హాట్ టాపిక్ గా రణ్బీర్,ఐశ్వర్యల రొమాన్స్! | Ae Dil Hai Mushkil : Anushka, Aishwarya and Ranbir in a complicated relationship | Sakshi
Sakshi News home page

హాట్ టాపిక్ గా రణ్బీర్,ఐశ్వర్యల రొమాన్స్!

Published Tue, Aug 30 2016 4:54 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

హాట్ టాపిక్ గా రణ్బీర్,ఐశ్వర్యల రొమాన్స్!

హాట్ టాపిక్ గా రణ్బీర్,ఐశ్వర్యల రొమాన్స్!

రణ్బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మలు ప్రధాన పాత్రల్లో దర్శక, నిర్మాత కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్న 'యే దిల్ హై ముష్కిల్' ఫస్ట్ టీజర్ విడుదలయ్యింది. కరణ్ తన ట్విట్టర్ ద్వారా మంగళవారం ఆ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యకు, రణ్బీర్కు మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఐశ్వర్య కళ్లు చెదిరే అందంతో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా ఆమెకు అదిరే సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు. వన్ సైడ్ లవ్, డీప్ ఫ్రెండ్షిప్, హార్ట్ బ్రేక్ అంశాలతో హృదయాలను కదిలించే పనిపెట్టుకున్నారు కరణ్ జోహర్.

టీజర్ చూసిన ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. కరణ్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. రొమాంటిక్ డ్రామాగా అలరించనున్న 'యే దిల్ హై ముష్కిల్' చిత్ర టీజర్కు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రణ్ బీర్ కపూర్ తొలిసారి ఐశ్వర్యతో జతకట్టారు. వీరి మధ్య నడిచే సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయి.

షారుఖ్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ను కూడా కరణ్ జోహర్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. ఐశ్వర్య, రణ్ బీర్, అనుష్కల మధ్య నడిచే టిపికల్ లవ్ స్టోరీతో 'యే దిల్ హై ముష్కిల్' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement