చాలా రోజలుగా భారతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు దగ్గరకొచ్చింది. అందాల తార ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్ లో నటించిన 'జెజ్బా' రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్థుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. హీరోయిన్ ఐష్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్ కూడా ప్రమోషనల్ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఐష్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
అయితే రీ ఎంట్రీ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడింది ఐశ్వర్య. 'జెజ్బా' రిలీజ్ కు ఇంకా సమయం ఉండటంతో ఈ లోగా సినిమా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది. అమ్మ అయిన తరువాత కూడా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్న ఐష్, కరణ్ జోహార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో నటించడానికి రెడీ అవుతుంది.
దాదాపు ఐదేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఈ బ్యూటి రీ ఎంట్రీలో వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతుంది. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు రెడీ అయిపోతోంది. అంతేకాదు ఈ వయసులో యంగ్ హీరోల సరసన జోడి కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఏ దిల్ మై ముష్కిల్ సినిమాలో రణబీర్ తో కలిసి ఆడిపాడనుంది ఐష్.
రీ ఎంట్రీలో దూకుడు
Published Sun, Aug 30 2015 1:16 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement