ఆ సీన్లు కట్ చేయలేదు: కరణ్‌ | There’s no censor cut in Aishwarya Rai, Ranbir Kapoor track in ADHM | Sakshi
Sakshi News home page

ఆ సీన్లు కట్ చేయలేదు: కరణ్‌

Published Sun, Oct 23 2016 11:38 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

ఆ సీన్లు కట్ చేయలేదు: కరణ్‌

ఆ సీన్లు కట్ చేయలేదు: కరణ్‌

ముంబై: బాలీవుడ్ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్'లో రణబీర్ కపూర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ హాట్ సీన్స్ ను సెన్సార్ బోర్డు కట్ చేసిందని వచ్చిన వార్తలను దర్శకనిర్మాత కరణ్ జోహార్ తోసిపుచ్చారు. ఇవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. రణబీర్, ఐశ్వర్యరాయ్ నట్టించిన సన్నివేశాలపను సెన్సార్ బోర్డు తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. అనుష్క శర్మ, ఐశ్వర్యరాయ్ తో కలిసి జియో ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'సినిమాలోని సారాంశాన్ని సెన్సార్ బోర్డు అర్థం చేసుకుంది. అందుకే ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. ట్రైలర్ చూపించిన సన్నివేశాలు సినిమాలోనూ ఉంటారు. ఎటువంటి ముద్దు సన్నివేశాలు లేవు. కేవలం కళ్ల ద్వారా మాత్రమే భావాలు ప్రకటింపజేశాం. తన పాత్రకు అనుగుణంగానే ఐశ్వర్య నటించింద'ని కరణ్ జోహార్ అన్నారు.

తాను బోల్డ్ గా నటించాననడం కరెక్ట్ కాదని ఐశ్వర్యరాయ్ అంది. 'ఈ సినిమాలో సన్నివేశాలు హుందాగా ఉన్నాయి. రెండు పాత్రల మధ్య సంబంధం ఆధారంగా మాత్రమే ఈ సన్నివేశాలను చూడాలి. ఆ పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంద'ని చెప్పింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా అక్టోబర్ 28న విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement