
యాహూ దొరికిందోచ్
వియన్నా సిటీలోని ‘అయ్ దిల్ హై ముష్కిల్’ షూటింగ్ స్పాట్. రణ బీర్‌కపూర్, ఐశ్వర్యారాయ్, అనుష్కాశర్మలు కలిసి నటి స్తోన్న ఈ సినిమా చిత్రీకరణ చకచకా సాగుతోంది. కానీ అనుష్కాశర్మ మాత్రం ఓ విషయం గురించి తెగ ఆరా తీస్తున్నారు. అక్కడ తనకు తెలిసిన ఫ్రెండ్స్‌ని అడుగుతున్నారు. మరో పక్క చిత్ర యూనిట్‌లోని కొంత మంది సభ్యులను కూడా ఆరా తీశారు. విరాట్ కొహ్లీ గురించి ఏమైనా కొంటున్నారేమో అని ముసి ముసి ముసిగా నవ్వుకున్నారట. ఓ రోజు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ఎక్కడికో సడెన్‌గా మాయమైపోయారు అనుష్కా. కొంచెం సేపటి తర్వాత ‘యాహూ’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారట.
ఆ ఆనందానికి కారణం విని ఆశ్చర్యపోవడం యూనిట్ సభ్యుల వంతయింది. అసలు సీన్‌లోకి వస్తే.. అనుష్కాశర్మ చాలాకాలం కిందట ఆమిర్‌ఖాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని వేగన్‌గా మారిపోయారు. స్వత హాగా శాకాహారి అయిన ఆమె చాలా కాలం క్రితం మిల్క్ ప్రొడక్ట్స్‌కీ నో చెప్పారు. షూటింగ్ కోసం వియన్నా వెళ్లినప్పుడు మాత్రం దగ్గర్లో స్వచ్ఛమైన శాకాహారం దొరకలేదట. దాంతో ఆమె సెట్స్‌లో ఫుడ్డు సరిగ్గా తినేవారు కాదట. అందుకే తనలాంటి వాళ్లకోసం వియన్నా సిటీలో ఎక్కడైనా హోటల్ ఉండకపోతుందా అని ఊరంతా తిరిగారట. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి మరీ ఆ హోటల్ అడ్రస్ కనుక్కున్నారీ ఈ ముద్దు గుమ్మ.