తన ఫేస్బుక్ ఎకౌంట్‌కు 9 వేల మెసేజ్‌లు పంపారని, కరణ్ జోహార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 2న నిరసన చేపడుతామని తెలిపారు. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్‌కు కరణ్ జోహార్ ఏ దిల్ హై ముష్కిల్లో అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాను అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానుల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరణ్ .. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేలను కలసి సినిమా విడుదలకు సహకరించాలని విన్నవించడంతో లైన్ క్లియరైంది. -
థియేటర్లో టపాసులు కాల్చి గందరగోళం
-
థియేటర్లో టపాసులు కాల్చి గందరగోళం
అభిమానానికి కూడా హద్దులు ఉండాలి. అది హద్దు మీరితే ప్రమోదం కాస్తా ప్రమాదంగా మారుతుంది. షారుక్ ఖాన్ అభిమానులు సరిగ్గా ఇలాగే అతి చేశారు. రణబీర్ కపూర్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఒక సన్నివేశంలో బాలీవుడ్ బాద్షా షారుక్ అతిథి పాత్ర పోషించారు. సినిమాలో ఆయనను చూడగానే అభిమానులకు ఒక్కసారిగా పూనకం వచ్చినట్లయింది. ఏకంగా థియేటర్లోనే పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. మహారాష్ట్రలోని మాలెగావ్‌లో గల ఒక థియేటర్లో ఈ ఘటన జరిగింది. హాలు మొత్తం ఒక్కసారిగా టపాసుల మోతలతో దద్దరిల్లింది. ఏం జరుగుతోందో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులకు తెలిసేలోపే మంటలు, పొగ అంతా వ్యాపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వాట్సప్ ద్వారా చేరడంతో షారుక్ అభిమాని ఒకరు దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. దాంతో నువ్వే షూట్ చేశావా అంటూ ట్విట్టర్ జనాలు అతడి మీద మండిపడ్డారు. కానీ.. చివరకు అది షూట్ చేసింది తాను కాదని, ఎవరో వాట్సప్‌లో పంపారని అతడు సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తమ్మీద కొంతమంది అభిమానులు చేసిన అతి కారణంగా సినిమాకు వచ్చిన ప్రేక్షకులంతా నానా ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చిందన్నమాట. Crowd Reaction Video during cameo of @iamsrk in ADHM from Malegaon Nashik, Fucking unbelievable. pic.twitter.com/gTextXkWjx — रईस भाई (@SRKianz) October 28, 2016 -
పండుగనాడు ఆ రెండు సినిమాలు తుస్..
ముంబై: మత్తెక్కించే రొమాంటిక్ సీన్లు, ప్రేమ, వైఫల్యాలు, గాఢమైన అనుబంధాలు కలబోసిన సినిమా ఒకటి. భారీ యాక్షన్ సీన్లు, హిమాలయాల్లో సాహసాలు, కూతురి సెంటిమెంట్ తో తెరకెక్కిన మరో సినిమా. దీపావళి సందర్భంగా విడుదలైన రెండు భారీ బాలీవుడ్ సినిమాలు 'ఏ దిల్ హై ముష్కిల్', 'శివాయ్'లు బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్నాయి. పండుగను క్యాష్ చేసుకోవడంలో రెండు సినిమాలూ విఫలమయ్యాయని, దీంతో ఫ్యాన్సీ రేట్లకు సినిమాలు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే మిగిలిందని సోమవారం బాక్సాఫీస్ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 28న విడుదలైన 'ఏ దిల్ హై ముష్కిల్', 'శివాయ్'లు తొలిరోజు వరుసగా రూ.13.30 కోట్లు, రూ.8.26కోట్ల వసూళ్ల(గ్రాస్)ను రాబట్టాయి. రెండో రోజు, అంటే శనివారం 'ఏ దిల్'కు రూ.13.10కోట్లు, 'శివాయ్'కు 10.06కోట్లు వసూలయ్యాయి. కానీ కీలకమైన దీపావళి (ఆదివారం)పండుగ నాడు మాత్రం రెండు సినిమాల కలెక్షన్లు పడిపోయాయి. దీపావళినాడు 'ఏ దిల్' 9.20 కోట్లు, 'శివాయ్' రూ.8.26 కోట్లు మాత్రమే వసూలు చేశాశాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకొచ్చారు. ఇండియాలో 3000 స్క్రీన్లపై విడుదలైన 'ఏ దిల్'కు విదేశాల్లో మంచి స్పందన లభించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా రూ.40.05 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు 'ఏ దిల్'.. 2016 సంవత్సరంలో విదేశాల్లో భారీ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచిందని రూపకర్తలు ప్రకటించారు. 'ఏ దిల్..' అమెరికాలో 2.1 మిలియన్ డాలర్లు, బ్రిటన్, ఆస్త్రేలియాల్లో వరుసగా 752,000 డాలర్లు, 307,045 డాలర్లు వసూలు చేసిందని నిర్మాతలు తెలిపారు. అయితే సోమ, మంగళవారాల్లో కలెక్షన్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన డిస్ట్రిబ్యూటర్ జోగిందర్ మహాజన్ అన్నారు. -
సినిమా కలెక్షన్లకు దీపావళి దెబ్బ
సాధారణంగా పండుగ సీజన్లో సినిమాలు విడుదల చేస్తే బంపర్ కలెక్షన్లు వస్తాయని హీరోలందరూ తమ సినిమాలను పండుగల కోసం రిజర్వు చేసుకుంటారు. కానీ.. దీపావళి మాత్రం చాలామంది హీరోలకు నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా దీపావళికి ముందు వచ్చిన శుక్ర, శనివారాల్లో చాలా బ్రహ్మాండంగా వచ్చిన కలెక్షన్లు కూడా ఆదివారం, పండుగ కలిసి రావడంతో ఒక్కసారిగా తగ్గిపోయాయి. కుర్రాళ్లందరూ టపాసులు కాల్చుకునే సరదాలో ఉండి సినిమాలను పక్కన పెట్టేశారు. పగటి పూట కూడా లక్ష్మీపూజలు జరగడంతో సాధారణంగా ఆదివారం ఖాళీగా ఉండే వ్యాపార వర్గాలు కూడా సినిమాలకు వెళ్లలేదు. దాంతో కలెక్షన్లకు భారీగా గండి పడింది. ప్రస్తుతం బాలీవుడ్లో గట్టి కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కూడా ఇదే దారిలో నడిచింది. విడుదలైన శుక్రవారం 13.30 కోట్లు, శనివారం 13.10 కోట్లు సాధించిన ఈ సినిమా.. ఆదివారం మాత్రం కేవలం 9.20 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మొదటి వారాంతంలో భారతదేశంలో కలెక్షన్లు 35.60 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపాడు. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ఇది మంచి విజయం సాధించిందని, తొలి వారాంతంలో మొత్తం రూ. 41.05 కోట్ల కలెక్షన్లు సాధించి కరణ్ జోహార్, రణబీర్ కపూర్లకు హయ్యస్ట్ ఓపెనింగ్ వీకెండ్‌గా నిలిచిందని వివరించాడు. దీపావళి పూజలు, పండుగ కారణంగానే ఏ దిల్ హై ముష్కిల్, శివాయ్ రెండు సినిమాలకూ ఆదివారం ఏమాత్రం బాగోలేదని.. సోమ, మంగళవారాల్లో బిజినెస్ పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. #ADHM Fri 13.30 cr, Sat 13.10 cr, Sun 9.20 cr. Total: ₹ 35.60 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 31 October 2016 #ADHM packs a SOLID PUNCH in intl markets... Opening weekend: $ 6.15 million [₹ 41.05 cr]... HIGHEST opening weekend for KJo and Ranbir. — taran adarsh (@taran_adarsh) 31 October 2016 Diwali pooja and festivities made a dent in the biz of #ADHM and #Shivaay on Sun... Biz should witness an UPWARD TREND on Mon and Tue. — taran adarsh (@taran_adarsh) 31 October 2016 -
ఆ హీరో నటన అదుర్స్: ఆమీర్
ముంబై: ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో యువ హీరో రణబీర్ కపూర్ నటన బాగుందని బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ప్రశంసించాడు. దర్శకుడు కరణ్ జోహార్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ట్వీట్ చేశాడు. ‘ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను చూశా. నాకు చాలా బాగా నచ్చింది. బంతి స్టేడియం దాటిపోయేలా కరణ్ కొట్టాడు. రణబీర్, ఐశ్వర్య, అనుష్క నటన బాగుంది. రణబీర్ బెస్ట్ యాక్టర్’ అంటూ ఆమీర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో రణబీర్‌తో పాటు ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. -
రెండో రోజూ భారీ కలెక్షన్లు
న్యూఢిల్లీ: కరణ్ జోహార్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్ రెండో రోజూ భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాకు శనివారం 13.10 కోట్ల రూపాయలు (నెట్) వచ్చాయి. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం 26.40 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. దీపావళి కానుకగా శుక్రవారం 3 వేల స్క్రీన్లపై విడుదలైన ఏ దిల్ హై ముష్కిల్ తొలి రోజు దేశంలో 13.30 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్ నటించారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. కాగా పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. -
ఆ రెండు సినిమాలకు భారీ కలెక్షన్లు
ముంబై: కరణ్ జోహార్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్, అజయ్ దేవగణ్ చిత్రం శివాయ్ బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి. దీపావళి కానుకగా శుక్రవారం విడుదలైన ఈ రెండు సినిమాలు భారీగా ఓపెనింగ్ కలెక్షన్లు సాధించాయి. 3 వేల స్క్రీన్లపై విడుదలైన ఏ దిల్ హై ముష్కిల్ తొలి రోజు దేశంలో 13.30 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. ఈ సినిమాలో రణవీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్ నటించారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఇక స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నటించిన శివాయ్ తొలిరోజు 10.24 కోట్లు వసూలు చేసింది. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో భారీ కలెక్షన్లు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళన చేశారు. -
అవసరమైతే రాజ్‌ఠాక్రేపై చర్యలు: సీఎం
ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదల, ప్రదర్శన విషయంలో చట్టాన్ని ఉల్లంఘిస్తే.. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు ఆమోదం తెలిపిందంటే.. ఇక ఎవరూ ఆ సినిమా విడుదలను అడ్డుకోవడానికి వీల్లేదని, చట్టాన్ని ఉల్లంఘించడానికి ఏ ఒక్కరినీ అనుమతించేది లేదని ఫడ్నవిస్ అన్నారు. రాజ్‌ఠాక్రే ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు చేస్తే.. ఆయనపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సినిమా నిర్మాతలు తప్పనిసరిగా ఆర్మీ సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం ఇవ్వాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకించినట్లు సీఎం ఫడ్నవిస్ తెలిపారు. వాళ్లు కావాలంటే స్వచ్ఛందంగా ఇచ్చుకోవచ్చన్నారు. చట్టబద్ధంగా ఎవరైనా పాకిస్థానీ నటులు తగిన పత్రాలతో భారతదేశానికి వస్తే, వాళ్లకు తమ ప్రభుత్వం చట్టప్రకారం భద్రత కల్పిస్తుందని కూడా ఆయన తెలిపారు. కాగా, పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా.. విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. పలు ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. -
నేను చాలా ప్రాక్టికల్: హీరోయిన్
ముంబై: తొలిచూపులోనే ప్రేమలో పడడంపై తనకు నమ్మకం లేదని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తెలిపింది. తాను గుడ్డిగా ప్రేమలో పడనని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. 'నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. తొలిచూపులోనే గుడ్డిగా ప్రేమలో పడను. మొదటి చూపులోనే ప్రేమ కలుగుతుందో నాకు అర్థం కాదు. ఎవరైనా అబ్బాయిలు నన్ను ప్రేమిస్తున్నామని చెబితే వారిని స్నేహితులుగానే భావిస్తాన'ని అనుష్క పేర్కొంది. ఆమె నటించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో అక్టోబర్ 28న విడుదలకానుంది. ప్రేమలో విఫలమైన యువతిగా ఈ సినిమాలో కనిపించనుంది. నిజజీవితంలో ఎప్పుడైనా ప్రేమలో విఫలమయ్యారా అని ప్రశ్నించగా... 'నేను చాలా ప్రాక్టికల్. ఎప్పుడూ ప్రేమలో విఫలం కాలేదు. నేను అంత తొందరగా ప్రేమలో పడను. నేను కాలేజీ చదివే రోజుల్లో నా ఫ్రెండ్స్ చాలా మంది లవ్ లో పడ్డారు. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పడానికి నేను ఇష్టపడను. అలాగే ఇతరుల వ్యక్తిగ విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఆరోగ్యం బాగా చూసుకోవాలని మా అమ్మానాన్న, సోదరుడికి మాత్రం సలహాయిస్తాన'ని అనుష్క శర్మ స్పష్టం చేసింది. -
ముఖ్యమంత్రిగా ఆ పని చేయడం తప్పా!
'ముఖ్యమంత్రి బ్రోకర్లా మారారు.. పాకిస్థానీలకు వత్తాసు పలుకుతున్నారు' అని మిత్రపక్షం శివసేన చేస్తోన్న తీవ్ర ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల విషయంలో నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించే దిశగా సీఎం.. దర్శకనిర్మాతలకు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సీఎంతో భేటీ తర్వాత రాజ్ ఠాక్రే 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' అని డిమాండ్ చెయ్యడంతో అందరితోపాటు ఫడ్నవిస్ కూడా ఖంగుతిన్నారట! తన అధికారిక నివాసం 'వర్ష'లో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం అసలేంజరిగిందో చెప్పుకొచ్చారు.. (సీఎం సమక్షంలో సినిమా వివాదానికి తెర!) 'నా ముందు రెండు దారులున్నాయి. ఒకటి.. ఆ సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం. తద్వారా పండగ(దీపావళి)పూట పోలీసులు కుటుంబాలకు దైరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఆందోళనలు దారితప్పితే కొత్త సమస్యలు తలెత్తుతాయి. అందుకే నేను రెండో దారి.. అంటే చర్చలకు మొగ్గుచూపా. ఇరుపక్షాలను పిలిపించా. అక్కడ రాజ్ ఠాక్రే మూడు డిమాండ్లు మా ముందుంచారు. అందులో రెండింటికి(ఉడీ అమరజవాన్లకు నివాళులు అర్పించడం, భవిష్యత్ లో పాక్ నటులను తీసుకోకపోవడం) ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇక మూడోదైన 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' డిమాండ్ ను మాత్రం నేను అక్కడికక్కడే ఖండించా. సైనిక సహాయనిధికి విరాళాలు డిమాండ్ చేయడం సరికాదని రాజ్ ఠాక్రేను వారించా' అని ఫడ్నవిస్ చెప్పారు. చర్చల ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టిన తనను అభినందించాల్సిదిపోయి విమర్శలు గుప్పించడం అజ్ఞానమన్న సీఎం ఫడ్నవిస్.. కశ్మీర్ వేర్పాటువాదులతోనూ, తీవ్రవాదులతోనూ ప్రభుత్వాలు చర్చలు జరపడంలేదా?అని ప్రశ్నించారు. అమరజవాన్ల కుటుంబాలకు బాసటగా నిలవడంలో తప్పులేదని, అయితే అలా చేయాలని డిమాండ్ చేయడం మాత్రం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఎంఎన్ఎస్ పట్ల ప్రభుత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉందన్న విమర్శలు అర్థంలేనివని అన్నారు. -
లాస్ రాకూడదని.. డైరెక్టర్‌కు చెక్ పంపాడు!
‘మీ సినిమా చూడటం ఇష్టంలేదు. అయినా ఈ సినిమా వల్ల మీరు నష్టపోవడం సాటి వ్యాపారవేత్తగా నాకు బాధ కలిగిస్తోంది. అందుకే ఈ చెక్కు పంపిస్తున్నా’ అంటూ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త రూ. 350 చెక్కును కరణ్ జోహార్‌కు పంపించాడు. (ఆ సీన్ కట్.. అప్పుడే మొదలైన లీకులు!) పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించినందుకు ‘యే దిల్ హై ముష్కిల్’ విడుదలపై ఎమ్మెన్నెస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో చర్చలతో ఈ సినిమా విడుదలకు ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే అంగీకరించారు. అయితే, భవిష్యత్తులో పాక్ నటులతో సినిమాలు తీయవద్దని, పాక్ నటులతో సినిమాలు తీస్తే.. రూ. 5 కోట్లు భారత ఆర్మీ సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని రాజ్ ఠాక్రే షరతులు పెట్టారు. ఇందుకు కరణ్ జోహార్, బాలీవుడ్ నిర్మాతల సంఘం ఒప్పుకోవడంతో వివాదానికి తెరపడింది. పాక్ నటులతో నిర్మితమైన కరణ్ జోహార్ సినిమాలు ’యే దిల్ హై ముష్కిల్’, ’డియర్ జిందగీ’ సినిమాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే, అంతకుముందు తన సినిమాల విడుదలకు అడ్డంకులు కల్పించవద్దని సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియోలో కరణ్ జోహార్ అభ్యర్థించారు. ఇలా అడ్డుకోవడం వల్ల తాను భారీగా నష్టపోతానని వాపోయారు. దీంతో కరణ్ జోహార్ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆయన ముఖం చూసి ఓ వ్యాపారవేత్త సినిమా చూడకూండానే చెక్కు పంపించారనే శిల్పీ తివారీ ట్విట్టర్లో వెల్లడించారు. కళ కోసం కాకుండా తనకొచ్చే నష్టాల కోసం కరణ్ బాధపడ్డారని, అందుకే ఆయన సినిమా చూడాలనే ఉద్దేశం లేకపోయినా.. ఆయన నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండు టికెట్ల ధర (రూ. 160 చొప్పున)ను ఆయనకు పంపిస్తున్నట్టు ఆ వ్యాపారవేత్త తన లేఖలో తెలిపారు. -
ఆ సీన్ కట్.. అప్పుడే మొదలైన లీకులు!
కరణ్ జోహార్ ఏ ముహూర్తంలో ’యే దిల్ హై ముష్కిల్’ ని ప్రారంభించాడో కానీ.. ఆ సినిమాను అన్నీ కష్టాలే చుట్టుముడుతున్నాయి. పాకిస్థాన్ నటుడు నటించినందుకు ఈ సినిమాపై నిషేధం విధించాలన్న డిమాండ్ పెద్ద దుమారం రేపింది. ఈ విషయంలో ముందస్తుగా రాజీ కుదుర్చుకొని ఎలాగోలా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇంతలో లీకులు, పైరసీ కష్టాలు సినిమాను చుట్టుముడుతున్నట్టు కనిపిస్తోంది. ’యే దిల్ హై ముష్కిల్’ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర సెన్సార్ సర్టిఫికేట్, సెన్సార్ రిపోర్ట్ లీకైంది. కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ప్రకారం.. 13 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల తోడు ఉంటేనే ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. రణ్‌బీర్ కపూర్, ఐశ్యర్యరాయ్, అనుష్క శర్మ, ఫవాద్ ఖాన్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాలో పలు ఘాటు సన్నివేశాలు ఉన్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే చిత్రయూనిట్ రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్య హాట్ హాట్ ఫొటోలను విడుదల చేసింది. అయితే, లీకైన సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో మొత్తం మూడు కత్తెరలు పడ్డాయి. అనుష్క ఘాటైన ముద్దు సన్నివేశాన్ని కొంత కట్ చేశారు. పెదవులతో పెదవులను పేనవేసుకొని లిప్‌లాక్ చేసే ఈ సన్నివేశాన్ని సగానికి తగ్గించారు. అలాగే ’కిస్కా జాదా హాట్ హై’ అనే డైలాగ్‌ను ’కౌన్ జాదా హాట్ హై’గా మార్చారు. -
సీఎంపై సీనియర్ నటి మండిపాటు!
'యే దిల్ హై ముష్కిల్' (ఏడీహెచ్‌ఎం) సినిమా విడుదల విషయంలో ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే, చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీ కుదిర్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించినందుకు ఈ సినిమాపై ఎమ్మెన్నెస్ నిషేధం విధించింది. సీఎం సమక్షంలో జరిగిన చర్చల నేపథ్యంలో ఏడీహెచ్ఎంపై నిషేధం ఎత్తివేసేందుకు రాజ్ ఠాక్రే అంగీకరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాక్ నటులతో సినిమాలు తీయవద్దని, అలా సినిమాలు తీస్తే రూ. ఐదు కోట్లు భారత ఆర్మీ జవాన్ల సంక్షేమ నిధికి ఇవ్వాలని రాజ్ ఠాక్రే షరతులు పెట్టారు. అయితే, ఈ విషయంలో సీఎం స్థాయి వ్యక్తి రాజీయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఫడ్నవిస్ తీరును బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా తప్పుబట్టారు. 'ఎంత దారుణమైన పరిస్థితి ఇది! సీఎం బ్రోకరిజం చేసి రూ. 5 కోట్లకు దేశభక్తిని కొనుగోలు చేశారు. ఏడీహెచ్‌ఎం శాంతియుతంగా విడుదల అయ్యేలా చూస్తామని ఏకంగా కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చాక కూడా ఇలా జరిగింది’ అని షబానా వరుస ట్వీట్లలో మండిపడ్డారు. ’నేను దేశభక్తురాలినా? కాదా? అన్నది ఎమ్మెన్నెస్ నిర్ణయిస్తుందా? నేను రాజ్యాంగానికి బద్ధురాలిని కానీ, రాజ్ ఠాక్రేకు కాదు. నిజానికి ఆయన దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. 'యే దిల్ హై ముష్కిల్’ విడుదలకు కేంద్రహోంమంత్రి హామీ ఇచ్చినా ఆయనపై సీఎం ఫడ్నవిస్ ఏమాత్రం గౌరవం చూపలేదని, ఆయన నుంచి బీజేపీ వివరణ అడగాలని ఆమె డిమాండ్ చేశారు. -
ఆ సీన్లు కట్ చేయలేదు: కరణ్
ముంబై: బాలీవుడ్ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్'లో రణబీర్ కపూర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ హాట్ సీన్స్ ను సెన్సార్ బోర్డు కట్ చేసిందని వచ్చిన వార్తలను దర్శకనిర్మాత కరణ్ జోహార్ తోసిపుచ్చారు. ఇవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. రణబీర్, ఐశ్వర్యరాయ్ నట్టించిన సన్నివేశాలపను సెన్సార్ బోర్డు తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. అనుష్క శర్మ, ఐశ్వర్యరాయ్ తో కలిసి జియో ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'సినిమాలోని సారాంశాన్ని సెన్సార్ బోర్డు అర్థం చేసుకుంది. అందుకే ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. ట్రైలర్ చూపించిన సన్నివేశాలు సినిమాలోనూ ఉంటారు. ఎటువంటి ముద్దు సన్నివేశాలు లేవు. కేవలం కళ్ల ద్వారా మాత్రమే భావాలు ప్రకటింపజేశాం. తన పాత్రకు అనుగుణంగానే ఐశ్వర్య నటించింద'ని కరణ్ జోహార్ అన్నారు. తాను బోల్డ్ గా నటించాననడం కరెక్ట్ కాదని ఐశ్వర్యరాయ్ అంది. 'ఈ సినిమాలో సన్నివేశాలు హుందాగా ఉన్నాయి. రెండు పాత్రల మధ్య సంబంధం ఆధారంగా మాత్రమే ఈ సన్నివేశాలను చూడాలి. ఆ పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంద'ని చెప్పింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా అక్టోబర్ 28న విడుదలకు సిద్ధమవుతోంది. -
రణవీర్‌తో రొమాన్స్ సీన్లు అలా ఉండవు: ఐష్
ముంబై: ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో హీరో రణవీర్ కపూర్‌తో తాను నటించిన రొమాన్స్ సన్నివేశాలపై అందాలతార ఐశ్వర్యా రాయ్ వివరణ ఇచ్చింది. ఈ దృశ్యాలు అసభ్యకరంగా ఉండవని, కళాత్మకంగా ఉంటాయని చెప్పింది. విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లో ఐష్ హాట్‌హాట్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. పొట్టి దుస్తులు వేసుకుని రణవీర్ పక్కన ఐష్ రెచ్చిపోవడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. అంతేగాక రణవీర్, ఐష్ నటించిన కొన్ని రొమాన్స్ దృశ్యాలను సెన్సార్ బోర్డు కట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో తాను ఎక్కడా పరిధిదాటి నటించలేదని ఐష్ అంటోంది. 'ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. దర్శకుడి సలహా మేరకు హుందాగా నటించాను. హీరో రణవీర్‌తో కలసి చేసిన ఆన్ స్ర్కీన్ రొమాన్స్ కళాత్మకంగా ఉంటుంది. దీని గురించి నేను ఆందోళన చెందడం లేదు' అని ఐష్ చెప్పింది. దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఐశ్వర్య తన పాత్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, అద్భుతంగా నటించిందని చెప్పాడు. ఈ సినిమాలో స్కిన్ షో లేదా లిప్ లాక్ సన్నివేశాలు లేవని తెలిపాడు. -
ఫడ్నవీస్‌తో రాజ్ ఠాక్రే, కరణ్ జోహార్ భేటీ
ముంబయి: ‘ఏ దిల్ హై ముష్కిల్’ పంచాయితీ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు చేరింది. పాకిస్తాన్ నటులు నటించిన ఈ చిత్రాన్ని బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరికల నేపథ్యంలో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే, నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ శనివారం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ముఖేష్ భట్ మాట్లాడుతూ భవిష్యత్‌లో పాకిస్తాన్ నటులతో సినిమాలు తీయమని సీఎంకు హామీ ఇచ్చామన్నారు. అలాగే సినిమా ప్రారంభంలో అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ న్యూస్ రీల్‌ను ప్రదర్శించనున్నట్లు కరణ్ జోహార్ ఈ సందర్భంగా ఫడ్నవీస్‌కు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఎట్టకేలకు ఏ దిల్ హై ముష్కిల్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కాగా దీపావళి సందర్భంగా దిల్ హై ముష్కిల్ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. -
ఆ సినిమాను నిషేధించాల్సిందే..
ముంబై : ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలపై వివాదం మరింత ముదురుతోంది. ఆ సినిమా విడుదల విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తేల్చి చెబుతోంది. పోలీసులు కేసులో పెట్టినా తాము భయపడేది లేదని ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను నిషేధించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బాలీవుడ్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కరణ్ జోహర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో పాకిస్థాన్ నటుడు పవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకనిర్మాత మహేశ్ భట్ నేతృత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు గురువారం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చారు. కేంద్రం హామీ ఇచ్చినా ఎమ్ఎన్ఎస్ మాత్రం తన పట్టు వీడటం లేదు. -
దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్టిస్టులు నటించిన సినిమాల వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలు, ఆర్టిస్టులకు తన మద్దతు కచ్చితంగా ఉంటుందని ట్వీట్ చేసిన దిగ్విజయ్.. కేవలం పాక్ ఆర్టిస్టులను మాత్రమే ఎందుకు నిషేధిస్తున్నారని ప్రశ్నించారు. అంతగా అవసరమైతే దాయాది పాక్ ను అన్నిరంగాల్లోనూ నిషేధిస్తే తప్పేముంది అని మరో ప్రశ్న సంధించారు. ఇరుదేశాల మధ్య ఎన్నో సమస్యలు ఉండగా కేవలం పాక్ ఆర్టిస్టులు మాత్రమే ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. భారత్-పాక్ దేశాలకు ఆర్టిస్టులే బాండ్ అంబాసిడర్లు అని వారిని కొనియాడారు. పాకిస్తాన్ తో భారతీయులకు నేరుగా సంబంధాలు లేని పక్షంలో నిషేధం లాంటివి వాడాలి, అలా కాని పక్షంలో ఆర్టిస్టులు లేదా ఇతర రంగాలకు చెందిన వారిపై నిషేధం విధించడం ఉత్తమమని దిగ్విజయ్ వరుస ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్న చాలా మందితో పాటు రాజకీయ నాయకులు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా వివాదం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ వద్దకు తీసుకెళ్లగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మూవీ రిలీజ్ అవుతుందని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. I fully support Bollywood's stand on Filmmakers. Why punish only Artists ? Why not ban any kind of relationship with Pakistan ? — digvijaya singh (@digvijaya_28) 21 October 2016 We must open dialogue with Pakistan and also not unnecessarily target Artists on both sides. They can be best of Ambassadors on both sides. — digvijaya singh (@digvijaya_28) 21 October 2016 -
బెదిరింపులు వద్దనుకున్నా: హీరో
ముంబై: హిందీ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్' వివాదంపై తన అభిప్రాయాలను వెల్లడించలేనని బాలీవుడ్ హీరో, ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తన అభిప్రాయాలను వెల్లడించి ప్రమాదాలు కొనితెచ్చుకోలేనని అన్నారు. 'ఈ వివాదంపై నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. నేను గనక నా అభిప్రాయాలు వెల్లడిస్తే కొంతమంది మా ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నిస్తారని నాకు భయం. దాడులు చేస్తామన్న హెచ్చరికలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నా అభిప్రాయాలను నాలోనే దాచుకుంటున్నాన'ని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా, పాకిస్థాన్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని ధియేటర్ల యజమానుల సంఘం చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆమిర్ ఖాన్ నిరాకరించాడు. దీని గురించి ధియేటర్ల యజమానుల సంఘాన్నే అడగాలని అన్నాడు. -
'కరణ్ ఎటువంటి తప్పుచేయలేదు'
ముంబై: సినిమాలను టార్గెట్ చేయడం బాధాకరమని దర్శకురాలు జోయ అక్తర్ అన్నారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాపై వివాదం రేగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ఎటువంటి తప్పుచేయలేదని, చట్టాలను ఉల్లంఘించలేదన్నారు. భారత్-పాకిస్థాన్ సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ చేశాడని వెల్లడించారు. సినిమా విడుదల సమయానికి పరిస్థితులు మారిపోవడంతో అతడిపై దాడి చేస్తున్నారని వాపోయారు. పాకిస్థాన్ నటీనటులకు కేంద్ర ప్రభుత్వమే వీసాలు మంజూరు చేసిందని గుర్తుచేశారు. పాక్ కళాకారులు ఇక్కడ చట్టబద్దంగానే పనిచేస్తున్నారని చెప్పారు. ఎటువంటి సెన్సార్ రిష్ అయినా బాధాకరమని నటి కల్కీ కొచ్లిన్ అన్నారు. ఏ సినిమా చూడాలో, చూడకూడదో ఎంచుకునే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని ధియేటర్ల యజమానుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరూ ఈవిధంగా స్పందించారు. -
'ఆ సినిమాపై హోంమంత్రి వందశాతం భరోసా'
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ సినిమా విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీయిచ్చారు. దర్శకనిర్మాత మహేశ్ భట్ నేతృత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు గురువారం రాజ్ నాథ్ ను కలిశారు. భేటీ ముగిసిన తర్వాత మహేశ్ భట్ విలేకరులతో మాట్లాడుతూ... హోంమంత్రి తమకు వందశాతం భరోసాయిచ్చారని తెలిపారు. 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు అడ్డంకులు లేకుండా చూడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరాతానని తమతో రాజ్ నాథ్ చెప్పినట్టు వెల్లడించారు. సినిమా విడుదలవుతున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తానని హామీయిచ్చినట్టు చెప్పారు. ఈ సినిమా చూడొద్దనుకున్న వారిని తాము బలవంతం చేయడం లేదని, అలాగే సినిమా చూసేందుకు వచ్చే వారిని అడ్డుకోవడం సరికాదని మహేశ్ భట్ అన్నారు. మన సినిమాలు, టీవీ కార్యక్రమాలను పాకిస్థాన్ అడ్డుకోవడం పెద్ద విషయం కాదన్నారు. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంటాయని, పాకిస్థాన్ లో విడుదల చేయకున్నా పెద్దగా నష్టం ఉండదని వివరించారు. కరణ్ జోహార్ తెరకెక్కించిన 'ఏ దిల్ హై ముష్కిల్'లో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సినిమా విడుదలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ముంబై: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ తీసిన 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలపై ఇప్పటివరకూ ఉన్న ఎన్నో సందేహాలకు మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఫుల్ స్టాప్ పెట్టారు. సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు ఎదురవ్వకుండా చూసుకుంటామని పోలీసుశాఖ హామీ ఇచ్చినా కొందరు ఆందోళనకారుల తీరుతో మూవీ యూనిట్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో మూవీ విడుదలకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ఒకవేళ సినిమా విడుదలకు అవాంతరం కలుగజేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తేలేదని సీఎం తేల్చి చెప్పారు. మెట్రో సినిమా వద్దకు వెళ్లి 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదల చేయవద్దని హెచ్చరించిన 12 మంది మహారాష్ట్ర నవ నిర్మాణసేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆ ఆందోళనకారులను నవంబర్ 4 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వెల్లడించారు. 'ఏ దిల్ హై ముష్కిల్' ఈ నెల 28న విడుదల కానుందని మూవీ యూనిట్ ఇదివరకే ప్రకటించింది. తన సినిమాలో 300 మందికి పైగా భారతీయ సిబ్బంది పనిచేశారని, వాళ్లను ఇబ్బంది పెట్టొద్దని కరణ్ జోహర్ కోరారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ కేవలం 4 నిమిషాల నిడివిలో మాత్రమే మూవీలో కనిపిస్తాడని, అందరూ తమకు సహకరించాలని మరో నిర్మాత విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో సినిమాల విడుదల విషయంలో ఎంఎన్ఎస్ ఏం చేయగలదో ఈ సినిమా నిర్మాతలు తెలుసుకుంటారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు హెచ్చరించిన విషయం తెలిసిందే. -
కరణ్‌కు తప్పని సినిమా కష్టాలు
కరణ్ జోహార్ తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని పోలీసులు హామీ ఇచ్చినా.. మళ్లీ మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి మరో హెచ్చరిక జారీచేసింది. మల్టీప్లెక్సులలో ఎక్కడైనా ఆ సినిమాను ప్రదర్శిస్తే బాగోదని హెచ్చరించింది. సినిమాకు వ్యతిరేకంగా తాము నిర్వహించే నిరసన ప్రదర్శనలను అడ్డుకున్నా, సినిమా ప్రదర్శన ఆపేందుకు చేసే తమ ప్రయత్నాలకు విఘాతం కలిగించినా వాళ్లను చితక్కొట్టడం ఖాయమని ఎంఎన్ఎస్ అధికార ప్రతినిధి అమే ఖోప్కర్ తెలిపారు. మహారాష్ట్రలో సినిమాల విడుదల విషయంలో ఎంఎన్ఎస్ ఏం చేయగలదో ఈ సినిమా నిర్మాతలు తెలుసుకుంటారని ఎంఎన్ఎస్ నాయకురాలు షాలినీ ఠాక్రే కూడా అన్నారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడే వరకు తాను పాకిస్థానీ నటీనటులతో తాను సినిమాలు చేయబోనని కరణ్ జోహార్ మంగళవారం ఒక వీడియోప్రకటన ద్వారా తెలిపారు. తన సినిమాలో 300 మందికి పైగా భారతీయ సిబ్బంది పనిచేశారని, వాళ్లను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. మరోవైపు సినిమా పంపిణీ హక్కులు దక్కించుకున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కూడా కరణ్‌కు మద్దతుగా ముందుకొచ్చింది. భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడిని తాము ఖండిస్తున్నామని, అయితే.. కరణ్ జోహార్ కూడా మంచి దేశభక్తుడని ఆ సంస్థ ప్రతినిధి అన్నారు. అతడి జాతీయతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో పాకిస్థానీ నటుడైన ఫవాద్ ఖాన్ కేవలం 4 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని, అందువల్ల ఈ సినిమా విడుదల అయ్యేందుకు సహకరించాలని ప్రముఖ దర్శక నిర్మాత ముకేష్ భట్ ఎంఎన్ఎస్ను కోరారు. సినిమా మీద ఇప్పటికే చాలా ఖర్చుపెట్టినందున దీపావళి సీజన్‌ను దయచేసి పాడుచేయొద్దని విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలోని సింగిల్ థియేటర్ల యజమానుల సంఘం కూడా తాము ఈ సినిమాను ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో.. సినిమా భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి. -
కాళ్ల బేరానికి వచ్చిన కరణ్ జోహార్
-
ఒక్క హిట్టులేక డబ్బులన్నీ పొగొట్టుకున్నా!
ఇటీవలికాలంలో ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. బాక్సాఫీస్ వద్ద నేను ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. ఈ సినిమా హిట్ అయితే.. జైలు నుంచి విడుదలైన భావన కలుగుతుంది. కొంచెం ఉపశమనంతో, ప్రశాంతతతో రాబోయే సినిమాల్లో పనిచేస్తా.. ఇది బాలీవుడ్ రణ్‌బీర్ కపూర్ ఆవేదన. ఒకప్పుడు వరుస విజయాలతో ఖాన్ త్రయంతో తర్వాత ఆ స్థాయి బాలీవుడ్ సూపర్ స్టార్‌గా రణ్‌బీర్ ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ ఊహించనిరీతిలో ఎదురైన వరుస పరాజయాలు రణ్‌బీర్ కెరీర్‌ను తీవ్రంగా కుంగదీశాయి. ఈ నేపథ్యంలో తన తాజా సినిమా ‘యే దిల్ హై ముష్కిల్’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ ఉండటంతో విడుదల కోసం అనేక చిక్కులు ఎదుర్కొంటున్నది. దీపావళి కానుకగా మరో పది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కొన్ని థియేటర్ల సంఘాలు నిషేధం విధించాయి. ఈ పరిణామాలు ఇలా ఉండగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రణ్‌బీర్ ‘యే దిల్ హై ముష్కిల్’ హిట్ కోసం తానెంత ఆశగా ఎదురుచూస్తున్నాడో తెలిపాడు. ‘నా గత సినిమాకు ఈ సినిమాకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. నా చివరి సినిమా ’తమాషా’ గత ఏడాది నవంబర్‌లో విడుదల కాగా.. ఇప్పుడు తాజా సినిమా వస్తోంది. నా సినిమాలు బాగా ఆడటం లేదన్న అభిప్రాయం కారణంగా ‘యే దిల్ హై ముష్కిల్’ విషయంలో ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నా. నేను బాక్సాఫీస్ వద్ద ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. ఒక హిట్టు వస్తే నాకు ఉపశమనం లభిస్తుంది. జైలు నుంచి విడుదలైన భావన కలుగుతుంది. ప్రశాంతంగా రాబోయే సినిమాల కోసం పనిచేస్తా’ అని రణ్‌బీర్ వివరించాడు. కాగా, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఐశ్యర్యరాయ్, రణ్‌బీర్ కపూర్ సాన్నిహిత్యంగా ఉన్న హాట్‌హాట్ ఫొటోలను విడుదల చేశారు. -
కాళ్ల బేరానికి వచ్చిన కరణ్ జోహార్
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఎట్టకేలకు కాళ్లబేరానికి వచ్చాడు. కొంతమంది తనను జాతి వ్యతిరేకిగా ముద్రవేయడంతో చాలా బాధపడ్డానని, అందుకే ఇన్నాళ్లూ బయటకు రాలేదని అన్నాడు. పాకిస్థానీ హీరో నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు చిక్కులు ఎదురు కావడంతో మొదట్లో కళాకారులు వేరు, దేశాల మధ్య గొడవలు వేరన్న కరణ్.. ఇప్పుడు తన సినిమా విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో సందేశం ఒకటి పెట్టాడు. ఉగ్రవాదాన్ని తాను గట్టిగా ఖండిస్తానని, మన సైన్యాన్ని గౌరవిస్తానని.. తనకు దేశమే ముఖ్యమని అన్నాడు. ఇన్నాళ్ల బట్టి తీవ్రంగా బాధపడటం వల్లే మౌనంగా ఉన్నట్లు చెప్పాడు. పాకిస్థాన్‌కు చెందిన ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా నిజానికి దీపావళికి విడుదల కావాల్సి ఉంది. అయితే, 450 మంది సినిమా థియేటర్ల యజమానుల సంఘం కూడా పాకిస్థానీ నటులున్న సినిమాలను ప్రదర్శించేది లేదని స్పష్టం చేసింది. మొదట్లో కేవలం ఎంఎన్ఎస్ మాత్రమే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినా.. తర్వాత క్రమంగా అది కాస్తా ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయింది. పాకిస్థానీ నటీనటులంతా 48 గంటల్లోగా దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే హెచ్చరించారు. తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ల యజమానుల సంఘం సైతం సినిమాను ప్రదర్శించేది లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఎక్కువగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు. కశ్మీర్‌లోని ఉడి ప్రాంతంలో పాక్ మూకలు ఉగ్రదాడికి పాల్పడి 19 మంది సైనికులను కిరాతకంగా హతమార్చడం.. ఆ తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాతల మండలి ఒకటి భారతీయ సినిమాల్లో పాకిస్థానీ నటీనటులు చేసేందుకు వీల్లేదంటూ నిషేధం కూడా విధించింది. దానికి ప్రతీకారంగా.. భారతీయ సినిమాలను తాము ప్రదర్శించేది లేదని పాకిస్థాన్‌కు చెందిన థియేటర్ యజమానులు ప్రకటించారు. దాంతో.. ఫవాద్ఖాన్ను సినిమా నుంచి తప్పించకపోతే ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ఆడనిచ్చేది లేదని కరణ్ జోహార్‌కు బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో బాలీవుడ్ పరిశ్రమ చాలావరకు కరణ్‌కు అండగా నిలిచింది. అయినా ప్రయోజనం లేకపోయింది. పార్టీలు కాకుండా థియేటర్ యజమానులు సైతం సినిమాను ప్రదర్శించబోమని చెప్పడంతో.. ఇప్పుడు కరణ్ జోహార్ కాళ్ల బేరానికి వచ్చాడు. దేశభక్తిని ప్రదర్శించడానికి ఉత్తమ మార్గం ప్రేమను పంచడమేనని, అది తాను తన సినిమాల ద్వారా చేస్తున్నానని అన్నాడు. తాను ఏ దిల్ హై ముష్కిల్ సినిమా తీసేటప్పటికి ఇరు దేశాల సంబంధాలు బాగానే ఉండేవని, ప్రభుత్వం కూడా పాకిస్థాన్‌తో స్నేహ సంబంధాల కోసమే ప్రయత్నించిందని కరణ్ తన వీడియో సందేశంలో చెప్పాడు. కానీ ఇప్పుడు సెంటిమెంట్లు వేరుగా ఉన్నాయని, వాటిని తాను గౌరవిస్తానని అన్నాడు. ఇక మీదట తాను పాకిస్థానీ నటీనటులతో సినిమాలు చేయబోనని.. కానీ, తన సినిమాలో దాదాపు 300 మందికి పైగా భారతీయులు కూడా పనిచేశారని అన్నాడు. వాళ్లంతా తమ రక్తం, చెమట ధారపోశారని చెప్పాడు. వాళ్లు ఇబ్బంది పడటం సరికాదని భావిస్తున్నట్లు తెలిపాడు. అలా పరోక్షంగా.. తన సినిమా విడుదలకు ఆటంకాలు కలిగించవద్దని కోరాడు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే. -
హీరోహీరోయిన్ల స్టన్నింగ్ ఫొటో
అదిరిపోయే రొమాంటిక్ సీన్లలో అద్భుతమైన కెమెస్ట్రీని పండించిన ఐశ్వర్యరాయ్, రణ్ బీర్ సింగ్ లు 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా అంచనాలను అమాంతం పెంచేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాగ్స్, ట్రైలర్స్ లో ఐశ్వర్య రెచ్చిపోయి నటించగా.. ప్రస్తుతం సోషల్ మీడియలో సంచలనం రేపుతోన్న ఫొటోలోనూ అందేస్థాయిలో కనిపించారు. ఐశ్వర్య, రణ్ బీర్ లపై ఇటీవల ఓ ఫొటో షూట్ కు చెందిందంటూ ప్రచారంలో ఉన్న ఫొటో ఇది. ఇవి 'ఏ దిల్ హై ముష్కిల్'కు సంబంధించినవా లేక మరేదైనా యాడ్ కు సంబంధించినవా అనేది తెలియాల్సిఉంది. (చూడండి: రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..) ఇదిలా ఉంటే, పాకిస్థానీ నటులున్న సినిమాలు విడుదల చేయరాదంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఐశ్వర్య, రణ్ బీర్, అనుష్క శర్మలతోపాటు పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ రూపొందించిన 'ఏ దిల్ హై ముష్కిల్' అక్టోబర్ 28న విడుదల కావల్సిఉంది. -
నిర్మాత కరణ్ జోహార్‌కు షాక్
-
ఆ సినిమాల రిలీజ్ డౌటే..!
భారత్ పాక్‌ల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు సినీరంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో స్పందించిన చిత్ర పరిశ్రమ, పాకిస్థానీ నటులు, సాంకేతిక నిపుణులపై బ్యాన్ విధించింది. ఆ కళాకారులు పనిచేసిన సినిమాలు రిలీజ్ విషయంలో కూడా ఆంక్షలు విధించింది. దీంతో స్టార్ హీరోలతో పాటు, బడా ప్రొడ్యూసర్లు కూడా చిక్కులు పడ్డారు. కరణ్ జోహర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఏ దిల్ హై ముష్కిల్, షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రాయిస్ సినిమాలతో పాటు షారూఖ్, కరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న డియర్ జిందగీ సినిమాల రిలీజ్‌ను 'సినిమా ఓనర్స్ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా' వ్యతిరేకిస్తోంది. అయితే యూనిట్ సభ్యులు రిలీజ్‌కు ఇబ్బంది కలింగిచవద్దని అభ్యర్తిస్తున్నా.. అసోషియేషన్ మాత్రం ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించింది. శుక్రవారం జరగనున్న కమిటీ సమావేశంలో ఈ సినిమా రిలీజ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. -
హీరోయిన్ భర్తతో వివాదం ముదిరిందా?
ముంబై: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ మూవీ అంటే చాలు కచ్చితంగా ఒక హీరోయిన్ కు అతడి ఫ్రాంచైజీలో అవకాశం ఉంటుంది. పాత్ర చిన్నదా.. పెద్దదా.. లేక అతిథిగా అభిమానులకు కనిపిస్తారా.. అనే తేడా లేకుండా ఆ తార తళుక్కుమంటుంది. అయితే ఇటీవల జరిగిన ఓ మూవీ వివాదం కారణంగా ఆ నటి కరణ్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 'ఏ దిల్ హై ముష్కిల్' లో మాత్రం నటించడం లేదట. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి కాజోల్. కాజోల్ భర్త అజయ్ దేవగణ్ 'శివాయ్'లో హీరోగా నటించడంతో పాటు ఆ మూవీలో పలు బాధ్యతలు తనపై వేసుకున్నాడు. సాయేశా సైగల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీపై కరణ్ జోహర్ తప్పుడు సంకేతాలు ఇచ్చాడని అజయ్ కొన్నిరోజుల కిందట ఆరోపించాడు. కుచ్ కుచ్ హోతా మై, కబీ కుషీ కబీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, ఇలా కరణ్ తీసిన పలు చిత్రాల్లో కాజోల్ సందడి చేసింది. కానీ భర్త అజయ్ మూవీపై నెగిటివ్ ప్రచారం రావడం, కరణ్ తన మూవీ కోసం ఇలా చేశాడన్న ఆరోపణల్ని కూడా ఈ దర్శకనిర్మాత గట్టిగా ఖండించలేదు. ఈ కారణాల వల్ల కాజోల్ కరణ్ మూవీలో నటించలేదని చెప్పవచ్చు. కరణ్ తాజా మూవీలో ఐశ్వర్యరాయ్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ఇతర ప్రముఖులు కనిపించనున్న విషయం తెలిసిందే. -
హీరోహీరోయిన్ల అరుదైన ఫొటో
ఈ ఫొటోలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ పక్కనున్న యువకుడిని గుర్తించారా. అతడు మరెవరో కాదు బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్. వయసులో కంటే చిన్నవాడైన రణబీర్ తో కలిసి ఐశ్వర్యరాయ్ తాజాగా 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో నటించింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ ఫొటో వార్తల్లోకి వచ్చింది. రిషికపూర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘ఆ ఆబ్ లాత్ ఛలే’ సినిమాలో అక్షయ్ ఖన్నా సరసన ఐశ్వర్య నటించింది. ఈ సినిమాకు రణబీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. షూటింగ్ సమయంలో అమెరికాలో ఐశ్వర్యతో కలిసి రణబీర్ ఫొటో దిగాడు. రమీ జాఫ్రే ఈ ఫొటోను ట్వీట్ చేశారు. భవిష్యత్ లో వీరిద్దరూ కలిసి నటిస్తారని ఊహించలేదని జాఫ్రే పేర్కొన్నారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో రణబీర్, ఐశ్వర్య నటించారు. అనుష్క శర్మ కూడా ఈ సినిమాలో ఉన్నప్పటికీ రణబీర్, ఐశ్వర్య మధ్య సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 28న 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. -
25 ఫ్లాపులొచ్చినా సూపర్ స్టారే!
తన సోదరుడు, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ అభినయ ప్రతిభపై నటి కరీనాకపూర్ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎన్ని ఫ్లాపులొచ్చినా తన సోదరుడు ఎప్పటికీ బాలీవుడ్ సూపర్ స్టార్‌గానే ఉంటాడని ఆమె తెలిపింది. ’హిందీ చిత్ర పరిశ్రమలో రణ్‌బీర్ కపూర్ సూపర్‌స్టార్. ఏదీ అతని స్టార్‌డమ్‌ను తగ్గించలేదు. 25 ఫ్లాపులిచ్చినా అతను ఉత్తమ నటుడిగానే ఉంటాడు. ’యే దిల్ హై ముష్కిల్’ సినిమాతో మళ్లీ అతను ట్రాక్‌లోకి వస్తాడని చెప్పడం నాకు నచ్చదు. అతను ఇప్పటికీ సూపర్ స్టారే’ అని కరీన ’పీటీఐ’ వార్తాసంస్థతో పేర్కొంది. ’ఈరోజుల్లో హిట్లు, ఫ్లాపులు రావడం సాధారణ విషయం. నేను కూడా ఎన్నో ఫ్లాపులు ఎదుర్కొన్నా. సినిమా పరాజయాలు స్టార్‌డమ్‌లను తగ్గిస్తాయని నేను అనుకోవడం లేదు. ఇప్పటికీ మనకున్న నటుల్లో రణ్‌బీర్ మంచి నటుడు’ అని ఆమె పేర్కొంది. రాకెట్ సింగ్, బర్ఫీ, రాక్ స్టార్ సినిమాలతో బాలీవుడ్ స్టార్ హీరో ఇమేజ్ పొందిన రణ్‌బీర్‌ను బేషరమ్, బొంబే వెల్వెట్ సినిమాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. సరైన హిట్ లేక స్టార్డమ్ కోల్పోతున్న తన సోదరుడికి ’యే దిల్ హై ముష్కిల్’ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందని కరీన ధీమా వ్యక్తం చేసింది. -
రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..
ముంబై: హీరోకు కన్నుగీటి కవ్వించి, చూపు తిప్పుకోనివ్వని కళ్లతో మైమరపించి, అతని బుగ్గలకు క్రీమ్ రాసి పెదవులతో తుడిచి.. ఇంకా రకరకాల చేష్టలతో ఐశ్వర్య రాయ్ అదరగొట్టింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా కోసం 42 ఏళ్ల ఐశ్వర్య.. 33 ఏళ్ల రణ్ బీర్ కపూర్ తో కలిసి రొమాన్స్ ను అద్భుతంగా పండించారని వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. కొద్ది రోజుల కిందటే టైటిల్ సాంగ్ ను విడుదల చేసిన 'ఏ దిల్ హై ముష్కిల్' రూపకర్తలు రెండో పాటగా 'బులెయా..'ను శుక్రవారం ఆన్ లైన్ లో విడుదల చేశారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న 'ఏ దిల్ హై ముష్కిల్'పై సినీ వర్గాల్లో ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా చిత్రీకరించిన 'బులెయా..' సాంగ్ నెట్ లో విడుదలైన కొద్ది గంటలకే గణనీయమైన హిట్స్ సాధించింది. ఐశ్వర్య రాయ్, రణ్ బీర్ కపూర్, అనుష్క శర్మ, ఫవద్ ఖాన్ లు ఈ సినిమాలో ప్రధాన తారగణం. 'బాద్ షా' షారూఖ్ ఖాన్ కూడా తళుక్కున మెరవనున్నారు. ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 28న 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, 2006లో వచ్చిన 'యాక్షన్ రిప్లే' తర్వాత ఐశ్వర్య నటిస్తోన్న రొమాంటిక్ సినిమా ఇదే కావడం విశేషం. -
రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..
-
హాట్ టాపిక్ గా రణ్‌బీర్,ఐశ్వర్యల రొమాన్స్!
రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మలు ప్రధాన పాత్రల్లో దర్శక, నిర్మాత కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్న 'యే దిల్ హై ముష్కిల్' ఫస్ట్ టీజర్ విడుదలయ్యింది. కరణ్ తన ట్విట్టర్ ద్వారా మంగళవారం ఆ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యకు, రణ్‌బీర్‌కు మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఐశ్వర్య కళ్లు చెదిరే అందంతో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా ఆమెకు అదిరే సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు. వన్ సైడ్ లవ్, డీప్ ఫ్రెండ్షిప్, హార్ట్ బ్రేక్ అంశాలతో హృదయాలను కదిలించే పనిపెట్టుకున్నారు కరణ్ జోహర్. టీజర్ చూసిన ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. కరణ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. రొమాంటిక్ డ్రామాగా అలరించనున్న 'యే దిల్ హై ముష్కిల్' చిత్ర టీజర్‌కు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రణ్ బీర్ కపూర్ తొలిసారి ఐశ్వర్యతో జతకట్టారు. వీరి మధ్య నడిచే సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయి. షారుఖ్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా టైటిల్ ట్రాక్‌ను కూడా కరణ్ జోహర్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. ఐశ్వర్య, రణ్ బీర్, అనుష్కల మధ్య నడిచే టిపికల్ లవ్ స్టోరీతో 'యే దిల్ హై ముష్కిల్' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హాట్ టాపిక్ అయిన రణ్‌బీర్,ఐశ్వర్యల రొమాన్స్
-
అనుష్క ముక్కుసూటి మనిషి
తాజాగా సుల్తాన్ సినిమాలో మల్లయోధురాలి పాత్ర పోషించిన అనుష్కా శర్మ.. ఆ సినిమాలో తన పాత్ర లాగే చాలా ముక్కుసూటిగా వ్యవహరించే మనిషట. అదే రణ్‌బీర్ కపూర్ అయితే మాత్రం చాలా కూల్‌గా ఉంటాడట. ఈ విషయాలు ఎవరు చెప్పారని అనుకుంటున్నారా.. ప్రముఖ మోడల్, నటి అయిన లీసా హేడెన్ ఇదంతా తెలిపింది. తాజాగా ఆమె ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే సినిమాలో అతిథిపాత్రలో కనిపిస్తోంది. అందులో రణ్‌బీర్ కపూర్, అనుష్కా శర్మ జంటగా నటిస్తున్నారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లీసా హేడెన్ తళుక్కుమంటుంది. ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఐశ్వర్య అందం చూసి తాను ఆమె వద్దకు వెళ్లడానికే కొంత సిగ్గుపడ్డానని, అనుష్క అయితే తనకు ఏం కావాలో, తానేం చేస్తానో ముక్కుసూటిగా చెప్పేస్తుందని లీసా అంటోంది. రణ్‌బీర్ కపూర్ చాలా కూల్‌గా ఉంటాడని, అతడితో కలిసి నటిస్తుంటే ఒకటే నవ్వులు వస్తుంటాయని తెలిపింది. తన పాత్ర చూసి నిజంగా చాలా మంచి కిక్ వచ్చిందని, ప్రస్తుతానికి అది మాత్రమే చెప్పగలనని అంటోంది. -
మూవీలో సత్తా ఉండాలి.. అంతే కానీ..!
నోయిడా: అనుష్కా శర్మ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఏ దిల్ హై ముష్కిల్’.ఆమె ప్రియుడిగా బాలీవుడ్ నటుడు ఫవాద్ ఖాన్ నటిస్తున్నాడు. ఫవాద్ నటుడు మాత్రమే కాదు ప్లే బ్యాక్ సింగర్ గానూ పేరు తెచ్చుకున్నాడు. తొలి మూవీ ఖుబ్సురత్ విడుదల నుంచీ జిందగీ గుల్జార్ హై వరకు తనదైన నటనతో అందరినీ మెప్పిస్తున్న ఫవాద్ సినిమాల విషయంలో ఆసక్తికర కామెంట్లు చేశాడు. మూవీలో కంటెంట్ ఉంటే చాలు సరిపోతుంది, మల్టీ స్టారర్ అయితేనే హిట్ అవుతుందని తాను భావించడం లేదన్నాడు. క్రియేటివ్ రోల్ ఏది వచ్చినా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం బెటర్ ఆప్షన్ అంటున్నాడు. ఆ మూవీలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. మల్టీ స్టారర్ మూవీలలో ఎక్కువగా ఎంచుకుంటున్నారని విలేకరి అడిగిన ప్రశ్నపై భిన్నంగా స్పందించి ఈ విషయాలు చెప్పాడు. కాన్పెప్ట్ నచ్చితే అన్ని రకాల మూవీలు చేస్తానని, అయితే ఎంచుకునే పాత్రపై కాస్త అవగాహన ఉంటే సరిపోతుందని పేర్కొన్నాడు. మరో కొత్త మూవీ 'కపూర్ అండ్ సన్స్' గే పాత్రలో ఫవాద్ కనిపించనున్నాడు. పాకిస్తానీ సినిమాలు మాత్రమే కాదు బాలీవుడ్ మూవీలను ఎంతో ఇష్టపడతానని చెప్పాడు. పలానా మూవీలు మాత్రమే చేయాలని అని భావించడానికి ఇవేమీ ప్రభుత్వ నిర్ణయాలు కాదని, మనసుకు నచ్చే పాత్రలు చేస్తూ కెరీర్ సాఫీగా సాగేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఫవాద్ తన మనసులో మాటను బయటపెట్టాడు. -
యాహూ దొరికిందోచ్
వియన్నా సిటీలోని ‘అయ్ దిల్ హై ముష్కిల్’ షూటింగ్ స్పాట్. రణ బీర్‌కపూర్, ఐశ్వర్యారాయ్, అనుష్కాశర్మలు కలిసి నటి స్తోన్న ఈ సినిమా చిత్రీకరణ చకచకా సాగుతోంది. కానీ అనుష్కాశర్మ మాత్రం ఓ విషయం గురించి తెగ ఆరా తీస్తున్నారు. అక్కడ తనకు తెలిసిన ఫ్రెండ్స్‌ని అడుగుతున్నారు. మరో పక్క చిత్ర యూనిట్‌లోని కొంత మంది సభ్యులను కూడా ఆరా తీశారు. విరాట్ కొహ్లీ గురించి ఏమైనా కొంటున్నారేమో అని ముసి ముసి ముసిగా నవ్వుకున్నారట. ఓ రోజు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ఎక్కడికో సడెన్‌గా మాయమైపోయారు అనుష్కా. కొంచెం సేపటి తర్వాత ‘యాహూ’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారట. ఆ ఆనందానికి కారణం విని ఆశ్చర్యపోవడం యూనిట్ సభ్యుల వంతయింది. అసలు సీన్లోకి వస్తే.. అనుష్కాశర్మ చాలాకాలం కిందట ఆమిర్‌ఖాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని వేగన్‌గా మారిపోయారు. స్వత హాగా శాకాహారి అయిన ఆమె చాలా కాలం క్రితం మిల్క్ ప్రొడక్ట్స్కీ నో చెప్పారు. షూటింగ్ కోసం వియన్నా వెళ్లినప్పుడు మాత్రం దగ్గర్లో స్వచ్ఛమైన శాకాహారం దొరకలేదట. దాంతో ఆమె సెట్స్‌లో ఫుడ్డు సరిగ్గా తినేవారు కాదట. అందుకే తనలాంటి వాళ్లకోసం వియన్నా సిటీలో ఎక్కడైనా హోటల్ ఉండకపోతుందా అని ఊరంతా తిరిగారట. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ ఆ హోటల్ అడ్రస్ కనుక్కున్నారీ ఈ ముద్దు గుమ్మ. -
రీ ఎంట్రీలో దూకుడు
చాలా రోజలుగా భారతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు దగ్గరకొచ్చింది. అందాల తార ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్ లో నటించిన 'జెజ్‌బా' రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్థుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. హీరోయిన్ ఐష్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్ కూడా ప్రమోషనల్ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఐష్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే రీ ఎంట్రీ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడింది ఐశ్వర్య. 'జెజ్‌బా' రిలీజ్ కు ఇంకా సమయం ఉండటంతో ఈ లోగా సినిమా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది. అమ్మ అయిన తరువాత కూడా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్న ఐష్, కరణ్ జోహార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో నటించడానికి రెడీ అవుతుంది. దాదాపు ఐదేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఈ బ్యూటి రీ ఎంట్రీలో వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతుంది. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు రెడీ అయిపోతోంది. అంతేకాదు ఈ వయసులో యంగ్ హీరోల సరసన జోడి కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఏ దిల్ మై ముష్కిల్ సినిమాలో రణబీర్ తో కలిసి ఆడిపాడనుంది ఐష్.