
ఐష్ బోల్డ్ సినిమాపై అభి స్పందించాడు
కొద్ది రోజులుగా బాలీవుడ్ సర్కిల్స్లో బచ్చన్ ఫ్యామిలీలో ఏదో జరుగుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐష్ నటించిన సన్నివేశాల విషయంలో బచ్చన్ ఫ్యామిలీ గుర్రుగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఏ దిల్ హై ముష్కిల్ సినిమా చూడకపోవటం, సినిమాపై కామెంట్ చేయకపోవటంతో ఈ వాదనకు మరింత బలాన్ని ఇచ్చినట్టయ్యింది.
అయితే రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ అభిషేక్ క్లారిటీ ఇచ్చేశాడు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐష్ లుక్ స్టన్నింగ్గా ఉందంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు ప్రస్తుతం తాను తన ఫుట్ బాల్ టీం పర్యటనలతో బిజీగా ఉన్న కారణంగా సినిమా చూడలేకపోయానని, అయితే ప్రొడక్షన్ టైం లోనే కొంత సినిమా చూశానని ఐష్ అద్భుతంగా నటించిందని తెలిపాడు. అభిషేక్ కామెంట్స్తో బచ్చన్ ఫ్యామిలీ పై వినిపిస్తున్న గాసిప్స్ రకు తెరపడినట్టే అని భావిస్తున్నారు ఫ్యాన్స్.