ఆ డైరెక్టర్‌ నన్ను అసభ్యంగా తాకాడు: అనుష్క | director used to touch me inappropriately, says Anushka | Sakshi
Sakshi News home page

ఆ డైరెక్టర్‌ నన్ను అసభ్యంగా తాకాడు: అనుష్క

Published Mon, Dec 26 2016 8:07 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

ఆ డైరెక్టర్‌ నన్ను అసభ్యంగా తాకాడు: అనుష్క

ఆ డైరెక్టర్‌ నన్ను అసభ్యంగా తాకాడు: అనుష్క

ముంబై: కాఫీ విత్‌ కరణ్‌.. ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షోలో గాసిప్పులకు కొదవలేదు. గెస్టులను గుచ్చిగుచ్చి అడిగి.. కూపీలాగి మరీ.. వారి సీక్రెట్లు బయటపెట్టే కరణ్‌.. తాజాగా ఈ షోలో తానే బలయ్యాడు. అతను ఇటీవల అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌తో కలిసి షో నిర్వహించాడు. ఈ షోలో అనుష్క శర్మ పెద్ద షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. కరణ్‌ తాజాగా తెరకెక్కించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' (ఏడీహెచ్‌ఎం) సినిమా షూటింగ్‌ సందర్భంగా తనను కొన్నిసార్లు అభ్యంతరకరంగా తాకాడని తెలిపింది.

అంతకుముందు కరణ్‌ మాట్లాడుతూ ఏడీహెచ్‌ఎం షూటింగ్‌ సందర్భంగా తనకు అనుష్కపై ప్రేమ పుట్టిందని పేర్కొంటూ.. 'నేను నీకు పూర్తిగా పడిపోయాను. నీ కోసం ఆ సినిమా చేశాను' అంటూ పేర్కొన్నాడు. ఎంతో ఓపిగ్గా ఇదంతా విన్న అనుష్క ఒకింత అసహనంగా.. 'నేను అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలి. కొన్నిసార్లు అతను నన్ను అభ్యంతరకరంగా తాకాడు' అని పేర్కొంది. దీనికి కత్రిన స్పందిస్తూ 'నీలో కొంత చురుకుదనం తేవడానికి అలా చేసి ఉంటాడు' అని పేర్కొనగా.. అనుష్క మాత్రం వెనుకకు తగ్గలేదు. 'జాక్వలిన్‌ కూడా నీపై ఫిర్యాదు చేసింది. మనీష్‌ మల్హోత్రా పార్టీలో నువ్వు ఆమెను అసభ్యంగా తాకావంట' అని పేర్కొంది. దీంతో కత్రిన జోక్యం చేసుకొని ఈ 'లీగల్‌' తగాదాను ఇక్కడితో ముగించాలని వేడుకొంది. ఇదంతా వీరు సరదా కోసమే చేశారా? లేక నిజంగా ఏదైనా జరిగిందా? అన్నది దేవుడికే తెలియాలి అంటున్నారు బాలీవుడ్‌ జనాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement