డిలీటెడ్ సాంగ్ ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతోంది!
డిలీటెడ్ సాంగ్ ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతోంది!
Published Sat, Nov 5 2016 4:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
కరణ్ జోహార్ తాజా సినిమా ‘యే దిల్ హై ముష్కిల్' విడుదలకు ముందు అనేక వివాదాలు ఎదుర్కొన్నా.. విడుదలైన తర్వాత మాత్రం అభిమానుల మనస్సు గెలుచుకుంటోంది. ప్రేమలు, విడిపోవడాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలోని కథ కొత్తగా లేకపోయినా.. పాటలు, కరణ్ మ్యాజిక్ జనాలను థియేటర్ల వైపు నడిపిస్తోంది. ఈ సినిమా విజయవంతంగా ఆడుతూ నెమ్మదిగా వందకోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ కానుక ఇచ్చారు. నిడివి కారణంగా ఈ సినిమా నుంచి డిలీట్ చేసిన పాటను తాజాగా యూట్యూబ్‌లో అభిమానులతో పంచుకున్నారు.
పారిస్ వీధుల్లో రణ్‌బీర్ కపూర్, అనుష్క మధ్య ఈ హుషారెత్తించే పాటను చిత్రీకరించారు. యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్' అంటూ సాగే ఈ పాటకు నెటిజన్లు నీరాజనం పడుతున్నారు. ఇప్పటికే రెండు లక్షలమందికిపైగా ఈ బ్యూటీఫుల్ పాటను చూశారు.
Advertisement
Advertisement